English | Telugu

తెలుగు నాట మ‌రో ల‌వ్ గాసిప్ ఇది. రానా, కాజ‌ల్ ప్రేమ‌లో ప‌డ్డార‌ని, ఇద్ద‌రూ ప్ర‌ణ‌య వీధిల్లో షికారు చేస్తున్నార‌న్న‌ది లేటెస్ట్ టాలీవుడ్ టాక్‌. అటు రానాపై, ఇటు కాజ‌ల్‌పై ఇది వ‌ర‌కు చాలాసార్లు ఇలాంటి గాసిప్పులు వినిపించాయి. బిపాసాబ‌సుతో రానా ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడ‌ని కొన్నాళ్లు చెప్పుకొన్నారు. ఆ త‌ర‌వాత త్రిష వ‌చ్చి చేరింది. ఇప్పుడు కాజ‌ల్ పేరు త‌గిలించారు. కాజ‌ల్‌కీ ఇలాంటి వార్త‌లు కొత్త‌కాదు. ఓ యువ హీరోతో స‌న్నిహితంగా మెలుగుతోంద‌ని ఓ వార్త అప్ప‌ట్లో షికారు చేసింది. దీనిపై కాజ‌ల్ కూడా ఘాటుగా స్పందించింది. కాజ‌ల్‌కి పెళ్లి కుదిరింద‌ని, ఓ వ్యాపార వేత్త‌తో నిశ్చితార్థం కూడా జ‌రిగిపోయింద‌ని చెప్పుకొన్నారు. వీటికి కూడా కాజ‌ల్ ప‌లుమార్లు స‌మాధాన‌మిచ్చింది. ఇప్పుడు రానాతో బాగా క్లోజ్‌గా మూవ్ అవుతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వాసులు గుస‌గుస‌లాడుకొంటున్నారు. రానా, కాజ‌ల్ క‌ల‌యిక‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. క‌నీసం యాడ్‌లోనూ న‌టించ‌లేదు. మ‌రి వీరిద్ద‌రికీ ఎలా జోడీ కుదిరిందో ఏంటో..? ఈమ‌ధ్య రెస్టారెంట్ల‌లోనూ, ప్రైవేటు పార్టీల్లోనూ ఇద్ద‌రూ జాయింటుగా క‌నిపిస్తున్నార‌ట‌. ఒకే కారులో ట్రావెల్ చేస్తున్నార‌ట‌. వీటి ఆధారంగా ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోయారని గుస‌గుస‌లాడుకొంటున్నారు. మ‌రి కాజ‌ల్‌, రానాలు ఈ ప్రేమ గుట్టు ఎప్పుడు విప్పుతారో??