English | Telugu

తమిళ్‌, తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో కార్తీ. వరస హిట్స్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్న కార్తీ చేసిన లేటెస్ట్‌ మూవీ ‘జపాన్‌’. ఇది కార్తీ హీరోగా చేసిన 25వ చిత్రం కావడం విశేషం. రాజు మురుగన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హీస్ట్‌ థ్రిల్లర్‌ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు.

దీపావళి కానుకగా రిలీజ్‌ కానున్న ఈ సినిమా తెలుగు రైట్స్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ దక్కించుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. తన ప్రతి సినిమాలోనూ ఒక డిఫరెంట్‌ లుక్‌ని ట్రై చేసే కార్తీ ఈ సినిమాలోనూ కొత్తగా కనిపించబోతున్నాడు. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్‌ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ మిల్టన్‌ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌.రవివర్మన్‌ సినిమాటోగ్రఫీ, జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌ కానున్నాయి.