English | Telugu

 

మూవీ: కాదలిక్క నేరమిళ్లై 
నటీనటులు: జయం రవి, నిత్యా మీనన్, రవి మోహన్, యోగి బాబు తదితరులు
ఎడిటింగ్: లారెన్స్ కిశోర్
సినిమాటోగ్రఫీ: గావెమిక్ యూ. అరి
మ్యూజిక్: ఎఆర్ రహమాన్
నిర్మాతలు: ఉదయనిధి స్టాలిన్
దర్శకత్వం: కృతిగ ఉదయనిధి
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

జయం రవి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో‌ నటించిన చిత్రం ' కాదలిక్క నేరమిళ్లై'. తమిళంలో ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అవ్వగా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ: 

శ్రియ (నిత్యామీనన్) ఆర్కిటెక్ట్ గా చెన్నైలోని ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి ఆమె నివసిస్తూ ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆమెకి స్వతంత్ర భావాలు ఎక్కువ. కరణ్ (జాన్ కొక్కెన్)తో ఆమె ప్రేమలో ఉంటుంది. నిశ్చితార్థం తరువాత అతని నిజస్వరూపం తెలియడంతో దూరం పెడుతుంది. ఇక సిద్ధార్థ్ (జయం రవి), బెంగుళూర్ లో నివసిస్తూ ఉంటాడు. అతను కూడా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ కి గౌడ (యోగిబాబు) సేతు (వినయ్ రాయ్) స్నేహితులుగా ఉంటారు. ఒకసారి సేతుతో పాటు వెళ్లడం వలన, సిద్ధార్థ్ కూడా 'స్పెర్మ్' డొనేట్ చేయవలసి వస్తుంది. అయితే అతను తన పేరు జేమ్స్ అని చెప్పి, తప్పుడు అడ్రెస్ ఇస్తాడు.  సిద్దార్థ్, నిరుపమ ప్రేనలో ఉంటారు కానీ వారికి బ్రేకప్ అవుతుంది. మరోవైపు శ్రీయ తన బిడ్డ  తండ్రి కోసం వెతుకుతూనే ఉంటుంది. ఎనిమిదేళ్ల తరువాత కంపెనీ పనిపై సిద్ధార్థ్ చెన్నై కి వెళతాడు. అక్కడ అతనికి శ్రియతో పరిచయం పెరుగుతుంది. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. అదే సమయంలో సిద్ధార్థ్ జీవితంలోకి నిరుపమ రీ ఎంట్రీ ఇస్తుంది. సిద్దార్థ్ జీవితం ఎటువైపు మలుపు తిరిగింది? తన బిడ్డ తండ్రిని శ్రియ కనక్కోగలిగిందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ సినిమా చూసాక ఒక్కటే ఫీల్ కలుగుతుంది.. ఇది పెద్దవాళ్ళకి, మెచురిటీ ఉన్న యువతకు మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు యువకులు కలిసి తమ స్పెర్మ్ డొనేట్ చేయడం దానివల్ల వచ్చే పరిణామాలు ఇలా ఒక సెన్సిటివ్ టాపిక్ ని కామెడీగా చూపించాలనుకున్నాడు దర్శకుడు.  అది ఎంత వరకు నచ్చుతుందంటే కొంత మెచుర్డ్ ఉన్నవాళ్ళకే అన్నట్టుగా సాగుతుంది. 

ఒక మనిషి ఎంత కష్టపడ్డా ఓడిపోతున్నప్పుడు అతనికి బ్యాడ్ టైమ్ కలుగుతుంది. అలాంటి టైమ్ లో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన హ్యాపీగా ఉంటాడనే ఉద్దేశంతో హీరో అలా చేయడంతో కథ కాస్త ఆసక్తిగా సాగుతుంది. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా గుర్తొస్తుంది. అయితే చివరలో ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని తీసినట్టుగా ఉంటుంది. కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

యోగిబాబు లాంటి వాళ్ళు ఉన్నప్పటికి వారితో సరైన కామెడీని వాడుకోలేదనిపించింది.‌ ఒకానొక సిచువేషన్ లో హీరో పాత్ర భిన్నంగా ఉంటుంది. లవ్ బ్రేకప్ అయ్యాక కొంతమంది అమ్మాయిలతో అలా చేయడం కాస్త ఇబ్బంది పెడుతుంది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పెద్దగా సెట్ అవ్వలేదు.  ఫ్యామిలీతో కలసి చూడలేకుండా కొన్ని సీన్లు డిస్టబ్ చేస్తాయి. అడల్ట్ వర్డ్ బాగానే వాడారు. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

శ్రీయగా నిత్యామీనన్, సిద్దార్థ్ గా జయం రవి ఆకట్టుకున్నారు. యోగి బాబు, వినయ్ రాయ్ తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఫైనల్ గా : మెచుర్ట్ ప్రేమికులకు మాత్రమే. వన్ టైమ్ వాచెబుల్‌.

రేటింగ్:  2.25 / 5

✍️. దాసరి  మల్లేష్