English | Telugu

కొన్ని సూపర్ హిట్ అయినటువంటి మలయాళం సినిమాలు ఓటీటీలోకి తెలుగులో వస్తున్నాయి. అవి ఇక్కడ హిట్లుగా నిలుస్తున్నాయి.

మలయాళ నటుడు బిజూ మీనన్ కి మంచి క్రేజ్ ఉంది. హీరోగా అసీఫ్ అలీకి కూడా స్టార్ ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా 'తలవన్'. అరుణ్ నారాయణ్ నిర్మించిన ఈ సినిమాకి జిస్ జోయ్ దర్శకత్వం వహించాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సినిమా ఇది. దీపక్ దేవ్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాలో, కథానాయికలుగా మియా జార్జ్ - అనుశ్రీ నటించారు. అలాంటి ఈ సినిమాను సోనీ లివ్ వారు సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సీఐగా జయశంకర్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కి కొత్తగా ఎస్ ఐ కార్తీక్ వాసుదేవన్ వస్తాడు. జయశంకర్ కి మాట మాత్రమైనా చెప్పకుండా ఆ స్టేషన్లో నేరస్థుడిగా ఉన్న ఒక వ్యక్తిని కార్తీక్ వాసుదేవన్ రిలీజ్ చేస్తాడు. ఆ విషయంలో జయశంకర్ మందలించడంతో కార్తీక్ పగ పెంచుకుంటాడు. అదే సమయంలో జయశంకర్ ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. అప్పుడు కార్తీక్ ఏం చేశాడనేది మిగతా కథ.