English | Telugu

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్‌మోస్ట్ షూటింగ్ కంప్లీట్ స్టేజ్‌కు వచ్చేసిన ఈ మూవీకి టైటిల్ మాత్రం పెట్టలేదు.. జస్ట్ వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ఫినీష్ చేసేశారు. ఈ సినిమాకు టైటిల్ ఇదేనంటూ డే బై డే సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టేది. వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ వర్కింగ్ టైటిల్‌గా ఉన్న "అజ్ఞాతవాసినే" మెయిన్ టైటిల్‌గా ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అసలు ఈ పేరునే ఎందుకు సెలెక్ట్ చేశారు అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

పురాణాలు, హిందూ మైథలాజికల్ స్టోరీస్‌పై బాగా గ్రిప్ ఉన్న త్రివిక్రమ్ పాండవుల అజ్ఞాతవాసాన్ని బేస్‌గా తీసుకున్నాడని.. పన్నేండేళ్ల వనవాసం తర్వాత మరో ఏడాది అజ్ఞాతవాసాన్ని గడిపిన పాండవులు రాజ్యాన్ని సొంతం చేసుకున్నట్లుగానే.. ఈ కథలో హీరో కూడా తన కుటుంబానికి దూరమై అజ్ఞాతవాసం తర్వాత ఫ్యామిలీని తిరిగి కలుస్తాడని సినీజనాలు అంటున్నారు. అత్తారింటికి దారేదితో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన పవన్‌కు "అ" అనే అక్షరంపై గురి బాగా కుదిరిందని.. అందుకే టైటిల్‌లో "అ" అక్షరం వచ్చేలా అజ్ఞాతవాసిని ఫైనల్ చేశాడని.. ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన యాంగిల్‌లో కథనాలు అల్లేస్తూ సోషల్ మీడియా మీదకు వదులుతున్నారు. మరి వీటిలో దేనిని కన్ఫార్మ్ చేసుకోవాలో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే అంటున్నారు ఫిలింనగర్ జనాలు.