Updated : Dec 14, 2023
మంచు మనోజ్ నట జీవితలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతుంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్ప మీద మంచు అభిమానుల్లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే వచ్చిన కన్నప్ప ఫస్ట్ లుక్ అయితే ఒక రేంజ్ లో ఉంది. తాజాగా కన్నప్ప కి సంబంధించిన హీరోయిన్ ని మేకర్స్ ప్రకటించారు.
ప్రముఖ భరతనాట్య కళాకారిణి ప్రీతి ముకుందన్ కన్నప్ప కి జోడిగా నటించనుంది. తన భారత నాట్యం ద్వారా ఎంతో గుర్తింపుని పొందిన ప్రీతి ఇప్పుడు కన్నప్ప ద్వారా మొదటి సారిగా చలన చిత్ర రంగ ప్రవేశం చేయనుంది. ఎంతో మందిని ఆడిషన్స్ చేసిన తర్వాత సినిమాలో తాము అనుకున్న క్యారక్టర్ కి ప్రీతి కరెక్ట్ గా సరిపోతుందని భావించిన చిత్ర యూనిట్ ఆమెని తీసుకోవడం జరిగింది. అలాగే ప్రీతి కి ఉన్న నృత్య నైపుణ్యంతో సినిమాలో తాను పోషించే పాత్రకు ప్రాణం పోస్తుందని కూడా చిత్ర యూనిట్ నమ్ముతుంది.
ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాకుండా కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చిందని ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది అని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెలిపారు భారతీయ సినిమా ప్రేక్షకులకి సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ని కలిగించేలా తెరకెక్కుతున్న కన్నప్పలో మంచు మనోజ్ తన సొంత నిర్మాణంలో ఖర్చు విషయం లో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. మోహన్‌లాల్,ప్రభాస్, మోహన్ బాబు లాంటి బిగ్ స్టార్స్ నటిస్తున్న కన్నప్ప మూవీకి మణిశర్మ, స్టీఫెన్ దేవసి లు సంగీతాన్ని అందిస్తున్నారు.