English | Telugu

"నీతోనే డాన్స్" ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక్కొక్క జోడి పెర్ఫార్మెన్సులు అదరగొట్టారు. నటరాజ్- నీతూ జోడి ఇద్దరూ రాధాకృష్ణుల గెటప్ లో చక్కగా డాన్స్ చేశారు. ఐతే మార్క్స్ ఇచ్చే విషయంలో చిన్నపాటి యుద్ధం మిగతా టీమ్స్ మధ్య జరిగింది.నటరాజ్ మాస్టర్ డాన్స్ చేసేటప్పుడు తల మీద ఉన్న కిరీటం కిందపడిపోతుండగా దాన్ని సర్దుకుని డాన్స్ కంటిన్యూ చేసాడు. ఇక్కడ స్టెప్స్ అంతా కూడా చూడడానికి కొంచెం గందరగోళాన్ని సృష్టించాయి. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక అంజలి-పవన్ 6 మార్క్స్ ఇచ్చారు. మిగతా రెండు జోడీస్ 8 మార్క్స్ ఇచ్చారు. అంజలి - పవన్ ఇచ్చిన మార్క్స్ చూసిన నీతూ " 6 మార్క్స్ ఇచ్చే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఐతే ఇది కాదు" అంది. ఇక అంజలి-పవన్ మిగతా టీంమేట్స్ మీద ఫైర్ అయ్యారు. చాలా సేఫ్ గేమ్ ఆడుతూ మార్క్స్ ఇస్తున్నారన్నారు..వాళ్ళ మాటలకు నిఖిల్-కావ్య తమకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలనిపించిందో అన్నే ఇచ్చాం అని గట్టిగానే చెప్పారు.

అసలు నటరాజ్ మాస్టర్ నోరు తెరవడం లేదు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఏదైనా ఓపెనప్ ఐతేనే కదా ఎవరికైనా మీరేమనుకుంటున్నారో తెలిసేది.. నేను కూడా చెప్పొచ్చు కానీ ఆయన అసలు మాట్లాడ్డమే లేదు అని రాధ అన్నారు. "నేను చాలా ఓపెనప్ గా ఉంటా మేడం..వాళ్ళు ఇవ్వాల్సిన మార్కులు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళేదో అంటారు.. అంటే నేనేదో హైపర్ అవుతాను..ఏదో ఒక గొడవ ఐపోతుంది. ఆ గొడవల్లో నేను దూరాలనుకోవడం లేదు. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ లో బాగా చేయకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కి ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తాం. ఇందులో డిస్కషన్ అంటూ ఏమీ లేదు..నేను కూడా జీరో మేడం " అన్నారు నటరాజ్ మాస్టర్. "ఐనా హైపర్ అవ్వాల్సిన అవసరం ఏముంది...ఇది చెప్తే సరిపోతుంది కదా..ఇలా కమ్యూనికేట్ చేయండి." అన్నారు జడ్జ్ రాధా .

వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బ్యాక్ గ్రౌండ్ లో వేసి చూపించి దాని వెనక ఉన్న స్టోరీ ఏమిటి అని అడిగేసరికి నీతూ కన్నీళ్లు పెట్టుకుంది. "నాకు అన్ని పండగల కంటే నీతూ బర్త్ డే పెద్ద పండగా" అని చెప్పారు నటరాజ్ మాష్టర్. "నాకు అమ్మ లేదు..ఆయనే నా అమ్మా" అంటూ చెప్పింది నీతూ.