Updated : Nov 3, 2022
రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం రష్మీ బుల్లితెర మీద షోలు చేస్తూ.. సినిమాలు కూడా చేస్తోంది. రీసెంట్ గా నందుతో కలిసి "బొమ్మ బ్లాక్ బాస్టర్" సినిమాలో నటించింది. బుధవారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి ధనాధన్ ధన్ రాజ్, సుడిగాలి సుధీర్ వచ్చి రష్మీ గురించి చాలా ఇన్స్పైరింగ్ గా కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలకు రష్మీ ఎమోషనల్ అయ్యింది.
ధన్ రాజ్ మాట్లాడుతూ "రష్మీ గురించి చెప్పాలంటే మనుషుల్ని పట్టించుకుంటుందో లేదో తెలీదు కానీ యానిమల్ లవర్ కాబట్టి వాటిని కచ్చితంగా పట్టించుకుంటుంది.పాండమిక్ టైములో మా ఇంట్లో ఉన్న ఒక కుక్కను సాకలేక అమల గారి హాస్పిటల్ లో ఇచ్చేశాం. కానీ రష్మీ అలాంటి టైంలో కూడా స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ వండుకుని వెళ్లి పెట్టి వచ్చేది. అప్పుడనిపించింది ఒక్క కుక్కనే చూసుకోలేకపోయాను కానీ రష్మీ ఇన్ని కుక్కల గురించి ఆలోచిస్తోంది అని..తర్వాత మళ్ళీ నేను ఒక కుక్కను తెచ్చుకుని పెంచుకోవడం మొదలుపెట్టాను. తాను ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా." అని అన్నాడు.
ఇక సుధీర్ మాట్లాడుతూ "నాకు ఇన్స్పిరేషన్ రష్మీ గారే. ఆమెది చాలా మంచి మనసు.. ఎవరికైనా ఏమన్నా జరిగితే వెంటనే స్పందించే గుణం రశ్మిలో చాలా ఎక్కువ. నేను ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే ముందున్నానంటూ వచ్చే వ్యక్తుల్లో రష్మీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.." అని రష్మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు సుధీర్.