Updated : Aug 31, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్రని ధరిస్తుండగా.. అతనికి జోడీగా సీత వేషంలో దర్శనమివ్వనుంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. `ఆదిపురుష్` కోసం వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన కృతి.. ఆపై రాబోయే సినిమా కోసం భవిష్యకాలంలోకి వెళ్ళనుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ `హీరో పంటి` (2014) తరువాత టైగర్ ష్రాఫ్ తో కలిసి ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరో సినిమా చేయబోతోంది కృతి. ఆ చిత్రమే.. `గణపథ్`. `క్వీన్` ఫేమ్ వికాస్ భళ్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2090 నాటి కథతో రూపొందనుందట. యుద్ధాలు, ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచం ఎలా ధ్వంసమైపోతోందో ఈ కాల్పనిక చిత్రంలో చూపించనున్నారట. అక్టోబర్ నుంచి పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. 2022 డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మరి.. తక్కువ గ్యాప్ లోనే రానున్న విభిన్న కాలాలకు చెందిన చిత్రాలు `ఆదిపురుష్`, `గణపథ్`తో కృతి ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.