LATEST NEWS
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళ్లపూర్ గ్రామంలో జరుగుతున్న రిలే నిరహార దీక్షకు మద్దతుగా భారీ ఎత్తున తరలివస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీక్ష స్థలానికి వెళ్లే ప్రధాన రహదారులపై పోలీసులు భారీగా మోహ రించి మొత్తం తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.   రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.ఈ నేపథ్యంలోనే పరిగి పర్యటనకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును పోలీసులు అప్ప జంక్షన్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు.  ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షకు మద్దతుగా భారీగా తరలివస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడం, కీలక నేతల అరెస్టులతో పరిగి ప్రాంతంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ఇలా ఉండగా అరెస్టు చేసిన హరీష్ రావు, సరిత తదితరులను పోలీసులు శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంపై హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో  జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అంటూ చేసిన ఓ ట్వీట్ లో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు.  అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, ఎంపీలకూ, ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ణతలు తెలిపారు.  అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందన్నారు.  
కడప జిల్లా జమ్మలమడుగులో  బీజేపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి   సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నదన్నారు.  అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నదంటూనే..  జములమడుగులో  ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి  మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు.   పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడుస్తున్నా నియోజకవర్గములో కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని ఆదినారాయణరెడ్డి అన్నారు.   గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లింపు,  రాజోలి జలాశయ నిర్మాణం,  ఎస్ ఆర్ బి సి నిర్మాణం, ఆర్టిపిపి సమస్య పరిష్కారం కావాల్సి ఉందన్నారు.   గండికోట జలాశయంలో ఇప్పటికే నీరు నిలువ చేస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్న ఆయన..  ఈ సమస్యల పరిష్కారం కాకుంటే..  ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ప్రజల వెంటే ఉంటా తప్ప అధికారం కోసం ఆరాటపడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిన వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక పరిణామంపై స్పందించిన ముఖ్యమంత్రి, ఇది రాష్ట్ర ప్రజల విజయమని అభివర్ణించారు. ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహకారంతోనే అమరావతి నిర్మాణ స్వప్నం ఇప్పుడు వాస్తవరూపం దాల్చబోతోందని ఆయన వివరించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంట్ సభ్యులు, వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆయన అభినందించారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసిన రైతులు, మహిళలను చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొని రాజధాని కోసం నిలబడిన ప్రతి పౌరుడి విజయం ఇది అని ఆయన కొనియాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇక నుంచి ఒకే చిరునామా ఉండబోతోందని, అది అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతిని రాజధానిగా ధ్రువీకరిస్తూ చేసిన సవరణ బిల్లును పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలలో కూడా  ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ ప్రక్రియలో భాగంగా, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కీలక అంశాలకు సవరణలు చేశారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ (2)లో ఉన్న మార్పులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో "కొత్త రాజధాని ఉండేది. ఇప్పుడు ఆ పదాన్ని తొలగించి, దాని స్థానంలో  అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది  అని స్పష్టంగా పొందుపరిచారు. ఈ మార్పు ద్వారా 'అమరావతి' అనే పదానికి చట్టపరమైన నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. సీఆర్డీయే   చట్టం 2014 నిబంధనల ప్రకారం నోటిఫై చేయబడిన ప్రాంతాలన్నీ అమరావతి కిందకు వస్తాయని గెజిట్‌లో స్పష్టం చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సవరణ చట్టం 2024 జూన్ 2వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లుగా   కేంద్రం పేర్కొంది. అంటే, సాంకేతికంగా 2024 జూన్ 2 నుంచే అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టపరమైన గుర్తింపు పొందింది. ఈ గెజిట్ ప్రచురణతో ఇకపై రాజధాని విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. గత కొన్నేళ్లుగా రాజధాని అంశంపై నెలకొన్న రాజకీయ మరియు న్యాయ పోరాటాలకు ఈ గెజిట్ ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధత లభించడంతో, రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల సమీకరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గెజిట్ పునాదిగా నిలవనుంది. అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షించడానికి, కేంద్ర సహాయ సహకారాలు పొందడానికి ఈ చట్టబద్ధత ఎంతో దోహదపడనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం రాజధాని అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణను రూపొందిస్తుందో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
The highly anticipated sports drama Peddi, featuring an impressive cast of Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Divyendu, and Jagapati Babu, is facing another delay. Initially scheduled for March 26th and later pushed to April 30th, the release has now been officially postponed to June. The makers are currently considering either June 4th or June 25th, as the extensive post-production works require more time to complete. The film is presented by Mythri Movie Makers and Sukumar Writings. As this is the maiden production for producer Venkata Satish Kilaru, he is reportedly facing some issues navigating the massive scale of the project. Despite these hurdles, the producer and Ram Charan are determined to deliver the best possible cinematic experience and refuse to rush the final product. Director Buchi Babu Sana is working round the clock to perfect every frame, while AR Rahman is busy composing a grand background score. The promotional material released so far has met with a mixed response. While the track "Chikiri Chikiri" has quickly become a massive chartbuster, the recently unveiled "Body builder" glimpse did not click as much with viewers. Interestingly, the extra time has altered the film's business approach. The makers are engaged in fresh discussions with major OTT platforms, negotiating a profit-sharing agreement for the digital rights as one-time high amount deal has to be scrapped with multiple delays.  However, multiple delays could be a cause for concern regarding the film's initial box office openings. Although Peddi remains a highly anticipated project, such frequent postponements can cause a lack of interest and break the promotional momentum among sections of the audience.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్  'పెద్ది' రిలీజ్ డేట్‌పై మళ్ళీ మొదలైన సస్పెన్స్! కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'పెద్ది'(Peddi). ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు మెగా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఏప్రిల్ నెలలో కూడా 'పెద్ది' రావడం కష్టమే అనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, 'పెద్ది' మూవీ ఏప్రిల్ రేసు నుంచి తప్పుకుని జూన్ నెలకు వెళ్లే ఆలోచనలో ఉందట. రీసెంట్‌గా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.  ఇటీవల ఒక మూవీ ప్రమోషన్స్ సమయంలో చరణ్ మాట్లాడుతూ.. "టైంకి వస్తుందని చెప్పండ్రా" అని సరదాగా అన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జూన్ 26న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్‌గా జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్ కూడా 'పెద్ది' జూన్ 26కి వాయిదా పడిందనే విషయాన్ని హింట్ ఇచ్చారు.  షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం, ప్రమోషన్స్ కి తగినంత సమయం లేకపోవడం వంటి కారణాలతో 'పెద్ది' విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాపై ఇంతటి హైప్ ఉండటానికి ప్రధాన కారణం ఇందులోని భారీ తారాగణం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రా రా' వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్నాయి. చరణ్ ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా ఒక రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'రంగస్థలం' తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇదని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.   
  10 న డెకాయిట్ తో రాక  ఆ హీరోకి శేష్ అంటే ఎందుకు పడదు  టాలీవుడ్ ఏమనుకుంటుంది  నెటిజన్స్ చెప్తున్న హీరో ఎవరు! డిజాస్టర్స్ కి నాకు మధ్య మాటలు లేవంటు వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడివి శేష్(Adivi Sesh)ఈ నెల 10 న 'డెకాయిట్'(Decoit)తో సెల్యులాయిడ్ పై ల్యాండ్ కాబోతున్నాడు. క్వాలిటీ తో కూడిన యాక్టింగ్, క్వాలిటీ తో కూడిన చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ కూడా. దీంతో  డెకాయిట్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ని ఫ్యాన్స్ తీరిగ్గా గమిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ చెప్పిన మాటలు వైరల్ గా మారడంతో పాటు ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి.ఆ డీటెయిల్స్ చూద్దాం అడివి శేష్ మాట్లాడుతు బర్త్ డే పార్టీలో ఒక యువ హీరోని కలిసాను. నాతో ఆ హీరో మాట్లాడుతు నువ్వు ఎప్పుడు చిన్న సినిమాలే చేస్తావా? నాలాంటి పెద్ద సినిమాలు ఎప్పుడు చేస్తావ్?” అన్నాడు. ఆ మాటలకి చిరాకు రావడంతో పాటు కించపరిచేలా  మాట్లాడటం చాలా బాధ కలిగించింది. ఏం చేస్తాం. నీ కుళ్లు బుద్ధి ఎప్పటికీ మారదని అనుకున్నానని   చెప్పుకొచ్చాడు. దీంతో  టాలీవుడ్ లో అనారోగ్య పోటీ ఉందని అప్పుడప్పుడు వినిపించే వార్తలు నిజమని కొంత మంది భావిస్తున్నారు. ఇక ఎండల దెబ్బకి బయటకెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపని క్రియేటివ్ నెటిజెన్స్ అయితే ఆ హీరో ఎవరై ఉంటారనే ఎంక్వయిరీ స్టార్ట్ చేసారు. పనిలో పనిగా ఆ హీరో  వీళ్లల్లో ఒకడంటూ ఐదుగురు యంగ్ హీరోల పేర్లని   అప్షన్స్ గా ఉంచుతున్నారు. also read:  Dhurandhar 2: గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఓటిటి డేట్ వచ్చేసింది   ఇక డెకాయిట్ లో  శేష్ కి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)జోడి కడుతుంది. జోడి అనే కంటే శేష్ తో సరిసమానమైన క్యారక్టర్. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఆ విషయం అర్ధమవుతుంది. అనురాగ్  కశ్యప్,  జాయ్న్ మేరీ  ఖాన్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి వంటి క్వాలిటీ యాక్టర్స్ కనువిందు చేయనున్నారు. మరి ఏప్రిల్ 10 న డెకాయిట్ తో  సూపర్ డూపర్ హిట్ అందుకొని ఇదీ పెద్ద హిట్ అని సదరు కుళ్ళు హీరోకి చెప్తాడేమో చూద్దాం. 70 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుందనేది టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది.     
- ఆ అంకెలు చూసి ఇండస్ట్రీ షాక్! - వసూళ్ల లెక్కల్లో తేడా కొట్టిందా? - ఫేక్ పోస్టర్లపై నెటిజన్ల సెటైర్లు. సినిమా ఇండస్ట్రీలో హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వసూళ్ల లెక్కల దగ్గర వచ్చేసరికి మేకర్స్ చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు. తమ సినిమా రేంజ్‌ను పెంచి చూపించుకోవాలనే ఆరాటంలో అప్పుడప్పుడు వాస్తవానికి దూరంగా ఉండే అంకెలను ప్రకటిస్తుంటారు. తాజాగా కోలీవుడ్ 'లెజెండ్' శరవణన్ నటించిన 'లీడర్' సినిమా విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. గ్రౌండ్ రియాలిటీకి, చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌కు అస్సలు పొంతన లేకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి వీకెండ్ కలెక్షన్లు అత్యంత కీలకం. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, 'లీడర్' సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలిపి మొదటి మూడు రోజుల్లో సుమారు రూ. 3 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఆక్యుపెన్సీ, బుకింగ్స్ సరళిని గమనిస్తే ఈ అంకెలే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఇందుకు భిన్నంగా కళ్లు చెదిరే అంకెలను బయటపెట్టారు. ఈ సినిమా వీకెండ్‌లోనే ఏకంగా రూ. 25 కోట్ల వసూళ్లను సాధించిందని పేర్కొంటూ చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతటితో ఆగకుండా, ఈ సినిమా అతి త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరబోతోందని కూడా అందులో ధీమా వ్యక్తం చేశారు. అసలు రూ. 5 కోట్లు దాటడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో, ఏకంగా రూ. 25 కోట్లు అంటూ పోస్టర్ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ 'అత్యుత్సాహం' కాస్తా నెటిజన్లకు దొరికిపోవడంతో ట్రోల్స్ మొదలయ్యాయి. "మీకు లెక్కలు వచ్చా? లేక క్యాలిక్యులేటర్ పాడైపోయిందా?" అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే, "సినిమాలోని గ్రాఫిక్స్ కంటే వసూళ్ల పోస్టర్‌లోని గ్రాఫిక్స్ అదిరిపోయాయి" అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో శరవణన్‌పై వచ్చే మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పుడు ఈ కలెక్షన్ల ఇష్యూ వాటికి మరింత ఆజ్యం పోసినట్లయింది. గతంలో ఆయన నటించిన 'ది లెజెండ్' సినిమా సమయంలో కూడా ఇలాంటి చర్చలే జరిగాయి. బిజినెస్ మ్యాన్ నుంచి యాక్టర్‌గా మారిన శరవణన్, భారీ బడ్జెట్‌తో సినిమాలను నిర్మించడంలో ఎక్కడా వెనకాడరు. ఈ 'లీడర్' సినిమాను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ తారాగణంతో తెరకెక్కించారు. ప్రమోషన్ల కోసం కూడా కోట్లు ఖర్చు చేశారు. అయితే కంటెంట్ విషయంలో ఆడియన్స్‌ను మెప్పించడంలో సినిమా కొంత తడబడినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి ఫేక్ పోస్టర్లు సినిమా పరువు తీస్తున్నాయని సినీ విశ్లేషకులు సైతం విమర్శిస్తున్నారు. మొత్తానికి 'లీడర్' వసూళ్ల రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవైపు నెగటివిటీ నడుస్తున్నా, శరవణన్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే మరో భారీ సినిమాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి ఆ సినిమాతోనైనా ఆయన బాక్సాఫీస్ వద్ద నిజమైన మ్యాజిక్ చేస్తారో లేదో వేచి చూడాలి.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి దేవయాని(Devayani) తన నటనతో అప్పట్లో ఒక ఊపు ఊపారు. 'ప్రేమలేఖ', 'సుస్వాగతం' వంటి చిత్రాలతో హోమ్లీ హీరోయిన్‌గా అందరి మనసు గెలుచుకున్న ఆమె.. ఇప్పుడు తన వారసురాలిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు.  దేవయాని, దర్శకుడు రాజకుమారన్ దంపతుల కుమార్తె ప్రియాంక రాజకుమారన్(Priyanka Rajakumaran).. టాలీవుడ్ హిట్ సినిమా రీమేక్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. సీనియర్ యాక్టర్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ద్వారా ఆమె వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రశాంత్ 53వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి 'రంజన్: ది అడ్వకేట్'(Ranjan) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. గతేడాది తెలుగులో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' (Court: State vs. A Nobody) సినిమాకి ఇది అధికారిక తమిళ రీమేక్.  తెలుగులో ప్రియదర్శి పోషించిన అడ్వకేట్ పాత్రను తమిళంలో ప్రశాంత్ పోషిస్తున్నారు. తెలుగులో శ్రీదేవి పోషించిన పాత్రలో ప్రియాంక రాజకుమారన్ కనిపించనుంది. ప్రముఖ నిర్మాత కతిరేసన్ కుమారుడు హరి కూడా ఇందులో నటిస్తున్నాడు. రోషన్ పాత్రలో అతను కనిపించనున్నాడు. ఈ సినిమా లాంచ్ కార్యక్రమంలో దేవయాని తన కుమార్తె ఎంట్రీ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు ప్రశాంత్ సరసన తాను హీరోయిన్‌గా 'అప్పు' వంటి హిట్ చిత్రాల్లో నటించానని, ఇప్పుడు తన కుమార్తె అదే ప్రశాంత్ సినిమాలో ఒక ముఖ్య పాత్రతో పరిచయం కావడం విశేషమని ఆమె పేర్కొన్నారు.  పోక్సో చట్టం గురించి అవగాహన కలిగించేలా సాగే ఈ కోర్టు రూమ్ డ్రామాకు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సోషల్ మీడియాలో దేవయాని కుమార్తె ఫోటోలు చూసిన నెటిజన్లు.. "అచ్చు దేవయానిలాగే ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేవయాని వారసత్వాన్ని ప్రియాంక ఎంతవరకు కొనసాగిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read: ఎన్టీఆర్ దెబ్బ తగిలినా ఆగలేదు.. పాలిటిక్స్‌పై వి.వి. వినాయక్ షాకింగ్ కామెంట్స్!  
- బన్నీ బర్త్‌డే గిఫ్ట్: టైటిల్ అనౌన్స్‌మెంట్ అప్పుడే! - AA 22 అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది! - సూపర్ హీరోగా అల్లు అర్జున్  టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఇది అసలైన పండగ లాంటి వార్త. గత కొంతకాలంగా వినిపిస్తున్న క్రేజీ కాంబినేషన్ చివరకు పట్టాలెక్కింది. కోలీవుడ్ మాస్ పల్స్ తెలిసిన స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఇంటర్నెట్‌లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. పోస్టర్‌లో ఒక తోడేలు ఆకారం కలిగిన పంజాతో కూడిన భయంకరమైన హస్తం కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా చాలా ఇంటెన్సివ్‌గా, ఒక రకమైన డార్క్ ఫాంటసీ మూడ్‌ను తలపిస్తోంది. "లవ్ లెటర్ లోడింగ్" అంటూ అట్లీ ఈ పోస్టర్‌ను షేర్ చేయడం విశేషం. అయితే ఈ 'లవ్ లెటర్' అనేది ఒక కోడ్ వర్డ్ లాగా కనిపిస్తోందే తప్ప, కేవలం ప్రేమకథ మాత్రమే కాదని, ఇందులో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. అట్లీ ఈ చిత్రాన్ని ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్ పోషించని సరికొత్త పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అట్లీ గత చిత్రం 'జవాన్' బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో అట్లీ జతకట్టడం చూస్తుంటే, ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువల మధ్య ఈ సినిమా నిర్మాణం జరగనుంది. ఇప్పటికే 'పుష్ప 2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అల్లు అర్జున్ హవా నడుస్తోంది. ఈ క్రమంలో అట్లీతో కలిసి ఆయన చేస్తున్న ఈ కొత్త సాహసం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఐకాన్ స్టార్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సినిమా అధికారిక టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఒక్క అప్‌డేట్‌తోనే బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్ లో 'AA22' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక వైపు పుష్పరాజ్ రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, మరోవైపు అట్లీతో ఈ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం డబుల్ ట్రీట్ అని చెప్పాలి. మరి రేపు ఉదయం రాబోయే ఆ 'లవ్ లెటర్' ఏ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డైరెక్టర్ వి.వి. వినాయక్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ 'ఆది' షూటింగ్ లో దెబ్బ తగిలినా ఎన్టీఆర్ లెక్కచేయలేదు 'యోగి' ఫ్లాప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన వినాయక్ టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్, 'ఆది' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తాజాగా తెలుగువన్‌ (TeluguOne) ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన 25 ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఎదురైన ఎన్నో ఎత్తుపల్లాలను, వ్యక్తిగత విషయాలను ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం, పొలిటికల్ ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. (VV Vinayak Interview) ఈ ఇంటర్వ్యూలో వినాయక్ తన కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకుంటూ కొన్ని సెన్సేషనల్ విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా మొదటి సినిమా 'ఆది' షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కు దెబ్బ తగిలి రక్తం వస్తున్నా లెక్కచేయకుండా పనిచేశారని వినాయక్ గుర్తుచేసుకున్నారు. "తారక్ చేతికి తీవ్రమైన గాయమైతే వైజాగ్ వెళ్లి స్టిచెస్ వేయించుకుని వచ్చి, అదే రోజు సాయంత్రం ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు" అని వినాయక్ తెలిపారు. ఎన్టీఆర్ ఎదుగుదల వెనుక వారి అమ్మగారు పడ్డ శ్రమ వెలకట్టలేనిదని అన్నారు. మరోవైపు తన కెరీర్ లో 'యోగి' సినిమా ఫెయిల్యూర్ తనను మానసికంగా చాలా కృంగదీసిందని వినాయక్ ఓపెన్ అయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశించానని, కానీ రిజల్ట్ తారుమారు కావడంతో కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయానని నిజాయితీగా ఒప్పుకున్నారు.  అలాగే 'అదుర్స్' సినిమాలో బ్రహ్మానందం కామెడీ టైమింగ్‌కు ఎన్టీఆర్ సెట్స్ లో నవ్వు ఆపుకోలేకపోయేవారని ఫన్నీ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లోనే తనకు ఎంపీ సీటు ఆఫర్ వచ్చిందని, అయితే అప్పట్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల తాను పోటీ చేయలేకపోయానని వెల్లడించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు.. "జరిగేవి జరుగుతూనే ఉంటాయి, మనం కేవలం అందులో భాగస్వాములం మాత్రమే" అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని వినాయక్ చెప్పుకొచ్చారు. వి.వి. వినాయక్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
  -థియేటర్స్ లో స్టిల్ అదరగొడుతూనే ఉంది   -1700 కోట్లకి పైగా గ్రాస్ -ఈ క్రమంలో ఓటిటి డేట్ చక్కర్లు   ఇప్పుడు ఓటిటి మూవీ ప్రేమికుల్లో ఎవరి ఫేస్ చూసినా సరే ఒకేసారి పది దీపావళి పండగ కాంతులు మొత్తం ఒకేసారి వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ధురంధర్ 2(Dhurandhar 2)ఓటిటి డేట్ న్యూస్ సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ లోని పవన్ కళ్యాణ్ డైలాగ్ లా 'నాకు ఎవరు పోటీ కాదు. నాకు నేనే పోటీ అనే రీతిలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ లెక్కన ఓటిటి సినీ ప్రియుల ఆనందాన్ని దీపావళి కాంతులతో పోల్చడంలో ఎలాంటి తప్పు లేదు. మరి మనం కూడా ఓటిటి డేట్ చూసేద్దాం. ధురంధర్ పార్ట్ 2 మే నెల 8 లేదా 15 తేదీల్లో స్ట్రీమింగ్ కి రావచ్చనే ప్రచారం చాలా జోరుగానే సాగుతుంది. వంద శాతం ఈ న్యూస్ నిజమవ్వచ్చు. మార్చి 18 ప్రీమియర్స్ నుంచే ధురంధర్ 2  థియేటర్స్ లో అడుగుపెట్టింది. అంటే మే 8 కల్లా 50 రోజులని పూర్తి చేసుకుంటుంది. మరి ఓటిటి చిత్రాలతో బాలీవుడ్ మేకర్స్ కుదుర్చుకున్న  ఒప్పందం ప్రకారం ధురంధర్ 2 అడుగుపెట్టడం మే 8 , 15 తేదీల్లో రావడం ఖాయం. ధురంధర్ పార్ట్ 1 కూడా ఈ కోవలోనే 50 రోజులు తర్వాత అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ధురంధర్ 2 స్ట్రీమింగ్ పార్టనర్ జియో హాట్ స్టార్. Also read: Sreeleela: షూటింగ్ టైంలో పీరియడ్స్‌తో శ్రీలీల ఇబ్బంది! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్  ప్రస్తుతానికైతే థియేటర్స్ లో ధురంధర్ 2 తన హవాని యదావిధిగా కొనసాగిస్తూనే ఉంది. స్టిల్ 1700 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతు 2000 కోట్ల గ్రాస్ ని అందుకోవాలనే పట్టుదలని చూపిస్తున్నాడు. మరి ప్రేక్షక దేవుళ్ళు ఆ వరాన్ని అందిస్తారేమో చూడాలి.      
Atlee is known for following the themes and stories touched upon by legends like Mani Ratnam and Shankar for his films. In fact, he is an assistant of Shankar and his Mersal, Theri had themes touched upon by his guru. His first film, Raja Rani, is said to be heavily influenced by Mouna Ragam by Mani sir.  Now, for his next biggie, AA22*A6 with Allu Arjun, the maker released the pre-title look poster with a Beast Hand. Many are remembering the I poster with Vikram in Beast get-up and while many wanted a full length werewolf role, Shankar chose to restrict it for a popular song.  The movie had huge anticipation but failed to live up to them due to the kind of get-up that Shankar chose for Vikram and his screenplay. Looks like Atlee in his parallel world epic, wants to use some elements like in I and bring such outrageous yet exciting ideas in his own style to screen.  Allu Arjun fans are eagerly waiting for updates from the film as it is releasing after Pushpa 2 The Rule blockbuster and it already crossed a year and half time from its release without many new updates. Deepika Padukone is confirmed as one leading lady and it is heard that Allu Arjun will play a dual role for the first time, in the film. Title poster will be released tomorrow on the occasion of Allu Arjun's birthday. Sun Pictures is producing the film on gigantic scale.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
    ఉస్తాద్ తో మెప్పించిన శ్రీలీల డాన్స్ ల విషయం తెలిసిందే  రీసెంట్ గా పీరియడ్స్ పై స్పందించిన హీరోయిన్  శ్రీలీల(Sreeleela)గత నెల మిడిల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ లో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. స్క్రీన్ పై తాను కనిపిస్తున్నంత సేపు ఉస్తాద్ కి జోష్ ని ఇవ్వడమే కాకుండా ప్రేక్షకులకి  సదరు జోష్ ని అందించడంలో భారీగానే సక్సెస్ అయ్యింది. శ్రీలీల రీసెంట్ గా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యింది. అందులో ఆమె మహిళలకి సహజ సిద్ధంగా వచ్చే పీరియడ్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ మాటలేంటో చూద్దాం.    పీరియడ్స్ అనేవి సాకుగా ఉండకూడదనేది నా అభిప్రాయం. నేను ఇప్పటివరకు చాలా సాంగ్స్ కి  డ్యాన్స్ చేశాను. వాటిల్లో హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు పీరియడ్స్ టైంలో   చేసినవే. ఆ సాంగ్స్ లోని నా స్టెప్స్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. మనం మన శారీరక, మానసిక సమస్యలన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలి. పురుషులతో సమానంగా సమాన అవకాశాలు, సమాన అధికారం, సమాన హక్కులు కోరుతున్నప్పుడు, మన నెలసరిని ఒక సాకుగా చూపి ఎలా వెనక్కిపోగలమని చెప్పుకొచ్చింది. పీరియడ్స్‌ వలన    షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా అని ఒక విలేకరి అడగడంతోనే శ్రీలీల ఆ విధంగా చెప్పుకొచ్చింది. Also Read: Balakrishna: అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని.. నోట్ రిలీజ్ చేసిన బాలకృష్ణ  ఇక అభిమానులైతే శ్రీలీలకి మంచి పేరు తీసుకొచ్చిన సాంగ్స్ ని చూసే పనిలో బిజీగా ఉన్నారు. వైద్యురాలు కూడా అయిన శ్రీలీల నుంచి ఇంకా కొత్త సినిమా ప్రకటన రాలేదు.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు  చాలా వరకు ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు.  ఎక్కడ చూసినా హాస్పిటల్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.  చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా చాలా  రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు.  అయితే ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సపం ఎలా ఆవిర్బవించింది? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ రోజు ఏ కార్యక్రమాలు చేపడతారు? ఆరోగ్యం కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభం.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభానికి ప్రధాన కారణం World Health Organization (WHO). 1948 ఏప్రిల్ 7న WHO అధికారికంగా స్థాపించబడింది. అదే తేదీని గుర్తుగా 1950 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే జరుపుతున్నారు. ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు. ఉద్దేశ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుర్తుగా  ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుపుకోవడం వెనుక కొన్ని ముఖ్య ఉద్దేశ్యాలు ఉన్నాయి.  ప్రజల్లో అవగాహన పెంచడం.. ఆరోగ్యం గురించి చాలామందికి సరైన సమాచారం,  అవగాహన  ఉండవు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా  వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి,  మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. గ్లోబల్ హెల్త్ సమస్యలపై దృష్టి.. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ ను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన,  వాటి ఆచరణ వైపు ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు.  ఉదాహరణకు..  మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ ప్రభావం, యూనివర్సల్ హెల్త్ కేర్  వంటి అంశాలు ఉండవచ్చు.  ఈ రోజు తీసుకునే నిర్ణయాలు,  ప్రాణాళికలు.. ప్రపంచ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు, సంస్థలను ప్రోత్సహించడం.. దేశాలు తమ ఆరోగ్య విధానాలను మెరుగుపరచడానికి ఈ రోజు ప్రేరణ కల్పిస్తుంది. ఇందుకోసం.. ఆరోగ్య సమాచారం,  ఆరోగ్యం కోసం మెరుగు పరుచుకోవలసిన అంశాలు,  పర్యావరణం,  ఆరోగ్య సూత్రాలు..  వంటివి సూచించడం జరుగుతుంది. నిర్వహించే కార్యక్రమాలు.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున కొన్ని  కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఇవి ప్రతి గ్రామం, ప్రతి ఊరు, పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు,  ప్రభుత్వం,  స్వచ్చంద ఆరోగ్య సంస్థల నేతృత్వంలో జరుగుతాయి. ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.  గ్రామాలు, పట్టణాల్లో ఫ్రీ మెడికల్ చెకప్‌లు,  రక్తపరీక్షలు, షుగర్, BP పరీక్షలు వంటివి ఉచితంగా చేస్తారు. హెల్త్ ర్యాలీలు & అవగాహన కార్యక్రమాలు చేపడతారు.  కొన్ని ప్రాంతాలలో వాకథాన్‌లు, మారథాన్‌లు,  స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సెషన్స్ నిర్వహిస్తారు. చాలా చోట్ల సెమినార్లు & వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. డాక్టర్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, మానసిక ఆరోగ్యం, పోషణపై చర్చలు వంటివి జరుపుతారు. వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు టీకాలు వేయించడం,  ప్రజల్లో ఇమ్యూనిటీ పెంపుకు తోడ్పడటం చేస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తారు. హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా అవగాహన, ఆరోగ్య చిట్కాలు పంచుకోవడం. ఆరోగ్య సమస్యల గురించి సరైన సమాచారం అందించడం,  ఆరోగ్య విషయంలో చాలా చేసే నిర్లక్ష్యాల గురించి వివరించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్బాలు చెప్పడం వంటివి చేస్తారు. అందరూ చేయాల్సింది.. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు.. ఆరోగ్యం బాగుంటే కోట్ల ఆస్తులు ఉన్నట్టే.. అందుకే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.  వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచాలి.  జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి.  ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ కు హాజరు కావాలి. వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని చాలా గొప్పగా మెరుగుపరుస్తాయి.  ప్రతి రోజు వీటిని కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి.  మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అనే అపోహను వదిలేయాలి. నోటికి రుచిగా ఉన్నది కాదు.. శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో అది తినడం అలవాటు చేసుకుంటే.. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే భద్రంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం ,  ఇతర ఖనిజ స్ఫటికాలు మూత్రపిండాలలో పేరుకుపోయి, రాళ్లుగా ఏర్పడతాయి. భారతదేశంలో 12% కంటే ఎక్కువ మంది ప్రజలు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అసలు వేసవిలో మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ సమస్య ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. మూత్రపిండాల రాళ్ల ప్రమాదం.. వేసవిలో శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోవడం శరీరంలో తేమ శాతం తగ్గడానికి  దారితీయవచ్చు. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. శరీరంలో నీటి కొరత మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి ఖనిజాల సాంద్రతను పెంచుతుంది. ఈ ఖనిజాలు కలిసి చిన్న స్ఫటికాలుగా ఏర్పడి మూత్రపిండాల్లో రాళ్లుగా మారుతాయి. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ , యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల స్ఫటికాలు ఏర్పడతాయి. శరీరం డీహైడ్రేషన్ కు  గురైనప్పుడు, ఈ స్ఫటికాలు బయటకు వెళ్లలేక రాళ్లుగా మారతాయి. వేసవిలో డీహైడ్రేషన్  పెరగడం వల్ల ఈ ప్రమాదం అధికమవుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల్లో రాళ్ల వల్ల మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల నడుము కింది భాగంలో లేదా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి కలగవచ్చు. ఎవరికి ఎక్కువ ప్రమాదం? వేసవిలో మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదం కొంతమందికి  ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నీరు తక్కువగా తాగడం,  నీరు తాగడంలో నిర్లక్ష్యం చేసే వారికి ప్రమాదం ఉంటుంది. అలాగే..  ఎక్కువ ఎండలో తిరిగే వారికి, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి,  ఉప్పు ఎక్కువ తినేవారికి,  ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేవారికి, కాఫీ టీ లు, శీతల పానీయాలు ఎక్కువ తీసుకునేవారికి, శరీరం తొందరగా డీహైడ్రేట్ కు గురయ్యే వారికి వేసవి కాలంలో మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నీరు ముఖ్యం.. వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల నీటి అవసరం పెరుగుతుంది. సాధారణంగా, ప్రతిరోజూ 2.5-3 లీటర్ల నీరు త్రాగాలి.  ఎక్కువగా చెమట పట్టినా లేదా బయట పనిచేసినా నీటిని మరింత ఎక్కువ తాగాలి. లేత పసుపు రంగు మూత్రం తగినంత నీరు తీసుకుంటున్నారని సూచిస్తుంది, అయితే ముదురు రంగు మూత్రం వస్తే.. నీరు బాగా తాగాలని సంకేతం.                            *రూపశ్రీ.
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.