కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

posted on: Apr 10, 2026 4:58PM

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 10) బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.

కేసీఆర్‌ను చూడగానే జీవన్ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.  అన్నా.. మన రాష్ట్రానికి నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను ఇక్కడికి పంపాడన్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో  కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా ఈ భేటీలో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు,  జగిత్యాల మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వసంత సురేష్ దంపతులు కూడా కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు,  కాంగ్రెస్ లో తనకు ఎదురైన పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి  కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్న జీవన్ రెడ్డికి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి  కేటీఆర్ ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు కూడా జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా కేసీఆర్   జీవన్ రెడ్డిని సన్మానించి, పార్టీలోకి  ఆహ్వానించారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...