Updated : Nov 29, 2022
2005 లో విడుదలైన 'చంద్రముఖి' చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజినీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి తమిళ్ లో సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు వాసు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ ప్రధాన పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది.
'చంద్రముఖి-2' లో కంగనా నటించబోతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలకు నిజం చేస్తూ తాను చంద్రముఖి సీక్వెల్ లో నటిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది కంగనా. వాసు గారి దర్శకత్వంలో తమిళ్ మూవీ చేస్తుండటం సంతోషంగా ఉందని తెలిపింది. మరి చంద్రముఖిగా కంగనా ఎంతలా మెప్పిస్తుందో చూడాలి.
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.