Manchu Lakshmi A Village Woman in Gundello Godari
Updated : Apr 17, 2011
"గుండెల్లో గోదారి" మూవీలో పల్లెపడుచుగా మంచు లక్ష్మి నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే "గుండెల్లో గోదారి" మూవీలో మంచు లక్ష్మీ ప్రసన్న గ్రామీణ యువతిగా నటిస్తున్నారు. ముందు బుల్లితెరపై "లక్ష్మీ టాక్ షో" అనే కార్యక్రమంతో మొదలుపెట్టి "అనగనగా ఓ ధీరుడు" చిత్రంలో ఐరేంద్రి అనే విలన్ గా, రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" చిత్రంలో స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గా నటించింది మంచు లక్ష్మీ ప్రసన్న. అలాగే బుల్లి తెరపై "ప్రేమతో మీ లక్ష్మీ" అనే ప్రోగ్రామ్ ను కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూంది.
అలా తన నటనా సామ్రాజ్యాన్ని మెలమెల్లగా విస్తరుంచుకుంటూ పోతోంది మంచు లక్ష్మీ ప్రసన్న. ప్రస్తుతం "గుండెల్లో గోదారి" చిత్రంలో ఒక పల్లెపడుచుగా నటిస్తూంది. ఈ "గుండెల్లో గోదారి" చిత్రం సెంటిమెంటుకి సంబంధించిన కథతో నిర్మిస్తున్నారనీ, ఈ చిత్రానికి కుమార్ అనే నూతన యువకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ మాటల రచయిత లక్ష్మీ భూపాల్ ఈ "గుండెల్లో గోదారి" చిత్రానికి సంభాషణలు వ్రాస్తున్నారు. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న తన తమ్ముడు మంచు మనోజ్ కుమార్ హీరోగా, యువరత్న నందమూరి బాలకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తూండగా "ఊ కొడతారా... ఉలిక్కి పడతారా...!" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.