English | Telugu

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారు జామున కృష్ణంరాజు కన్నుమూశారన్న వార్తతో విషాదంలో మునిగిపోయిన సినీ పరిశ్రమకు కాసేపటికే మరో బాధాకరమైన వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మణిశర్మ తల్లి సరస్వతి ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. మణిశర్మ తల్లి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.