English | Telugu

"స్టార్ మా పరివార్ అవార్డ్స్" ఈవెంట్ ప్రోమో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి మహామహులంతా ఎంట్రీ ఇచ్చేసారు. సూపర్ డాన్సులతో ఎంటర్టైన్ చేసారు. బుల్లితెర మీద "మల్లి.. నిండు జాబిల్లి" అనే సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం ఒక రేంజ్ లో దూసుకెళుతున్న సీరియల్. ఇందులో హీరోకి ఇద్దరు భార్యలు ఉంటారు. ఈ పరివార్ అవార్డ్స్ లో ఇద్దరి భార్యలను మేనేజ్ చేస్తున్నందుకు ఆ సీరియల్ హీరోకి ఉత్తమ భర్త అవార్డు ప్రదానం చేసారు.

"ఇలా ఇద్దరు పెళ్ళాలు ఉంటే ఉత్తమ భర్త అవార్డు ఇచ్చారా ? దీన్నే ఆదర్శంగా తీసుకుని రాజీవ్ కనకాల ఏదైనా చేస్తే హూ ఈజ్ రెస్పాన్సిబిల్ " అంటూ సంచలన కామెంట్ చేసి ఫన్ క్రియేట్ చేసింది సుమ. ఇక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరి నటనకు గాను అవార్డు అందుకుంటూ "యాంకరింగ్ క్వీన్ అంటే సుమ..ఎంటర్టైన్మెంట్ కింగ్ అంటే స్టార్ మా" అంటూ సూపర్ కామెంట్ చేసింది. ఇందులో పాయల్ రాజపుట్, నాగార్జున, ఓంకార్, శ్రీరామచంద్ర, మురళీమోహన్, సన్నీ ఇలా ఎంతో మంది ఈ షోలో కనిపించారు.