English | Telugu

అప్ప‌టి వ‌ర‌కు రైట‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్న కొర‌టాల శివ `మిర్చి` సినిమాతో ద‌ర్శ‌కుడుగా మారాడు. ఆ త‌ర్వాత వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్నాడు కొర‌టాల‌. అలా రైట‌ర్ కు డైర‌క్ట‌ర్ అవ‌కాశం కల్పించిన ప్ర‌భాస్ మ‌రో టాలెంటెడ్ రైట‌ర్ కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది. కంచె , గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, మ‌హాన‌టి చిత్రాల‌తో రైట‌ర్ గా పేరు తెచ్చుకున్న సాయి మాధ‌వ్ బుర్రా ఇటీవ‌ల ప్ర‌భాస్ ని క‌లిసి ఓ క‌థ‌ని వినిపించిన‌డ‌మే కాకుండా గ్రీన్ సిగ్న‌ల్ కూడా అందుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజ‌మైతే మ‌రో రైట‌ర్ కు ప్ర‌భాస్ లైఫ్ ఇవ్వ‌బోతున్నాడ‌న‌డంలో సందేహం లేదు. ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `సాహో` చిత్రంతో పాటు జాన్ అనే రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అన్నీ కుదిరితే ఈ రెండు సినిమాలు పూర్తైన వెంట‌నే సాయి మాధ‌వ్ బుర్రాతో సినిమా ఉండే అవ‌కాశాలున్నాయి.