English | Telugu

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్. ఇప్పటికే విడువులైన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైలర్ విడుదలైంది.

లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో కూడిన 'రంగ రంగ వైభవంగా' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చిన్నతనంలో గొడవై మాట్లాడుకోవడం మానేసిన హీరోహీరోయిన్లు.. పెద్దయ్యాక ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కలర్ ఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వైష్ణవ్ తేజ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ మెప్పించింది. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో "నాన్నా ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుండి ఇంకొక లెక్క. చెప్పను.. చూపిస్తా" అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా శామ్ ద‌త్, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వర్ రావు వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం విశేషం.