English | Telugu

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధానికి సమయం దగ్గర పడుతోంది. ప్రభుత్వాధికారి కుమారుడు, ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్న వెంకటచైతన్య జొన్నలగడ్డతో ఆమె పెళ్లి నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. తమ్ముని కుమార్తెకు తమకు చిరకాల కుటుంబ స్నేహితులైన ఐజి ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో సంబంధం కుదరడం వెనుక చిరంజీవి చొరవ ఉంది.

పెళ్లి కుదిరిన తర్వాత చైతన్య, నీహారిక జంట‌ సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులతో సందడి చేస్తున్నారు. త్వరలోనే వీళ్ళిద్దరూ ఉంగరాలు మార్చుకోనున్నారు. ఆగస్టులో చెల్లెలి నిశ్చితార్థం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తెలిపాడు.‌ కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిషేధాజ్ఞలు పాటిస్తూ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంగేజ్మెంట్ చేస్తామని అతడు స్పష్టం చేశాడు. నిశ్చితార్థం ఇప్పుడు చేసినా, పెళ్లి మాత్రం వచ్చే ఏడాది చేయాలని అనుకుంటున్నారట. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఆగ‌స్ట్ 13న నిహారిక‌, చైత‌న్య నిశ్చితార్ధం జ‌ర‌గ‌బోతోంది.