English | Telugu

 

క‌మెడియ‌న్స్  పేరు తెచ్చుకున్న సునీల్ , స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్ హీరోలుగా మారి ప‌లు చిత్రాల్లో హీరోలుగా న‌టించి మెప్పించారు. ఇప్పుడు మ‌రో క‌మెడియ‌న్ జ‌బ‌ర్ద‌స్త్ , ఢీ, పోవే పోరా వంటి టెలివిజ‌న్ షోస్ ద్వ‌రా ఎంతో పాపుల‌రైన సుడిగాలి సుధీర్ హీరోగా `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఓ నూత‌న నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.  సుధీర్ స‌ర‌స‌న ధ‌న్య బాల‌కృష్ణ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇంద్ర‌జ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే గౌత‌మ్ రాజు, రామ్ ప్ర‌సాద్, రామ్ ల‌క్ష్మ‌ణ్‌, భీమ్స్ సిసిరోలియో లాంటి టాలెంటెడ్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌ని చేస్తున్నారు. సునీల్ లాంటి క‌మెడియ‌న్సే హీరోలుగా నిల‌దొక్కుకోలేక మ‌ళ్లీ క‌మెడియ‌న్స్ గా చేస్తున్నారు. మ‌రి సుధీర్ లాంటి చిన్న‌పాటి క‌మెడియ‌న్స్ హీరోలుగా నిల‌దొక్కుకోగ‌ల‌రా? ఉన్న ఫేమ్ ని కూడా పాడు చేసుకుంటారా? అంటున్నారా సినీ జ‌నాలు.