తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 10) బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్‌ను చూడగానే జీవన్ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.  అన్నా.. మన రాష్ట్రానికి నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను ఇక్కడికి పంపాడన్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో  కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా ఈ భేటీలో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు,  జగిత్యాల మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వసంత సురేష్ దంపతులు కూడా కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు,  కాంగ్రెస్ లో తనకు ఎదురైన పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి  కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్న జీవన్ రెడ్డికి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి  కేటీఆర్ ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు కూడా జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా కేసీఆర్   జీవన్ రెడ్డిని సన్మానించి, పార్టీలోకి  ఆహ్వానించారు.   
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి శుక్రవారం (ఏప్రిల్ 10) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.    రాజీనామా చేయాలని ఆయనకు గతంలోనూ సూచనలు అందినప్పటికీ అప్పట్లో ఆయన అందుకు నిరాకరించారు.  ఇప్పుడు ఆయన తప్పుకోవడం న్యాయ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది.  గత ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున నగదు   కనిపించింది. కాలిపోయిన నోట్లతో పాటు కొన్ని వందల నోట్ల కట్టలు బయటపడటంతో ఈ అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయ మూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించడంతో పాటు, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతర్గత విచారణ కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నగదుతో తనకు సంబంధం లేదని ఆయన వాదించినప్పటికీ విచారణలో ఆ నగదు ఆయన నివాసంలోనిదే అని తేలింది.  ఈ క్రమంలోనే ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియను ప్రారం భించేందుకు   146 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. ఈ అభిశంసన ప్రక్రియ వేగవంతం కావడంతోనే ఇప్పుడు ఆయన  రాజీనామా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.  ఇలా ఉండగా, యశ్వంత్ వర్మ రాష్ట్రపతికి పంపిన లేఖలో   తన రాజీనామాకు గల కారణాలను వివరించకుండా..  ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పదవిలో కొనసాగడం ఇష్టం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే ఆయన ఈ  నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలాంటి తీవ్ర ఆర్థిక ఆరోపణలతో అభిశంసన ఎదుర్కొంటూ రాజీనామా చేయడం అత్యంత అరుదు.  జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాతో ప్రస్తుతం సాగుతున్న అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందా లేదా అన్నవిషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా రాజీనామా చేసిన తర్వాత అభిశంసన ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం సదరు వ్యక్తిని పదవి నుంచి తొలగించడమే. అయితే ఇక్కడ యశ్వంత్ వర్మపై  నమోదైన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.  
బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పిన నితీశ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా శుక్రవారం (ఏప్రిల్ 10)  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో ఆయన ఇకపై పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలకే పరిమితం కానున్నారు.   రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్   ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు  వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంతో నితీశ్ కుమార్ భారత రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. శాసనసభ , శాసనమండలి , లోక్‌సభ,  రాజ్యసభ లలోనూ  సభ్యుడిగా పనిచేసిన అతికొద్ది మంది నాయకుల జాబితాలో నితీశ్ చేరారు. ఇది ఆయన సుదీర్ఘ,  వైవిధ్యభరితమైన రాజకీయ అనుభవానికి అద్దంపడుతోంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నితీశ్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన గత నెల  30న తన శాసనమండలి సభ్యత్వానికి   రాజీనామా సమర్పించారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నందున, ముఖ్యమంత్రి హోదాలో కొనసాగేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బీహార్ అభివృద్ధి కోసం తాను ఇన్నేళ్లుగా పని చేశాననీ, రాష్ట్ర ప్రగతికి అవసరమైన పునాదులు వేశాననీ చెప్పుకొచ్చారు.  ఇక నుంచీ జాతీయ స్థాయిలో సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు. 2005 నుండి బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా కొనసాగుతూ వచ్చిన ఆయన, దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు.  
ALSO ON TELUGUONE N E W S
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా వేళ ఓ సాధారణ పూసలు అమ్మే అమ్మాయిగా సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా భోస్లే గుర్తుందిగా? తన సహజమైన అందంతో, చిరునవ్వుతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ చిన్నది, ఇప్పుడు ఒక తీవ్రమైన చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న ఈమె జీవితం, ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. కుంభమేళాలో వైరల్ అయిన తర్వాత మోనాలిసాకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడి, పెద్దలను ఎదిరించి కేరళలో వివాహం చేసుకుంది. అయితే, ఈ పెళ్లి జరిగినప్పటి నుండి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) జరిపిన విచారణలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి సమయంలో మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్ల రెండు నెలలేనని, ఆమె మైనర్ అని ఆధారాలతో సహా తేలింది. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించినట్లు అధికారులు గుర్తించారు. అంటే చట్టప్రకారం ఆమెకు పెళ్లి వయసు రాలేదు. పెళ్లి కోసం నకిలీ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించారని విచారణలో వెల్లడైంది. దీంతో మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు, అలాగే గిరిజన సామాజిక వర్గానికి చెందిన యువతిని మోసం చేసినందుకు ఫర్మాన్ ఖాన్‌పై పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ వివాదం కేవలం పెళ్లికే పరిమితం కాలేదు. గతంలోనే మోనాలిసా తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన తండ్రి తనను బలవంతంగా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారని, అందుకే తాను ఇష్టపడిన వ్యక్తితో కేరళ వెళ్లి పెళ్లి చేసుకున్నానని అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే, ఆమె తండ్రి జైసింగ్ భోస్లే మాత్రం తన కూతురిని ఫర్మాన్ ఖాన్ తప్పుదోవ పట్టించి తీసుకెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కేరళ, మధ్యప్రదేశ్ పోలీసుల సమన్వయంతో తదుపరి విచారణ కొనసాగుతోంది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ వంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్న ఈ వైరల్ గర్ల్, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రావడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఆమెకు మద్దతుగా మాట్లాడుతుండగా, చట్టాన్ని ఉల్లంఘించడం తప్పని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, కుంభమేళాలో వెలిగిన ఈ తార జీవితం ఇప్పుడు చీకటి చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. ముందుముందు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో.. ఫర్మాన్ ఖాన్ అరెస్ట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం జాతీయ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 22న ఈ విషయంపై పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. మోనాలిసా భవిష్యత్తు మరియు ఆమె సినీ కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.
మృత్యువుతో పోరాడుతున్న రెండేళ్ల కేయాన్ష్  ఆదుకోవాలని పిలుపునిచ్చిన బాలయ్య.. నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తనలోని సేవాగుణాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి చలించిపోయారు. అత్యంత ఖరీదైన చికిత్స అవసరమైన ఆ బాలుడిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని బాలయ్య భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిందంటే? హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) ప్రస్తుతం ఒక భయంకరమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నాడు. వైద్యుల పరీక్షల్లో ఆ చిన్నారికి 'స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్ 2' అనే అత్యంత అరుదైన, ప్రాణాపాయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత 21 నెలలుగా ఆ చిన్నారి బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. 16 కోట్ల ఇంజెక్షన్ ఉంటేనే ప్రాణం నిలుస్తుంది.. ఈ వ్యాధి నుండి చిన్నారిని కాపాడాలంటే 'AVXS-101' (Onasemnogene Abeparvovec) అనే జీవరక్షక ఔషధం అవసరం. ఇది భారతదేశంలో అందుబాటులో లేదు, విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. ఈ ఒక్క ఇంజెక్షన్ ధర అక్షరాలా 16 కోట్ల రూపాయలు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన నటరాజు దంపతులు అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం అసాధ్యం. నిన్నటి హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణను ఆ కుటుంబం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాలయ్య అభయం - ప్రజలకు విన్నపం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ, తన వంతుగా వ్యక్తిగత సహాయం చేస్తూనే, ప్రభుత్వ పరంగా కూడా నిధుల సేకరణకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. "ఇంత భారీ మొత్తాన్ని ఆ కుటుంబం ఒక్కటే సమకూర్చుకోలేదు. కావున ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేసి ఆ చిన్నారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుతున్నాను" అని బాలయ్య పిలుపునిచ్చారు. చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు దాతలు నేరుగా తండ్రి ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు: అకౌంట్ వివరాలు:  Account- 8265662545 Name - A S Nataraj IFSC - IDIB000J028 Branch - J P NAGAR బాలకృష్ణ చేసిన ఈ విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే పలువురు దాతలు తమ వంతు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఆ రెండేళ్ల చిన్నారి తిరిగి ఆరోగ్యవంతుడై తల్లిదండ్రుల ఒడిలో క్షేమంగా ఉండాలని కోరుకుందాం.  https://www.facebook.com/share/p/1DxfDmwsxR/
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. అయితే, తాజాగా ఈ సినిమా సెట్‌లో జరిగిన ఒక ప్రమాదం అందరినీ కంగారు పెట్టింది. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో సెట్‌లోని కొన్ని టెంట్లు, ఇతర సినిమా సామాగ్రి పాక్షికంగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చిత్రయూనిట్ మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో చిత్ర బృందానికి సహాయం చేసే టీమ్‌లో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్‌లో లేరు. ఈ వార్త తెలియగానే ఆయన అభిమానులు మొదట ఆందోళన చెందినప్పటికీ, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సెట్‌లో మరమ్మతులు చేపట్టి, త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా తీస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK). విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. పైగా ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే.. వినూత్నమైన టైటిల్, పోస్టర్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా ఎలా ఉంది? ప్రదీప్ ఖాతాలో మరో హిట్ పడిందా? (Love Insurance Kompany Review Telugu) కథ: ఈ కథ 2040వ సంవత్సరంలో జరుగుతుంది. అప్పటికి టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతుందంటే.. మనుషుల ప్రేమ వ్యవహారాలను చూసుకోవడానికి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ యాప్ ఉంటుంది. ఈ కంపెనీకి సీఈఓ గా ఎస్.జె. సూర్య ఉంటాడు. ఎవరిని ప్రేమించాలో, ఎప్పుడు విడిపోవాలో ఆ యాప్ డిసైడ్ చేస్తుంది. దానిని గుడ్డిగా ఫాలో అవుతుంది ధీమా(కృతి శెట్టి). టెక్నాలజీపై ఆధారపడే ధీమాను.. ప్రకృతికి దగ్గరగా జీవించే వ్యక్తి వాసు (ప్రదీప్ రంగనాథన్) తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ యాప్‌లోని "లవ్ స్కోర్" ఫీచర్ ఈ ప్రేమ కథకు రెడ్ ఫ్లాగ్ వేస్తుంది. అప్పుడు వాసు ఏం చేశాడు? ధీమా మనసు గెలుచుకొని, తన ప్రేమ కథను విజయ తీరాలకు చేర్చాడా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. అయితే ఆ కొత్త పాయింట్ ను, పూర్తిస్థాయిలో మెప్పించేలా ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో మాత్రం దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమాలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా వేగంగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా మెప్పించింది.  అయితే, సెకండాఫ్‌లో కొన్ని చోట్ల నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. ప్రదీప్-కృతి శెట్టి, ప్రదీప్-ఎస్.జె. సూర్య మధ్య సన్నివేశాలు పరవాలేదు. కానీ క్లైమాక్స్ ఊహకు అందేలా ఉండటం, కొన్ని డ్రామా సీన్స్ సాగదీసినట్లు అనిపించడం మైనస్ గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ లో రైటింగ్ పరంగా కేర్ తీసుకుంటే అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది. సినిమాలో ప్రధాన ఆకర్షణ 'ఫ్యూచరిస్టిక్ లవ్' అనే పాయింట్. 2040 నాటి ప్రపంచాన్ని చూపిస్తూ, అప్పటి టెక్నాలజీ మనుషుల సంబంధాలను ఎలా శాసిస్తుందో చూపించడం కొత్తగా ఉంది. విఘ్నేష్ శివన్ ఫస్టాఫ్‌ను చాలా ఎనర్జిటిక్‌గా నడిపించాడు. ప్రదీప్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా రాసుకున్న డైలాగులు థియేటర్లలో నవ్వులు పూయించాయి. అయితే, సెకండాఫ్‌లో తడబాటు కారణంగా పూర్తిస్థాయి సంతృప్తి కలగదు. ఈ సినిమాలో టెక్నాలజీ వల్ల మనుషుల మధ్య దూరం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని అంతర్లీనంగా సందేశం ఇచ్చారు. టెక్నాలజీ యుగంలోనూ మనసు విప్పి మాట్లాడుకోవడమే ప్రేమకు అసలైన ఇన్సూరెన్స్ అని ఈ సినిమా చాటిచెప్పింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: ప్రదీప్ రంగనాథన్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టాడు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగిన పాత్ర ఇది. ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. కృతి శెట్టి మంచి పాత్రలో మెరిసింది. ఆమె లుక్స్, నటన సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్రదీప్, కృతి మధ్య కెమిస్ట్రీ యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఎస్.జె. సూర్య తనదైన నటనతో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. యోగి బాబు కామెడీ కొన్ని చోట్ల బాగానే నవ్వులు పూయించింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఫ్యూచరిస్టిక్ అంశాలను చూపిస్తూనే, మన ఎమోషన్స్ కు కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఆకట్టుకుంది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్: కొత్త కాన్సెప్ట్ ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ కామెడీ మైనస్ పాయింట్స్: కొన్ని నెమ్మదిగా సాగే సీన్స్ రొటీన్ క్లైమాక్స్ ఫైనల్ గా.. కాన్సెప్ట్ బాగున్నా.. సెకండాఫ్ లో తడబాటు కారణంగా ఈ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. రేటింగ్: 2.25/5 Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
Adivi Sesh seems to have missed his target with his highly anticipated film, Dacoit. Despite being in production for over two years, the movie has opened to highly mixed reactions, leaving many audiences expressing their disappointment. The initial reactions built up a lot of hope, but the final product did not reach into audiences as anticipated.   A major reason for this underwhelming response is the uneven VFX and a same old template screenplay that offers nothing fresh. It appears that Sesh’s deliberate attempt to gain widespread commercial hero acceptance has worked against him this time.  While his co-star Mrunal Thakur is getting praises for her solid performance, Sesh is facing a surprising amount of criticism. Even his usually praised screenplay skills and keen eye in execution are being tarnished by several people for being too illogical and disjointed.   Audiences expected a tight and thrilling experience, but the execution struggled to hold interest. The forced commercial elements diluted the core story, making the overall narrative feel unnatural. Considering the mostly negative response and mixed word of mouth, it is going to be a long rope for the actor to secure a clean hit from this particular project.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
Megastar Chiranjeevi possesses a strong awareness and a commendable willingness to react to issues plaguing Indian cinema, as seen in his recent response on X regarding the malicious online leak of Thalapathy Vijay's Jana Nayagan.  The movie has been trapped in a difficult position after its scheduled January release was indefinitely halted over severe censorship disputes. Showing immense industry unity, Chiranjeevi pointed out that such acts of piracy are incredibly harmful to the cinema ecosystem and the livelihoods of countless workers.  On X, he wrote, "The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me. Cinema is built on trust, effort, and the collective dreams of many. Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work. My thoughts and support are with the movie team. Let us all take responsibility to respect and protect cinema. Kill Piracy. Save Cinema."  He shares a close professional bond with the makers, as KVN Productions is the driving force behind both Jana Nayagan and his own upcoming Telugu project. He appealed to the public to understand the pain of the creators and avoid sharing the leaked footage.  The continuous roadblocks faced by the film are widely attributed to the ripple effects of Vijay's strong political alignment and recent entry into the political arena. Despite these troubles, the production house is taking strict legal measures to pull down the unauthorized links, and the industry continues to stand united against piracy.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
  -నెట్టింట దర్శనమిస్తున్న జననాయగన్ పైరసీ  -యావత్తు ఇండియన్ పరిశ్రమ షాక్  -ట్వీట్ చేసిన మెగాస్టార్  -ఆ డీటెయిల్స్ చూద్దాం. పైరసీ.. అణుబాంబు కంటే ప్రమాదకరమైన పైరసీ పదం వింటే చాలు భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపాటుకి గురవుతుంది.స్క్రీన్ పైనే కాకుండా బయట కూడా జనరల్ గా హీరోలు దైర్యంగానే ఉంటారు. కానీ పైరసీ విషయంలో మాత్రం డల్ అయిపోతారు. అంతలా ఆ పెనుభూతం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్ జననాయగన్ మూవీ పైరసీ బారిన పడి నెట్టింట దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బాధపడని హీరో అండ్ టెక్నీషయన్  లేడు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ఈ విషయంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది.  సదరు ట్వీట్ లో 'జననాయగన్(Jananayagan)లీక్ అవ్వడం నన్ను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా అనేది నమ్మకం, కృషి, మరియు ఎందరో సమిష్టి కలల మీద నిర్మించబడుతుంది. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. సృజనాత్మకతతో కూడిన పనిని కాపాడుకోవడం ఎంత కీలకమో కూడా ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. పైరసీని అంతమొందించే విషయంలో నా ఆలోచనలు  మద్దతు చిత్ర బృందానికి ఎల్లప్పుడూ ఉంటాయి. సినిమాను గౌరవించి, కాపాడే బాధ్యతను మనమందరం తీసుకుందాం. పైరసీని అంతం చేయండి. సినిమాని కాపాడండని తెలిపాడు. Also read: Allu sneha reddy: వైరల్ గా మారిన అల్లు స్నేహరెడ్డి ఆస్తులు.. నిజమేనా!  చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు, మూవీ లవర్స్ స్పందిస్తు పైరసీ విషయంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు. జన నాయగన్ ని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిందనేది టాక్. ఇప్పటికే సెన్సార్ విషయంలో వాయిదా పడింది. అలాంటి ఈ టైంలో పైరసీ బారిన పడటం నిజంగా దురదృష్టం. చిరంజీవి, బాబీ మూవీని కె వి ఎన్ ప్రొడక్షన్స్ నే నిర్మిస్తుంది. ఇక 'జననాయగన్' విషయంలో ట్వీట్ చేసినందుకు విజయ్(Vijay)ఫ్యాన్స్ చిరుకి థాంక్స్ చెప్తున్నారు.      https://x.com/KChiruTweets/status/2042530568806838277?s=20  
  - వీఎఫ్ఎక్స్ విషయంలో మెగాస్టార్ కఠిన నిర్ణయం - క్వాలిటీ కోసం వెనక్కి తగ్గిన మెగా హీరోలు  - వాయిదా బాటలో భారీ చిత్రాలు మెగా అభిమానులకు ప్రస్తుతం ఒకటే టెన్షన్. తమ అభిమాన హీరోల సినిమాలు అనౌన్స్ అయి నెలలు గడుస్తున్నా, షూటింగులు పూర్తి చేసుకున్నా రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర, రామ్‌చ‌ర‌ణ్ పెద్ది విడుదల తేదీల చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ రెండు సినిమాల జాప్యానికి ప్రధాన కారణం టెక్నికల్ సమస్యలు, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యత అని ఫిల్మ్ నగర్ టాక్. విశ్వంభ‌ర చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఇక రామ్‌చ‌ర‌ణ్ పెద్దికి మొద‌ట మార్చి 27 రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. ఆ త‌ర్వాత ఏప్రిల్ 30కి మార్చారు. ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్న మాటేమిటంటే.. ఈ చిత్రం జూన్‌కి వెళ్లిపోయింది. ఈ రెండు సినిమాల‌ను విఎఫ్ఎక్స్ స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయ‌న్న‌ది సినీ వ‌ర్గాల్లో ఉన్న అభిప్రాయం.  గతంలో 'విశ్వంభర' టీజర్ విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో విజువల్స్ పట్ల కొంత మిశ్రమ స్పందన వచ్చింది. గ్రాఫిక్స్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేదని కొందరు నెటిజన్లు పెదవి విరిచారు. దీంతో అప్రమత్తమైన మెగాస్టార్ మరియు దర్శకుడు వశిష్ట, అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. దాదాపు ఐదారు కీలకమైన సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ పనులు మళ్ళీ మొదటి నుంచి చేయిస్తున్నట్లు సమాచారం. ఈ రీ-వర్క్ కారణంగానే సినిమా విడుదల తేదీ ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు  'పెద్ది' పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ దశలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారాయట. రాజమౌళి వంటి దర్శకులు ఇండియన్ సినిమాను వీఎఫ్ఎక్స్ పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న తరుణంలో, చిన్న పొరపాటు జరిగినా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే క్వాలిటీ కోసం మరికొంత సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ, పక్కాగా రావాలని పట్టుబడుతున్నారు. వాస్తవానికి మెగా ఫ్యామిలీకి వీఎఫ్ఎక్స్ సమస్యలు కొత్తేమీ కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  'హరిహర వీరమల్లుస చిత్రానికి కూడా వీఎఫ్ఎక్స్‌పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర'కు కూడా అదే పరిస్థితి ఎదురుకావడం మెగా ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆలస్యంపై విభిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. "లేటైనా లేటెస్ట్‌గా రావాలి" అని కొందరు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తుంటే, "ముందే పక్కా ప్లానింగ్‌తో ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు కదా" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలైనప్పుడు టెక్నికల్ టీమ్స్‌ను ముందే సరిగ్గా ఎంచుకోవాలని సినీ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి తన 'విశ్వంభర'తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని కంకణం కట్టుకున్నారు. గతంలో 'బింబిసార'తో మెప్పించిన వశిష్ట, ఈసారి చిరు కోసం అంతకు మించి అద్భుతమైన విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నారట. ఇక 'పెద్ది' టీమ్ కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో రావాల్సిన సినిమాలు కాస్త అటు ఇటుగా మారినా, వెండితెరపై విజువల్ ఫీస్ట్ మాత్రం పక్కా అని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ వీఎఫ్ఎక్స్ అడ్డంకులను దాటుకుని మెగా హీరోలు ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తారో వేచి చూడాలి!
  -ఈ నెల 8 న బర్త్ డే వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్  -ట్రెండ్ అవుతున్న అల్లు స్నేహ రెడ్డి ఆస్తులు -మరి అవి నిజమేనా! కొన్నిపేర్లకి పరిచయ వ్యాఖ్యానాలు అవసరం ఉండదు. అలాంటి వాళ్ళల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)వైఫ్ స్నేహరెడ్డి ఒకరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటంతో నిత్యం ఆమె పేరు ఏదో ఒక రూపాన ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ తన ఆస్తుల లిస్ట్ గురించిన న్యూస్ ట్రెండ్ అవుతూ ఉంది. మరి ఆ డీటెయిల్స్ చూద్దాం. స్నేహా రెడ్డి(Allu Sneha Reddy)ఆస్తి విలువ సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుందనే న్యూస్ ఈ రోజే తనకి స్వాతంత్య్రం వచ్చినట్టుగా కనపడిన ప్రతి వాళ్ళకి హాయ్ చెప్తుంది. పైగా ఆ ప్రాపర్టీని తనే సొంతంగా సంపాదించిందనేది కూడా టాక్. అమెరికాలో మాస్టర్  డిగ్రీని పూర్తి చేసుకొని వచ్చిన స్నేహ రెడ్డి స్టైలిష్ ఫ్యాషన్ నుంచి ట్రావెల్ డైరీల వరకు, తన లైఫ్‌కి సంబంధించిన విషయాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మొదట తన తండ్రికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేసి ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఒక స్టూడియోని కూడా నడుపుతున్నారు. పలు బ్రాండ్లతో కలిసి వర్క్ చేస్తు నెలకి లక్షల్లో సంపాదిస్తుంది.  Also read: Dacoit: డెకాయిట్ హైలెట్స్ ఇవే.. టాక్ ఎలా ఉంది స్నేహరెడ్డిది తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని చింతపల్లి విలేజ్. రీసెంట్ గా బర్త్ డే జరుపుకున్న అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలని తనే దగ్గర్నుండి నిర్వహించింది.పిల్లలు అయాన్, అర్హ ల గురించి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రెజెంట్ రాకా(Raaka)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే      
టాలీవుడ్‌లో మొదలైన పర్సెంటేజ్ వార్  నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ గొడవతో థియేటర్ల మూసివేతకు రంగం సిద్ధం! తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక కొత్త వివాదం రాజుకుంది. 'పర్సెంటేజ్' (శాతం) విధానంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల గిల్డ్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే, అది కుదరదని నిర్మాతలు తెగేసి చెబుతున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరికి మే 1 నుంచి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పర్సెంటేజ్ విధానం అంటే ఏమిటి? సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'రెంటల్' విధానం అమలులో ఉంటుంది. అంటే సినిమా ఆడినా ఆడకపోయినా నిర్మాత థియేటర్ యజమానికి నిర్ణీత అద్దె చెల్లించాలి. అయితే, ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సెంటేజ్ విధానాన్ని కోరుతోంది. దీని ప్రకారం, మొదటి వారం వసూళ్లలో 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం థియేటర్ యాజమాన్యానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌లోని సుమారు 23 ప్రధాన థియేటర్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఛాంబర్ స్పష్టం చేసింది. నిర్మాతల గిల్డ్ అభ్యంతరం.. ఈ పర్సెంటేజ్ విధానంపై నిర్మాతల గిల్డ్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు భారీగా పర్సెంటేజ్ ఇవ్వడం సాధ్యం కాదని, కేవలం అద్దె విధానం (Rental System) ద్వారానే సినిమాలను ప్రదర్శించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెంటల్ విధానానికి ఒప్పుకునే థియేటర్లకే తమ సినిమాలను ఇస్తామని నిర్మాతలు ఖచ్చితంగా చెబుతున్నారు. దీంతో అటు థియేటర్ల యాజమాన్యాలు, ఇటు నిర్మాతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఫిలిం ఛాంబర్ ఆగ్రహం - లెటర్ వార్! నిర్మాతల గిల్డ్ వైఖరిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తెలుగు ఫిలిం ఛాంబర్‌ను కాదని గిల్డ్ నిర్ణయాలు తీసుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. "నిర్మాతల గిల్డ్ ఎవరు?" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తెలుగు ఫిలిం ఛాంబర్‌కు ఒక లేఖ కూడా రాశారు. ఈ నెలాఖరు (ఏప్రిల్ 30) లోగా ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. మే 1 నుంచి థియేటర్ల మూసివేత? ఒకవేళ ఏప్రిల్ 30 లోగా పర్సెంటేజ్ విధానంపై స్పష్టత రాకపోతే, మే 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. అద్దె విధానం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పర్సెంటేజ్ విధానమే విజయవంతంగా నడుస్తోందని వారు గుర్తు చేస్తున్నారు.  ప్రేక్షకులపై ప్రభావం.. సమ్మర్ సీజన్ కావడం, రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ థియేటర్ల బంద్ వార్త ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ థియేటర్లు మూతపడితే బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరి ఈ వివాదానికి ఏప్రిల్ 30 లోగా ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు.. ఇలా జీవితం ఎంత సాఫీగా గడుస్తోంది అనుకున్నా.. మనిషి లోపల మాత్రం మనసు తృప్తిగా, సంతోషంగా అనుభూతి చెందడం లేదు. చాలామందిలో ఈ గందరగోళం కనిపిస్తూ ఉంటుంది.  ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి రివర్స్ గా.. సంతోషంగా ఉండే వ్యక్తులు మాత్రం జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా అధిగమించగలరు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలరు,  వీరికి జీవితం అసలు కష్టంగా అనిపించదు.  కానీ సంతోషంగా ఉండటం ఎలా.. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం కేవలం నాలుగు అలవాట్ల వల్ల సాధ్యం అవుతుందని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు.  ఆ నాలుగు అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. జాగ్రత్తగా వినడం.. కొంతమంది తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు, ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినగలిగే వ్యక్తులు జీవితంలో ఎన్నో సమస్యలను క్లిష్టతరం కాకుండా,  అసలు సమస్యలుగా మారకుండా ముందుగానే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. తద్వారా జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత సమస్యలు ఏవీ వారికి ఉండవు. పాజిటివ్ మైండ్ సెట్.. సానుకూల భావాలు అంటే పాజిటివ్ మైండ్ సెట్  ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ జీవితాలతో సంతోషంగా ఉంటారు,  వారికి దొరికే ఏ కొద్ది సమయాన్ని అయినా సంతోషంగా గడపడానికి,  ఆ సమయాన్ని మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి, పదిలపరుచుకోవడానికి ఇష్టపడతారు. ఈ విషయాలు క్రమంగా వారిని సంతోషంగా ఉంచుతాయి. ఒత్తిడికి దూరంగా ఉండటం.. సంతోషంగా ఉండే వ్యక్తులకు ఒత్తిడి లేకుండా నిద్రపోవడం  అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు  సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది.  నిద్రపోయేటప్పుడల్లా అస్సలు  ఏ చింతా లేకుండా,  ఏ సమస్య గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నం చేయాలి.  ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. తమ మీద తాము జాలి పడటం.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తులు తమ మీద తాము జాలి పడటం అస్సలు పాటించరు. వారు ఏదో ఒకటి నేర్చుకుని, తప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పులను తాము దాచిపెట్టడం లేదా తమ అసమర్థతను ఒప్పుకోకుండా ఇతరులతో గొడవ పడటం లాంటివి చేయరు.   పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.  ఆ లక్షణాలు వ్యక్తులను సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి,  సహాయపడతాయి కూడా.                                          *రూపశ్రీ  
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే... గొప్ప వ్యక్తులలో ఉండే అతిగొప్ప లక్షణం తక్కువ మాట్లాడటం.  తక్కువ మాట్లాడేవాడు తన చేతల్లోనే తన విజయాన్ని చూపిస్తాడు అని తరచుగా చెబుతూ ఉంటారు కూడా. ఇతరుల కంటే తక్కువ మాట్లాడేవారే ఎక్కువ తెలివైనవారని, జ్ఞానులని ఎందుకు అంటారు? తక్కువ మాట్లాడేవారు ఎందుకు ప్రత్యేకమైనవారిగా పరిగణించబడతారు? తక్కువ మాట్లాడటం అనేది గొప్ప లక్షణంగా ఎందుకు పరిగణించబడుతుంది? వివరంగా తెలుసుకుంటే.. తక్కువ మాట్లాడితే మాట విలువ పెరుగుతుంది.. ఎప్పుడూ  మాట్లాడుతూ ఉండే వ్యక్తులపై  చుట్టూ ఉన్నవారు  శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారట.చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి మాట్లాడినా కూడా ప్రజలు శ్రద్ధగా వింటారు. తక్కువ మాట్లాడటం వల్ల  వ్యక్తి మాటలకు విలువ పెరిగి, సమాజంలో వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఆలోచనా శక్తి.. తక్కువ మాట్లాడేవారు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు స్పందించడానికి తొందరపడరు.  ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే  వారు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటాయి.   సమాజం కూడా ఇలా తక్కువ మాట్లాడే వారికి చాలా తెలివైన వారు అని చెబుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం..  తక్కువ మాట్లాడేవారు ఆర్భాటాలు చేయరు. వారికి తమపై పూర్తి విశ్వాసం ఉంటుంది, కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి  పనికిమాలిన మాటలు మాట్లాడరు. ఇలా  నిశ్శబ్దంగా ఉండే స్వభావమే వారి నిజమైన బలం అవుతుందని చాణక్యుడు అంటాడు.  తక్కువ మాట్లాడినప్పుడు వారిలో ఎన్నో విషయాలు వారిలోనే రహస్యంగా ఉండిపోతాయి. అదే ఎప్పుడూ మాట్లాడేవారు ఏ చిన్న సంఘటన జరిగినా బయటకు చెప్పేసుకుంటారు. దీని వల్ల వారికి విలువ, గౌరవం తగ్గిపోతుంది. అర్థం చేసుకునే అవకాశం.. తక్కువ మాట్లాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఇతరుల మాటలను వినడానికి  అవకాశం లభించడం. ఇతరులు చెప్పేది బాగా వినగలిగే వ్యక్తి మాత్రమే  ఇతరుల బలహీనతలను, అవసరాలను అర్థం చేసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. మౌనంగా ఉండి ఇతరుల మాటలను విన్నప్పుడు, వారి ఆలోచనలపై  ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి,  విజయం సాధించడానికి అత్యంత కీలకం అవుతుంది.                                 *రూపశ్రీ.
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం? శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్య.. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. పాలకూర.. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది. బీట్‌రూట్ .. బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆకుకూర సలాడ్లు.. ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి.  ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు.  ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. మెంతులు.. మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కాలీఫ్లవర్.. క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.                      *రూపశ్రీ.
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు.  ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు.  కొబ్బరి నీరు,  మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే.. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది.  తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది.  అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది. మజ్జిగ.. మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ ,  ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే  శరీరం  చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేడా.. కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?  డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది.  శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి,  వేర్వేరుగా ఉపయోగపడతాయి.                              *రూపశ్రీ.
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.   వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్షలా కాపాడతాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రయాణాలు.. వేసవి కాలంలో చేసే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధిక వేడిమితో డీహైడ్రేషన్ గురికాకుండా తరచూ మంచినీరు,ఓఆరెస్,పల్చటి మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు  ఉదయం చాలా తొందరగా,  లేదా సాయంత్రం ఎండ వేడిమి చాలా వరకు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లడం.. వేసవి కాలంలో సాధారణంగా మిగతా రోజుల్లా పనుల కోసం బయటకు వెళ్ళే విధానాన్ని తగ్గించుకోవాలి. వేసవి కాలంలో పనుల షెడ్యుల్.. బయటకు వెళ్ళి చక్కబెట్టుకోవాల్సిన పనుల ప్రణాళికలు మార్చుకోవాలి.  తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే.. వెంట వాటర్ బాటిల్,  గొడుగు ఉండేలా చూసుకోవాలి. కాలి నడకన లేదా బైక్ లో వెళ్లడం కంటే ఆటో వంటి వాహనాలలో బయటకు వెళ్లి రావడం చాలా మంచిది. ఆహార, పానీయాలు.. వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి  నీటి శాతాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి.  ఆహారంలో కారం, ఉప్పు,  నూనె వంటివి బాగా తగ్గించాలి. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు,  పండ్లు విరివిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తొందర పాటులో చాలా చల్లగా ఉన్న ఫ్రిజ్ లోని నీరు తాగడం  మానుకోవాలి.  బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కుండలోని నీరు లేదా పల్చగా మజ్జిగ,  సుగంద షర్బత్ వంటివి తాగవచ్చు. ఇవి శరీరానికి ఊరట ఇస్తాయి.  వేసవి తాపం తీరుస్తాయి. హెల్త్ కేర్..   వేసవి ఎండల కారణంగా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్స పొందాలి. అక్కడ ఓఆర్ లేదా ఎలక్ట్రోలైట్స్ ను అందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవడం లేదా నీడ పట్టున పనులు చేసుకోవడం మంచిది.   సేవ.. వేసవికాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా.. నలుగురి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం కనీస మానవత్వం.  వేసవిలో ప్రయాణాలు చేసేవారు.. దారి వెంట వెళ్లే బాటసారులు ఉంటారు. అలాంటి వారి కోసం.. మంచి నీరు ఏర్పాటు చేయడం,  అక్కడక్కడా కూర్చోవడానికి కాసింత చోటు ఇవ్వడం వంటివి కూడా చేయాలి. ఇవి కనీస మానవ ధర్మం కూడా. అయితే.. ఏ పని చేసినా ప్రమాదాలు మీదకు తెచ్చుకోకుండా చేయడమే మంచిది.                               *రూపశ్రీ.