Updated : Feb 18, 2022
మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'సన్నాఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మోహన్ బాబుపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.
మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో కొంతకాలంగా ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా 'మా' ఎన్నికల సమయం నుంచి ఈ ట్రోల్స్ డోస్ పెరిగింది. ఇక శుక్రవారం 'సన్నాఫ్ ఇండియా' సినిమా విడుదల ఉండటంతో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే రెండే టికెట్లు బుక్ అయ్యాయని.. అది కూడా మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు బుక్ చేసుకొని ఉంటారని గురువారం సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేశారు. ఇక ఈరోజు కూడా ఈ సినిమాపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. "తెలంగాణలో సన్నాఫ్ ఇండియా మొదటి రోజు గ్రాస్ 2430 రూపాయలు", "ఈ సినిమాలో అవతార్ ని మించిన గ్రాఫిక్స్ ఉంది", "సన్నాఫ్ ఇండియా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది", "మీ సినిమాలకు మీరే హీరోలు, మీరే ప్రొడ్యూసర్స్.. బ్యాడ్ లక్ ఏంటంటే ఆడియెన్స్ కూడా మీరే" అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
తన మీద ఓ ఇద్దరు హీరోలు కావాలనే ట్రోలింగ్ చేయిస్తున్నారని, యాబై నుంచి వంద మందిని ప్రత్యేకంగా నియమించుకుని మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారని, ఆ ట్రోల్స్ బాధ కలిగిస్తున్నాయని రీసెంట్ గా మోహన్ బాబు కామెంట్స్ చేశారు. అయినప్పటికీ ట్రోల్స్ ఆగడంలేదు. పైగా ఆయన చేసిన కామెంట్స్ పై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. మీ మీద ట్రోల్స్ చేయించే అంత ఖాళీగా హీరోలు ఎవరూ లేరు, మీ మాటలే మీపై ట్రోల్స్ కి కారణమంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మోహన్ బాబు & ఫ్యామిలీపై వస్తున్న ఈ ట్రోల్స్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.