English | Telugu

తెలుగు సినీ,ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని నటుడు కాదంబరి కిరణ్.(kadambari Kiran)ఇప్పటి వరకు సుమారు 250 చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించాడు.కొన్నిటివి సీరియల్స్ లో కూడా నటించి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు.

రీసెంట్ గా ఆయనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారి అత్తారింటికి దారేది లో చిన్న క్యారక్టర్ అయినా కూడా చేయడం వల్ల నా క్యారక్టర్ కి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది.2 రోజుల పనికి ఇరవై లక్షల సెట్ వేసి నాపై సీన్ ని చిత్రీకరించారు.దాంతో ఆ సీన్ పేలడంతో వరుసగా 18 సినిమాల్లో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

కాదంబరి కిరణ్ 11 సంవత్సరాల క్రితం మనం సైతం అనే స్వచ్చంద సంస్థని నెలకొల్పి తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురి సహకారంతో పేద కళాకారులతో పాటు ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేస్తు వస్తున్నాడు.