English | Telugu

Rajamouli Eega Movie Updates

"మే" నుంచి రాజమౌళి "ఈగ" షుటింగ్ తిరిగి ప్రారంభం కాగలదని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా, రాజమౌళి దర్శకత్వంలో, కొర్రపాటి సాయి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "ఈగ". "ఈగ" చిత్రానికి ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. "ఈగ" చిత్రం ఫిబ్రవరి నెలలోనే ప్రారంభమైనా, ఫెడరేషన్‍ చేసిన సమ్మె వల్ల షూటింగ్ ను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో ఒక భారీ సెట్ వేశారు.

గతంలో రాజ మౌళి దర్శకత్వం వహించిన "యమదొంగ, మగధీర" చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ "ఈగ" చిత్రానికి కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. "ఈగ" చిత్రానికి స్కార్పియో క్రేన్ ని ఉపయోగిస్తున్నారు. స్కార్పియో క్రేన్ ని తొలిసారిగా "ఈగ" అనే తెలుగు సినిమాకే వాడుటం విశేషం."ఈగ" చిత్రానికి యమ్ యమ్ (మరకత మణి) కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతవరకూ అపజయమెరుగని రాజమౌళికి "ఈగ" సినిమా అపజయాన్నిచ్చి రికార్డు బ్రేక్ చేస్తుందో లేక రాజమౌళికి మరొక ఘనవిజయాన్ని అందించి అతని జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగనిస్తుందా అన్నది వేచి చూడాలి.