LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  రాజధాని అంశం ఎప్పుడూ ఒక మండుతున్న నిప్పుకణమే. గత పదేళ్లుగా ఈ పేరు మారుతూ, రూపు మారుతూ ప్రజలను అయోమయంలో నెట్టేస్తోంది. తాజాగా  అమరావతికి చట్టబద్ధత లభించింది. అయితే వైసీపీ అధినేత రాజధానిగా ప్లాన్ బి అంటూ చేసిన మావిగన్ ప్రతిపాదన సంచలనంగా మారింది. దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది కూడా. ఈ నేపథ్యంలోనే తెలుగువన్ వాస్తవ వేదిక లో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ రాజధాని భవిష్యత్ పై సమగ్రంగా చర్చించారు.   ఈ చర్చలో డోలేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు   రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్' అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై డోలేంద్ర ప్రసాద్  తెలుగువన్ వాస్తవ వేదికలో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో ఉన్న అస్పష్టతను, రాజకీయ నాయకుల ద్వంద్వ విధానాలనూ ఎండగట్టారు. ముఖ్యంగా జగన్ మావిగాన్' కాన్సెప్ట్,   ప్రస్తుత అమరావతి అభివృద్ధిపై ఆయన నిష్కర్షగా తన అభిప్రాయాలను వెల్లడించారు.  రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదని, అది ఒక జీవకళతో ఉట్టిపడే నగరం కావాలన్నారు.    2014లో విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, అక్కడ భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులంటూ  అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి పాలన వికేంద్రీకరణ అంది. అయితే అది మాటలకే పరిమితమైంది. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందిన తరువాత జగన్ అమరావతిపై తన వ్యతిరేకతను స్పష్టంగా చాటుతూ.. విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని కలిపి  మావిగాన్  అంటూ చేసిన కొత్త ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాస్తవ వేదికలో డోలేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.   అమరావతి పేరు ముఖ్యమంత్రి లెటర్ హెడ్ మీద  ఉందా అని ప్రశ్నించారు. అమరావతి పేరు సీఎం లెటర్ హెడ్ మీదే లేకుంటేఇన్వెస్టర్లకు నమ్మకం ఎలా కలుగుతుందని నిలదీశారు. అమరావతి-విజయవాడ ప్రాంతానికి వాస్తు దోషం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని  పాలకులు  ఎలా విస్మరిస్తారన్నారు.   రాజధానిలో కేవలం మాల్స్ కడితే సరిపోదని, అక్కడ జనం రాకపోకలు   ఉండాలని, అప్పుడే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు.  పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధికి అక్కడ చోటు ఉండాలన్నారు.  తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో రాజకీయ నాయకుల మధ్య సంకుచిత మనస్తత్వం ఎక్కువైందని, ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని మరొక ప్రభుత్వం నాశనం చేయడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు.   రాజధాని ఒక డెడ్ సిటీలా మారకుండా ఉండాలంటే తక్షణమే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ విద్యాసంస్థలు, ఆసుపత్రులు,  ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం విషయంలో ఇసుమంతైనా జాప్యం లేకుండా మళ్లీ ఎన్నికలు వెళ్లేలోగానే పూర్తి చేయాలన్నారు.  వచ్చే రెండు మూడేళ్లలో అమరావతికి ఒక స్పష్టమైన రూపురేఖలు వస్తాయని, ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని కాదనలేని విధంగా అభివృద్ధి జరగాలన్నారు.   జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేనిల చర్చను తెలుగువన్ వాస్తవ వేదికలో వీక్షించండి  
పార్లమెంటు లోపలా బయటా కూడా నిప్పు, ఉప్పులా విమర్శలు కురిపించుకునే ప్రధాని మోడీ, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవ్వులూ ముచ్చటించుకుంటున్నముచ్చటైన దృశ్యం శనివారం (ఏప్రిల్ 11) ఆవిష్కృతమైంది.  సామాజిక విప్లవకారుడు  మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని  ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ నివాళుల కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. సామాజిక సమానత్వం కోసం ఫూలే చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి దేశం గర్వించదగ్గ మహనీయుడికి నివాళులర్పించే క్రమంలో ప్రధాని, రాహుల్ గాంధీ ఒకే చోట కనిపించడం, ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకోవడం భారత ప్రజాస్వామ్య ఔన్నత్యానికి ప్రతీకగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఫూలే ఒక దార్శనిక నేత అని పేర్కొన్న ఆయన సామాజిక  న్యాయం కోసం ఆయన పడ్డ తపన భావితరాలకు మార్గదర్శకమని ప్రస్తుతించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన వేసిన పునాదులు నేటికీ ఆదర్శప్రాయమన్న ప్రధాని,  విద్యే శక్తివంతమైన ఆయుధమని నమ్మిన ఫూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఫూలే ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. అటు ప్రతిపక్షాలు కూడా సామాజిక న్యాయం ప్రాతిపదికన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశం గర్వించే సంస్కర్త గౌరవార్థం అధికార, ప్రతిపక్ష నేతలు ఏకతాటిపైకి రావడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇంటి పోరు ముదురుతోంది. ఆమె భర్త పరకాల ప్రభాకర్ తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.  ఇందుకోసం ఆయన  జీరో బీజేపీ  ఇనీషియేటివ్‌  చేపట్టడం గమనార్హం. చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని అఖిల భారత ప్రజా ఉద్యమ తమిళనాడు సమన్వయ కమిటీ ఉద్ఘాటించింది.  జీరో బీజేపీ   ప్రచారాన్ని ప్రారంభించిన ఆ కమిటీ... 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చూడటమే   లక్ష్యమని పేర్కొంది. ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ..   జీరో బీజేపీ ’ చాలా ముఖ్యమని, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకే తాను తమిళనాడుకు వచ్చానని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలంతా ఈ సిద్ధాంతం వైపు నిలబడాలని  పిలుపునిచ్చారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రాజ్యాంగ విలువలకు సమాధి కట్టుకోవడమేనన్నారు.  ప బీజేపీకి ఓటేస్తే తమిళనాడులో మత సామరస్యం దెబ్బతింటుందని, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించలేరని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం నాశనమవుతాయని పరకాల హెచ్చరించారు. 
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి గిట్టదని ఆ పార్టీ నేతలు తమ ప్రకటనలతో పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్నారెడ్డి మాటలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైసీపీకి సుతరామూ ఇష్టం లేదని  మరో సారి ప్రస్ఫుటంగా రుజువైంది. అమరావతిలో పెట్టుబడులు పెడితే కృష్ణ నదిలో కలిసినట్లేనని పెట్టుబడి దారులను హెచ్చరించింది. ఈ పార్టీ కీలక నేత, జగన్ హయాంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుబడిదారులను అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ హెచ్చరిక జారీ చేశారు.   రాజధాని అమరావతి పేరుతో సాగుతున్నదంతా అబద్ధపు ప్రచారమేనన్నారు.   అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.  సజ్జల, వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నా.. వాస్తవానికి అక్కడ పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణం చేపట్టాయి. అవి దాదాపు తుది దశకు వచ్చాయి. ఇక స్టార్ హోటళ్లు, పలు వాణిజ్య, వ్యాపార సంస్థలు కార్యకలపాల నిర్వహణకు రెడీ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో అమరావతిలో పెట్టుబడులు పెడితే ఆ సొమ్ములు కృష్ణా నదిలో పారబోసినట్లే నంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమరశలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి అభివృద్ధిని, అక్కడ వచ్చే పెట్టుబడులు అడ్డుకోవడమే వైసీపీ ధ్యేయంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మావిగన్ ప్రతిపాదనతో వైసీపీ అధినేత జగన్ ఒక ట్రోల్ మెటీరియల్ గా మారినట్లుగానే అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ సజ్జన చేసిన హెచ్చిరకపై కూడా నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడమే వైపీపీకి తెలుసుననీ, అభివృద్ధి అంటే గిట్టదనీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వైపు ప్రపంచం మొత్తం అమరావతివైపు చూస్తుంటే వైసీపీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని అక్కడ ఏమీ లేదని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.    జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేసి, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసిన సంగతిని జనం మరిచిపోలేదని, ఇప్పుడు మళ్లీ అమరావతిపై వైసీపీ కక్కుతున్న విషం ఆ పార్టీనే కబలించేస్తుందని అంటున్నారు పరిశీలకులు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ తీసుకున్న వైఖరి ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేకుండా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. 
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 10) బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్‌ను చూడగానే జీవన్ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.  అన్నా.. మన రాష్ట్రానికి నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను ఇక్కడికి పంపాడన్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో  కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా ఈ భేటీలో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు,  జగిత్యాల మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వసంత సురేష్ దంపతులు కూడా కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు,  కాంగ్రెస్ లో తనకు ఎదురైన పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి  కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్న జీవన్ రెడ్డికి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి  కేటీఆర్ ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు కూడా జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా కేసీఆర్   జీవన్ రెడ్డిని సన్మానించి, పార్టీలోకి  ఆహ్వానించారు.   
ALSO ON TELUGUONE N E W S
  -ఉస్తాద్ ఓటిటి డేట్ ప్రకటన  -అధికారంగా ధ్రువీకరించిన నెట్ ఫ్లిక్స్  -డేట్ చూద్దాం  కొన్ని సినిమాల న్యూస్ చదువుతాం గాని పెద్దగా కిక్ రాదు. రాకపోయింది గాక నిద్ర కూడా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సినిమాకి సంబంధించిన న్యూస్ చదివితే మాత్రం టన్నుల కొద్దీ కిక్ ప్రాప్తిరస్తు. ఇప్పుడు ఆ కిక్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తున్నాడు. ఉస్తాద్ ఓటిటి లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఉస్తాద్ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.  ఈ మేరకు ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నారు. ఈ విషయాన్నీ నెట్ ఫ్లిక్ అధికారకంగా ప్రకటించింది. దీంతో కొన్ని రోజుల నుంచి స్ట్రీమింగ్ డేట్ పై వస్తున్న రూమర్స్ మొత్తం నిజమైన డేట్ న్యూస్ దెబ్బకి కనపడకుండా పోయే పరిస్థితి. ఇక ఏప్రిల్ 16 న అయితే  ఫ్యాన్స్, ఓటిటి లవర్స్ ఆనందాన్ని ఎంత డబ్బు ఇచ్చినా కొనలేం. Also read: Mahavatar: మహావతార్ లో శ్రద్ధాకపూర్..గోల్డెన్ ఆఫర్ కానుందా!  థియేటర్స్ లో మాత్రం ఉస్తాద్ పెద్దగా రన్ అవ్వలేదు. మరి ఓటిటిలో రికార్డు వ్యూస్ తో   సరికొత్త సంచనాలని సృష్టించాలని కోరుకుందాం.     
- పాట వెనుక ఉన్న పవర్ ఏంటి? - 25 ఏళ్ళైనా తగ్గని క్రేజ్  - ఏఆర్ రెహమాన్ మ్యాజిక్  ఉత్తేజభరితమైన సాహిత్యంతో, సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ మేనరిజమ్స్‌తో ‘నరసింహ’ చిత్రంలోని ‘ఎక్కు తొలి మెట్టు’ పాట ఆనాటి నుండి నేటి వరకు అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి కావాల్సిన స్ఫూర్తిని ఈ పాట అందిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘నరసింహ’. ఇందులో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఎంత పాపులర్ అయిందో, రజనీకాంత్ మార్క్ యాక్షన్ మరియు డైలాగ్స్ కూడా అంతే స్థాయిలో క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘ఎక్కు తొలి మెట్టు’ పాట కేవలం ఒక సినిమా పాటగా మిగిలిపోకుండా, నిరాశలో ఉన్న ఎంతోమందికి ఒక మోటివేషన్ సాంగ్‌లా నిలిచింది. ఈ పాట రజనీకాంత్ తన ఆస్తులను కోల్పోయి, శూన్యం నుండి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే క్రమంలో వస్తుంది. “జీవితమంటే పోరాటం.. పోరాటంలో ఉంది జయం” అంటూ మొదలయ్యే ఈ గీతం, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అనే సత్యాన్ని చాటి చెబుతుంది. ఈ పాటలో రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్ మరియు గొడ్డలి పట్టుకుని బండరాళ్లను పగులగొట్టే సీన్స్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాయి. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అందించిన స్వరాలు ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎనర్జిటిక్ బీట్స్ మరియు గాయకుడి గాత్రం ప్రేక్షకుల్లో ఒక రకమైన తెలియని ఉత్సాహాన్ని నింపుతాయి. సాహిత్యంలో వాడిన పదాలు “పట్టు పురుగుల్లే ఉండక వెంటాడే పులివై సాగరా” అనే మాటలు పౌరుషాన్ని రేకెత్తిస్తాయి. ఈ వీడియో సాంగ్‌లో సౌందర్య మరియు రజనీకాంత్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా హుందాగా ఉంటుంది. కష్టకాలంలో భార్య తోడుంటే మనిషి ఎంతటి విజయాన్ని అయినా సాధించగలడని ఈ సన్నివేశాలు నిరూపిస్తాయి. కేవలం సినీ ప్రియులకే కాకుండా, జీవితంలో పైకి రావాలనుకునే ప్రతి యువకుడికి ఈ పాట ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. నేటికీ సోషల్ మీడియాలో లేదా జిమ్ ట్రైనింగ్ వీడియోలలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌గా ‘నరసింహ’ పాటలు వినిపిస్తూనే ఉన్నాయంటే, ఆ సాంగ్ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ స్టైల్, రెహమాన్ మ్యూజిక్ కలగలిసి ఈ పాటను తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా మార్చేశాయి. ఇలాంటి ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
తనికెళ్ల భరణి నటుడిగానే కాకుండా కవిగా, రచయితగా చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కామెడీ అయినా, విలనీ అయినా అద్భుతంగా పోషించే భరణి ‘దొంగరాముడు అండ్ పార్టీ’ చిత్రంలో చేసిన కామెడీ అందర్నీ ఆకట్టుకుంటుంది. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్, లయ, కష్ణభగవాన్, భువనేశ్వరి, తనికెళ్ల భరణి, కొండవలస తదితరులు నటించారు. ఆద్యంతం కామెడీని అందించే వీడియో మీకోసం అందిస్తున్నాం.  ఈ వీడియోలో భరణి తనదైన గోదావరి యాసలో హీరోయిన్‌ను బ్రతిమిలాడటం చూడవచ్చు. “ఐ యామ్ సారీ అమ్మ.. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను” అంటూ ఆయన చెప్పే డైలాగుల్లో ఒక విలక్షణమైన హావభావాలు కనిపిస్తాయి. ఎన్ని గొడవలున్నా అవసరాల దగ్గరకు వచ్చేసరికి ఆయన చూపే ఆత్రుత కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ వీడియోలో అసలైన కామెడీ పండేది భరణి తన భార్యను, ప్రియురాలిని పోల్చి చూసే సందర్భంలో. “కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్‌” అంటూ ఆయన చేసే ఫిలాసఫీ, ఆ గొంతులో ఉండే గాంభీర్యం సీన్‌ను ఎక్కడికో తీసుకెళ్తాయి. తన భార్య ముఖాన్ని “తవ్వకాల్లో దొరికిన కుండ పెంకు”తో పోల్చడం, అదే సమయంలో పక్కనున్న అమ్మాయిని “పాలరాతి శిల్పం” అని పొగడటం కేవలం తనికెళ్ల భరణికే సాధ్యమైన విద్య. ఈ కామెడీ సీక్వెన్స్‌లో హైలైట్ ఏంటంటే.. “ఇల్లాలు ఇటుక ముక్క.. ప్రియురాలు పటిక ముక్క” అనే కవిత్వం. ఒక రచయితగా భరణి ఆ పదాలను ఎంత లౌక్యంగా, హాస్యం అందించే విధంగా పలికారో చూస్తుంటే ముచ్చటేస్తుంది. చివరికి తన పెళ్ళాం అక్కడికి వచ్చేసరికి ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సీన్ మొత్తానికి హైలైట్. అద్భుతమైన నటనతో, అంతకు మించిన వాచకంతో తనికెళ్ల భరణి పండించిన ఈ హాస్యరసం ‘తెలుగువన్‌’ ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇలాంటి చక్కని వినోదాన్ని అందించే వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
    -విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో మహావతార్  -పరశురాముడుగా విక్కీ  -ప్రచార చిత్రాలతో వైరల్ -శ్రద్ధాకపూర్ పేరు పరిశీలనలో  పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)డార్లింగ్ గా సాహూలో చేసి మెప్పించిన భామ శ్రద్దా కపూర్(Shraddha Kapoor). కల్కిలోను మెరిసి తన అందంతో ప్రభాస్ నే కాకుండా అభిమానులని, ప్రేక్షకులని కట్టి పడేసింది. హోమ్లీ లుక్ స్క్రీన్ ప్రెజన్స్ తన ప్రధాన బలం.ఎలాంటి హడావిడి, టెన్షన్ లేకుండా తన క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఉన్న చిత్రాల్లోనే చేస్తు తన కట్ అవుట్ రేంజ్ ని ఎలివేట్ చేసుకుంటు వస్తుంది. 2024 లో సూపర్ డూపర్ హిట్ అందుకున్న స్త్రీ 2 తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి మూవీని ఒప్పుకోలేదంటే ఆమె నిబద్దతని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఖాతాలోకి తనంతట తానుగా వచ్చి ఒక మూవీ చేరిందనే న్యూస్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. 'చావా'గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న విక్కీ కౌశల్(Vicky Kaushal)మహావతార్' అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ శ్రద్ద కపూర్ ని పరిశీలిస్తున్నారనే న్యూస్ 'బి టౌన్' సర్కిల్స్ లో అత్యంత వాల్యుబుల్ న్యూస్ గా చక్కర్లు కొడుతుంది. మరి విక్కీ కౌశల్ తో శ్రద్ధ జత కట్టడం ఖాయమైతే మహావతార్ కి అదనపు శక్తి సమకూరినట్టే. పైగా ఆ ఇద్దరి ఫస్ట్ కాంబో కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులకి నయనానందం కలగడం పక్కా. శ్రద్ధ ప్రస్తుతం 'ఏతా' అనే మరో మూవీ కూడా చేస్తుంది. Also read: Shah rukh khan vs ranveer singh: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణవీర్ సింగ్  మహావతార్(Mahavatar)విషయానికి వస్తే మాములు అల్లా టప్పా సబ్జెట్ తో తెరకెక్కడం లేదు. త్రేతాయుగం ఆరంభంలోని  శ్రీమహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు(Parasuramudu)అవతారం నేపథ్యంలో తెరకెక్కుతుంది. జమదగ్ని మహర్షి, రేణుకా దేవి కడుపున జనియించిన పరశురాముడు దుష్ట శక్తుల నుంచి భూమిని రక్షించి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన గొడ్డలితో 21 సార్లు దండెత్తి అధర్మపరులని సంహరించాడు ఏడుగురు చిరంజీవులలో ఒకరు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కల్కికి గురువు. చావాని నిర్మించిన మాడాక్ సంస్థనే నిర్మిస్తుండగా ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి.       
The industry is currently buzzing with the exciting news that 'Peddi' star Ram Charan is setting the stage for his grand return to Bollywood. The latest grapevine suggests he is joining hands with the legendary Sanjay Leela Bhansali for an ambitious period-based jungle adventure.  After his initial Hindi film debut failed to hit the mark years ago, Ram Charan seems completely ready to conquer the Northern market again. The script for this adventure is reportedly tailored specifically to match his dynamic on-screen persona.This massive collaboration actually comes with a fascinating backstory. Allu Arjun had previously met Bhansali twice, sparking heavy rumors of a huge team-up. However, Allu Arjun has recently shifted his focus towards collaborating with Tamil directors to further consolidate his South Indian market. With that strategic pivot, the project has smoothly moved forward with Ram Charan stepping in as the lead.  While Bhansali is currently heavily occupied with his highly anticipated film Love and War, industry whispers indicate that another leading Bollywood filmmaker is expected to direct this jungle saga. Planned as a grand pan-India venture, the movie will be shot directly in Hindi and later dubbed into Telugu, Tamil, Malayalam, and Kannada. Fans are undoubtedly in for a spectacular cinematic experience.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
Nani has successfully generated unprecedented hype for his upcoming grand drama, The Paradise. Under the careful direction of Srikanth Odela, the movie is being meticulously sculpted into a sweeping, large-scale epic. Already, Aaya Sher song has become a huge blockbuster with 102 Million views and Anirudh Ravichander is very happy with its success.  Celebrating Kayadu Lohar's special day, the makers surprised everyone with her official first look from the movie. She portrays Subbu, also known to many as Subbalakshmi, a highly determined girl dreaming of a bright future as an actress. The official birthday poster highlights her stunning vintage aesthetic perfectly. Riding a retro cycle through a raw village backdrop, she looks deeply immersed in the period setting, wearing a long blue skirt, a detailed white blouse, and a stylish retro cap. Producer Sudhakar Cherukuri is funding this visual marvel, ensuring it holds the record for the highest budget in the leading actor's filmography. Fans can finally experience this cinematic brilliance in theaters worldwide on August 21st. Mohan Babu, Raghav Juyal and Sampoornesh Babu have been cast in other prominent roles.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
- హాట్ టాపిక్ గా బాలకృష్ణ స్పీడ్ - 'NBK 111' సెట్స్‌పై ఉండగానే లైన్ లోకి మరో ప్రాజెక్ట్ - 2027 సంక్రాంతి టార్గెట్ గా బాలయ్య స్కెచ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) జోరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత ఉత్సాహంతో వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న 'NBK 111' సెట్స్‌పై ఉండగానే, తన తదుపరి సినిమా 'NBK 112' గురించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టును టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించబోతున్నారు. 'నాంది', 'ఉగ్రం' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ఇప్పుడు బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, జూన్ నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఒక పాత్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. గతంలో బాలయ్య పోలీస్ డ్రెస్ వేస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఖాకీ యూనిఫాంలో నందమూరి సింహాన్ని చూడబోతున్నామనే వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలయ్య తన డైరీని చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ఓ పక్కన జరుగుతుండగానే, మరోవైపు విజయ్ కనకమేడల సినిమాను కూడా పారలెల్ గా  పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారట. గోపీచంద్ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్స్ ముగిసిన వెంటనే, జూన్ నుంచి విజయ్ ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర బృందం భావిస్తోంది. సాధారణంగా సంక్రాంతి అంటేనే బాలయ్య సీజన్. పండుగ సమయంలో థియేటర్లలో బాలయ్య సందడి ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే ఎక్కడా ఆలస్యం కాకుండా షూటింగ్‌ను చకచకా పూర్తి చేసి, 2027 సంక్రాంతికి ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్. సోషల్ మీడియాలో ఈ అప్డేట్ రాగానే నందమూరి అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలను ఎంచుకుంటున్న బాలయ్య, విజయ్ కనకమేడల వంటి సీరియస్ మేకింగ్ ఉన్న డైరెక్టర్‌తో జతకట్టడం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతానికి గోపీచంద్ మలినేని సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య, త్వరలోనే తన 112వ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. బాలయ్య మార్క్ యాక్షన్, విజయ్ శైలి మేకింగ్ కలగలిసి రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.  
  -ధురంధర్ సిరీస్ విజయాలతో జోష్ లో ఉన్న రణవీర్  -ముంబై లో రీసెంట్ గా ఒక పార్టీ  -రణవీర్, షారుక్ హాజరు  -పలరించిన షారుక్  -రెస్పాన్స్ అవ్వని రణవీర్  -సోషల్ మీడియా వేదికగా పలు చర్చలు  -ఏమైనా విభేదాలున్నాయా! బడా హీరోలు పబ్లిక్ ఫంక్షన్ లో ఒకరినొకరు ఎదురుపడ్డారే అనుకోండి. ఎంత లేదన్నా సుమారు పది, పదిహేను నిమిషాలైనా మాట్లాడుకుంటారు. ఒక వేళ ఆ ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని అనుకుందాం. మీడియాతో పాటు పబ్లిక్ లుక్ స్ట్రాంగ్ గా ఉండే నేపథ్యంలో అయినా ఆ ఇద్దరు తప్పని సరిగా మాట్లాడుకోవాల్సిందే. అలాంటిది షారుక్ ఖాన్(Shahrukh Khan),రణవీర్ సింగ్(Ranveer Singh)ల నామ్ కే వస్తే పలరింపులు ఇప్పుడు ఇండియన్ సినీ సర్కిల్స్ లో అనేక చర్చలకి దారి తీస్తున్నాయి. సోషల్ మీడియా అయితే ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం. రీసెంట్ గా ముంబైలో భారీ ఎత్తున ఈవెంట్ జరిగింది. రణవీర్, షారుఖ్ హాజరయ్యారు. రణవీర్ కొంత మందితో మాట్లాడుతుండగా రణవీర్ బుగ్గని షారుక్ తడిమాడు. దాంతో థాంక్స్ చెప్పి రణవీర్ పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క క్లిప్  సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిజానికి ఆ ఇద్దరు కనిపించినప్పుడు ఎంతో బాగా మాట్లాడుకోవాలి. పైగా రణవీర్ ధురంధర్ సక్సెస్ లో ఉన్నాడు. షారుక్ కూడా తన కొత్త చిత్రం 'కింగ్' తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు చాలా సేపు ముచ్చటించుకోవాలి. కానీ అలా జరగకపోవడంతో సోషల్ మీడియాని ఆ ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ బిజీ మోడ్ లోకి తీసుకెళ్లారు. షారుక్ లాంటి సీనియర్ హీరో పలకరిస్తే పట్టించుకోడా, ధురంధర్ విజయంతో రణవీర్ కి తలపొగరు వచ్చిందని,  ధురంధర్ రికార్డ్స్ సృష్టిస్తుంటే ఎదురుగా వెళ్లి పలకరించాలి కదా. అయినా ఇప్పటి వరకు ధురంధర్ సిరిస్ గురించి షారుఖ్ మాట్లాడాడా, అదేనా సీనియర్ అంటే..ఇలా ఇంకా ఎన్నో కామెంట్స్ తో వీకెండ్ కి జోష్ వచ్చింది.  aslo read: Mangli: సింగర్ మంగ్లీ, డైరెక్టర్ వేణు ఊడుగుల చంపుతామని బెదిరిస్తున్నారు నిజానికి ధురంధర్ సిరీస్ సక్సెస్ ని పొగుడుతు బాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలు స్పందించారు. కానీ షారుక్  ఖాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్పందించాలని రూల్ ఏమి లేదులే గాని, స్పందించడం అనేది ఎప్పట్నుంచో వస్తున్న సినీ ఆనవాయితీ. షారుక్ నే కాదు సల్మాన్, అమీర్ ఖాన్ కూడా మాట్లాడలేదు. దీంతో ఖాన్ త్రయం ఎందుకు మాట్లాడలేదనే న్యూస్ అయితే ఇప్పటికి మిస్టరీ గానే ఉంది. మరి ఇప్పుడు షారుఖ్, రణవీర్ తాలూకు వీడియో వైరల్ గా మారడంతో షారుక్ తో పాటు సల్మాన్, అమీర్ స్పందిస్తారేమో చూడాలి. షారుఖ్, రణవీర్ కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఒకటుంది. షారుక్ హిట్ సిరీస్ డాన్ 3 లో రణవీర్ సింగ్ హీరోగా చేస్తున్నాడు. డాన్ పార్ట్ 1 , పార్ట్ 2  షారుక్ వే. మరి స్పెషల్ ఎట్రాక్షన్ గా షారుక్ కనిపించే అవకాశం ఉండవచ్చు. అప్పుడు ఆ ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కి 'వాళ్ళు వాళ్ళు ఒకటేరా' అనుకునే అవకాశం రావచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటి వరకు రణవీర్, షారుక్ మధ్య గొడవలు ఉన్నాయనే ఎలాంటి న్యూస్ కనీసం రూమర్ గా అయినాస్ప్రెడ్ అయిన దాఖలాలు లేవు.      
- ఆడియెన్స్ వెయిటింగ్ ఫినిష్  - హారర్ ప్రియులకు పండగే - ఓటీటీలోకి వచ్చేసిన ఆది ‘శబ్దం’ హీరో ఆది పినిశెట్టి విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘శబ్దం’ గురించి సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో సందడి చేసిన తర్వాత, ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 (ZEE5)లో ‘శబ్దం’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి, ఈ సినిమా గతంలోనే ఇతర భాషల్లో ఓటీటీలోకి వచ్చినప్పటికీ, తెలుగు వెర్షన్ కోసం కొంచెం సమయం పట్టింది. ప్రారంభంలో కేవలం తమిళం, హిందీ భాషల్లోనే అందుబాటులో ఉండటంతో తెలుగు సినీ అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే, ఇప్పుడు మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెబుతూ, మన భాషలో కూడా స్ట్రీమింగ్ ప్రారంభించారు. వీకెండ్ లో ఒక మంచి హారర్ మూవీ చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించారు. గతంలో ఆది పినిశెట్టి మరియు అరివళగన్ కాంబినేషన్ లో వచ్చిన ‘వైశాలి’ (ఈరమ్) చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన చిత్రం కావడంతో ‘శబ్దం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆది తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా చాలా రిచ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఎస్. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని భయాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిందని ఆడియెన్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. శబ్దాలకు ప్రాముఖ్యతనిస్తూ సాగే కథ కాబట్టి, సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. చిత్రంలో లక్ష్మీ మీనన్, సిమ్రాన్ మరియు లైలా వంటి సీనియర్ నటీమణులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ‘శబ్దం’ సినిమా కథాంశం విషయానికి వస్తే, ఒక మెడికల్ కాలేజీలో జరిగే వింత మరణాల చుట్టూ తిరుగుతుంది. ఆ మిస్టరీని ఛేదించేందుకు వచ్చిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఆది పాత్ర చాలా ఇంటెన్సివ్ గా సాగుతుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, హారర్ మరియు థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా డిజిటల్ తెరపై మంచి అనుభూతిని ఇస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆది పినిశెట్టి సినిమాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ లో ఆది ‘శబ్దం’ చేసే వింత ప్రయోగాన్ని జీ5లో వీక్షించండి!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'రెబల్ స్టార్'గా వెలుగొందిన కృష్ణంరాజు (Krishnam Raju) అభిరుచులు, ఆయన జీవనశైలి ఎప్పుడూ రాజసం ఉట్టిపడేలా ఉండేవి. ఆయన ఇంటికి వెళ్తే ఒక మ్యూజియంను సందర్శించిన అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా ఆయన గదిలో ఉండే ఒక అద్భుతమైన కళాఖండం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అదే "బంగారు చిరుత విగ్రహం" (Golden Leopard Idol). కృష్ణంరాజు ప్రాణప్రదమైన యాంటిక్ పీస్: ఈ అద్భుతమైన చిరుత విగ్రహాన్ని కృష్ణంరాజు సుమారు 50 ఏళ్ల క్రితం విదేశాల నుంచి ఎంతో శ్రమకోర్చి తెచ్చుకున్నారు. ఇది కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఆయన అభిరుచికి నిదర్శనం. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అప్పట్లో ప్రపంచం మొత్తంలో ఇది "సింగిల్ పీస్" అంటే ఒకే ఒక్క విగ్రహం తయారు చేయబడింది. దానిని కృష్ణంరాజు సొంతం చేసుకున్నారు. విదేశాల నుంచి ఇలాంటి అరుదైన వస్తువులను తీసుకువచ్చేటప్పుడు ఆయన ఎంతో ఇష్టంగా భారీ మొత్తంలో ఇన్కమ్ టాక్స్ కూడా చెల్లించేవారని సమాచారం. బంగారు వర్ణంతో మెరిసిపోయే రాజసం: ఈ చిరుత విగ్రహం 24 క్యారెట్ల బంగారు పూతతో (Gold Plated) చేయబడింది. దీనిని చూస్తుంటే సాక్షాత్తు ఒక నిజమైన చిరుతపులి గదిలో నిలబడి ఉందా అనేంత సహజంగా ఉంటుంది. విశేషమేమిటంటే, 50 ఏళ్లు గడిచినా దీని మెరుపు ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో తయారైన ఈ ఏకైక విగ్రహం, ఇప్పుడు 50 ఏళ్లు పూర్తి చేసుకుని ఒక అరుదైన 'యాంటిక్ పీస్' (పురాతన కళాఖండం) గా మారింది. ఇటీవల కాలంలోనే దీని తయారీదారులు మరొక పీస్ తయారు చేయడం ప్రారంభించారట, కానీ దశాబ్దాల పాటు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక పీస్ కృష్ణంరాజు ఇంట్లోనే ఉండటం గమనార్హం. భద్రంగా చూసుకుంటున్న ప్రభాస్​: ఈ విగ్రహాన్ని చూస్తుంటే కృష్ణంరాజు వ్యక్తిత్వం గుర్తొస్తుంది. అడవికి రాజు సింహం అయితే, ఆ సింహపు నడకలో ఉండే గాంభీర్యం, చిరుతపులి వేగంలో ఉండే పదును ఆయన నటనలో, వ్యక్తిత్వంలో కనిపిస్తాయి. ఆయన లేకపోయినా, ఆయన ప్రాణప్రదంగా చూసుకున్న ఈ అరుదైన వస్తువులు నేటికీ ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కూడా తన పెదనాన్న సేకరించిన ఇటువంటి అరుదైన వస్తువులను ఎంతో భద్రంగా చూసుకుంటున్నారు. కృష్ణంరాజు గదిలోని ఆఫీస్ టేబుల్, హ్యాండిల్స్ అన్నీ ఆయన స్వయంగా దగ్గరుండి చేయించుకున్నవే. ఆ వస్తువులను చూస్తుంటే ఆయన ఆ గదిలో లేరన్న వెలితి మనల్ని బాధిస్తున్నా, ఆయన అభిరుచి మాత్రం ఆ గోల్డెన్ విగ్రహంలాగే ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం? శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్య.. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. పాలకూర.. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది. బీట్‌రూట్ .. బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆకుకూర సలాడ్లు.. ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి.  ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు.  ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. మెంతులు.. మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కాలీఫ్లవర్.. క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.                      *రూపశ్రీ.
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు.  ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు.  కొబ్బరి నీరు,  మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే.. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది.  తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది.  అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది. మజ్జిగ.. మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ ,  ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే  శరీరం  చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేడా.. కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?  డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది.  శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి,  వేర్వేరుగా ఉపయోగపడతాయి.                              *రూపశ్రీ.
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.   వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్షలా కాపాడతాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రయాణాలు.. వేసవి కాలంలో చేసే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధిక వేడిమితో డీహైడ్రేషన్ గురికాకుండా తరచూ మంచినీరు,ఓఆరెస్,పల్చటి మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు  ఉదయం చాలా తొందరగా,  లేదా సాయంత్రం ఎండ వేడిమి చాలా వరకు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లడం.. వేసవి కాలంలో సాధారణంగా మిగతా రోజుల్లా పనుల కోసం బయటకు వెళ్ళే విధానాన్ని తగ్గించుకోవాలి. వేసవి కాలంలో పనుల షెడ్యుల్.. బయటకు వెళ్ళి చక్కబెట్టుకోవాల్సిన పనుల ప్రణాళికలు మార్చుకోవాలి.  తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే.. వెంట వాటర్ బాటిల్,  గొడుగు ఉండేలా చూసుకోవాలి. కాలి నడకన లేదా బైక్ లో వెళ్లడం కంటే ఆటో వంటి వాహనాలలో బయటకు వెళ్లి రావడం చాలా మంచిది. ఆహార, పానీయాలు.. వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి  నీటి శాతాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి.  ఆహారంలో కారం, ఉప్పు,  నూనె వంటివి బాగా తగ్గించాలి. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు,  పండ్లు విరివిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తొందర పాటులో చాలా చల్లగా ఉన్న ఫ్రిజ్ లోని నీరు తాగడం  మానుకోవాలి.  బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కుండలోని నీరు లేదా పల్చగా మజ్జిగ,  సుగంద షర్బత్ వంటివి తాగవచ్చు. ఇవి శరీరానికి ఊరట ఇస్తాయి.  వేసవి తాపం తీరుస్తాయి. హెల్త్ కేర్..   వేసవి ఎండల కారణంగా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్స పొందాలి. అక్కడ ఓఆర్ లేదా ఎలక్ట్రోలైట్స్ ను అందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవడం లేదా నీడ పట్టున పనులు చేసుకోవడం మంచిది.   సేవ.. వేసవికాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా.. నలుగురి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం కనీస మానవత్వం.  వేసవిలో ప్రయాణాలు చేసేవారు.. దారి వెంట వెళ్లే బాటసారులు ఉంటారు. అలాంటి వారి కోసం.. మంచి నీరు ఏర్పాటు చేయడం,  అక్కడక్కడా కూర్చోవడానికి కాసింత చోటు ఇవ్వడం వంటివి కూడా చేయాలి. ఇవి కనీస మానవ ధర్మం కూడా. అయితే.. ఏ పని చేసినా ప్రమాదాలు మీదకు తెచ్చుకోకుండా చేయడమే మంచిది.                               *రూపశ్రీ.