LATEST NEWS
- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం దారి తప్పిందని ముఖ్యమంత్రికి అర్ధమైంది - మంత్రి నారాయణ, ఎమ్పీ విపిఆర్‌లకు బాధ్యతల నుంచి విముక్తి - ఉదయగిరి ఎమ్మెల్యేకి తల వాచే చీవాట్లు - సూళ్లూరుపేట నేతలకు పదునైన చురకలు - దేముళ్ల సేవతో సరిపెట్టుకోవద్దని రామనారాయణరెడ్డికి సూచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా మీద సునిశిత దృష్టి సారించినట్లు అర్థమవుతున్నది. నెల్లూరు జిల్లా సాధారణంగా  సామాజిక పరిస్థితుల దృష్ట్యా వైకాపాకు బలమైన స్థావరం. కానీ మొన్నటి ఎన్నికలలో పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. అదొక విచిత్రం. అన్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది. అంటే..  తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేదా ఎంపీలలోనే తమ భవిష్యత్ మీద నమ్మకం సడలిందన్న మాట. అదేమీ ఒకరు చేసే ఆరోపణ కాదు.  కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. దేనివల్ల ఈ పరిస్థితి? 30 నుంచి 75 వేల మెజారిటీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలను గెలిపించిన నెల్లూరు జిల్లా ఓటర్లకు అప్పుడే ముఖం మొత్తిందా? పార్టీ మీద లేదా పదవులలో వున్న వారి మీద విరక్తి జనించిందా? అందుకు కారణం ఏమిటి? జిల్లా పరిస్థితి బాగా లేదన్న వార్తలు ముఖ్యమంత్రి చెవికి కూడా చేరినట్లున్నాయి. పడవకు పడిన లేదా పడుతున్న చిల్లుని, చిన్నదిగా వున్నప్పుడే పూడ్చకుంటే, మొత్తం పడవే మునిగిపోతుందన్న ఆలోచనతోనే, నెల్లూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లున్నారు. ఈ వారంలో రెండు ఊళ్లకు వచ్చారాయన. ఈ రెండు ఊళ్లను ఎంపిక చేసుకోవడంలో ఏదో ఒక పరమార్థం వుందని భావించాలి. మొదట సూళ్లూరుపేట. ఎమ్మెల్యే విజయశ్రీ మీద తనకు సదభిప్రాయం వుందనే సూచన ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంబిబిఎస్ చదివిన ఉన్నత విద్యావంతురాలిగానే కాకుండా, నిరంతరం నవ్వుముఖంతో కనపడడం విజయశ్రీ విలక్షణత. ఎవరినైనా నవ్వుతోనే పలకరిస్తారు. ఆమె మీద ఆరోపణలు లేవు. అయితే సూళ్లూరుపేట నుంచి మద్రాసు నగరానికి ఎర్ర గులక, ఇసుక ఎవరు దొంగ రవాణా చేస్తున్నారో నాకు తెలుసు, వారీ అక్రమాలు తక్షణమే నిలిపివేయండి అని గట్టిగానే హెచ్చరిక చేశారు. ఎవరికి తగలాలో వారికి ఆ మాటల శూలం బలంగా గుచ్చుకున్నది. గుండె కలుక్కుమన్నది. లక్షల రూపాయల అక్రమ రాబడి ఆగిపోతుందనుకునే బాధే కదా పాపం. పనిలో పనిగా, విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యానికి కూడా, ఇక నువ్వు రిటైర్ అయితే బాగుంటుందని నవ్వుతూనే సలహా ఇచ్చారు. ఆ మాటలో పరుషత్వం లేకపోవడంతో నెలవల సంతోష పడిపోయాడు. సూళ్లూరుపేట ఎస్‌సి నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే పసిపిల్ల కావడంతో ముదురు మనుషులు పెత్తనం చలాయిస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లుంది. కలెక్టర్, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడట, ఒక్క ఎమ్మెల్యే నుంచి వచ్చే సిఫార్సులు తప్ప ఇతరులెవరి మాటా మీరు వినాల్సిన అవసరం లేదని. ఈ మాటకు కొందరి ముఖాలలో గంటు పడింది. వెంటనే.. వింజమూరు. అక్కడికి రాకముందే స్థానిక పరిస్థితుల మీద సమగ్ర అవగాహన తెచ్చుకున్నట్లున్నారు చంద్రబాబు. ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద చర్నాకోళ ఝుళిపించారు. వాతలు పడేట్లు, మాటలు విసిరారు. రేపటి ఎన్నికలలో రాష్ట్రంలో 175 మంది తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే, నువ్వు 172 వాడిగా ఉంటావు. ఇంత తక్కువ వ్యవధిలో అంత చెడ్డ పేరు తెచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు. నీ సొంత సామాజిక వర్గం కూడా నిన్ను సమర్థించడం లేదు. పార్టీ కార్యకర్తలందరూ విసిగిపోయి వున్నారు. తీరు మార్చుకోవడానికి మూడు నెలల గడువు ఇస్తున్నాను, మారితే మర్యాదగా వుంటుంది, లేకుంటే చర్యలు వేరేగా వుంటాయని  కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇదేదో గదిలోకి పిలిచి, ఎవరూ వినకుండా హితబోధ చేసి వుంటే గౌరవంగా వుండేది.. కానీ, కార్యకర్తల సమావేశంలో అందరి సమక్షంలో తూర్పార పట్టడం వల్ల, పాపం కాకర్ల సురేష్ నిరుత్తరుడైపోయారు. ఉదయగిరి కార్యకర్తలు మాత్రం పండుగ చేసుకున్నారు. ఇక జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన సవరణలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. అందులో ఓం ప్రథమంగా మంత్రి నారాయణకు, ఎమ్పీ విపిఆర్‌కు, మీ పనులు మీరు చేసుకోండి, జిల్లా బాధ్యత వదిలి పెట్టేయండి అని సూచించారట. ఈ సూచన సున్నితంగా, మనసు నొచ్చుకోకుండా ఉందని చెబుతున్నారు. మరి జిల్లా బాధ్యత ఎవరిది? ఆ బరువు మరొక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భుజాలపై పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ దేముళ్లు, దేవాలయాలేనా.. అప్పుడప్పుడైనా రాజకీయాలు కూడా చూసుకోవాలి కదా అని సుతారంగా మందలించారని వినికిడి.  దానిలో నువ్వే ఈ భారం మోయాలి అనే సూచన వుందని మనం భావించవచ్చు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో పట్టుజారక ముందే పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి స్థాయిలో కలగడం కార్యకర్తలకు సంతోషం కలిగిస్తున్నది. ఆ మాత్రం రాజకీయ సవరణలు చేపడితే, పదికి పది గెలవకపోయినా, పదికి పది కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. జమీన్ రైతు సౌజన్యంతో
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం  కేంద్ర బిందువుగా మారింది. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన  మావిగన్  కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సీనియర్ జర్నలిస్ట్ డి.వి. శ్రీనివాస్ విశ్లేషణ ప్రకారం, జగన్ వ్యూహం వెనుక కేవలం రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తోంది.  అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో..  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్..  ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల సమస్యలను విస్మరించిన జగన్.. ఇప్పుడు అకస్మాత్తుగా శేషగిరమ్మ వంటి వృద్ధులను కలవడం విమర్శలకు తావిస్తోంది.  జగన్ అకస్మాత్తుగా రైతుల పక్షపాతిగా మారడం వెనుక ఒక వ్యూహం ఉందని సీనియర్ జర్నలిస్ట్ డీవీశ్రీనివాస్ అంటున్నారు.  అమరావతి ప్రాంతంలో కోల్పోయిన ఓటు బ్యాంకును, కనీసం ఈ మావిగన్  ప్రాంతంలోని పట్టణ ఓటర్లను ఆకర్షించడం ద్వారా దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే..  గతంలో అమరావతి రైతులపై జరిగిన దాడులు, మహిళా రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరని, మరచిపోరనీ డీవీ శ్రీనివాస్ చెబుతున్నారు.  అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చవుతాయని, అది సాధ్యం కాదని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించడమే వైసీపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందంటున్నారాయన. అమెరికాలో ఒక పోలీసు అధికారి బూటు కాలితో తొక్కడం ఎలాగైతే ఒక ప్రభుత్వం పతనానికి దారితీసిందో, ఏపీలో కూడా రైతు కుటుంబాల పట్ల జరిగిన దుశ్చర్యలే గత ఎన్నికలలో జగన్ ఓటమికి ప్రధాన కారణమని గుర్తు చేసిన డీవీ శ్రీనివాస్.. ఇప్పుడు  మావిగన్ పేరుతో ముందుకు రావడం అనేది కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, వాస్తవిక అభివృద్ధికి సంబంధించినది కాదని ఆయన చెప్పారు.   రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం వేగవంతమైతే, జగన్ ప్రతిపాదించిన  మావిగన్ మంత్రం ఫలించే అవకాశమే లేదన్నారాయన. ప్రభుత్వం మానవీయ కోణంలో రైతుల సమస్యలను పరిష్కరిస్తే..  జగన్ ఆరోపణలకు బలం ఉండదు. ఒకవేళ వైసీపీ తన మొండి వైఖరిని వీడకుండా, కేవలం విమర్శలకే పరిమితమైతే, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో కూడా ఆ పార్టీకి ఉన్న అంతంత మాత్రం పట్టు కూడా సడిలిపోతుందని అన్నారు డీవీ శ్రీనివాస్.  రాబోయే ఎన్నికల నాటికి అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారుతుందని చెప్పారు.     
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు  మావిగన్'  ప్రతిపాదనను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు.  ఈ ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ ప్రతిపాదన చేసిన జగన్ నెట్టింట ఓ ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయినప్పటకీ.. వైసీపీ సీనియర్ నాయకుడు, కోఆర్డినేటర్ సజ్జల, మాజీ మంత్రి  అంబటి రాంబాబు వంటి వారు మాత్రం మావిగన్ ను భుజాలకెత్తుకున్నారు.  వీరిలో అంబటి రాంబాబు ఒక అడుగు ముందుకు వేసి మావిగన్ కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు.  అమరావతి నిర్మాణం అనేది ఎప్పటికీ పూర్తికాని ప్రక్రియ అని, అది ఒక కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా అంబటి వ్యాఖ్యానించారు.   పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే ఏమౌతుంది.. , భవిష్యత్తులో  మా ప్రభుత్వం వచ్చి మళ్లీ సవరణలు చేస్తుందంటూ తన వాచాలత్వాన్ని అంబటి ప్రదర్శించారు. అంబటి వ్యాఖ్యలపై ఒక రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో  వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్  ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.   అమరావతి రాజధానిగా స్థిరపడిందని మెజారిటీ ప్రజలు భావిస్తుంటే,  వైసీపీ మాత్రం రోజుకో మాట, పూటకో ప్రతిపాదనతో  ప్రతిష్ఠను మరింత దిగజార్చుకుంటోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   అమరావతికి వ్యతిరేకంగా ప్రజల వద్ద మాట్లాడడానికే ఇబ్బందిగా ఉందని క్యాడర్ ఓ వైపు నెత్తీనోరూ బాబుకుంటుంటే.. ఆ పార్టీ కోఆర్డినేటర్, జగన్ ప్రభుత్వ హయాంలో ముఖ్యసలహాదారు, సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ ప్రతిపాదన ప్రతి పల్లెకూ చేరేలా ప్రచారం చేయాలంటూ పిలుపునివ్వడం చూస్తుంటే   జనం నుంచి వ్యక్తమౌతున్నఆగ్రహం, క్యాడర్ వ్యతిరేకత వైసీపీయులు చూడకుండా పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నచందంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. కెమెరాలు కట్ చేసి చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తొలిసారి పెదవి విప్పారు.  ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై  చెయ్యి చేసుకున్నారని  పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో  తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. తన దగ్గర డబ్బు లేదు కాబట్టి బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారని, మండలినే రద్దు చేస్తామని బెదిరించారని నాటి వైసీపీ ఘాతులకాలను వివరించారు. అయినా తనకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదని షరీఫ్ సగర్వంగా చెప్పారు. నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించుకుని 'అల్లా సత్యం వైపు ఉండేటట్లుగా నా కళ్లు తెరువు' అని కోరారన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా.. బెదిరించినా ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు ఆరోజు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాతా తనన న్ను చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారని,  ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టం చేయడం ఆనందంగా ఉందని నాడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు 
అమరావతిని వైసీపీ నాశనం చేయాలని చూస్తే.. తాము శాసనం చేసి నిలబెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.    అమరావతికి   పార్లమెంట్ ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. అమరావతిలో శుక్రవారం (ఏప్రిల్ 3) మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పార్లమెంటు ఉభయ సభల్లోనూ  35 మంది వరకు ఎంపీలు అమరావతికి మద్దతుగా మాట్లాడారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు.  రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.  శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యం ఉందన్నారు. సమృద్ధిగా నీరు, సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. ఆనాడు అసెంబ్లీలో వైసీపీ కూడా రాజధానిని సమర్థించిందని... కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ చెప్పారని ఈ  సందర్భంగా గుర్తు చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి ఆనంద్‌ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. "గేదెల రాజు" సినిమా నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటి శ్రావ్య మాట్లాడుతూ - జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. మా మూవీని మీరే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి. రఘు కుంచె గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరినీ ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. అన్నారు. నటి మౌనిక మాట్లాడుతూ - మా "గేదెల రాజు" సినిమా ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో సినిమా అంతకంటే బాగా ఉంటుంది. ఈ సినిమాకు రఘు కుంచె గారి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఈ నెల 17న థియేటర్స్ లో సినిమా చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.   నటుడు రవిఆనంద్ చిన్నిబిల్లి మాట్లాడుతూ - మా టీమ్ అంతా ఎంతో ప్యాషనేట్ గా కష్టపడి పనిచేసిన సినిమా ఇది. ఈ సినిమాకు దాదాపు అందరూ కాకినాడ వాళ్లే వర్క్ చేశారు. రఘు కుంచె గారు మా అందరికీ మంచి గైడెన్స్ ఇచ్చి ముందుండి నడిపించారు. మాలాంటి కొత్త వాళ్లకు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.  కో ప్రొడ్యూసర్ తాడాల వీరభద్రరావు మాట్లాడుతూ - రఘు కుంచె గారు మంచి మ్యూజిక్ తో పాటు ఈ సినిమాలో తన నటనతో మనందరినీ ఆకట్టుకుంటారు. గేదెల రాజు సినిమా ప్రేక్షకులకు కావాల్సిన ఎన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మిమ్మల్ని థియేటర్స్ లో బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు. ప్రొడ్యూసర్ వాణి రవికుమార్‌ మోటూరి మాట్లాడుతూ - డైరెక్టర్ చైతన్య మోటూరి మా అబ్బాయి. అతనికి సినిమా మీద ఉన్న ప్యాషన్ ను ఎంకరేజ్ చేయాలని ఈ సినిమా నిర్మించాం. ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. మా అబ్బాయిని దర్శకుడిగా మీరంతా ఆశీర్వదిస్తారని, మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు. నటుడు రామచంద్రం మాట్లాడుతూ - నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటి నుంచి ఈ మూవీ డైరెక్టర్ చైతన్య నాకు పరిచయం. నటుడిగా నాకు ఇది ఫస్ట్ మూవీ. మా సినిమా మీద పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. అందుకే మీడియా మిత్రులతో మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశాం. ఈ నెల 17న థియేటర్స్ కు రండి, తప్పకుండా మూవీని ఎంజాయ్ చేస్తారు. అన్నారు. నటుడు కిష్టయ్య మాట్లాడుతూ - రఘు కుంచె గారికి రాని విద్య ఏదైనా ఉందా అని సందేహం. ఆయన నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. ఒక ఎస్వీఆర్ ను, కైకాల సత్యనారాయణ గారిని గుర్తుకుతెస్తారు. ఎస్పీ బాలు, ఘంటసాల గారిలా ఆయనది మంచి గాత్రం. ఆయన తన కంపోజింగ్ తో ఇళయరాజాను గుర్తుకుతెస్తారు. అన్నారు. నటుడు, చిత్ర సమర్పకులు రఘు కుంచె మాట్లాడుతూ - ప్రతి సినిమాకు పనిచేసిన వారు మేము కష్టపడ్డామనే చెబుతుంటారు. మా సినిమా బాగుందనే అంటారు. మేము ఎవరెన్ని చెప్పినా థియేటర్స్ కి ప్రేక్షకుల్ని రప్పించేది కంటెంట్ మాత్రమే. సినిమా రిలీజ్ అయ్యాక ఆ మూవీలో కంటెంట్ ఉందని ప్రేక్షకులు అనుకుంటే తప్పకుండా సినిమాను ఆదరిస్తారు. మా మూవీలో మంచి కంటెంట్ ఉందని మేము నమ్ముతున్నాం. ఈ ట్రైలర్ తో మా మూవీ మీద మీకొక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ట్రైలర్ నచ్చి మా మూవీ బాగుంటుందని మీకు అనిపిస్తే ఈ నెల 17న థియేటర్స్ కు వచ్చి మా సినిమాను సక్సెస్ చేయండి. అన్నారు. డైరెక్టర్ చైతన్య మోటూరి మాట్లాడుతూ - గేదెలరాజు కాకినాడ తాలూక ఈ సినిమాకు మేము పెట్టిన క్యాప్షన్ చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు. ఈ క్యాప్షన్ లోనే కథ సారం ఉంది. గేదెల రాజు కథ ఇదే. ఒక మర్డర్ మిస్టరీని, ఒక క్రైమ్ థ్రిల్లర్ ను రెండు గంటల ఒక్క నిమిషం నిడివిలో క్రిస్ప్ గా తెరకెక్కించాం. ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్తారు. ఈ మూవీలో హీరోలు, విలన్స్ ఎవరూ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి. ఆ పాత్రల యొక్క లైఫ్ మాత్రమే ఉంటుంది. సినిమా చివరి 40 నిమిషాలు చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మేము ప్రేక్షకుల ఒక్క రూపాయి గానీ ఒక్క నిమిషం గానీ వృథా చేయాలనుకోవడం లేదు. అందుకే క్రిస్పీగా ఇంతమంచి సినిమా ఇచ్చేందుకు కష్టపడ్డాం. మలయాళ సినిమాలు బాగుంటాయని మనం అనుకుంటాం, మలయాళం వాళ్లు తెలుగు సినిమాలు బాగా తెరకెక్కిస్తారని అంటారు. అలా వాళ్లు చెప్పుకునేలా మా గేదెల రాజు సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం మేము చాలా ప్రయోగాలు చేశాం. పల్లెటూరి కొత్త గాయకులతో పాటలు పాడించాం. రఘు గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాలో లీడ్ రోల్ తో పాటు మ్యూజిక్ ఇచ్చారు ఓ పాట పాడారు. ఆ పాటను నేను ఎన్నోసార్లు విన్నాను. అలాగే సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మేకింగ్ లో మేము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 84 లొకేషన్స్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను సాధ్యమైనంత బాగా తెరకెక్కించాం. రెండున్నర నిమిషాల ఫైట్ సీక్వెన్స్ ను అరవై మంది కొత్తవాళ్లతో చేశాం. అలాగే కాకినాడలో రియల్ క్రౌడ్ మధ్య షూటింగ్ జరిపాం. ఈ సినిమాకు నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. సక్సెస్ మీట్ లో వారి గురించి మాట్లాడుతా. అన్నారు. 
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో   తెలుగు, తమిళ భాషల్లో  రూపొందిన  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’.  విలక్షణ నటులు సముద్రఖని, లక్ష్మీ ప్రియా జంటగా నటించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కీలక పాత్రలు పోషించారు.  ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.  కథ :  ఇప్పటి సమాజంలో డబ్బుకు  ఎంత ప్రాధాన్యత ఉందో,  అది కుటుంబ బంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ చిత్రం చాలా సున్నితంగా చూపిస్తుంది. ఎక్కడా బోర్ అనిపించకుండా, భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. సెల్వం అనే కార్ డ్రైవర్ పాత్రలో సముద్రఖని నటించారు. ఆయన భార్యగా లక్ష్మీప్రియా కనిపించారు. సంపత్, దేవి  (గౌతమ్ మీనన్, అభినయ) దంపతుల దగ్గర సెల్వం కార్ డ్రైవర్‌‌గా పనిచేస్తుంటారు. ఆయన భార్య  లక్ష్మీ ఇడ్లీ బండి నడుపుతూ.. కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండాలనుకుంటుంది. సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలనే కలతో వీరిపయనం సాగిస్తూ ఒక్కో రూపాయి సేవ్ చేసుకుంటుంటారు. ఓసారి సెల్వం చెల్లెలి కూతురి శుభకార్యానికి వెళ్లి అక్కడ అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన భర్తకు మాట రాకూడదనే తలపుంతో దాచుకున్న సొమ్ముతోపాటు మెడలోని తాళి బొట్టు కూడా అమ్మేసి వారికి సారె పెడుతుంది లక్ష్మీ. అది జరిగిన కొన్ని రోజులకే అనుకోకుండా సెల్వం కుమారుడి తలకు గాయం కావడంతో వైద్యానికి   డబ్బులు అవసరమవుతాయి. దీనికోసం తప్పని పరిస్థితుల్లో సెల్వం బావ దగ్గర పదివేల రూపాయలు అప్పు చేస్తాడు. సంపత్ దంపతులు నెలరోజుల వెకేషన్‌కు ఫారిన్ వెళ్లడంతో తన కారును  ట్యాక్సీగా మార్చి క్యాబ్ డ్రైవర్‌‌గా మారతాడు. ఈ క్రమంలో క్యాబ్‌ ఎక్కే ప్రతివారి నుంచి ఏదో ఒకటి తెలుసుకుని అలా ప్రయత్నం చేయాలనుకుంటాడు.  ‘డబ్బు సంపాదించాలంటే డబ్బున్న వాడిలా ప్రవర్తించాలి..’ అని ఒకరు  చెప్పడంతో   ఫ్యామిలీతో ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి అనవసర ఖర్చులు పెడతాడు.  అలాగే  ‘అప్పులు చేస్తేనే  గొప్పోళ్లు అవుతారు’ అని మరొకరు చెప్పడంతో క్రెడిట్ కార్డు ద్వారా తన అవసరాలను తీర్చుకుంటూ,   రాత్రింబవళ్లు క్యాబ్ నడిపి  కష్టపడి  కొంత డబ్బులు దాచుకుని, మరికొంత అప్పు చేసి మరీ ఊరి చివరన రెండు వందల గజాల స్థలం కొంటాడు. కానీ వాళ్ల భార్యకు మాత్రం అప్పు చేయడం  ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఒకానొక సందర్భంలో అప్పులు బాధలు ఎక్కువై ఇంట్లో ఉన్నా లేడని చెప్పించుకునే పరిస్థితి నెలకొంటుంది. ఈ అప్పుల బాధలు తట్టుకోలేక దుబాయ్‌లోని షార్జాకు వెళ్లి కారు నడుపుతూ డబ్బు సంపాదించాలనుకుంటాడు. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? భార్య, బిడ్డలను మిస్ అవుతూ ఎలా సఫర్ అయ్యాడనేది ఆసక్తికరంగా చూపించారు.   విశ్లేష‌ణ‌ :  బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగే  చక్కటి కుటుంబకథా చిత్రమిది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి వల్గారిటీ లేకుండా, మద్యపానం, ధూమపానంతో పాటు ఒక్క బూతుపదం కూడా లేకుండా ఇటీవల కాలంలో వచ్చిన సినిమా ఇది. మధ్యతరగతి కుటుంబ విలువలను చాటిచెప్పేలా సాగుతూ, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ వాళ్లను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందనేది చాలా రియలిస్టిక్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంది.  హృదయానికి హత్తుకునే ఈ చిత్రం.. డబ్బు, కుటుంబం, సంబంధాల మధ్య నడుస్తూ  ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ‘అనవసరం అయినవి  కొంటే.. అవసరమైనని కోల్పోతాం’ అని క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్ సినిమా డెప్త్‌ను తెలియజేస్తుంది.  న‌టీన‌టులు:  సముద్రఖని తన సహజమైన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలో ఉన్న లోతు, భావోద్వేగాలు ఎంతో సహజంగా కనిపిస్తాయి. సెల్వం పాత్రలో సముద్రఖని నటించిన తీరు ప్రతి ఒక్కరినీ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. మధ్యతరగతి భర్తగా, మధ్యతరగతి తండ్రిగా తనదైన ఎమోషన్స్‌ను పండించారు. ఆయన భార్యగా లక్ష్మీ ప్రియా నటన ప్రతి మహిళకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గౌతమ్ మీనన్, అభినయ పాత్రల నిడివి తక్కువే అయినా కథపై బలమైన ప్రభావాన్ని చూపిస్తారు. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు: దర్శకుడు రామ్ చక్రి ఈ  కథను చాలా సహజంగా, రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. ప్రతి సీన్‌లోనూ ఒక జీవం కనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రాఫర్  యువరాజ్ దక్షణ్ అందించిన విజువల్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయి.  మ్యూజిక్ ఈ చిత్రానికి అదనపు బలం. రామానుజన్ అందించిన  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది.    హైలైట్స్: సముద్రఖని అద్భుత నటన బలమైన కథ, భావోద్వేగాలు కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన అంశాలు రియలిస్టిక్ టేకింగ్ ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేని కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ మూవీ  ఫైనల్‌గా :    “కార్మేని సెల్వం” ఒక సాధారణ కథను అసాధారణంగా చెప్పిన మంచి సినిమా. భావోద్వేగాలు, కుటుంబ విలువలను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది.  రేటింగ్: 2.5/5
- ‘గూఢచారి’ నా లైఫ్ మార్చేసింది..  - ‘డెకాయిట్’ ప్రమోషన్స్‌లో శేష్ ఎమోషనల్. - సక్సెస్ ఫార్ములా రివీల్ చేసిన అడివి శేష్  టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న హీరో అడివి శేష్. కేవలం నటుడిగానే కాకుండా, స్క్రిప్ట్ లెవల్ నుంచి సినిమా నిర్మాణంలో భాగస్వామి అవుతూ ‘మినిమం గ్యారెంటీ’ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో, శేష్ ప్రమోషన్స్ హోరెత్తిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, నిర్మాతల లాభాలు మరియు గత విజయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ ప్రయాణంలో నిర్మాతల పాత్ర గురించి శేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లాభనష్టాలు సహజం, కానీ శేష్ ట్రాక్ రికార్డ్ మాత్రం వేరుగా ఉంది. "నేను ఇప్పటివరకు చేసిన సినిమాల వల్ల నా నిర్మాతలు ఎవరూ నష్టపోలేదు. ప్రతి ఒక్కరూ లాభాలను గడించారు. నన్ను నమ్మి వారు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని గర్వంగా చెప్పగలను" అని ఆయన పేర్కొన్నారు. ఒక నటుడికి అంతకంటే పెద్ద సంతృప్తి ఏముంటుందని శేష్ అభిప్రాయపడ్డారు. ఇక తన కెరీర్ టర్నింగ్ పాయింట్ గురించి ప్రస్తావిస్తూ ‘గూఢచారి’ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందని, ఒక నటుడిగా తన స్థాయిని పెంచిందని శేష్ అన్నారు. ‘గూఢచారి’ అందించిన విజయమే ఈరోజు ‘డెకాయిట్’ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టులను ధైర్యంగా చేసేలా చేసిందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమే తనను కొత్త తరహా కథలు చేసేలా ప్రోత్సహిస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలో విడుదల కాబోతున్న 'డెకాయిట్' సినిమాలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నాయని శేష్ హింట్ ఇచ్చారు. అడివి శేష్ అంటేనే సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. 'క్షణం', 'ఎవరు', 'మేజర్' వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో శేష్ తీసుకునే జాగ్రత్తలే ఆయన సినిమాలను హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తాయని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు 'డెకాయిట్'తో మరో భారీ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా శేష్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. "శేష్ అన్న సినిమా అంటే పక్కా హిట్" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అడివి శేష్ తన సినిమాలను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోట్ చేయడం కూడా అతనికి కలిసి వచ్చే అంశం. మరి ఏప్రిల్ 10న రాబోతున్న ఈ 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. దీని తర్వాత 'గూఢచారి 2' షూటింగ్‌లో శేష్ బిజీ కానున్నారు.
    -ధురంధర్ 1 విజయంలో రెహ్మాన్ పాత్ర తెలిసిందే  -సోషల్ మీడియాలో వైరల్ గా మారిన డీటెయిల్స్  -మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం రెహ్మాన్ డెకాయిత్ గా కంటి చూపు దగ్గరనుంచి కాలి గోటి వరకు మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ తో పాకిస్థాన్ లోని 'లాయిరీ' ఏరియాకి చెందిన నిజమైన అసాంఘిక శక్తి రెహ్మాన్ డెకాయిత్ ని మన కళ్ళ ముందు ఉంచాడు అక్షయ్ ఖన్నా(Akshaye Khanna). ధురంధర్ పార్ట్ 1  ఘన విజయంలో సైతం కీలక భూమిక. అసలు స్క్రీన్ పై  తన క్యారక్టర్ ఎంట్రీ అవ్వడం ఆలస్యం ప్రేక్షకుల నుంచి ఈలలు కేకలు. రీసెంట్ గా అక్షయ్ ఖన్నా ఫుడ్ హ్యాబిట్స్ తో స్లీపింగ్ టైం గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. అక్షయ్ ఖన్నా ఉదయం టిఫిన్ చెయ్యడు. అవసరమైతే టీ తాగి డైరెక్ట్ గా మధ్యాహ్నం  భోజనం చేస్తాడు. ఎక్కువగా ఇంటి భోజనాన్నే ఇష్టపడే అక్షయ్ మెనులో ఎక్కువ శాతం పప్పు, కొన్ని రకాల కూరగాయలు, చేపలు, చికెన్ ఉంటాయి. ఇంట్లో ఉన్నా సెట్స్ లో ఉన్నా అదే పరిస్థితి. ఒక్కో సారి నైట్ సమయంలో  రైస్ తీసుకోవడం కుదరనపుడు చపాతీ తింటాడు. బెండకాయ, లిచీ పండ్లు, కేక్స్ అంటే చాలా ఇష్టం. డైలీ పది గంటలు నిద్ర మాత్రం తప్పని సరి. అలసిన శరీరానికి, మనసుకి ఊరటనిచ్చేది నిద్ర అనే బలమైన నమ్మకంతో ఉంటాడు. Also read: Dhurandhar 2: ధురంధర్ 2 ని దెబ్బ కొట్టిన చిన్న మూవీ.. 52 దేశాలలో ట్రెండింగ్ అంటే మాటలా  ఈ విషయాలన్నీ గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అక్షయ్ ఖన్నానే వెల్లడి చేసాడు. రెహ్మాన్ డెకాయిత్ కాబట్టి మళ్ళీ తాజాగా వైరల్ గా మారాయి. చావా మూవీలో కూడా ఔరంగ జేబుగా వీరవిహారం చేసిన అక్షయ్ కి గతంలో హీరోగా చేసిన సినిమాల కంటే ఇప్పుడు ప్రతి నాయకుడిగా ఎక్కువ పేరు వస్తుండటం విశేషం. ఎంతలా అంటే తన అప్ కమింగ్ సినిమాల గురించి డైలీ సెర్చ్ చేసేంతలా. ఒకప్పటి బాలీవుడ్ అగ్ర హీరో వినోద్ ఖన్నా కొడుకే అక్షయ్ ఖన్నా.    
​For the past 25 years, Kantamaneni Ravi Shankar has garnered widespread appreciation for leading TeluguOne with a strong commitment to value-based journalism. Recently, he paid a courtesy visit to Megastar Chiranjeevi. During the meeting, Chiranjeevi commended Ravi Shankar for successfully running the organization with unwavering dedication for two and a half decades. ​Beyond maintaining healthy journalistic standards at his media organization, Ravi Shankar has been actively involved in philanthropy through the TeluguOne Foundation. His foundation has facilitated life-saving surgeries for numerous individuals in need. Learning about these noble initiatives, Megastar Chiranjeevi highly praised Ravi Shankar's social efforts. ​The meeting also saw the two prominent figures discuss a variety of subjects and exchange their perspectives. In turn, Ravi Shankar lauded Chiranjeevi's philanthropic nature, recognizing the numerous charitable activities the actor undertakes as a social responsibility alongside his monumental contributions to the film industry. ​Reflecting on the meeting, Kantamaneni Ravi Shankar shared, "Chiranjeevi garu remains incredibly grounded, no matter how great the heights he reaches. The warmth with which he received me and the way he spoke proves yet again why he is a true Megastar."
గత 25 సంవత్సరాలుగా విలువలతో కూడిన జర్నలిజంతో తెలుగువన్ సంస్థను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు కంఠంనేని రవిశంకర్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని ఆయన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 25 సంవత్సరాలుగా నిబద్ధతతో సంస్థను నిర్వహిస్తున్న రవిశంకర్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఆరోగ్యకరమైన జర్నలిజంతో మీడియా సంస్థను నిర్వహిస్తూనే తెలుగువన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రవిశంకర్. అలాగే తమ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి లైఫ్ సేవింగ్ స‌ర్జ‌రీలు కూడా చేయించారు. ఈ విషయాలు తెలుసుకున్న మెగాస్టార్.. రవిశంకర్‌ను ప్రశంసించారు.  ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, కంఠంనేని రవిశంకర్ పలు అంశాల గురించి చర్చించారు. తమ అభిప్రాయాలను ఇద్దరూ షేర్ చేసుకున్నారు. సినీ రంగానికి సేవ చేస్తూనే సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సేవా తత్పరతను రవిశంకర్ కొనియాడారు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం చిరంజీవిగారిది. నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన నిజమైన మెగాస్టార్ అని మరోసారి రుజువైంది’ అని కంఠంనేని రవిశంకర్ తెలియజేశారు.
    -ధురంధర్ 2 కాదు, మించిన సినిమా వచ్చింది  -ఇంతకీ ఏంటి ఆ మూవీ  -అసలు ఈ న్యూస్ నిజమేనా  -పూర్తి డీటెయిల్స్ చూద్దాం పాడమని నన్ను అడగవలనా... పరవశించి పాడనా అని ఒక పాటల రచయిత రాసినట్టుగా ధురంధర్ 2(Dhurandhar 2)కలెక్షన్స్ రికార్డ్స్ గురించి భారతీయులకి చెప్పాలా! ప్రతి అప్ డేట్ వాళ్ళందరి దగ్గర ఉంటుంది. స్టిల్ ఈ నిమిషం సైతం వాళ్ళని ఏ మాత్రం కదిలించినా ధురంధర్ 2 వద్దకి చేరిన నయా రికార్డు గురించి ధురంధర్ సైనికుల్లా పూస గుచ్చినట్టుగా విడమర్చి మరి చెప్తారు. దీన్ని బట్టి ధురంధర్ 2 ఎంత ట్రెండింగ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ధురంధర్ ప్రేమికులు షాక్ అయ్యే న్యూస్ చెప్పబోతున్నాం. స్పిరిట్ గా తీసుకుంటారో, తాడిని తన్నే వాడు ఉంటే తలని తన్నే వాడుంటాడనే సత్యాన్ని అర్ధం చేసుకుంటారో మీ ఇష్టం. మరి ఆ నయా క్రేజ్ మూవీ ఏంటో చూద్దాం. మేడ్ ఇన్ కొరియా(Made in Korea).. ఓజి భామ ప్రియాంక మోహన్(Priyanka Mohan)ముఖ్యమైన క్యారక్టర్ పోషించింది. ఒక మోస్తరు ప్రమోషన్స్ తో గత నెల మార్చి 12 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఏంటి! ఈ మూవీ ఇప్పుడు ధురంధర్ 2 హవాని అడ్డుకుందా! చెవుల్లో ఏమైనా కాలిఫ్లవర్ కనపడుతుందా అని అనుకోవడం కామన్. మీరింకా ఎక్కువ సామెతల్లోకి  వెళ్లకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నాను. మేడ్ ఇన్ కొరియా ప్రెజంట్ 54 దేశాల్లో భారీ వ్యూస్ ని రాబడుతుంది. దీన్ని బట్టి ఆ దేశాల్లో మేడ్ ఇన్ కొరియా ట్రెండింగ్ ని  అర్ధం చేసుకోవచ్చు. 54 దేశాల్లో ట్రెండింగ్ లో ఉందనే విషయాన్నీ  నెట్ ఫ్లిక్స్ అధికారకంగా ప్రకటించింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో విడుదలైన అత్యంత విజయవంతమైన తమిళ చిత్రంగా నిలవడంతో పాటు నెలరోజులు తిరక్కుండానే 10 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది. తమిళంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగుతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ హిందీతో సహా 12 భాషల్లో అందుబాటులో ఉంది. also read: Bhanupriya: భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా!..ఊహించని ఆన్సర్ చెప్పిన సోదరి  ఏ మాత్రం భీకరమైన మలుపులు, భారీ సెట్టింగ్స్, చేజింగ్స్, చెవులు దద్దరిల్లే బిజిఎం లేకుండా నటీనటుల పెర్ ఫార్మెన్స్, భావోద్వేగాల ఆధారంగా తెరకెక్కింది. షేన్బా గా ప్రియాంక మోహన్ పెర్ఫార్మ్ అత్యద్భుతంగా ఉంటుంది. కొరియన్ నటులు కూడా  తమ పెర్ఫార్మ్ తో మెప్పిస్తారు. తమిళనాడుకి చెందిన షేన్బా  కొరియా దేశం ఎందుకు వెళ్ళింది. వెళ్ళాక అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అనేదే కథ.  రా. కార్తీక్(Ra karthik) దర్శకుడు.     
  -సోషల్ మీడియాలో భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందనే వార్తలు  -అవి నిజామా -వివరణ ఇచ్చిన శాంతిప్రియ   తెలుగు సినిమాకి ఎనలేని సేవలు చేసిన నటీమణుల్లో భానుప్రియ(Bhanupriya)ఒకరు. బాక్స్ ఆఫీస్ ని సైతం హీరోకి ధీటుగా సొంతం చేసుకొని భారీ ఫ్యాన్స్ బేస్ ని  కూడా పొందింది.స్క్రీన్ పై  కళ్ళతోనే ప్రదర్శించే పెర్ఫార్మ్ చూసి తమ అభిమాన నటి తమతోనే ఏదో చెప్తుందనుకున్న ఫ్యాన్స్ కైతే లెక్కే లేదు. అంతలా కళ్ళతోనే క్యారెక్టర్స్ లో మెస్మరైజ్ చెయ్యగలదు. పెళ్లి చూపులకి వెళ్లి భానుప్రియలాగా రూపు, కళ్ళు లేవని పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అంతలా 80 వ దశకంలో సగభాగాన్ని, 90 వ దశకాన్నితన ఛరిష్మాతో నింపేసింది. మరి అంతటి లెజండ్రీ నటీమణి మతిస్థిమితం కోల్పోయిందనే న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతు ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ని కలవరపరుస్తోంది. రీసెంట్ గా భానుప్రియ సోదరి శాంతిప్రియ(Shanthipriya)ఆ వార్తలపై  స్పందించడం జరిగింది. ఆమె ఏం చెప్పిందో చూద్దాం. ఆమె మాట్లాడుతు అక్కయ్య మతిస్థిమితం కోల్పోయిందనేది అబద్దం. దయచేసి అసత్య వార్తలు ప్రచారం చేయకండి. బాడ్ గర్ల్ మూవీలో అక్క నా కోసం డబ్బింగ్ కూడా చెప్పింది  బావగారు చనిపోయాక అక్కయ్య తీవ్ర మనోవేదనలో ఉంది. పైగా గత కొంత కాలం నుంచి అక్కయ్యకి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఎంతో ఆనందంతో సెట్స్ కి వెళ్తుంది. కానీ అక్కడకి వెళ్ళాక క్యారెక్టర్స్ డిజైన్ మారుస్తున్నారు. దీంతో ఎంతగానో  కలత చెందుతుంది. 200 సినిమాలకి పైగా చేసిన అక్క విషయంలో ఆ విధంగా ప్రవర్తించడం చాలా బాధగా ఉంది. ఇప్పుడు అక్కయ్య ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. 80 వ తరం నటీనటులు కూడా తాము ఏర్పాటు చేసుకుంటున్న ఫంక్షన్స్ కి  పిలవడం లేదని చెప్పుకొచ్చింది. Also read: Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి డేట్ వచ్చేసింది.. డేట్ స్పెషల్ ఇదే ఇప్పుడు ఈ మాటలతో భానుప్రియ మతిస్థిమితం కోల్పోలేదనే విషయం అర్ధమవుతుంది. శాంతిప్రియ పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. మహర్షి సాంగ్స్ తో అయితే సంగీత ప్రియుల ఇళ్లల్లో శాంతిప్రియ నామం నిత్య జపం. 
- వారణాసి సెట్స్‌లో ప్రియాంక చోప్రా సంద‌డి - హైదరాబాద్‌లో కాశీ నగరం - మహేష్ బాబు 'వారణాసి' కోసం జక్కన్న భారీ ప్లాన్. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి' ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నారు. సెట్స్‌కు వెళ్లే దారిలో ఆమె షేర్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో రాజమౌళి ఒక అద్భుతాన్నే సృష్టించారు. కాశీ నగరాన్ని తలపించేలా భారీ సెట్‌ను నిర్మించి, అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గంగా హారతి, పురాతన ఆలయాలు, వారణాసి వీధులు ప్రతిబింబించేలా ఈ సెట్ రూపొందించబడింది. కేవలం 25 నిమిషాల నిడివి గల సీక్వెన్స్ కోసం జక్కన్న ఇంత భారీ ఏర్పాట్లు చేయడం గమనార్హం. ప్రియాంక చోప్రా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటూ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను వేగవంతం చేశారు. సినిమా అనుభవాల గురించి ప్రియాంక మాట్లాడుతూ.. తెలుగు డైలాగులు చెప్పడం తనకు పెద్ద ఛాలెంజ్‌గా మారిందని పేర్కొన్నారు. అయితే రాజమౌళి ప్రతి విషయాన్ని ఎంతో ఓపిగ్గా వివరిస్తున్నారని, ఆయన విజన్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని కొనియాడారు. కేవలం డైలాగులు మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న భావం కూడా అర్థం చేసుకునేలా రాజమౌళి సాయం చేస్తున్నారని ఆమె తెలిపారు. సుమారు 14 నెలలుగా ఈ సినిమా షూటింగ్ సాగుతుండగా, మరో ఆరు నెలల వరకు చిత్రీకరణ కొనసాగే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా అలరించనుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా పురాణాలు మరియు ఆధునిక సైన్స్ ఫిక్షన్ కలయికగా రాబోతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన ఈ కథ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో వినియోగించే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫెసిలిటీలో ఇప్పటికే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేశారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం జక్కన్న ఎక్కడా తగ్గకుండా పని చేస్తున్నారు. ప్రియాంక నటించిన 'ది బ్లఫ్' సినిమాను చూసిన మహేష్, రాజమౌళి ఆమె నటనను ప్రశంసించడంతో 'వారణాసి'పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనుంది. సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రియాంక చోప్రా తిరిగి ఇండియన్ స్క్రీన్ పైకి వస్తుండటంతో గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దిగ్గజ దర్శకుడు మణిరత్నం. వెండితెరపై ఆయన సృష్టించే దృశ్యకావ్యం కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. తాజాగా ఈ మాస్టర్ డైరెక్టర్ ఒక క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి మరియు అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే 'లేడీ పవర్ స్టార్' సాయి పల్లవి మొదటిసారి ఈ చిత్రం కోసం జతకట్టబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ నెలాఖరులోనే (ఏప్రిల్) ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రోమో షూటింగ్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను వేసవి కానుకగా జూన్ 2026లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, తన కెరీర్‌లో ఎప్పుడూ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. మణిరత్నం సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంత బలంగా, సున్నితంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తోందంటే, ఆమె పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. విజయ్ సేతుపతి సైతం తన సహజ సిద్ధమైన నటనతో ఈ సినిమాకు పెద్ద అసెట్ కానున్నారు. మణిరత్నం గతంలో అందించిన 'పొన్నియిన్ సెల్వన్' వంటి భారీ చారిత్రక చిత్రాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీతో రాబోతున్నట్లు సమాచారం. తన సినిమాల్లో ఎమోషన్స్ మరియు విజువల్స్ పట్ల మణిరత్నం తీసుకునే శ్రద్ధ ఈ చిత్రాన్ని మరో అద్భుత కావ్యంలా తీర్చిదిద్దుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఇద్దరూ తమ మునుపటి కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ పై భారీగా చర్చ జరుగుతోంది. టాలెంటెడ్ యాక్టర్స్ మరియు గ్రేట్ డైరెక్టర్ కలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారా లేదా అనే అంశంపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మణిరత్నం నుంచి రాబోతున్న ఈ సరికొత్త 'మేజిక్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అన్నీ ఉన్నా కరెంట్ కోత వల్ల అవి  పనిచేయడం ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.  ఈ చిట్కాలు తెలుసుకున్న వారు వేసవి వేడి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా,  కరెంట్ కోత ఉన్న సమయంలో అయినా టెన్షన్ పడకుండా రిలాక్స్ ఫీల్ అవుతారు.  ఇంతకీ కరెంట్ లేకపోయినా చల్లగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కిటికీల, తలుపులు.. వేసవిలో విద్యుత్ కోత  గురించి  చింతించాల్సిన అవసరం లేదు. కిటికీలు, తలుపులను తడిపి, వాటిని తెరిస్తే చాలు, చల్లని గాలి గదిలోకి ప్రవహిస్తుంది. లేదంటే కిటికీలు,  తలుపులకు తడి కర్టెన్లు ఏర్పాటు చేసుకున్నా చల్లగా ఉంటుంది. వట్టివేర్ల మ్యాట్.. బయటి వేడి గాలి లోపలికి రాకుండా కిటికీలలో వట్టివేర్ల  చాపను వేయాలి.  ఈ చాపను కిటికీల దగ్గర ఏర్పాటు చేసి వాటిని అప్పుడప్పుడ తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతిని గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వట్టివేర్లు చాలా చాలా చల్లగా ఉంచుతుంది. సీజనల్ ప్రూట్స్.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే, వేసవి కాలంలో  లభించే పండ్లను కూడా తినవచ్చు. పెరుగు, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అవి వేడిని తట్టుకోవడానికి  సహాయపడతాయి. చన్నీటి స్నానం..  ఇంట్లో కరెంట్ పోయినప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే,  చల్లటి నీటితో స్నానం చేయవచ్చు.  వేడిగా అనిపించకుండా ఉండటానికి  చేతులు, పాదాలు, ముఖాన్ని తరచుగా కడుక్కోవడం కూడా మంచి మార్గం. కుండనీరు..  మట్టి కుండలోని నీటిని త్రాగడం కూడా మంచి ఉపశమనం. ఈ నీరు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ,  శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచుతుంది. తడిబట్ట.. ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు తడిబట్ట పెట్టడం అంటే. గదిలో ప్లోర్ ను తుడవడం కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది డీప్ క్లీన్ కానక్కర్లేదు. కేవలం కాస్త నీరు చల్లి ప్లోర్ తుడుచుకున్నా చల్లగా ఉంటుంది. రూప్ కూలింగ్.. మేడపైన కూలింగ్ పెయింట్ వేస్తుంటారు కొందరు.  వేసవిలో ఈ పెయింట్ వేయడం వల్ల ఇంట్లో చాలా చల్లగా ఉంటుందని చెబుతారు.  అయితే ఇలా కాకపోయినా ఇంటి మేడ పైన రూఫ్ ను నీటితో తడుపుతూ ఉన్నా కూడా ఇంట్లో చల్లగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు. ఇది సాధారణ పండుగలా ఆనందంతో జరుపుకునే రోజు కాదు..  దీని వెనుక ఉన్న భావం ఎంతో గంభీరమైనది,  ఆధ్యాత్మికతతో నిండినది. యేసు ప్రభువు త్యాగాన్ని ప్రతిబింబించేది.. గుడ్ ఫ్రైడే గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. యేసు క్రీస్తు తన బోధనల ద్వారా ప్రేమ, క్షమ, దయ వంటి విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన మార్గం సహనం, పరస్పర గౌరవంతో కూడుకుని ఉంది. అయితే ఆయన బోధనలు అప్పటి కొందరు అధికారులకు నచ్చకపోవడంతో ఆయనను శిక్షించడానికి కుట్రలు పన్నారు. చివరకు ఆయనను శిలువపై వేయడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి, మానవాళి పాపాల విమోచన కోసం తనను తాను అర్పించుకున్నారని క్రైస్తవులు విశ్వసిస్తారు. ప్రేమకు, క్షమకు ఉన్న అపారమైన శక్తిని  ఈ త్యాగం ద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి చాటి చెప్పాడని అంటారు. తనను బాధించిన వారిని కూడా క్షమించగలిగిన హృదయం ఉండాలని.. ఈ  గొప్ప సందేశాన్ని ఆయన తానే ఒక ఉదాహరణగా మారి ప్రజలకు, ప్రపంచానికి అందించారు. గుడ్ ఫ్రైడే ను గుర్తు చేసుకునే విధానం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు, యేసు ప్రభువు శిలువ అయిన విధానాన్ని స్మరించుకుంటారు,  చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఇది ఆత్మపరిశీలనకు, ప్రతి ఒక్కరూ తమ  తప్పులను గుర్తించి మార్పు చెందడానికి  అవకాశం కల్పిస్తుంది. గుడ్ ఫ్రైడే ప్రతి ఒక్కరికి  ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.. నిజమైన ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నదని,  క్షమించగలిగే మనసు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నేర్పుతుంది.  ప్రతి ఒక్కరు తమ  జీవితాల్లో కూడా ఇతరులను ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం వంటి విలువలను అలవాటు చేసుకోవాలని గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తు చేస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువును శిలువ వేసిన కారణంగా.. ఈ రోజు ప్రతి క్రైస్తవ సోదరుడు, సోదరి..  ఎంతో భావోద్వేగంగా యేసును స్మరించుకుంటారు.  గుడ్ ఫ్రైడే అనేది ఒక విషాద దినం మాత్రమే కాదు,  ఇది మానవత్వాన్ని, దయను,  నిస్వార్థ త్యాగాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన రోజు. మనసును శుద్ది చేసుకుని,  ప్రతి ఒక్కరూ మంచి మార్గం వైపు నడిచేందుకు గుడ్ ఫ్రైడే ఒక మార్గం చూపిస్తుంది.                                 *రూపశ్రీ.
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను  పెంచేటప్పుడు, తల్లిదండ్రులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాయి.  ఆడపిల్లలను పెంచే తల్లిదండ్రులు చేయకూడని తప్పులేంటి? ఆడపిల్లను పెంచేటప్పుడు తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటి? ఆచార్య చాణక్యుడు దీని గురించి ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ఆంక్షలు, పరిమితులు.. ఆడపిల్ల అంటే  కుటుంబానికి పరువుగా  భావిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు తరచుగా  ఆడపిల్లల  కలలను అల్పమైనవిగా భావించి, వాటిపై ఆంక్షలు విధిస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం ఆడపిల్లల  కలలను ఎన్నడూ పరిమితం చేయకూడదు. ఆమె చదువును, వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆడపిల్ల  అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశమూ కల్పించాలి. ఆడపిల్ల చదువులో,  వృత్తిలో ఎదిగే ఇంటికి అంతులేని గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్వేచ్ఛ.. అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ఎవరికీ మంచిది కాదు. అలాగే, ప్రతి విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు. నిరంతరం ఆంక్షలు విధించడం మంచి ఆలోచన కాదు. అలా చేయడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కొడుకు అయినా, కూతురు అయినా, వారి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. కొడుకుకు అయితే అన్నీ తెలుసు వారికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవడం,  కూతురుకు ఏమీ తెలియదు అని ఏ విషయాన్ని ఆమె ఆలోచించకుండా,  ఆమె నిర్ణయించుకోకుండా చెయ్యడం మంచిది కాదు. వివాహం పట్ల అబిప్రాయం.. నేటి సమాజం మారుతున్నప్పటికీ, కొందరు అమ్మాయిలు మాత్రమే  పెళ్లి విషయంలో తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది తండ్రులు ఇప్పటికీ తమ కూతుళ్ల పెళ్లి విషయమై వారి అభిప్రాయం తెలుసుకోరు. నేటికీ కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు ఉంటున్నారు.  సమాజపు ఒత్తిడికి లొంగి కూతురికి పెళ్లి చేయడం లేదా అనారోగ్యకరమైన బంధంలోనే ఉండమని ఒత్తిడి చేయడం మంచిది కాదు. పెంపకం.. కూతుళ్ల పెంపకం రెండు విధాలుగా ఉంటుంది.  కొందరు ఆడపిల్లను ప్రేమగా పెంచుతారు.  అలాంటి వారు కూతుళ్లతో ప్రేమగా, స్నేహంగా అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడేలా పెంచుతారు. కానీ కొందరు భయం గుప్పెట్లో పెంచుతారు. ఇలాంటి పెంపకంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర, పెద్ద వారి దగ్గర,  సమాజంలోని వ్యక్తుల దగ్గర కూడా నోరు విప్పాలంటే భయపడుతుంది. దీని వల్ల ఆడపిల్ల తనను తాను కోల్పోతుంది.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ ఫూల్ లేదా బావులలో ఈత కొట్టడం కూడా ఒక మార్గం.  అయితే చాలా మంది ఈత కొట్టడం అంటే మునిగిపోతారనో లేక జలుబు,  చెవి సమస్యలు వస్తాయనో కంగారు పడుతూ ఉంటారు. కానీ ఈత కొట్టడం వల్ల వీటి కంటే పెద్ద సమస్య.. అందులోనూ నిర్లక్ష్యం చేస్తే చాలా చాలా కంగారు పెట్టే సమస్య ఒకటుంది. అదే కంటి ఇన్ఫెక్షన్లు.. ఈత వల్ల కళ్లకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. స్విమ్మింగ్ ఫూల్  నీటిలోని క్లోరిన్, రసాయనాలు,  బ్యాక్టీరియా కొన్నిసార్లు కళ్లలోని సున్నితమైన పొరను దెబ్బతీసి, చికాకు, ఎరుపు, దురద, దృష్టి మసకబారడానికి కారణమవుతాయి. జనం ఎక్కువగా  ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈత కొడుతున్నప్పుడు కంటి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి. వేసవిలో అధిక చెమట, దుమ్ము , రద్దీ కారణంగా కళ్ల సెన్సిటివ్  పెరుగుతుంది.  స్విమ్మింగ్ పూల్ నీటిని సరిగ్గా శుభ్రపరచకపోతే, అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయి.  ఈ బాక్టీరియా కంటి బయటి పొర (కంజంక్టివా) వాపుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంట, కళ్ళు ఎర్రబడటం, దురద , కళ్ళ నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలుగవచ్చు. మురికిగా ఉన్న లేదా జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంటాక్ట్ లెన్సులు ధరించి ఈత కొట్టడం ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. స్విమ్మింగ్ ఫూల్ మెయింటెన్స్ సరిగా లేకపోతే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా ప్రోటోజోవాలు డవలప్ అవుతాయి. ఇవి కళ్లకు సోకి, వాపును కలిగిస్తాయి. ఎక్కువ కాలం వీటికి గురికావడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ రియాక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈత కొట్టే ముందు శుభ్రమైన, సరిగ్గా సరిపోయే, నీరు చొరబడని గాగుల్స్ ధరించాలి. రసాయన రియాక్షన్స్  తగ్గించడానికి, కంటి మేకప్ లేదా జిడ్డు క్రీములను తొలగించిన తర్వాతే  ఈత కొట్టాలి. స్విమ్మింగ్ పూల్‌లో  అటు ఇటు నుండి చిమ్మే నీటి నుండి  జాగ్రత్త పడాలి. నీరు కంటి మీద పడకుండా చూసుకోవాలి.  ఈత కొట్టిన తర్వాత కళ్లను చల్లని, శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి. అవసరమైతే కంటికి తేమను అందించే చుక్కల మందును వాడాలి.  స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి ప్రత్యేకంగా టవల్ ను సొంతంగా తీసుకెళ్లడం మంచిది.  స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జనం ఎక్కువగా కనిపించినా, నీరు మురికిగా కనిపిస్తున్నా అక్కడ ఈత కొట్టకపోవడం మంచిది.                               *రూపశ్రీ.
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు.  అయితే చాలా మంది ప్రజలు తరచుగా తమ రోజును  కప్పు టీతో లేక కాఫీతో మొదలుపెడుతుంటారు.  దీని వల్ల ఉదయాన్నే చురుగ్గా పనిచేయగలుగుతామని చెబుతారు. అయితే టీకి బదులుగా ఉదయాన్నే  ఒక గ్లాసు నీరు త్రాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు , రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో.. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే.. ఎన్ని లీటర్ల నీరు తాగాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరానికి సరైన మోతాదులో నీరు త్రాగడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో మరింత నీరు త్రాగడం మంచిది. జిమ్‌కు వెళ్లేవారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి. ఎప్పుడు నీరు తాగాలి?  ప్రతి ఒకటి నుండి రెండు గంటలకు కొద్దిగా నీరు త్రాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం మంచిది కాదు. కొద్దికొద్దిగా నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. అలాగే  పడుకునే ముందు కొద్దిగా నీరు తాగవచ్చు, కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయాన్నే ఎందుకు తాగాలి? రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత, శరీరానికి తిరిగి తేమను అందించడానికి నీరు అవసరం. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. చర్మానికి మంచిది.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అందాన్ని పెంచుతుంది. నిజానికి, నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. నీళ్లు తాగడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల ముఖ ముడతలు తగ్గుతాయి , శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియ.. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల  జీవక్రియ వేగవంతమవుతుంది. జీవక్రియను పెంచుకోవడం బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.  దీని వల్ల  కాలేయం,  మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం వల్ల పైన చెప్పుకున్న లాభలన్నీ ఉంటాయి.  అంతేకాకుండా ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.                                    *రూపశ్రీ.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో, క్యాలీ ఫ్లవర్ ను పోలిన బ్రోకలీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులను ఆమడ దూరంలో ఉంచే శక్తి బ్రోకలీకి ఉంది. అసలు బ్రోకలీలో ఉండే పోషకాలు ఏంటి? బ్రోకలీ తింటే ఏ వ్యాధులు దూరంగా ఉంటాయి?  తెలుసుకుంటే.. బ్రోకలీలో ఉండే పోషకాలు.. బ్రోకలీలో ఫైబర్,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రోకలీ తింటే ఏ జబ్బులు దూరంగా ఉంటాయంటే.. గుండె జబ్బులు.. బ్రోకలీని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇందుకోసం బ్రోకలీని తీసుకునే విధానం కూడా చాలా ముఖ్యం.  ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తనాళాల ఆరోగ్యం.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రోకలీ గుండె మరియు రక్తనాళాల  వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు,  పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి. క్యాన్సర్.. బ్రోకలీకి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే.. బ్రోకలీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కంటిచూపు.. కంటి చూపుకు పదును పెట్టడంలో,  దృష్టి లోపాన్ని నివారించడంలో,  రేచీకటి వంటి దృష్టి సమస్యలు నివారించడంలో బ్రోకలీ  కొంతవరకు సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పేగు ఆరోగ్యం.. బ్రోకలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది పేగు ఆరోగ్యానికి చక్కగా  సహాయపడుతుంది. బ్రోకలీని తీసుకుంటూ ఉంటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. చక్కెర స్థాయిలు.. మధుమేహం ఉన్నవారు బ్రోకలీని తింటే చాలా ఉపయోగం.  బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.                                  *రూపశ్రీ.