Sri Rama Rajyam Audio Songs Released
Updated : Aug 15, 2011
శ్రీ రామరాజ్యం ఆడియో రిలీజ్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల వారి సన్నిధిలో, సినీ అతిరథమహాథుల, అశేష నందమూరి బాలకృష్ణ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. వివరాల్లోకి వెళితే నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్ర మూర్తిగా, అందాల నయనతార సీతా మహాసాధ్విగా, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా నటిస్తూండగా, గ్రేట్ డైరెక్టర్ బాపు గారి దర్శకత్వంలో, యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న పౌరాణిక కళాఖండం "శ్రీ రామరాజ్యం".
"శ్రీరామరాజ్యం" చిత్రంలో లక్ష్మణుడుగా హీరో శ్రీకాంత్, భరతుడిగా డైలాగ్ కింగ్ సాయికుమార్, దశరథుడిగా సీనియర్ నటులు బాలయ్య నటిస్తున్నారు. ముళ్లపూడి వెంకట రమణ "శ్రీ రామరాజ్యం" చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలు వ్రాయగా, జొన్న విత్తుల, వెన్నెల కంటి పాటలను వ్రాశారు. "శ్రీ రామరాజ్యం" చిత్రానికి ఇసైరాజా, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వీనులవిందైన సంగీతాన్ని ఇచ్చారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో, ఆగస్టు 15 వ తేదీ, సోమవారం రాత్రి, స్వాతంత్ర్య దినోత్సవం నాడు యువరత్న నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది.
ఈ ఆడియో రిలీజ్ కు దర్శకులు బాపు, నిర్మాత యలమంచిలి సాయిబాబు, నందమూరి బాలకృష్ణ, నయనతార, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, బాలయ్య, ఆదిత్య దయానంద్, రచయిత జొన్నవిత్తుల, ఈ చిత్ర సంగీత దర్శకులు ఇళయరాజా, యువ దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ సతీమణి శ్రీమతి వసుంధర తదితరులు హాజరయ్యారు.