English | Telugu

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పోర్ట్స్ డ్రామా `గ‌ని`. బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ ఈ సినిమాతోనే తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది. అలాగే, ద‌ర్శ‌కుడిగా కిర‌ణ్ కొర్ర‌పాటికి కూడా ఇదే మొద‌టి చిత్రం. కాగా, ఈ పాటికే థియేట‌ర్స్ లో సంద‌డి చేయాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఎప్ప‌టిక‌ప్పుడు అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే, తాజాగా ఏప్రిల్ 8ని రిలీజ్ డేట్ గా లాక్ చేశారు మేక‌ర్స్.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ఏప్రిల్ 8 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. సో.. బ‌న్నీ 40వ‌ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా వ‌రుణ్ తేజ్ `గ‌ని` రాబోతోంద‌న్న‌మాట‌. `గ‌ని` నిర్మాత‌ల‌లో ఒక‌రైన అల్లు బాబీ.. స్వ‌యంగా బ‌న్నీకి అన్న‌. మ‌రి.. బ‌న్నీ పుట్టినరోజు ప్ర‌త్యేకంగా రానున్న `గ‌ని` బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

Also Read:RadheShyam Pre Release Trailer Launch

కాగా, `గ‌ని`కి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందించాడు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓ ప్ర‌త్యేక గీతంలో చిందులేసిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌దియా, న‌వీన్ చంద్ర ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. జార్జ్ సి. విలియ‌మ్స్ ఈ క్రీడా నేప‌థ్య చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందించాడు.