English | Telugu

ఎప్పుడొస్తుందా అని షారుఖ్ ఖాన్ అభిమానులతో పాటు బాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్న సినిమా ఫ్యాన్. తనకు తనే ఫ్యాన్ గా షారుఖ్ నటించడమే అందుకు కారణం. సినిమాలో హీరో ఆర్యన్ ఖన్నాగా, ఫ్యాన్ గౌరవ్ గా షారుఖ్ యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వినూత్నంగా ఉన్న ఫ్యాన్ యాంథెమ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న నేపథ్యంలో, లేటెస్ట్ గా రిలీజైన మరో కొత్త పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఏప్రిల్ 15 న రాబోతున్న ఫ్యాన్ ను మనీశ్ శర్మ తెరకెక్కిస్తున్నారు.