Updated : Feb 21, 2024
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నలుగురు టాప్ హీరోల లిస్ట్ ని తీసుకుంటే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా ఉంటుంది. రెండు దశాబ్దాల పై నుంచి తన అధ్బుతమైన నటనతో కొన్ని లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు.సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా చేస్తు తన కంటూ ఒక బ్రాండ్ ని సృష్టించుకున్నాడు. అలాంటి మహేష్ కి సంబంధించిన న్యూస్ ఒకటి నయా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలబడింది.
ఆన్ లైన్ పేమెంట్స్ కి సంబంధించి ఇప్పుడు ఎక్కువ మంది ఫోన్ పే యాప్ ని యూజ్ చేస్తున్నారు. డబ్బులు చెల్లించగానే అవతలి వాళ్ళకి క్యాష్ వచ్చినట్టు ఒక వాయిస్ రికార్డు వస్తుంది. ఇప్పుడు ఆ వాయిస్ రికార్డు మహేష్ గొంతుతో వినపడబోతుంది. ఫోన్ పే సంస్థ మహేష్ బాబు వాయిస్ తో కొత్త టెక్నాలజీని యాడ్ చేసి తమ పేమెంట్స్ కోసం తీసుకురాబోతున్నారు.ఇక ఎవరైనా ఫోన్ పే ద్వారా పేమెంట్స్ చేస్తే మహేష్ వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఇక మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. తమ అభిమాన హీరో వాయిస్ ని ఎప్పుడెప్పుడు వింటామా అని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.
మహేష్ లేటెస్ట్ గా గుంటూరు కారంతో వచ్చి టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సాధించాడు.తన నెక్స్ట్ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు. అందుకు సంబంధించి తన క్యారక్టర్ కోసం పూర్తిగా సిద్దమవుతున్నాడు. త్వరలోనే షూటింగ్ ని ప్రారంభించుకుంటున్న ఆ మూవీ మహేష్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుంది