Updated : Aug 21, 2021
యువసామ్రాట్ నాగచైతన్యకి అచ్చొచ్చిన కథానాయికల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా `100% లవ్` (2011) సూపర్ హిట్ కాగా.. రెండో చిత్రం `తడాఖా`(2013) హిట్ మూవీగా నిలిచింది. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఇద్దరు మరోమారు జోడీగా నటించబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `నాంది` ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా ఓ సినిమా రూపొందబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. `మజిలీ` నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ సినిమా కోసమే చైతూకి జంటగా తమన్నా నటించబోతోందని వినికిడి. అంతేకాదు.. ఇందులో వీరిద్దరూ భార్యభర్తలుగా కనిపించబోతున్నారని బజ్. త్వరలోనే చైతూ, తమ్మూ థర్డ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానున్నది. మరి.. చైతూ, తమన్నా జోడీ ముచ్చటగా మూడోసారి కూడా మురిపిస్తుందేమో చూడాలి.