LATEST NEWS
1980 ఏప్రిల్ 6న న్యూఢిల్లీలోని కోట్లా మైదానంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బిజెపి అధికారికంగా ఆవిర్భవించింది. భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ పార్టీకి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆనాటి సభలో ఆయన చేసిన అంధేరా ఛాటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా ప్ర‌క‌ట‌నే నేడు నిజ‌మైంద‌ని అంటారు క‌మ‌ల‌నాథులు. తెలుగులో దీన‌ర్ధం ఏమిటంటే.. చీకటి తొలగుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. ఆ నినాదం ఇప్పటికీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. బిజెపికి  1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి.  అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.  2026లో బీజేపీ 46వ‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వ‌హిస్తోంది. ఏప్రిల్ 5 నుండి 12 వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేస్తోంది. ఈ వారోత్స‌వాల్లో భాగంగా.. వికాస్ యాత్రలు, సేవా కార్యక్రమాల‌ను ప్లాన్ చేసింది బీజేపీ. ప్రతి బూత్ స్థాయిలో జెండా  ఆవిష్కరణ,  పార్టీ సిద్ధాంతకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు నివాళులర్పించడం వంటివి చేస్తోంది.   కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేసి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక గ్రామ బస్తీ చలో కార్య‌క్ర‌మం విష‌యానికి వ‌స్తే.. ఏప్రిల్ 7 నుండి 12 వరకు నాయకులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ.. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.  తెలంగాణ‌లో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల‌తో కమలం పార్టీ బలంగా ఉంది.  ఇక ఎమ్మెల్సీ, మున్సిపాల్టీల్లోనూ ప‌ట్టు నిలుపుకుంటూ వ‌స్తోంది. వ‌చ్చే  ఎన్నిక‌ల‌లో అధికారమే టార్గెట్ గా అడుగులు వేస్తు ముందుకు సాగుతోంది.  ఇక ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంది.  అటు కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా  కూటమి అధికారంలో ఉండటంతో, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిధులు, మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాల్లో కేంద్రం నుంచి ల‌బ్ధి పొందడంలో బిజెపి   వారధి గా పనిచేస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపికి ప్రాతినిధ్యం ఉంది. సత్యకుమార్ యాదవ్ వంటి నేతలు మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహిస్తున్నారు.  కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయడంలో బిజెపి చురుకైన పాత్ర పోషిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సొంతంగా బిజెపి ముఖ్యమంత్రులు   14 రాష్ట్రాలలో, బీజేపీ యేతర సీఎంలు ఉన్నప్పటికీ  ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. అంటే దేశంలో మొత్తం 21 రాష్ట్రాలలో   ప్ర‌స్తుతం బీజేపీ  నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి అధికారంలో ఉంది.   ప్రస్తుతం  అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే మే 4న ఈ లెక్కల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బిజెపి గట్టి పోటీనిస్తోంది.   ఏది ఏమైనా బీజేపీ త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో స్వ‌ర్ణ‌యుగంలాంటి రోజుల‌ను ఆస్వాదిస్తోంది. దేశ వ్యాప్తంగా అత్య‌ధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ.. గా ఈ ఏడాది ఆవిర్భావ ఏడుక‌ల‌ను ఎంతో ఘ‌నంగా  నిర్వ‌హిస్తోంది.  
 ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు జోరు వానలూ, మరో వైపు చండ్ర నిప్పులతో ఏపీ వాతావరణం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండురోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో నిప్పులు చెరిగే ఎండలే, మరి కొన్ని జిల్లాలలో  పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.  దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.  వీటి ప్రభావంతో  సోమ, మంగళ (ఏప్రిల్ 6, 7) వారాల్లో ఈ ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై  పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక  పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో  ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.   అదలా ఉండగా,  ఆదివారం (ఏప్రిల్ 5) పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.3, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 41.8, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 41.5, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41.3, చిత్తూరు జిల్లా పలమనేరు, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
  రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ  మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి. గతంలో పార్టీకి వెన్నెముకగా, కేజ్రీవాల్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న రాఘవ్ చద్దాపై ఇప్పుడు పార్టీ నాయకత్వమే విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై రాఘవ్ చద్దా స్పందిస్తూ.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, ఇది తనను అణచివేసేందుకు జరుగుతున్న కుట్ర అని కొట్టిపారేశారు.  రాజకీయ పరిస్థితి : ఆప్ వర్సెస్ రాఘవ్ చద్దారాజ్యసభలో ఆప్ డెప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించి, ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించడంతో ఈ వివాదం మొదలైంది. అంతేకాకుండా, రాజ్యసభలో పార్టీ కోటా నుంచి చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని పార్టీ సెక్రటేరియట్‌కు లేఖ రాయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పంజాబ్ సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని, ప్రతిపక్షాల వాకౌట్‌లో పాల్గొనలేదని మరియు ప్రధానమంత్రిపై విమర్శలు చేయడానికి భయపడుతున్నారని పంజాబ్ ఆప్ నాయకులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా చద్దా ఒక వీడియో విడుదల చేస్తూ, "నేను గాయపడ్డాను, అందుకే మరింత ప్రమాదకరంగా మారాను" అంటూ హెచ్చరించారు. పార్లమెంట్‌లో తాను లేవనెత్తిన అంశాల ట్రాక్ రికార్డ్ చూడాలని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని ఆయన సవాల్ విసిరారు. తన గొంతు నొక్కడమే లక్ష్యంగా ఈ "స్క్రిప్టెడ్" ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వ్యూహం మరియు అంతరార్థంఈ పరిణామాల వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి పార్టీ నియంత్రణ : 2025 ఢిల్లీ ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గత ప్రక్షాళన జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాయకులను పక్కన పెట్టడం ద్వారా పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం జరుగుతోంది. క్రమశిక్షణ పేరుతో ప్రక్షాళన: రాఘవ్ చద్దా తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడానికి  ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ ఎజెండాను పక్కన పెట్టారని ఆరోపించడం ద్వారా ఆయనను నైతికంగా దెబ్బతీసే వ్యూహం కనిపిస్తోంది. పంజాబ్ సెంటిమెంట్: పంజాబ్ నుంచి ఎన్నికైన ఎంపీగా ఆయన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని ఆరోపించడం ద్వారా, పంజాబ్ కేడర్‌లో ఆయనపై వ్యతిరేకత పెంచేలా పార్టీ పావులు కదుపుతోంది.భవిష్యత్తు రాజకీయ ప్రభావంఈ వివాదం ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాఘవ్ చద్దా వంటి యువ మరియు విద్యావంతుడైన నాయకుడు పార్టీకి దూరం కావడం జాతీయ స్థాయిలో ఆప్ ఇమేజ్‌కు నష్టం కలిగించవచ్చు. ఇప్పటికే ఆయన తన సోషల్ మీడియా బయో నుంచి 'AAP' పేరును తొలగించడం, ఆయన పార్టీని వీడతారనే ఊహాగానాలకు బలాన్నిస్తోంది. ఒకవేళ చద్దా పార్టీని వీడి బీజేపీలో చేరితే, అది ఆప్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. ముఖ్యంగా ఢిల్లీ మరియు పంజాబ్ రాజకీయాల్లో కేజ్రీవాల్ వ్యూహాలను ఎరిగిన నాయకుడు ప్రత్యర్థి పక్షంలో ఉండటం ఆప్‌కు సవాలుగా మారుతుంది. మరోవైపు, పార్టీలో ఉంటూనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే, అది అంతర్గత కుమ్ములాటలకు దారితీసి కేడర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఏది ఏమైనా, "బ్లూ ఐడ్ బాయ్" నుంచి "రెబెల్" గా మారిన చద్దా ఉదంతం భారత రాజకీయాల్లో ఆసక్తికర మలుపుగా మారింది.
- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం దారి తప్పిందని ముఖ్యమంత్రికి అర్ధమైంది - మంత్రి నారాయణ, ఎమ్పీ విపిఆర్‌లకు బాధ్యతల నుంచి విముక్తి - ఉదయగిరి ఎమ్మెల్యేకి తల వాచే చీవాట్లు - సూళ్లూరుపేట నేతలకు పదునైన చురకలు - దేముళ్ల సేవతో సరిపెట్టుకోవద్దని రామనారాయణరెడ్డికి సూచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా మీద సునిశిత దృష్టి సారించినట్లు అర్థమవుతున్నది. నెల్లూరు జిల్లా సాధారణంగా  సామాజిక పరిస్థితుల దృష్ట్యా వైకాపాకు బలమైన స్థావరం. కానీ మొన్నటి ఎన్నికలలో పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. అదొక విచిత్రం. అన్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది. అంటే..  తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేదా ఎంపీలలోనే తమ భవిష్యత్ మీద నమ్మకం సడలిందన్న మాట. అదేమీ ఒకరు చేసే ఆరోపణ కాదు.  కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. దేనివల్ల ఈ పరిస్థితి? 30 నుంచి 75 వేల మెజారిటీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలను గెలిపించిన నెల్లూరు జిల్లా ఓటర్లకు అప్పుడే ముఖం మొత్తిందా? పార్టీ మీద లేదా పదవులలో వున్న వారి మీద విరక్తి జనించిందా? అందుకు కారణం ఏమిటి? జిల్లా పరిస్థితి బాగా లేదన్న వార్తలు ముఖ్యమంత్రి చెవికి కూడా చేరినట్లున్నాయి. పడవకు పడిన లేదా పడుతున్న చిల్లుని, చిన్నదిగా వున్నప్పుడే పూడ్చకుంటే, మొత్తం పడవే మునిగిపోతుందన్న ఆలోచనతోనే, నెల్లూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లున్నారు. ఈ వారంలో రెండు ఊళ్లకు వచ్చారాయన. ఈ రెండు ఊళ్లను ఎంపిక చేసుకోవడంలో ఏదో ఒక పరమార్థం వుందని భావించాలి. మొదట సూళ్లూరుపేట. ఎమ్మెల్యే విజయశ్రీ మీద తనకు సదభిప్రాయం వుందనే సూచన ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంబిబిఎస్ చదివిన ఉన్నత విద్యావంతురాలిగానే కాకుండా, నిరంతరం నవ్వుముఖంతో కనపడడం విజయశ్రీ విలక్షణత. ఎవరినైనా నవ్వుతోనే పలకరిస్తారు. ఆమె మీద ఆరోపణలు లేవు. అయితే సూళ్లూరుపేట నుంచి మద్రాసు నగరానికి ఎర్ర గులక, ఇసుక ఎవరు దొంగ రవాణా చేస్తున్నారో నాకు తెలుసు, వారీ అక్రమాలు తక్షణమే నిలిపివేయండి అని గట్టిగానే హెచ్చరిక చేశారు. ఎవరికి తగలాలో వారికి ఆ మాటల శూలం బలంగా గుచ్చుకున్నది. గుండె కలుక్కుమన్నది. లక్షల రూపాయల అక్రమ రాబడి ఆగిపోతుందనుకునే బాధే కదా పాపం. పనిలో పనిగా, విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యానికి కూడా, ఇక నువ్వు రిటైర్ అయితే బాగుంటుందని నవ్వుతూనే సలహా ఇచ్చారు. ఆ మాటలో పరుషత్వం లేకపోవడంతో నెలవల సంతోష పడిపోయాడు. సూళ్లూరుపేట ఎస్‌సి నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే పసిపిల్ల కావడంతో ముదురు మనుషులు పెత్తనం చలాయిస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లుంది. కలెక్టర్, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడట, ఒక్క ఎమ్మెల్యే నుంచి వచ్చే సిఫార్సులు తప్ప ఇతరులెవరి మాటా మీరు వినాల్సిన అవసరం లేదని. ఈ మాటకు కొందరి ముఖాలలో గంటు పడింది. వెంటనే.. వింజమూరు. అక్కడికి రాకముందే స్థానిక పరిస్థితుల మీద సమగ్ర అవగాహన తెచ్చుకున్నట్లున్నారు చంద్రబాబు. ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద చర్నాకోళ ఝుళిపించారు. వాతలు పడేట్లు, మాటలు విసిరారు. రేపటి ఎన్నికలలో రాష్ట్రంలో 175 మంది తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే, నువ్వు 172 వాడిగా ఉంటావు. ఇంత తక్కువ వ్యవధిలో అంత చెడ్డ పేరు తెచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు. నీ సొంత సామాజిక వర్గం కూడా నిన్ను సమర్థించడం లేదు. పార్టీ కార్యకర్తలందరూ విసిగిపోయి వున్నారు. తీరు మార్చుకోవడానికి మూడు నెలల గడువు ఇస్తున్నాను, మారితే మర్యాదగా వుంటుంది, లేకుంటే చర్యలు వేరేగా వుంటాయని  కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇదేదో గదిలోకి పిలిచి, ఎవరూ వినకుండా హితబోధ చేసి వుంటే గౌరవంగా వుండేది.. కానీ, కార్యకర్తల సమావేశంలో అందరి సమక్షంలో తూర్పార పట్టడం వల్ల, పాపం కాకర్ల సురేష్ నిరుత్తరుడైపోయారు. ఉదయగిరి కార్యకర్తలు మాత్రం పండుగ చేసుకున్నారు. ఇక జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన సవరణలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. అందులో ఓం ప్రథమంగా మంత్రి నారాయణకు, ఎమ్పీ విపిఆర్‌కు, మీ పనులు మీరు చేసుకోండి, జిల్లా బాధ్యత వదిలి పెట్టేయండి అని సూచించారట. ఈ సూచన సున్నితంగా, మనసు నొచ్చుకోకుండా ఉందని చెబుతున్నారు. మరి జిల్లా బాధ్యత ఎవరిది? ఆ బరువు మరొక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భుజాలపై పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ దేముళ్లు, దేవాలయాలేనా.. అప్పుడప్పుడైనా రాజకీయాలు కూడా చూసుకోవాలి కదా అని సుతారంగా మందలించారని వినికిడి.  దానిలో నువ్వే ఈ భారం మోయాలి అనే సూచన వుందని మనం భావించవచ్చు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో పట్టుజారక ముందే పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి స్థాయిలో కలగడం కార్యకర్తలకు సంతోషం కలిగిస్తున్నది. ఆ మాత్రం రాజకీయ సవరణలు చేపడితే, పదికి పది గెలవకపోయినా, పదికి పది కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. జమీన్ రైతు సౌజన్యంతో
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం  కేంద్ర బిందువుగా మారింది. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన  మావిగన్  కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సీనియర్ జర్నలిస్ట్ డి.వి. శ్రీనివాస్ విశ్లేషణ ప్రకారం, జగన్ వ్యూహం వెనుక కేవలం రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తోంది.  అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో..  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్..  ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల సమస్యలను విస్మరించిన జగన్.. ఇప్పుడు అకస్మాత్తుగా శేషగిరమ్మ వంటి వృద్ధులను కలవడం విమర్శలకు తావిస్తోంది.  జగన్ అకస్మాత్తుగా రైతుల పక్షపాతిగా మారడం వెనుక ఒక వ్యూహం ఉందని సీనియర్ జర్నలిస్ట్ డీవీశ్రీనివాస్ అంటున్నారు.  అమరావతి ప్రాంతంలో కోల్పోయిన ఓటు బ్యాంకును, కనీసం ఈ మావిగన్  ప్రాంతంలోని పట్టణ ఓటర్లను ఆకర్షించడం ద్వారా దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే..  గతంలో అమరావతి రైతులపై జరిగిన దాడులు, మహిళా రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరని, మరచిపోరనీ డీవీ శ్రీనివాస్ చెబుతున్నారు.  అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చవుతాయని, అది సాధ్యం కాదని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించడమే వైసీపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందంటున్నారాయన. అమెరికాలో ఒక పోలీసు అధికారి బూటు కాలితో తొక్కడం ఎలాగైతే ఒక ప్రభుత్వం పతనానికి దారితీసిందో, ఏపీలో కూడా రైతు కుటుంబాల పట్ల జరిగిన దుశ్చర్యలే గత ఎన్నికలలో జగన్ ఓటమికి ప్రధాన కారణమని గుర్తు చేసిన డీవీ శ్రీనివాస్.. ఇప్పుడు  మావిగన్ పేరుతో ముందుకు రావడం అనేది కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, వాస్తవిక అభివృద్ధికి సంబంధించినది కాదని ఆయన చెప్పారు.   రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం వేగవంతమైతే, జగన్ ప్రతిపాదించిన  మావిగన్ మంత్రం ఫలించే అవకాశమే లేదన్నారాయన. ప్రభుత్వం మానవీయ కోణంలో రైతుల సమస్యలను పరిష్కరిస్తే..  జగన్ ఆరోపణలకు బలం ఉండదు. ఒకవేళ వైసీపీ తన మొండి వైఖరిని వీడకుండా, కేవలం విమర్శలకే పరిమితమైతే, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో కూడా ఆ పార్టీకి ఉన్న అంతంత మాత్రం పట్టు కూడా సడిలిపోతుందని అన్నారు డీవీ శ్రీనివాస్.  రాబోయే ఎన్నికల నాటికి అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారుతుందని చెప్పారు.     
ALSO ON TELUGUONE N E W S
  -1600 కోట్ల గ్రాస్ తో వీరవిహారం చేస్తున్న రణవీర్  -నెక్ట్ మూవీ ప్రళయ్ పై భారీ అంచనాలు  -కథ ఇదేనా! ఇక నుంచి రణవీర్ సింగ్ ని ఎవరు పిలవాలన్నా 'ధురంధర్  రణవీర్ సింగ్' అని పిలవడం భారతీయ సినీ మేకర్స్, ప్రేమికులధర్మం. అంతలా ధురంధర్ రెండు భాగాల్లో హంజా అలీ మజారి ఉరఫ్ జస్కి రాత్ సింగ్ గా మెస్మరైజ్ చేసి ధురంధర్ విజయ శాతాన్ని పెంచాడు. కలెక్షన్స్ పరంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తు స్టిల్ 1600 కోట్ల గ్రాస్ తో ఉన్నాడు. దీంతో ధురంధరుడి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'ప్రళయ్' పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఉదాహరణగా అంచనాల స్థాయిని  చెప్పినా అంతకు మించి అని చెప్పే ధురంధర్ ఫ్యాన్స్ ఆత్మవిశ్వాసానికి లెక్కే ఉండదు. అందుకే అంచనాల జోలికి వెళ్లకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో 'బ్లైండ్ నెస్' అనే బుక్ ఆధారంగా 'ప్రళయ్'(Pralay)తెరకెక్కతోందనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీంతో 'బ్లైండ్ నెస్' ప్రియులతో గూగుల్ క్రాష్ అయ్యే పరిస్థితి. ఇక ఈ మాత్రం లేటు చేయకుండా  రీసెంట్ గా ఈ విషయంపై  ప్రళయ్ ప్రొడ్యూసర్ 'హన్సల్ మెహతా' స్పందిస్తు ప్రళయ్ మూవీ ఏ పుస్తకం ఆధారంగా తెరకెక్కడం లేదు. అసలు పుస్తకాన్ని సినిమాగా తీసుకురావడం అంత ఈజీ కాదు. దర్శకుడు జై మెహతా చాలా సంవత్సరాల నుంచి ప్రళయ్ కోసం వర్క్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ బాగా వస్తుంది. సదరు స్క్రిప్ట్ తో పాటు జై మెహతా(Jai Mehta)పై రణవీర్ కి చాలా నమ్మకం ఉంది. బాలీవుడ్ చిత్రాల్లో ఇంతవరకు చూడని సరికొత్త వరల్డ్ ప్రళయ్ ద్వారా ప్రత్యక్షం కాబోతుందని చెప్పుకొచ్చాడు. దీంతో బ్లైండ్ నెస్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. Also read: Dacoit: డెకాయిట్ రిలీజ్ వేళ మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తన అజెండా అదేనంట  ఇక ప్రళయ్ జోనర్ కి వస్తే జాంబీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. జాంబీ థ్రిల్లర్ అంటే జీవించి ఉన్న వ్యక్తులపై దాడి చేసి, వారి రక్తాన్ని తాగడంతో పాటు  మాంసాన్ని తినే ఒక అరుదైన రాక్షస జాతి కథలు. ప్రాచీన డెవిల్స్ కథలుగా కూడా   చెప్పుకోవచ్చు. జాంబీ రెడ్డి, కొత్త లోక చాప్టర్ 1 చిత్రాలు కూడా ఒక ఉదాహరణ. హాలీవుడ్ లో 1970  నాటి నుంచే తెరకెక్కిస్తూ ఉన్నారు. బ్లైండ్ నెస్  బుక్ లో ఉన్న విషయానికి వస్తే   పేరు చెప్పని నగరంలో దాదాపు ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న, వివరించడానికి కూడా వీలు లేని సామూహిక అంధత్వ మహమ్మారి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. సామాజిక పతనాన్ని ఎదుర్కొంటున్న అనేక క్యారెక్టర్స్ కూడా బుక్ లో కనపడుతూ ఉంటాయి  పోర్చు గీసు రచయిత 'జోస్ సరమగో'(Jose saramago)1995 లో రచించాడు.    
  -ఈ నెల 10 న వరల్డ్ వైడ్ గా డెకాయిట్  -ప్రమోషన్స్ లో టీం బిజీ  -మృణాల్ కీలక వ్యాఖ్యలు  కళ్ళతోనే తన క్యారక్టర్  విధి విధానాన్ని చాలా బలంగా చాటి చెప్పగల నటి 'మృణాల్ ఠాకూర్'(Mrunal Thakur). ఎంతలా అంటే థియేటర్ నుంచి ప్రేక్షకులు ఇంటికి వెళ్లినా తన క్యారక్టర్ గురించే ఆలోచించిచేంతలా. అందుకే మృణాల్ అతి తక్కువ వ్యవధిలోనే డై హార్ట్స్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మృణాల్ స్క్రీన్ పై కనపడినప్పుడు మీరనుకునే ప్రేక్షకుల కళ్ళల్లోకి చూస్తే చాలు డై హార్ట్స్ ఫ్యాన్స్ లిస్ట్ మొత్తం మీ కళ్ళ ముందు కనపడుతుంది. సదరు డై హార్ట్స్ ఫ్యాన్స్ కౌంట్ ని లెక్కబెట్టే అదృష్టం ఇప్పుడు డెకాయిట్ ద్వారా మీకు రాబోతుంది. ఈ నెల 10 న రిలీజ్ కాబోతుండగా  ప్రమోషన్స్ లో మృణాల్ ఫుల్ బిజీ. మరి ఆమె మాట్లాడిన మాటలు కొన్నిటిని చూద్దాం. మృణాల్ మాట్లాడుతు డెకాయిట్ లో నా క్యారక్టర్ పేరు సరస్వతి. హరిగా శేష్(Adivi sesh)కనిపించబోతున్నాడు. పక్కా యాక్షన్ జోనర్ మూవీ. ఫస్ట్ టైం ఈ జోనర్ ని టచ్ చేస్తున్నాను. సరికొత్త నేపథ్యంలో సాగే కథలు, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ నన్ను ఎక్కువగా ఆకర్షిస్తు ఉంటాయి. డెకాయిట్ నేను ఒప్పుకోవడానికి కారణం అదే. రోమియో, జూలియట్ లాంటి ప్రేమ పక్షులైన సరస్వతి, హరి డెకాయిట్స్ గా ఎందుకు మారాల్సి వచ్చిందనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నేను ఎంచుకున్న కథ, క్యారక్టర్ డిజైన్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చెయ్యడం అంటే చాలా ఇష్టం. అలాంటిది డెకాయిట్ లో నా క్యారక్టర్ తీరు చూసి నేనే ఆశ్చర్యపోయాను. మూవీ అందరకి తప్పకుండా నచ్చుతుంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కారు చేజింగ్ సన్నివేశాల్లో చేశాను. స్వయంగా  డ్రైవ్ చేశాను. వ్యక్తిగతంగా కూడా మా ఇంట్లో కారు నడిపిన తొలి అమ్మాయిని నేనే అని మృణాల్ చెప్పుకొచ్చింది. also read: దుబాయ్ లో క్షిపణుల వర్షం.. బన్నీ, అట్లీ సినిమాకి బ్రేక్  ఇప్పుడు ఈ మాటలు ఫ్యాన్స్ తో పాటు డెకాయిట్ కోసం ఎదురుచూస్తున్న లవర్స్ లో ఆసక్తిని పెంచడంతో పాటు సినిమా హిట్ అనే నమ్మకం ఏర్పడింది. ప్రచార చిత్రాలు కూడా కాంప్రమైజ్ కానీ విధంగా పాజిటివ్ గానే ఉండటంతో అందరు వెయిట్. కింగ్ నాగార్జున మేనకోడలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ  డెకాయిట్ ని భారీ బడ్జెట్ తో నిర్మించగా షానియెల్(Shaneli)దర్శకుడు. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో డెకాయిట్ క్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు. లెజండ్రీ యాక్టర్స్ అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్  కీలక రోల్స్.      
Vignesh Shivn recently shared his thoughts on his current equation with Dhanush, putting some rumors to rest while sparking new ones. He stated that he respects Dhanush like a father figure in his life. The director acknowledged that his successful career as a writer and director today is entirely because of the massive break and support Dhanush gave him early on. Despite this deep gratitude, things are clearly not the same between them. Vignesh Shivn kept the details cryptic, explaining that there is no specific problem or active fight for them to solve. However, he admitted that an unfortunate distance has naturally developed between them over the years following the massive success of Naanum Rowdy Dhaan, due to unfortunate misunderstandings.  While the director chose his words carefully, inside reports in Kollywood paint a slightly different picture. Industry buzz strongly suggests that the professional and personal dynamics changed drastically after Vignesh Shivan and Nayanthara began dating during the making of that very film. Inside sources and gossip columns indicate that Nayanthara eventually became the unspoken reason for the clash and the growing gap between the actor and the director. Although Vignesh maintains a public stance of immense respect, the ongoing silence between the former collaborators remains a hot topic. Vignesh Shivn spoke to media about his equation with Dhanush as his LIK - Life Insurance Kompany, with Pradeep Ranganathan and Krithi Shetty is releasing on 10th April. It is known that Dhanush asked the couple Nayanthara and Vignesh to pay 10 crores for using Naanum Rowdy Dhaan clips in Nayanthara wedding documentary on Netflix. Their spat became public with the couple accusing Dhanush of acting in real life as a good man. Hence, Vignesh words about Dhanush became important.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Mrunal Thakur is set to surprise the audience with her complex role as Saraswati in the upcoming film Dacoit. Breaking away from the soft-spoken characters she portrayed in her earlier Telugu outings, she completely transitions into a challenging new genre. While the part was highly difficult, the creative team designed it so well that it became a deeply rewarding and joyful experience for her as an actor. The project gave her a rare opportunity to fulfill her desire for performing risky action sequences on the big screen. Taking full advantage of the extensive outdoor shoots, she participated in thrilling chase scenes and even drove an ambulance that had no handbrake. Being passionate about driving in real life, she found these high-energy moments to be the most exciting parts of the entire filming process. Shooting the movie simultaneously in Telugu and Hindi made the journey much more demanding than her previous straight Telugu films. However, navigating these challenges alongside versatile co-stars like Adivi Sesh and Anurag Kashyap made the experience highly memorable. She was also particularly impressed by the Hollywood-style visual execution brought to life by director Shanil Deo and his dedicated technical crew. At its core, she describes the narrative as a very different kind of love story, driven by the intriguing reasons behind the lead characters turning into dacoits. Backed by a mind-blowing musical album featuring chartbusters, she is confident this unique attempt will thoroughly entertain the viewers in theaters, on 10th April. Supriya Yarlagadda and Suneil Narang are producing the film with Annapurna Studios presenting it.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
- యుద్ధం కారణంగా మారిన ప్లాన్స్! - దుబాయ్ షెడ్యూల్ రద్దు! - షూటింగ్ విషయంలో అట్లీ కొత్త నిర్ణయం! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‌లో తన క్రేజ్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్న బన్నీ, ఆ తర్వాత కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను దుబాయ్ మరియు అబుదాబి వంటి దేశాల్లో చిత్రీకరించాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ విదేశీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలైన ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఈ సినిమా షూటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ క్షిపణుల దాడులు, ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో చిత్ర బృందం భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం. నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల రక్షణ దృష్ట్యా అట్లీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు ఆ సన్నివేశాలను మరే ఇతర సురక్షిత ప్రాంతంలో చిత్రీకరించాలనే దానిపై చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. మే నెలలో కొత్త లొకేషన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. అట్లీ కూడా ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ వరకు తన సత్తా చాటారు. వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అట్లీ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, బన్నీని మునుపెన్నడూ చూడని విధంగా ఒక మాస్ అవతార్‌లో చూపించబోతున్నారని టాక్. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా క్రేజీ అప్‌డేట్ వస్తుందని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి ఒక చిన్న టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందని భావించినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు పూర్తి కాకపోవడంతో కేవలం సినిమా టైటిల్ మాత్రమే అనౌన్స్ చేసే అవకాశం ఉందని వినిపిస్తోంది. మరోవైపు బన్నీ బర్త్‌డే కానుకగా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘రేసు గుర్రం’ సినిమా థియేటర్లలో రీ-రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అట్లీ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, అవుట్‌పుట్ మాత్రం అదిరిపోయేలా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
- సముద్రఖని 'తడయం' వెబ్ సిరీస్ రివ్యూ - ఉత్కంఠ రేపుతున్న ఇన్వెస్టిగేషన్! - ఓటీటీని షేక్ చేస్తున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్  ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వెండితెరపై కంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనే ఇలాంటి ఉత్కంఠభరితమైన కథలను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' (ZEE5) వేదికగా స్ట్రీమ్ అవుతున్న 'తడయం' వెబ్ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్, తన గ్రిప్పింగ్ నరేషన్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సిరీస్ కథాంశం విషయానికి వస్తే.. నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న దంపతులను టార్గెట్ చేసుకుని కిల్లర్స్ దాడులకు పాల్పడుతుంటారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ కిల్లర్స్ కేవలం ఆడవారి మంగళసూత్రాలు, మగవారి మొలతాళ్లను మాత్రమే తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా హత్య జరిగిన ప్రదేశంలో రక్తంతో ఒక 'ప్రశ్నార్థకం' గుర్తును వదిలి వెళ్లడం ఈ కథలో ప్రధాన ట్విస్ట్. ఈ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఎస్.ఐ లక్ష్మికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నదే ఈ సిరీస్ అసలు సిసలు మజా. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సిరీస్‌ను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సముద్రఖని తనదైన నటనతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అదరగొట్టారు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కనిపించే రొటీన్ అంశాలకు భిన్నంగా, రియల్ క్రైమ్ స్టోరీలను తలపించేలా ఈ సిరీస్ సాగడం విశేషం. ప్రతి ఎపిసోడ్ చివరలో ఇచ్చే ట్విస్టులు తదుపరి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను పెంచుతున్నాయి. సముద్రఖని గతంలో 'విసరణై', 'రైటర్' వంటి చిత్రాలతో తన నటనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఇప్పుడు 'తడయం'తో మరోసారి డిజిటల్ తెరపై తన ముద్ర వేశారు. దర్శకత్వం వహించడంలోనే కాకుండా, నటనలోనూ తనదైన శైలిని ప్రదర్శించే ఆయన, ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో చాలా సెటిల్డ్గా కనిపించారు. టెక్నికల్‌గా కూడా ఈ సిరీస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ సీన్లలోని ఇంటెన్సిటీని పెంచాయి. నెటిజన్ల నుంచి ఈ సిరీస్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీ లవర్స్ "ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ ఇదే" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సిరీస్‌లోని కొన్ని కీలక సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. వీకెండ్లో ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. మునుముందు మరిన్ని ఇలాంటి గ్రిప్పింగ్ సిరీస్‌లు జీ5 నుంచి రానున్నాయని సమాచారం. ప్రస్తుతం 'తడయం' సృష్టిస్తున్న సెన్సేషన్ చూస్తుంటే, దీనికి సీక్వెల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి మీరు ఇంకా ఈ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌ను చూడకపోతే, వెంటనే జీ5 లో వీక్షించండి!
- యాక్షన్ ప్యాక్డ్ పాలిటిక్స్ - బిగ్గెస్ట్ మల్టీస్టార‌ర్‌పై భారీ అంచ‌నాలు - బాక్సాఫీస్ వద్ద కేరళ లెజెండ్స్ హంగామా  మలయాళ చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజ నటులు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ కిక్కే వేరు. అలాంటి విజువల్ ట్రీట్‌ను అందించడానికి మెగాస్టార్ మమ్ముట్టి మరియు కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ సిద్ధమయ్యారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'పేట్రియాట్'. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి మలయాళీ సినిమా సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది. 'పేట్రియాట్' ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఒక మాజీ జేఏజీ (JAG) అధికారిగా మమ్ముట్టి కనిపిస్తుండగా, ఆయనకు అండగా నిలిచే సోల్జర్‌ పాత్రలో మోహన్‌లాల్ అదరగొట్టారు. ఒక రహస్య నిఘా కుట్ర మరియు దేశ భద్రత చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన పొలిటికల్ మరియు టెక్నాలజీ ఎలిమెంట్స్ కూడా ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో కేవలం మమ్ముట్టి, మోహన్‌లాల్ మాత్రమే కాకుండా ఫహద్ ఫాసిల్, నయనతార, కుంచాకో బోబన్ మరియు రేవతి వంటి అగ్ర తారాగణం ఉండటం సినిమాపై మరింత క్రేజ్ పెంచుతోంది. సుశిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసింది. గతంలో మహేష్ నారాయణన్ మాలిక్ వంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కావడంతో, ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ లొకేషన్లలో చిత్రీకరించిన విజువల్స్ ట్రైలర్‌లో చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫహద్ ఫాసిల్ పాత్రకు సంబంధించిన గ్రే షేడ్స్ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు "లెజెండ్స్ ఆర్ బ్యాక్" అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మమ్ముట్టి, మోహన్‌లాల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే షాట్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. పక్కా స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మెగా మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.
- సమాజ సంస్కర్తల వీరోచిత గాథ  - 'ఫూలే' తెలుగు ట్రైలర్ రిలీజ్ - అణచివేతపై అక్షరాయుధం  భారతదేశ చరిత్రలో సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే. వారి జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫూలే’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు అఫీషియల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అణచివేతకు వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం, చదువు వెలుగులను పంచడానికి వారు పడిన కష్టాలను ఈ ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ట్రైలర్ విషయానికి వస్తే.. 19వ శతాబ్దపు సామాజిక పరిస్థితులను, కుల వివక్షను ఎదిరించి నిలిచిన జ్యోతిరావు ఫూలే పాత్రలో 'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్ గాంధీ పరకాయ ప్రవేశం చేశారు. అలాగే అక్షర జ్ఞానాన్ని అట్టడుగు వర్గాలకు చేరవేయడంలో ఆయనకు తోడుగా నిలిచిన సావిత్రిబాయి ఫూలే పాత్రలో పత్రలేఖ ఒదిగిపోయారు. "విద్య అనేది కొందరి సొత్తు కాదు, అది అందరి హక్కు" అనే సందేశం ట్రైలర్‌లో బలంగా వినిపించింది. ప్రముఖ దర్శకుడు అనంత్ నారాయణ్ మహదేవన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. గతంలో అనేక జాతీయ అవార్డులు అందుకున్న ఆయన, ఈ బయోపిక్‌ను కూడా ఎంతో నిజాయితీగా మలిచినట్లు తెలుస్తోంది. కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన స్పూర్తిదాయక చిత్రంగా 'ఫూలే'ను తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే, ప్రతీక్ గాంధీ తన నటనతో ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంతో ఆయన తెలుగు ప్రేక్షకుల మనసు గెలవడం ఖాయమనిపిస్తోంది. పత్రలేఖ కూడా సావిత్రిబాయి పాత్రలో ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం, నేపథ్య పంపిణీ ఈ ట్రైలర్‌కు ప్రాణం పోశాయి. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల కథలు నేటి తరానికి ఎంతో అవసరమని, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. విద్య, సమానత్వం కోసం పోరాడిన ఒక గొప్ప దంపతుల ప్రయాణాన్ని వెండితెరపై చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
తెలంగాణ ఎమ్మెల్యే జె.అనిరుధ్ రెడ్డి ఇటీవల సినీ ప్రముఖులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్   ప్రెసిడెంట్  మాదాల  రవి స్పందించారు.   ఎమ్మెల్యే సూచనపై 'మా' అధ్యక్షుడు విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వాస్తవాలను గుర్తుచేశారు. "మంచి సూచన. అయితే, ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు రాజకీయ నాయకులకు ఉండాల్సిన సమానమైన పరీక్ష ఏంటో అని నేను ఆలోచిస్తున్నాను? గౌరవనీయులైన ఎమ్మెల్యేగారితో కలిసి అటువంటి ఉమ్మడి నిబంధనలపై పనిచేయడానికి ఓటర్లు ఖచ్చితంగా సంతోషిస్తారు." 'మా' ఉపాధ్యక్షుడు మాదాల రవి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ క్రమశిక్షణతో కూడుకున్నదని, ఈ వ్యాఖ్యలు అసహ్యకరమైన ఆధారం లేని మాటలు. సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్రను ఎప్పుడూ పోషిస్తూనే ఉందని ఆయన తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు అందుకున్న మహనీయులు ఈ రంగంలో ఉన్నారని గుర్తుచేశారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి లాంటి దిగ్గజాలు సినిమాల ద్వారా సమాజానికి శక్తివంతమైన సందేశాలను అందించారు. ప్రస్తుత నటులు చాలామంది నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.  మాదకద్రవ్యాల నిర్మూలనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందని మాదాల రవి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిసి 'మా' సన్నిహితంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. చిరంజీవి, రామ్చరణ్, విజయ్ దేవరకొండ వంటి అగ్ర నటులు యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గుర్తుచేశారు. చివరగా, చిత్ర పరిశ్రమ తన సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని మరియు డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా అంతం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు
- విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన క్రేజీ పోస్టర్! - కళ్లు మూస్తే ప్రమాదమే - ఉత్కంఠ రేపుతున్న ‘డోంట్ స్లీప్’ ఫస్ట్ లుక్! టాలీవుడ్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ‘డోంట్ స్లీప్’ (Don’t Sleep) అనే సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తాజాగా విడుదల చేశారు. తెలుగులో ఇదొక సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ అని మేకర్స్ చెప్తుండటంతో సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ మూవీతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాటోగ్రాఫర్ షామ్ దత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన 'ఉప్పెన', 'విరూపాక్ష', 'థండేల్' వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇప్పుడు స్వయంగా మెగా ఫోన్ పట్టి ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ‘చౌర్య పాఠం’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్ర రామ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచు పర్వతాల నేపథ్యంలో సాగే ఒక భయంకరమైన ఛేజింగ్‌ను ఈ పోస్టర్‌లో చూడవచ్చు. ఇంద్ర రామ్ కళ్లకు బ్యాండేజీతో ఉండటం, రవీంద్ర విజయ్ గన్‌తో అతడిని వెంబడించడం చూస్తుంటే.. భ్రమకు, వాస్తవానికి మధ్య జరిగే ఒక గందరగోళ పరిస్థితిని ఈ కథలో చూపించబోతున్నారని అర్థమవుతోంది. 'కళ్లు మూస్తే ప్రమాదం' అనేలా ఉన్న ఈ పోస్టర్ సినిమా మూడ్‌ను సెట్ చేసింది. వి. చూడామణి, వి. డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి షామ్ దత్ స్వయంగా సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. షామ్ దత్ కు కెమెరామెన్‌గా దశాబ్దాల అనుభవం ఉంది. కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’ వంటి చిత్రాలకు పని చేసిన అనుభవం ఉండటంతో, ‘డోంట్ స్లీప్’ విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ‘పుష్ప’ ఫేమ్ మోనిక రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్ చేస్తుండగా, గోకుల్ హర్షన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సజీర్, లూనా ఈ చిత్రానికి కథను అందించారు. ఈ టీమ్ అంతా టాలెంటెడ్ పర్సన్స్ కావడంతో ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ లోడింగ్ అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన షామ్ దత్, ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడాల్సిందే!
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అన్నీ ఉన్నా కరెంట్ కోత వల్ల అవి  పనిచేయడం ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.  ఈ చిట్కాలు తెలుసుకున్న వారు వేసవి వేడి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా,  కరెంట్ కోత ఉన్న సమయంలో అయినా టెన్షన్ పడకుండా రిలాక్స్ ఫీల్ అవుతారు.  ఇంతకీ కరెంట్ లేకపోయినా చల్లగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కిటికీల, తలుపులు.. వేసవిలో విద్యుత్ కోత  గురించి  చింతించాల్సిన అవసరం లేదు. కిటికీలు, తలుపులను తడిపి, వాటిని తెరిస్తే చాలు, చల్లని గాలి గదిలోకి ప్రవహిస్తుంది. లేదంటే కిటికీలు,  తలుపులకు తడి కర్టెన్లు ఏర్పాటు చేసుకున్నా చల్లగా ఉంటుంది. వట్టివేర్ల మ్యాట్.. బయటి వేడి గాలి లోపలికి రాకుండా కిటికీలలో వట్టివేర్ల  చాపను వేయాలి.  ఈ చాపను కిటికీల దగ్గర ఏర్పాటు చేసి వాటిని అప్పుడప్పుడ తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతిని గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వట్టివేర్లు చాలా చాలా చల్లగా ఉంచుతుంది. సీజనల్ ప్రూట్స్.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే, వేసవి కాలంలో  లభించే పండ్లను కూడా తినవచ్చు. పెరుగు, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అవి వేడిని తట్టుకోవడానికి  సహాయపడతాయి. చన్నీటి స్నానం..  ఇంట్లో కరెంట్ పోయినప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే,  చల్లటి నీటితో స్నానం చేయవచ్చు.  వేడిగా అనిపించకుండా ఉండటానికి  చేతులు, పాదాలు, ముఖాన్ని తరచుగా కడుక్కోవడం కూడా మంచి మార్గం. కుండనీరు..  మట్టి కుండలోని నీటిని త్రాగడం కూడా మంచి ఉపశమనం. ఈ నీరు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ,  శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచుతుంది. తడిబట్ట.. ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు తడిబట్ట పెట్టడం అంటే. గదిలో ప్లోర్ ను తుడవడం కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది డీప్ క్లీన్ కానక్కర్లేదు. కేవలం కాస్త నీరు చల్లి ప్లోర్ తుడుచుకున్నా చల్లగా ఉంటుంది. రూప్ కూలింగ్.. మేడపైన కూలింగ్ పెయింట్ వేస్తుంటారు కొందరు.  వేసవిలో ఈ పెయింట్ వేయడం వల్ల ఇంట్లో చాలా చల్లగా ఉంటుందని చెబుతారు.  అయితే ఇలా కాకపోయినా ఇంటి మేడ పైన రూఫ్ ను నీటితో తడుపుతూ ఉన్నా కూడా ఇంట్లో చల్లగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు. ఇది సాధారణ పండుగలా ఆనందంతో జరుపుకునే రోజు కాదు..  దీని వెనుక ఉన్న భావం ఎంతో గంభీరమైనది,  ఆధ్యాత్మికతతో నిండినది. యేసు ప్రభువు త్యాగాన్ని ప్రతిబింబించేది.. గుడ్ ఫ్రైడే గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. యేసు క్రీస్తు తన బోధనల ద్వారా ప్రేమ, క్షమ, దయ వంటి విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన మార్గం సహనం, పరస్పర గౌరవంతో కూడుకుని ఉంది. అయితే ఆయన బోధనలు అప్పటి కొందరు అధికారులకు నచ్చకపోవడంతో ఆయనను శిక్షించడానికి కుట్రలు పన్నారు. చివరకు ఆయనను శిలువపై వేయడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి, మానవాళి పాపాల విమోచన కోసం తనను తాను అర్పించుకున్నారని క్రైస్తవులు విశ్వసిస్తారు. ప్రేమకు, క్షమకు ఉన్న అపారమైన శక్తిని  ఈ త్యాగం ద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి చాటి చెప్పాడని అంటారు. తనను బాధించిన వారిని కూడా క్షమించగలిగిన హృదయం ఉండాలని.. ఈ  గొప్ప సందేశాన్ని ఆయన తానే ఒక ఉదాహరణగా మారి ప్రజలకు, ప్రపంచానికి అందించారు. గుడ్ ఫ్రైడే ను గుర్తు చేసుకునే విధానం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు, యేసు ప్రభువు శిలువ అయిన విధానాన్ని స్మరించుకుంటారు,  చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఇది ఆత్మపరిశీలనకు, ప్రతి ఒక్కరూ తమ  తప్పులను గుర్తించి మార్పు చెందడానికి  అవకాశం కల్పిస్తుంది. గుడ్ ఫ్రైడే ప్రతి ఒక్కరికి  ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.. నిజమైన ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నదని,  క్షమించగలిగే మనసు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నేర్పుతుంది.  ప్రతి ఒక్కరు తమ  జీవితాల్లో కూడా ఇతరులను ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం వంటి విలువలను అలవాటు చేసుకోవాలని గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తు చేస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువును శిలువ వేసిన కారణంగా.. ఈ రోజు ప్రతి క్రైస్తవ సోదరుడు, సోదరి..  ఎంతో భావోద్వేగంగా యేసును స్మరించుకుంటారు.  గుడ్ ఫ్రైడే అనేది ఒక విషాద దినం మాత్రమే కాదు,  ఇది మానవత్వాన్ని, దయను,  నిస్వార్థ త్యాగాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన రోజు. మనసును శుద్ది చేసుకుని,  ప్రతి ఒక్కరూ మంచి మార్గం వైపు నడిచేందుకు గుడ్ ఫ్రైడే ఒక మార్గం చూపిస్తుంది.                                 *రూపశ్రీ.
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను  పెంచేటప్పుడు, తల్లిదండ్రులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాయి.  ఆడపిల్లలను పెంచే తల్లిదండ్రులు చేయకూడని తప్పులేంటి? ఆడపిల్లను పెంచేటప్పుడు తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటి? ఆచార్య చాణక్యుడు దీని గురించి ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ఆంక్షలు, పరిమితులు.. ఆడపిల్ల అంటే  కుటుంబానికి పరువుగా  భావిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు తరచుగా  ఆడపిల్లల  కలలను అల్పమైనవిగా భావించి, వాటిపై ఆంక్షలు విధిస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం ఆడపిల్లల  కలలను ఎన్నడూ పరిమితం చేయకూడదు. ఆమె చదువును, వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆడపిల్ల  అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశమూ కల్పించాలి. ఆడపిల్ల చదువులో,  వృత్తిలో ఎదిగే ఇంటికి అంతులేని గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్వేచ్ఛ.. అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ఎవరికీ మంచిది కాదు. అలాగే, ప్రతి విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు. నిరంతరం ఆంక్షలు విధించడం మంచి ఆలోచన కాదు. అలా చేయడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కొడుకు అయినా, కూతురు అయినా, వారి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. కొడుకుకు అయితే అన్నీ తెలుసు వారికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవడం,  కూతురుకు ఏమీ తెలియదు అని ఏ విషయాన్ని ఆమె ఆలోచించకుండా,  ఆమె నిర్ణయించుకోకుండా చెయ్యడం మంచిది కాదు. వివాహం పట్ల అబిప్రాయం.. నేటి సమాజం మారుతున్నప్పటికీ, కొందరు అమ్మాయిలు మాత్రమే  పెళ్లి విషయంలో తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది తండ్రులు ఇప్పటికీ తమ కూతుళ్ల పెళ్లి విషయమై వారి అభిప్రాయం తెలుసుకోరు. నేటికీ కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు ఉంటున్నారు.  సమాజపు ఒత్తిడికి లొంగి కూతురికి పెళ్లి చేయడం లేదా అనారోగ్యకరమైన బంధంలోనే ఉండమని ఒత్తిడి చేయడం మంచిది కాదు. పెంపకం.. కూతుళ్ల పెంపకం రెండు విధాలుగా ఉంటుంది.  కొందరు ఆడపిల్లను ప్రేమగా పెంచుతారు.  అలాంటి వారు కూతుళ్లతో ప్రేమగా, స్నేహంగా అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడేలా పెంచుతారు. కానీ కొందరు భయం గుప్పెట్లో పెంచుతారు. ఇలాంటి పెంపకంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర, పెద్ద వారి దగ్గర,  సమాజంలోని వ్యక్తుల దగ్గర కూడా నోరు విప్పాలంటే భయపడుతుంది. దీని వల్ల ఆడపిల్ల తనను తాను కోల్పోతుంది.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ ఫూల్ లేదా బావులలో ఈత కొట్టడం కూడా ఒక మార్గం.  అయితే చాలా మంది ఈత కొట్టడం అంటే మునిగిపోతారనో లేక జలుబు,  చెవి సమస్యలు వస్తాయనో కంగారు పడుతూ ఉంటారు. కానీ ఈత కొట్టడం వల్ల వీటి కంటే పెద్ద సమస్య.. అందులోనూ నిర్లక్ష్యం చేస్తే చాలా చాలా కంగారు పెట్టే సమస్య ఒకటుంది. అదే కంటి ఇన్ఫెక్షన్లు.. ఈత వల్ల కళ్లకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. స్విమ్మింగ్ ఫూల్  నీటిలోని క్లోరిన్, రసాయనాలు,  బ్యాక్టీరియా కొన్నిసార్లు కళ్లలోని సున్నితమైన పొరను దెబ్బతీసి, చికాకు, ఎరుపు, దురద, దృష్టి మసకబారడానికి కారణమవుతాయి. జనం ఎక్కువగా  ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈత కొడుతున్నప్పుడు కంటి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి. వేసవిలో అధిక చెమట, దుమ్ము , రద్దీ కారణంగా కళ్ల సెన్సిటివ్  పెరుగుతుంది.  స్విమ్మింగ్ పూల్ నీటిని సరిగ్గా శుభ్రపరచకపోతే, అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయి.  ఈ బాక్టీరియా కంటి బయటి పొర (కంజంక్టివా) వాపుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంట, కళ్ళు ఎర్రబడటం, దురద , కళ్ళ నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలుగవచ్చు. మురికిగా ఉన్న లేదా జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంటాక్ట్ లెన్సులు ధరించి ఈత కొట్టడం ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. స్విమ్మింగ్ ఫూల్ మెయింటెన్స్ సరిగా లేకపోతే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా ప్రోటోజోవాలు డవలప్ అవుతాయి. ఇవి కళ్లకు సోకి, వాపును కలిగిస్తాయి. ఎక్కువ కాలం వీటికి గురికావడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ రియాక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈత కొట్టే ముందు శుభ్రమైన, సరిగ్గా సరిపోయే, నీరు చొరబడని గాగుల్స్ ధరించాలి. రసాయన రియాక్షన్స్  తగ్గించడానికి, కంటి మేకప్ లేదా జిడ్డు క్రీములను తొలగించిన తర్వాతే  ఈత కొట్టాలి. స్విమ్మింగ్ పూల్‌లో  అటు ఇటు నుండి చిమ్మే నీటి నుండి  జాగ్రత్త పడాలి. నీరు కంటి మీద పడకుండా చూసుకోవాలి.  ఈత కొట్టిన తర్వాత కళ్లను చల్లని, శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి. అవసరమైతే కంటికి తేమను అందించే చుక్కల మందును వాడాలి.  స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి ప్రత్యేకంగా టవల్ ను సొంతంగా తీసుకెళ్లడం మంచిది.  స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జనం ఎక్కువగా కనిపించినా, నీరు మురికిగా కనిపిస్తున్నా అక్కడ ఈత కొట్టకపోవడం మంచిది.                               *రూపశ్రీ.
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు.  అయితే చాలా మంది ప్రజలు తరచుగా తమ రోజును  కప్పు టీతో లేక కాఫీతో మొదలుపెడుతుంటారు.  దీని వల్ల ఉదయాన్నే చురుగ్గా పనిచేయగలుగుతామని చెబుతారు. అయితే టీకి బదులుగా ఉదయాన్నే  ఒక గ్లాసు నీరు త్రాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు , రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో.. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే.. ఎన్ని లీటర్ల నీరు తాగాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరానికి సరైన మోతాదులో నీరు త్రాగడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో మరింత నీరు త్రాగడం మంచిది. జిమ్‌కు వెళ్లేవారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి. ఎప్పుడు నీరు తాగాలి?  ప్రతి ఒకటి నుండి రెండు గంటలకు కొద్దిగా నీరు త్రాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం మంచిది కాదు. కొద్దికొద్దిగా నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. అలాగే  పడుకునే ముందు కొద్దిగా నీరు తాగవచ్చు, కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయాన్నే ఎందుకు తాగాలి? రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత, శరీరానికి తిరిగి తేమను అందించడానికి నీరు అవసరం. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. చర్మానికి మంచిది.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అందాన్ని పెంచుతుంది. నిజానికి, నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. నీళ్లు తాగడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల ముఖ ముడతలు తగ్గుతాయి , శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియ.. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల  జీవక్రియ వేగవంతమవుతుంది. జీవక్రియను పెంచుకోవడం బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.  దీని వల్ల  కాలేయం,  మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం వల్ల పైన చెప్పుకున్న లాభలన్నీ ఉంటాయి.  అంతేకాకుండా ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.                                    *రూపశ్రీ.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో, క్యాలీ ఫ్లవర్ ను పోలిన బ్రోకలీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులను ఆమడ దూరంలో ఉంచే శక్తి బ్రోకలీకి ఉంది. అసలు బ్రోకలీలో ఉండే పోషకాలు ఏంటి? బ్రోకలీ తింటే ఏ వ్యాధులు దూరంగా ఉంటాయి?  తెలుసుకుంటే.. బ్రోకలీలో ఉండే పోషకాలు.. బ్రోకలీలో ఫైబర్,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రోకలీ తింటే ఏ జబ్బులు దూరంగా ఉంటాయంటే.. గుండె జబ్బులు.. బ్రోకలీని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇందుకోసం బ్రోకలీని తీసుకునే విధానం కూడా చాలా ముఖ్యం.  ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తనాళాల ఆరోగ్యం.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రోకలీ గుండె మరియు రక్తనాళాల  వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు,  పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి. క్యాన్సర్.. బ్రోకలీకి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే.. బ్రోకలీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కంటిచూపు.. కంటి చూపుకు పదును పెట్టడంలో,  దృష్టి లోపాన్ని నివారించడంలో,  రేచీకటి వంటి దృష్టి సమస్యలు నివారించడంలో బ్రోకలీ  కొంతవరకు సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పేగు ఆరోగ్యం.. బ్రోకలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది పేగు ఆరోగ్యానికి చక్కగా  సహాయపడుతుంది. బ్రోకలీని తీసుకుంటూ ఉంటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. చక్కెర స్థాయిలు.. మధుమేహం ఉన్నవారు బ్రోకలీని తింటే చాలా ఉపయోగం.  బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.                                  *రూపశ్రీ.