వర్షాకాలంలో కొబ్బరినీరు తాగవచ్చా? వైద్యులేం చెప్పారంటే..!
వేసవిలో విపరీతమైన దాహం అనిపించినప్పుడు కొబ్బరి నీరు అమృతంలా అనిపిస్తుంది. కేవలం వేసవిలోనే కాదు.. కొబ్బరి నీరు ప్రతి సీజన్‌లో శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పుష్కలంగా పోషణను అందిస్తుంది. శరీరంలో నీటి లోపాన్ని తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా చర్మానికి కూడా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో, వైద్యులు ఏం చెప్పారో తెలుసుకుంటే.. ఎండాకాలం అయినా, చలికాలం, వర్షాకాలం అయినా కొబ్బరి నీళ్ళు త్రాగవచ్చు. ఇందులో ఉండే అనేక ఖనిజాలు, విటమిన్లు శరీరానికి మేలు చేస్తాయి. అందుకే కొబ్బరి నీళ్లను నిర్ణీత పరిమాణంలో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనితో పాటు వర్షాకాలంలో బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. మరోవైపు కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించి కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కొబ్బరి నీరు సహాయం చేస్తుంది. అయితే తాజా కొబ్బరి నీళ్లను మాత్రమే తాగాలని గుర్తుంచుకోవాలి. పాత లేదా నిల్వ చేసిన కొబ్బరి నీరు హాని చేస్తుంది. వర్షాకాలంలో కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యం క్షీణించవచ్చు. వాస్తవానికి, కొబ్బరి నీటిలో చాలా సోడియం ఉంటుంది. వర్షాకాలంలో సోడియం ఎక్కువగా తీసుకుంటే అది ఉబ్బరం, రక్తపోటు వంటి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల వర్షాకాలంలో కొబ్బరి నీళ్లను తీసుకోవడం సురక్షితమే అయినా మితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు, కొంతమందికి కొబ్బరి నీళ్లతో అలెర్జీ సమస్యలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో దీన్ని తీసుకుంటే శరీరంలో వాపు, పిత్తం, దురద వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. *రూపశ్రీ.
read moreవర్షాకాలంలో దగ్గు, జలుబును ఇలా తగ్గించేయచ్చు..!
వాతావరణం మారితే అది ఆరోగ్యంపై ప్రభావం చూపడానికి ఎక్కువ సమయం పట్టదు. వర్షాకాలం ప్రారంభమైన నేపధ్యంలో దగ్గు, జలుబు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజనల్ సమస్యలు సాధారణంగా రెండు మూడు రోజులలో తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇవి అంత సులువుగా తగ్గవు. వీటిని తగ్గించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు. ఇవి చాలా వేగంగా దగ్గు, జలుబు నుండి రిలీఫ్ ఇస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. తేనె.. జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు ఉదయం, సాయంత్రం తేనెను వెచ్చ చేసి తింటే సమస్య నుంచి బయటపడవచ్చు. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది జలుబు, దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తేనెను కొద్దిగా వేడి చేసి తీసుకోవాలి. అయితే ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు. వెల్లుల్లి.. యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. వెల్లుల్లిని పచ్చిగా లేదా తేలికగా కాల్చి తింటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది దగ్గు, జలుబు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. పసుపు.. పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. సీజనల్ సమస్యల నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు నీటిని తయారు చేసి త్రాగవచ్చు లేదా పసుపు టీ లేదా పసుపు పాలు తాగడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. తులసి.. తులసి ఆకులను వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. తులసి ఆకులతో చేసిన టీ తాగడం వల్ల దగ్గు, జలుబు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల్లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి దగ్గును నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఉప్పు నీరు.. ఉప్పు నీరు గొంతును శుభ్రపరచడంలో.. దగ్గు, జలుబు నుండి ఉపశమనాన్ని అందించడంలో ప్రభావవంతంగా ఉంటాయి . ఉప్పునీరు గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఈ నీటిని తాగాల్సిన అవసరం లేదు ఈ నీటితో పుక్కిలిస్తే సరిపోతుంది. ఉప్పు నీళ్లతో పుక్కిలిస్తే గొంతు క్లియర్ అవుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి ఆ నీటితో పుక్కిలించాలి. *రూపశ్రీ.
read moreమహిళల గుండెకు ముప్పు పొంచి ఉందా ?
పురుషుల కన్నా మహిళల్లో నే గుండెపోటు సమస్యతో మరనిస్తున్నారు .సహజంగా స్త్రీలకు ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద చూపరు. ఎచిన్న సమస్యకైన మళ్ళీ వస్తే చూద్ద్దాం అన్న ధోరణిలో ఉంటారు.అదే వారి పాలిట శాపం గా మారుతుంది ఒక కేసు విష యం లో రోగి పరిస్థితి చూసిన డాక్టర్ చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ ఇన్ని రోజుల నుండి రాకుండా ఏమి చేసారు. ఇప్పుడు చూడండి 7౦% బ్లాక్స్ ఏర్పడ్డాయి.కోపంగా మందలించారు.చెమట పడుతుంటే వేడి ఎక్కువగా ఉంది కదా అని అనుకున్నా మెట్లు ఎక్కు తుంటే ఆయాసం వస్తుంటే పనెక్కువ అయ్యిందని అందుకే అలసట వచ్చిందని అనుకున్నా. గుండె నొప్పి నాకు ఎందుకు వస్తుంది? అని సరి పెట్టుకున్నా కాని ఇలా జరుగుతుందని అనుకోలేదు. అని అన్నది ఆమె.కన్న బిడ్డకు చిన్న జలుబు చేసినా కంగారు పడిపోతారు.భర్తకు చిన్న జ్వరం వచ్చినా హడావిడి చేస్తారు. ఇంట్లో ఎవరికీ ఏం జరిగినా కంగారు పది పోయే డి ఆ ఇంటి మహాలక్ష్ములే. అదే మహిళలు తమ అనారోగ్య గురించి మాత్రం పట్టించుకోరు అందుకు చాలా సందర్భాలాలో జబ్బు బాగా ముదిరి పోయే దాకా చికిత్సకు వెళ్లరు. ఇక గుండె జబ్బు విషయానికి వస్తే అదేదో మగ వాళ్ళకు మాత్రమే వచ్చే జబ్బుగా అనుకుంటారు. గుండె జబ్బుకు స్త్రీలు, పురుషులు అన్న పక్ష పాతం ఉండదు. ఆ కులము ఈ కులము అన్న వివక్ష ఉండదు. ఈ మతము ఆమతము అన్న పక్ష పాత ధోరణి గుండెకు ఉండదు. ఎవరు అన్నారు గుండె జబ్బులు పురుషులకు మాత్రమే వచ్చే వని స్త్రీలకు భావోద్వేగాల ను భరించే శక్తి సహనం ఎక్కువే. ఓర్పు ఒర్చుకోవడం స్త్రీ ల ప్రవృత్తి. అందుకే ఆమె గుండె గట్టిది. అంటూ ఉంటారు. అందుకే మన వాళ్ళు ఆడవాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవని ఉన్నా అతి తక్కువే అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం గా చెప్పవచ్చు. నిజానికి పురుదులతో పాటు సమానం గా మహిళలలో కూడా గుండె జబ్బుల అవకాశం ఎక్కువే సాధారణంగా మహిళలలో క్యాన్సర్ బాధితులు అదీ రోమ్ముక్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ,ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది వాస్తవమే అయినప్పటికీ క్యాన్సర్ల కన్నా గుందేజబ్బుల వల్ల మరణించిన వాళ్ళే ఎక్కువ అని ఒక అద్యయనం లోతేలింది. స్త్రీలను వేదించే సమస్యలలో క్యాన్సర్ కన్నా 6 వంతులు ఎక్కువ అవకాశం గుండె పోటు కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.ముఖ్యంగా స్త్రీలు ౩౦ సంవత్సరాలు దాటగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించి క్యాన్సర్ స్క్రీనింగ్ కు వెళుతూ ఉంటారు.అయితే పనిలో అనిగా గుండెకు సంబందించిన పరీక్షలు చేయించుకోడం లో మాత్రం ఎందుకో తాత్సారం చేస్తారు. తమ గుండె గట్టిదనే నమ్మకం తో ధీమా తో ఉంటారు.విద్యా వంతులైన మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండడం అంత క్షేమం కాదు. గుండె పోటు మహిళ్ళలో రావడానికి కారణాలు... గుండె పోటు అంటే అది మగవాళ్ళకు మాత్రమే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు అపోలో ఆసుపత్రికి చెందినా ప్రముఖ హృద్రోగ నిపుణులుడాక్టర్ ఎ శ్రీనివాస్. ఇప్పటికే చాలా మందిలో అదే ఆపోహ కలిగి ఉండడం విచారకరం అనారు వైద్య నిపుణులు.చాతిలో నొప్పి అని అనిపించినా అది గ్యాస్ నొప్పో,మరేదైనా నొప్పి గా భావిస్తారు. తప్ప గుండె నొప్పిగా అనుమానించరు. ఆడవాళ్ళలో గుండేనొప్పి తక్కువ కాబట్టి నాకు గుండె జబ్బు రావడం ఏమిటి నాకు అస్సలు గుండె నొప్పి వచ్చే అవకాశం లేదని విశ్వాశం తో ఉంటారు స్త్రీలు. స్త్రీలకూ గుండె జబ్బు ఉండనే విషయాన్ని గుర్తించడం లో మిస్ అవుతూ ఉంటారు .ముఖ్యంగా స్త్రీలు మెనోపాజ్ తరువాత మరణిస్తున్న మహిళల లో ప్రాధాన కారణం గుండె పోటే అయి ఉంటుంది.సాధారణంగా మెనోపాజ్ దశలో ఊపిరాడక పోవడం,బలహీనం గా ఉండడం, గుండె దడ నీరసం, లాంటివి ఎక్కువగా ఉంటాయి. స్త్రీలలో గుండె సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి చాలా మంది వీటిని గుర్తించలేరు అని అంటారు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్.దాదాపు మెనోపాజ్ లో ఉండే సమస్యలే కదా అని అనుకుంటారు. అందుకే చాలా సందర్భాలలో తమకు గుండె జబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించలేక పోతారు.కొన్ని సార్లు స్త్రీలలో వచ్చే ఆయాసాన్ని ఆస్తమాగా పోప్రబడతారు. లేదా నీరసం గా ఉన్నాం కదా అందుకే ఆయాసం గా ఉందేమో అనుకుంటారు.చాలా సంఫర్భాలలో మహిళలు గుండె నొప్పిని గుర్తించక పోవడానికి ఇదే కారణం. అయితే గుండె నొప్పి లక్షణాలు కూడా మహిళ ల్లో వేరు వేరు గా ఉంటాయి అని శ్రీనివాస్ విశ్లేషించారు.సాధారణ గుండేనొప్పి లాగా నొప్పి పాకుతూ ఉంటుంది. సాంప్రదాయిక గుండె నొప్పి లక్షణాలు ఏవి ఉండక పోవచ్చు. ఆయాసం గా ఉండడం, చమట పట్టడం వంటి లక్షణాలు గుండె నొప్పి అన్న విషయాన్ని కలిగించవు. నీరసం,బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు అన్న అనుమానాన్ని కలిగించవు. నీరసం బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు లక్షనమం గానే బహిర్గతం అవుతాయి కాని అవి సాధారణ అనారోగ్యపు లక్షణాలుగా పర్గానించడం వల్ల ఒక్కోసారి గుండె జబ్బును కనిపెట్టడం మిస్ అవుతారు.ఇలాంటి సమయం లో చిన్న బ్లాక్ ఉన్నా అది హటాత్తుగా విచ్చినం చెందవచ్చు. దాంతో అకస్మాతుగా గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఫలితం గా ప్రాణాల మీదకు వస్తుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలా అకాస్మాతుగా గుండె పోటుకు గురి అయ్యే అవకాశాలు ఉండవు. అందుకే మెనో పాజ్ దశలో లక్షణాల లో అశ్రద్ధ చేయవద్దని 4౦ ఏళ్ళు దాటినా గుండెకు సంబందించిన అన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయిన్చుకోవాలి.అవగాహన ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కోసం పాప్‌స్మియర్ టెస్ట్ లు మమ్మో గ్రామ్ మామో గ్రఫీ, చేయించు కోవడం లేదు. చాలా మందికి మొదటి సారి గుండెపోటు రావడమే ప్రాణా పాయానికి దారి తీస్తుంది. పరీక్షల్లోనూ వేరుగా ఉంటాయి... సాధారణ లక్షనాలాతో గుండె జబ్బును కనిపెట్టడం కష్టం. కాబట్టి మహిళ ల్లో డయాగ్నిస్టిక్ పరీక్షలు కీలకం అవుతాయి. కొన్ని సార్లు ఈ పరీక్షలలో కూడా గుండె జబ్బు ఉన్నా లేనట్లుగా తేలే అవకాశాలు లేకపోలేదు. అందు వల్ల మహిళలు గుండెజబ్బు గుర్తించడం లో వైద్యుల నైపుణ్యం తో పాటు అన్ని రకాల పరీక్షలు ప్రాధాన పాత్ర వహిస్తాయని వాటి అన్నిటి సమీకృత ఫలితాలను బట్టే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.నిపుణులైన డాక్టర్లు మాత్రమే కేస్ హిస్టరీ ని బట్టి పరీక్షలు చేయిస్తారు. ఈ పరీక్షలలో ముఖ్యంగా ఇ సి జి ఎకో పరీక్షలు మార్పులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి .ఒక్కోసారి టి ఎం టి పరీక్ష కూడా తప్పుగా చూపించ వచ్చు. జబ్బు ఉన్న లేదని లేకున్నా ఉందని రావొచ్చు. కాబట్టి ఒకే పరీక్ష ఆధారం గా చెప్పలేము. ఈ పరీక్ష లన్నిటికీ బెరేజు వేసుకుని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది.ఆంజియో గ్రామ్ లో కూడా మహిళల డి ప్రత్యేకతే. పురుషులకన్న మహిళల శరీర నిర్మాణం చిన్నదిగా ఉంటుంది. అదే విధంగా రక్త నాళాలు సైతం చిన్నవిగా ఉంటాయి. అన్జియో గ్రామ్ చేసేటపుడు ఉపయోగించే చేయి లేదా కాలి రక్త నాళాలు కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి అన్జియో గ్రామ్ చాలా జాగ్రతగా చేయాలి. నైపుణ్యం లేకుండా అన్జియోగ్రామ్ చేస్తే సరైన ఫలితాలు రావు.మహిళ ల్లో గుండె రిస్క్ ఎక్కువ... కొలస్ట్రాల్ పేరుకుపోయి అదేరో స్క్లిరో సిస్ రావడం సర్వ సాధారణం కాని మహిళలలో రక్త నాళాలు స్పాసమ్ అంటారు రక్త నాళాలు పట్టేసినట్లు. అయిపోవడంవల్ల కుంచించుకు పోతాయి.తద్వారా రక్త ప్రసరణ కష్టం అవుతుంది. రక్త నాళాలు పెద్దవైతే జబ్బు మొదలై నప్పటికీ రక్తం ప్రసరించడానికి ఇంకా చోటు ఉంటుంది. కాబట్టి అడ్డంకి పెద్దది అయ్యే వరకూ జబ్బు ముదరదు. కాని రక్త నాళం చిన్నదిగా ఉండడం వల్ల చిన్న అడ్డకి ఏర్పడినా సమస్య ఎక్కువ అవుతుంది. అందు వల్ల ఒకే సైజు బ్లాక్ పురుషులలో అద్దంకి కాక పోయినా మహిళలలో మాత్రం పెద్ద సమాస్య అయి కూర్చుంటుంది. మహిళల లోనే రిస్క్ ఎక్కువ. పురుషుల కన్నా మహిళల్లో రక్త నాళాల పరిణామం చిన్నదిగా ఉండడం వల్ల చికిత్స విధానం లో కూడా వేరుగా ఉండడం వెర్రిలో రక్త నాళాలు మూసుకు పోయే అవకాశం చిన్న సైజు స్టెంట్ వాడాల్సి ఉంటుంది. పెద్ద రక్త నాళాలలో మళ్ళీ అడ్డంకులు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది.చిన్న రక్త నాళాలు ఉన్నప్పుడు స్తేన్టింగ్ సరిగా చేయకుండా మళ్ళీ క్లోత్స్ రక్తం గడ్డ కట్టే అవకాశం లేదా అడ్డాకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రక్త నళాలలో అడ్డంకులు ఏమేరకు ఉన్నాయో తెలుసుకోడానికి వాడే పరికరాలు కూడా మరింత ఆధునిక సంతరించుకుని అందుబాటులోకి వచ్చాయి ఇంట్రా వాస్క్యులార్ అల్ట్రా సౌండ్ ఆప్టికల్ కోహారెన్స్ టమో గ్రఫీ ద్వారా చికిత్సకు ముందు తరువాత అడ్డంకులు ఎలా ఉన్నాయి అన్నది పరిశీలిస్తారు. అయితే ఆధునిక పరిజ్ఞానం తో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడం కూడా ప్రాధాన అంశం. గుండెపోటు వస్తే... మహిళల లో కూడా మరణాల రేటు ఎక్కువ మగ వాళ్ళ కన్నా మూడు వంతులు ఎక్కువ సాధారణ మొదటి సారి గుండెపోటు వచ్చిన తరువాత చికిత్సచికిత్స చేయించు కోకుంటే పురుషులలో 2౦% రిస్క్ ఉంటె మహిళ లలో 5౦% రిస్క్ ఉంటుంది. రక్త నాళాలు చిన్న సైజువి కాబట్టి బైపాస్ లో కూడా రిస్క్ ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి స్టెంట్ సరిగా పెట్టక పోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. సమర్దులైన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోక పోతే పంపింగ్ సామర్ధ్యంభయపడాల్సిన అవసరం లేదు.జబ్బు ఉందన్న విషయాన్ని సకాలం లో గ్రహించకుండా తెలిసి నిర్లక్ష్యం చేసినా ఎటువంటి చేయించుకోక పోతే గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఇటీవలే అందు బాటులోకి వచ్చిన బై వెంట్రీ క్యులర్ పెసింగ్ అన్న విధానం సత్ఫలితాలు ఇస్తుంది. గుండె పంపింగ్ సా మర్ధ్యం పెరగడం కోసం ఇక మరో దారి లేదనుకున్నప్పుడు దీనిని వాడతారు. నివారణా ఉపాయాలు... సమస్య ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లో మందులు జాగ్రత్తగా వాడుకుంటే గుండె జబ్బును అదిగా మించ వచ్చు.అయితే నివారణ అన్నది అన్నిటికన్నా ఉత్తమం.గుండెను కాపాడు కోవాలంటే ప్రధానంగా జీవన శైలి లో మార్పులు చేసుకోవడం అవసరం.ఒత్తిడి తగ్గించుకునే ప్రయాత్నం చేయాలి దైనందిన వైవాహిక జీవితం లో సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ చేసుకోవాలి.బిపి షుగర్ కొలస్ట్రాల్ రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒక వేళ ఈ సమస్యలు వచ్చినా అదుపులో ఉంచుకోడానికి డాక్టర్ సలహా మేరకు తప్పని సరిగా సలహా తీసుకోవాలి.సూచించిన విధంగా మందులు వాడుకోవాలి.స్థూల కాయం మధుమేహం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.
read moreసంపూర్ణ పోషణ కావాలంటే ఈ మూడు రకాల సీడ్స్ తింటే చాలు..!
ఆహారపు అలవాట్లు మంచిగా ఉంటే శరీరానికి తీసుకునే ఆహారం ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే మాంసకృత్తులు, విటమిన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకుంటారు. దీని కోసం ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు వినియోగిస్తారు. కానీ ఆహారంలో సీడ్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని విత్తనాలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి ఒకటి కంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మూడు రకాల విత్తనాలు ఆరోగ్యానికి ఒకటి కాకుండా అనేక పోషకాలను అందించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలలో మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాల బయటి పొర నుండి లభించే ఫైబర్ జీర్ణం కావడం కష్టం. అందుకే ఈ విత్తనాలను తినడానికి ఉత్తమ మార్గం వాటిని పొడి రూపంలో తీసుకోవాలి లేదా వాటిని తాజాగా మెత్తగా, సలాడ్ టాపింగ్స్‌గా తినాలి. ఈ విత్తనాలు శోథ నిరోధక, ప్రేగు కదలికలను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మలబద్ధకం లేదా అతిసారం, ఏదైనా కడుపు సంబంధిత సమస్య ఉంటే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పిసిఒఎస్ సమస్య ఉన్నవారు కూడా అవిసె గింజలను తీసుకోవచ్చు. నువ్వులు.. ఒక గ్లాసు పాల కంటే కొన్ని నువ్వుల గింజల నుండి కాల్షియం ఎక్కువ లభిస్తుంది. రుతుక్రమం ఆగిన స్త్రీలు మూడ్ స్వింగ్స్ లేదా హార్మోన్ల సమస్యలు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. నువ్వులను 5 వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హార్మోన్ల ప్రొఫైల్ మెరుగుపడుతుంది. ఈ గింజలు యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. గుమ్మడికాయ గింజలు.. గుమ్మడి గింజలు స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ నిద్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. గుమ్మడికాయ గింజల్లో మంచి మొత్తంలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఎలాంటి సెల్యులార్ డ్యామేజ్‌ను అయినా తొలగిస్తాయి. *రూపశ్రీ.
read moreఆలివ్స్ ఎప్పుడైనా తిన్నారా? వీటిని తింటే కలిగే లాభాలు ఇవే..!
సలాడ్లు, సీసనింగ్ లో చాలావరకు ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. ఆలివ్ అంత గొప్పదని అర్థం. కేవలం ఆలివ్ నూనె మాత్రమే కాదు.. ఆలివ్స్ తినడం వల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆలివ్స్ ఆరోగ్యానికి ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. అయితే ఆలివ్స్ తింటే కలిగే లాభాలేంటో ఒక్కసారి చూడాల్సిందే.. గుండె ఆరోగ్యం.. ఆలివ్ లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ముఖ్యంగా ఒలేయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఈ కారణంగా ఆలివ్ తీసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అంతేకాదు ఇవి మంచి కొవ్వులను పెంచడం ద్వారా చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ లో ఉండే ఫాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలు కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఇ, హైడ్రాక్సీటైరోసోల్, ఒలీరోపిన్‌లతో సహా బోలెడు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలోనూ, ప్రీరాడికల్స్ తో పోరాడటంలోనూ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. శరీరంలో కణాల ఆరోగ్యాన్ని ఇవి పర్యవేక్షిస్తాయి. పేగు ఆరోగ్యం.. ఆలివ్ లో ఉండే పోషక విలువలు పేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దకాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి. ఆలివ్ లు ప్రోబయోటిక్ లను కలిగి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. చర్మానికి మంచిది.. ఆలివ్ లు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంమీద దాడి చేసే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను ఇస్తాయి. చర్మాన్ని రిపేర్ చేసి కాంతివంతంగా మారుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. బరువు.. బరువు తగ్గడంలో ఆలివ్స్ సహాయపడతాయి. ఆలివ్ లలో ఉండే మోనోఅన్శాచ్యురేటెడ్ కొవ్వులు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. అదే విధంగా ఆలివ్స్ లో ఉండే ఫైబర్ కూడా ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు ఆలివ్స్ ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. *నిశ్శబ్ద.
read moreషుగర్ పేషంట్లు ఈ కూరగాలయను డైట్లో చేర్చుకోవాలి.!!
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి పెరగడానికి అతి పెద్ద కారణం తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ ఆహారం, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే, మీరు ఈ వ్యాధిని నివారించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచే అనేక ఆహారాలు ఉన్నాయి. డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కూరగాయల గురించి మనం తెలుసుకుందాం. కాకరకాయ: కాకరకాయ రుచి ఎంత చేదుగా ఉంటుందో మనందరికీ తెలుసు, కానీ ఈ కూరగాయ మధుమేహ రోగులకు వరం లాంటిది. పాలీపెప్టైడ్-పి అనే సమ్మేళనం ఇందులో ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీ: మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో విటమిన్ కె, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ముల్లంగి: ముల్లంగి, పోషకాలు సమృద్ధిగా, మధుమేహ రోగులకు చాలా ప్రభావవంతంగా నిరూపించవచ్చు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఈ రూట్ వెజిటబుల్ చాలా సహాయపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగపడుతుంది. ఆకుకూరలు: ఆకు కూరలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో బచ్చలికూర మధుమేహ రోగులకు ఉత్తమ ఎంపిక. విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, అనేక విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పొట్లకాయ: పొట్లకాయ ఆరోగ్యానికి నిధి. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. మీరు డయాబెటిస్తో బాధపడుతున్నట్లయితే, మీ ఆహారంలో పొట్లకాయను ఖచ్చితంగా చేర్చుకోండి.
read moreసపోటా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
తియ్యగా ఉండే సపోటా పండును తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సపోటలో అధిక క్యాలరీలు ఉంటాయి. దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీంట్లో ఉండే గుజ్జు తేలికగా జీర్ణం అవుతుంది. పిల్లలకు జ్యూస్, మిల్క్ షేక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి చూద్దాం. మలబద్ధకం నుండి ఉపశమనం: సపోటా పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తద్వారా పేగు భాగాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు ఇది పనిచేస్తుంది.పేగు భాగంలో మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇది మీకు సులభంగా ప్రేగు కదలికను కలిగి ఉండటానికి, మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. శోథ నిరోధక లక్షణాలు: సపోటా పండ్లలో టానిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.అందువలన ఇది మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్, గ్యాస్ట్రిక్ సమస్యను తొలగిస్తుంది. మంట,నొప్పి నుండి ఉపశమనం కూడా సపోటా పండుతో సాధ్యమవుతుంది. చర్మం, జుట్టుకు : సపోటా పండ్ల రసం మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు జుట్టును బాగా ఎదిగేలా చేస్తుంది. చాలా మందికి జుట్టు రాలే సమస్యను సరిచేస్తుంది. సపోటా పండులో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్లు శిరోజాలను, చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌పై ప్రభావం చూపుతాయి చర్మంపై, మరియు గీతల రూపాన్ని కూడా తగ్గిస్తాయి. రక్తపోటు నిర్వహణ: సపోటా పండులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. అదనంగా, ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరం మనల్ని మన సొంతం చేస్తుంది. క్యాన్సర్ నుండి రక్షణ: సపోటా పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంతే కాకుండా సపోటా పండులో విటమిన్ ఎ, విటమిన్ బి కూడా లభిస్తాయి, ఇది మన చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకలు: ఇందులో కాల్షియం, ఫాస్పరస్‌తో పాటు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే సపోటా పండులో ఉండే ఈ మూలకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఎముకలు బలహీనపడకుండా నిరోధిస్తాయి.
read moreఆర్గానిక ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...!
ఇటీవలి కాలంలో ఆర్గానిక్ ఆహార పదార్థాలకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. అసలు ఆర్గానిక్ ఫుడ్ కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ.. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటీ..? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=lsQH29XE2iI
read moreఒంటె పాలతో ఎన్ని లాభాలో!!
జూన్ లో ప్రపంచ పాల దినోత్డవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం మీకోసం .ఒంటె పాలు రోజుకి ఒక్కసారి తాగిచూడండి.రోజూ తాగితే మీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.ఆరోగ్యానికి పాలు చాలా లాభదాయకం మీరు చిన్నప్పటి నుంచి వింటూ ఉండచ్చు.పల వల్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని. రోజూమీఆహారం లో పాలు చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.మీకు,ఆవు,గేదె,మేక,గాడిద పాల గురించి మాత్రమే తెలుసు.వీటిగురించి మీరు వినే ఉంటారు.కాని మీరు ఒంటె పాలు ఆరోగ్యానికి మంచిదని విన్నారా. మీరు విని ఉండనట్లై తే మీకు చెప్పల్సిదే.ఒంటె పాలు చాలా రకాల రోగాలను నివారించడం లో లాభదాయకం గా ఉంటుంది.శరీరం లో రోగనిరోదక శక్తి పెంచే మెదడుచురుకుగా పనిచేయాలంటే ఒంటె పాల లాభాల గురించి తెలుసుకుందాం. సంక్రమణం నుండి రక్షణ... ఒంటె పాలలో విటమిన్లు ఖనిజ లవణాలు,పుష్కలంగా ఉంటాయి.ఇందులో యాంటీ బాడీలు ఉంటాయి.వైరస్ సంక్రమించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.గ్యాస్టిక్,క్యాన్సర్,వంటి సమస్యను నిలువరించేందుకు సహాయ పడుతుంది. ఎముకలు గట్టిపడతాయి... ఒంటె పాలలో కాల్షియం అధిక సంఖ్యలో ఉండడం గమనించవచ్చు.ఎముకల ను పరిచే పని చేస్తుంది.ఒంటె పాలలో ఫ్యాక్టో ఫెలిన్ అనే గుణాలు ఉన్నట్లు గుర్తించారు.క్యాన్సర్ తో పోరాడే శక్తి మనకు లభిస్తుంది.ఒంటె పాలు రక్తం లో ఉన్న టాక్సిన్ ను బయటికి పంపిస్తుంది.లివర్ ను శుభ్రం చేస్తుంది.ఒకవేళ పొట్టకు సంబందించిన సమస్యలతో బాధ పడుతుంటే ఒంటె పాలు లాభ దాయకమని అంటున్నారు నిపుణులు. డయాబెటిస్ రోగులకు ఒంటె పాలు వరం... డయాబెటిస్ రోగులకు ఒంటె పాలు రామబాణం లా పనిచేస్తుందని.ఒకలీటరు ఒంటె పాలు 82 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.అది మధు మెహ రోగులకు లాభదాయకం కాగలదని నిపుణులు భావిస్తున్నారు. మెదసును చురుకుగా ఉంచుతుంది... ఎవరైతే పిల్లలు నియమిత పద్దతిలో ఒంటె పాలు సేవిస్తారో.వారి మెదడు ఇతర పిల్లల కన్నా అన్నిరకాలుగా చురుకుగా బలంగా ఉంటుంది.ఒంటె పాలు తాగిన వాళ్ళలో పోషక ఆహారం ఉన్న వారు బయట పడతారు. పచెంద్రియాలకు లాభం... ఒంటె పాలు తీయడం చాలా కష్టం.ఒంటె పాలాలో కాల్షియం ప్రోటీన్ తో పాటు, కార్బోహైడ్రేడ్స్, చక్కర,పీచుపదార్ధం,ఐరన్,మెగ్నీషియం,విటమిన్ సి,లాక్తర్,ఆమ్లం,సోడియం,పాస్ఫరస్,పొటాషియం,జింక్,కామ్ప్ర్,మాంగనీస్,లాంటి పోషక తత్వాలు.గ్రహించవచ్చు. చర్మ సంబంధిత సమస్యల ను దూరం చేస్తుంది... ఒంటె పాలు రోగాలు తగ్గిస్తుంది.శరీరానికి లాభాలను చేకూరుస్తుంది.చర్మ సౌందర్యానికి,వాల్ఫా హైడ్రో క్విల్ ఆమ్లం గుర్తించ వచ్చు.అది చర్మానికి కాంతి నిస్తుంది.
read moreవర్షాకాలంలో ఒక్క జబ్బు రాకూడదంటే.. ఈ ఆయుర్వేద మూలికలు తీసుకోండి..!
దేశంలో పలు ప్రాంతాలలో వర్షాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఈ వర్షాల కారణంగా ఇన్ఫెక్షన్లు కూడా వ్యాపిస్తున్నట్టు వార్తల సమాచారం. ఈ వర్షాల కారణంగా ప్రతి ప్రాంతంలోనూ ఆరోగ్య సమస్యలు రావడం సాధారణం. వీటిలో ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చర్మ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు ఎక్కువగా ఉంటాయి. అయితే రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లను అయినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వర్షాకాలంలో ఒక్క జబ్బు రాకూడదంటే తీసుకోవాల్సిన ఆయుర్వేద మూలికలు కొన్ని ఉన్నాయి. అల్లం.. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యల వరకు అన్నింటిలో అల్లం మేలు చేస్తుంది. వర్షాకాలంలో ప్రతిరోజూ అల్లం టీ తాగడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. పసుపు.. ఔషధ గుణాలను మెండుగా కలిగి ఉన్న పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శరీరంలో వాపు ఉంటే పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అతిమధురం.. దగ్గు, జలుబు, గొంతునొప్పి వర్షాకాలంలో ఇబ్బంది పెడతాయి. దీనికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన అతిమధురం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని టీగా లేదా డికాషన్ రూపంలో తీసుకోవచ్చు. తులసి.. తులసి ఆయుర్వేదంలో చాలా ప్రభావవంతమైన ఔషధ మూలిక. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగవచ్చు. లేదంటే తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. తిప్పతీగ.. తిప్పతీగ రోగనిరోధక శక్తిని బలపరిచే ఔషధం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది జలుబు, జ్వరం, ఫ్లూ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో ప్రతిరోజూ తిప్పతీగ కషాయాన్ని తయారు చేసి త్రాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. *రూపశ్రీ.
read moreషుగర్ కు ఇలా చెక్..!
జీవనశైలి సరిగ్గా లేకపోవడం, పోషకాల లోపం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహం సమస్య వస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్ అదుపులో లేకుంటే గుండె జబ్బులు, చర్మవ్యాధులు, యూటీఐ, కిడ్నీ ఫెయిల్యూర్, దంత సమస్యలు వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఈ పద్ధతులను అనుసరించవచ్చు. 1. మెంతి నీరు త్రాగాలి: ప్రతిరోజూ ఉదయం మెంతి నీరు తాగడం వల్ల డయాబెటిస్‌ను దూరం చేయవచ్చు. ఎందుకంటే మెంతి నీరు తాగడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ మందగిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. మెంతి నీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. 2. దాల్చిన చెక్క నీరు త్రాగాలి: దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం.. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం.. మధుమేహం-సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర నిర్వహణకు తోడ్పడుతుంది. 3. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి: మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి, ఒకరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆహారంలో ముందుగా ఫైబర్, ప్రొటీన్లు, కొవ్వులను తినండి. ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరగకుండా, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 4. కొద్దికొద్దిగా తినండి: డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి, ఒకేసారి పూర్తి భోజనం తినడానికి బదులుగా చిన్న భోజనం 4 నుండి 5 సార్లు తినండి. ఇలా చేయడం వల్ల కడుపు నిండుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. 5. చియా సీడ్స్ డిటాక్స్: అల్పాహారం తర్వాత చియా సీడ్స్ డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల చక్కెర శోషణ మందగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చియా సీడ్స్ డిటాక్స్ నీటిలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 6. గోధుమలకు బదులుగా మిల్లెట్ తినండి: భోజనం, రాత్రి భోజనంలో గోధుమలకు బదులుగా రాగులతో చేసిన రోటీని మీ ఆహారంలో చేర్చుకోండి. మిల్లెట్ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
read more99శాతం మంది పాలకూర వండటంలో తప్పు చేస్తున్నారట.. ఎలా వండితే మంచిది? లాభాలేంటంటే.!
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో పాలకూరను సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని పోషకాలకు పవర్ హౌస్ అని అంటారు. విటమిన్ ఎ, సి మరియు కె పుష్కలంగా ఉన్నాయి. ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా, దీని వినియోగం ఆక్సీకరణ ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మన ఎముకలు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండాలంటే బచ్చలికూర పుష్కలంగా తినాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే పాలకూర తినాలి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పాలకూరతో సూపులు, పన్నీర్ తో కలిపి వంటలు, పప్పు వంటివి తయారు చేస్తారు. అయితే చాలామంది పాలకూర వండటంలో తప్పులు చేస్తున్నారట. పాలకూర ఎలా వండాలంటే.. తాజాగా శుభ్రంగా ఉన్న పాలకూరను పచ్చిగానే సలాడ్ లో తినచ్చు. దీన్ని ఇతర కూరగాయాల వంటలలో చివరగా వేసి కాసింత వేపచ్చు. అయితే చాలామంది మాత్రం దీన్ని మొదట నీళ్లలో ఉడికించి ఆ తరువాత మళ్లీ చల్లనీళ్లో వేసి వేడి తగ్గాక పేస్ట్ చేసి కూరల్లో వాడుతుంటారు. ఇది ఎంతమాత్రం సరైన పద్దతి కాదు. పాలకూర చపాతీలు, పాలక్ పనీర్ కూర, పాలకూర సూప్ మొదలైనవన్నీ ఇలానే చేస్తారు. ఇలా చేయడం వల్ల పాలకూరలో పోషకాలన్నీ పోతాయి. రంగు తప్ప దీన్నుండి ఏమీ లభించదు. అయితే పాలకూరను టమోటా, మిరియాల పొడితో కలిపి తింటే శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యం పెరుగుతుందట. పాలకూర తింటే కలిగే లాభాలు.. గర్బిణీ స్త్రీలకు.. గర్భిణీ స్త్రీలకు పాలకూర చాలా మంచిది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీకి అవసరమైన పోషకం. ఫోలిక్ యాసిడ్ శిశువును పుట్టుకతో వచ్చే లోపాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. మధుమేహం .. పాలకూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్. డయాబెటిక్ రోగులలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం, ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. రక్తపోటు.. పాలకూరలో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడం సులభం అవుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి. క్యాన్సర్.. క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఎముకలు.. పాలకూరలో లభించే విటమిన్ కె ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాల్షియం శోషణను పెంచుతుంది. విటమిన్ కె లోపం వల్ల ఎముకలు విరిగిపోయే అవకాశాలు పెరుగుతాయి. జీర్ణక్రియ.. పాలకూరలో ఐరన్ తో పాటు ఫైబర్, నీటి శాతం సమృద్ధిగా ఉంటాయి. దీని వినియోగం మలబద్ధకం సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి బచ్చలికూర ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. జాగ్రత్తలు.. పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ శరీరం కాల్షియంను గ్రహించడంలో అడ్డుకుంటుంది. అంతేకాదు దీన్ని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి పాలకూరను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదు. అలాగే పాలకూరను ఎక్కువగా వండకూడు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు నశించిపోయి ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడదు. బచ్చలికూర నుండి పోషకాలు పుష్కలంగా లభించాలంటే ఎక్కువ ఉడకబెట్టడం మానుకోవాలి. *నిశ్శబ్ద
read moreఅర్థరాత్రివరకు మేల్కొంటున్నారా? అయితే ఇది మీకోసమే!
ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం సర్వసాధారణంగా మారింది. చాలా మంది పని కారణంగా అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటే, ఇంకొంత మంది టీవీ, మొబైల్‌లో టైం పాస్ చేయడానికి అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారు. అయితే అర్థరాత్రి వరకు మేల్కొని ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. అయినప్పటికీ అలాంటి నియమాలు ఎవరూ ఫాలో అవ్వరు. మీరు ఉదయం 6 లేదా 7 గంటలకు మేల్కొంటే, పూర్తి నిద్ర పొందడానికి, మీరు రాత్రి 9-10 గంటలలోపు నిద్రపోవాలి. లేకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చాలా మంది రాత్రి 12 గంటల వరకు లేదా తరువాత 1-2 గంటల వరకు మేల్కొంటున్నావారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. అర్థరాత్రి వరకు మెలకువగా ఉంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది: కంటి చూపుపై ప్రభావం: ప్రజలు అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడానికి అతిపెద్ద కారణం మొబైల్ ఫోన్. అటువంటి పరిస్థితిలో, అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్ ఉపయోగించడం దాని కాంతి కారణంగా కళ్లపై ప్రభావం చూపుతుంది. ఇది కళ్లను బలహీనపరుస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది: అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం తరచుగా కనిపిస్తుంది. రాత్రి పూట మేల్కొని ఉండడం వల్ల ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. రాత్రిపూట మెలకువగా ఉండటం వల్ల మనసులో చాలా విషయాలు జరుగుతూనే ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్థూలకాయం వచ్చే ప్రమాదం: రాత్రి వేళల్లో మేల్కొలపడం వల్ల తరచుగా ఆకలి వేస్తుంది. దీని వల్ల ప్రజలు రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం వస్తుంది. మీరు కూడా అలాంటి తప్పు చేస్తే, మీరు దానిని నివారించాలి. నల్లటి వలయాల సమస్య: అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖం చెడుగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు దీన్ని నివారించాలనుకుంటే, మీరు రాత్రి త్వరగా నిద్రపోవాలి. జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. సరైన వేగవంతమైన జీర్ణక్రియ కోసం, సరైన సమయంలో నిద్రపోవాలి.
read moreపాషన్ ఫ్రూట్ గురించి విన్నారా? దీంతో కలిగే లాభాలేంటంటే..!
పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. అయితే తెలుగు ప్రజలకు కాస్త పరిచయం తక్కువ ఉన్న పండ్లలో పాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ పాషన్ ఫ్రూట్ లోపల గుజ్జు, గింజలతో కూడి ఉంటుంది. దీని తొక్క మాత్రం గట్టిగా చూడటానికి ఏ మారేడు కాయో అనిపించేలా ఉంటుంది. ఊదా రంగులోనూ, పసుపు రంగులోనూ పాషన్ ఫ్రూట్ లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దీని గుజ్జుతో వివిధ రకాల పానీయాలు తయారుచేస్తారు. రోగనిరోధక శక్తికి పాషన్ ప్రూట్ పెట్టింది పేరు. ఈ పండులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి సహాకరిస్తుంది. పాషన్ ఫ్రూట్ లో పెద్ద మొత్తంలో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు.. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.. విటమిన్ సి, పాలీఫెనాల్స్‌తో సహా పాషన్ ఫ్రూట్‌లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్.. పాషన్ ఫ్రూట్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు, మధుమేహం ఉన్నవారికి మంచివి. పాషన్ ఫ్రూట్‌లో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం సహాయపడుతుంది. బరువు నిర్వహణ.. ఈ పండులో ఉండే పీచు పదార్ధం ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా పదే పదే తినడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ప్రేగు కదలికలను చురుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ప్యాషన్ ఫ్రూట్ పీల్స్ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం.. ప్యాషన్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. గట్ మైక్రోబయోమ్.. ఒక చిన్న పాషన్ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది మైక్రోబయోమ్‌ను మంచి బ్యాక్టీరియాతో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. *నిశ్శబ్ద.
read moreఆయుర్వేదం ప్రకారం.. పండ్లు ఎలా తీసుకుంటే ఎక్కువ లాభాలుంటాయి?
రోజూ పండ్లు తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం శరీరం మెరుగైన పనితీరుకు అవసరమైన అన్ని పోషకాలను పండ్లు కలిగి ఉంటాయి. పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది, మధుమేహం నియంత్రణలోనూ, స్థూలకాయాన్ని తగ్గించడంలోనూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. కంటి సమస్యలు, జీర్ణ సమస్యలను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వ్యాధులను నివారించడానికి పండ్లు మంచి ఔషదం. ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి నియమాలు, కాలానుగుణ నియమాలు ఇలా మరెన్నో జాగ్రత్తలు ఉంటాయి. పండ్లను సరైన పద్ధతిలో తినడానికి కూడా ఆయుర్వేదం నియమాలను సూచించింది. తద్వారా పండ్ల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు. వాటిని సరైన మార్గంలో తీసుకుంటే ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనం ఉంటుంది. తప్పుడు మార్గంలో, తప్పు సమయంలో పండ్లు తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. పండ్లు ఎలా తీసుకోకూడదో ఆయుర్వేదం చెప్పిన నియమాలు ఏంటో తెలుసుకుంటే.. ఆహారంతో పాటు పండ్లు తినకూడదు.. చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. ఆహారంతో పాటు పండ్లు తినడం వల్ల పేగుల్లో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఆయుర్వేదంలో కొన్ని విషయాలను 'ఆమ' అంటే విషపదార్థాలు అంటారు. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కాకుండా అనేక చర్మ సమస్యలు, వాపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పండ్లను జ్యూస్ చేస్తే ప్రాణానికే ముప్పు.. చాలా సులువుగా ఉంటుందని ఎక్కువ మంది పండ్లు తినడం కంటే పండ్ల రసాన్ని తీసుకోవడానికి ఇస్టపడతారు. అయితే పండ్ల రసం తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. పండ్ల నుండి ఎక్కువ పోషకాలను పొందడానికి మొత్తం పండు తినాలి. రసం తాగడం ద్వారా ఫైబర్ తో పాటు అనేక ఇతర మూలకాలను కోల్పోతారు. డిన్నర్‌లో లేదా సాయంత్రం తర్వాత పండ్లు తినవద్దు.. ఆయుర్వేదం ప్రకారం పండ్లను సాయంత్రం లేదా రాత్రి భోజనం చేసినప్పుడు తీసుకోకూడదు. ఈ సమయాన్ని కఫా కాలం అని, ఈ కాలంలో పండ్లు జీర్ణం కావడానికి చాలా బరువుగా ఉంటాయని, ఇది దోష అసమతుల్యతకు దారితీస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పాలలో పండ్లను కలపవద్దు.. పాలతో పండ్లను తినడం విరుద్ధ ఆహారం అని ఆయుర్వేదం చెబుతోంది. చాలామంది పాలను పండ్లను మిక్సీ పట్టి మిల్క్ షేక్ చేసుకుని ఇష్టంగా తాగుతుంటారు. అరటిపండు తియ్యగా ఉన్నప్పటికీ పేగులకు భారంగా ఉంటుంది. అందుకే అరటిపండ్లు పాలు కలిపి తినకూడదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎల్లప్పుడూ సీజనల్ పండ్లను మాత్రమే తినాలి.. సీజన్‌లో లభించే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇతర పండ్లు రసాయనాల ద్వారా ఎక్కువ కాలం భద్రపరచబడతాయి. సీజనల్ లేని పండ్లను తినడం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. పైపెచ్చు సీజన్ కాని పండ్లు సహజంగానే ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కాబట్టి సీజన్ లో లభించే పండ్లను తాజాగా ఉన్నట్టే తినాలి. *నిశ్శబ్ద.
read moreడయాబెటిస్ ఉన్నవాళ్లకు నేరేడు ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు..!!
భారతీయులకు ప్రాచీనులు అందించిన గొప్ప వరాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఆయుర్వేదం, యోగ ప్రథమ స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతిలో భాగమైన పంచభూతాలు మనిషికి గొప్ప ఔషదంగా పనిచేస్తాయి. చెట్లు, పండ్లు, చెట్ల ఆకులు ఇవన్నీ ఎన్నో జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో వీటి గురించి గొప్ప సమాచారం కూడా ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా నేరేడు పండ్లు నోరూరిస్తూ ఉంటాయి. అయితే నేరేడు పండ్లు మాత్రమే కాదు.. నేరేడు చెట్టు ఆకులు, నేరేడు పండ్ల గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు ఆకులు చాలా మంచివి. నేరేడు ఆకులు ఎలా ఉపయోగించాలి? వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే.. నేరేడు పండ్ల ఆకులను డయాబెటిస్ కంట్రోల్ ఉంచడానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం తాజా నేరేడు ఆకులను గ్రైండ్ చేసి రసం తీసి ఈ రసాన్ని ఉదయోన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఒక వేళ తాజా నేరేడు ఆకులు ఎప్పుడూ అందుబాటులో లేకపోతే నేరేడు ఆకులను ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, సాయంత్రం నీటితో తీసుకోవాలి. నేరేడు ఆకుల పొడితో టీ కూడా చేసుకోవచ్చు. లేదంటే తాజా ఆకులతో కూడా టీ చేసుకోవచ్చు. ఇందుకోసం తాజా నేరేడు ఆకులు లేదా పొడిని నీటిలో వేసి బాగా ఉడికించాలి. తరువాత వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీనికి కాసింత నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. ప్రయోజనాలు.. నేరేడు ఆకులలో జాంబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. నేరేడు ఆకులను టీగా చేసుకుని తీసుకోవచ్చు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి ఆక్సీకరణ ఒత్తిడి కారణం అవుతుంది. నేరేడు ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల ఈ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. నేరేడు ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంట, నొప్పి సమస్యలు తగ్గిస్తాయి. నేరేడు ఆకులను ఏ రూపంలో తీసుకున్నా ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియను పెంచుతాయి. *రూపశ్రీ.
read moreరాత్రిపూట గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి..!
నీరు శరీరానికి ఇంధనం వంటిది. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరం చాలా వరకు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగుతారు. దీనివల్ల శరీరం శుద్ది అవుతుందని, శరీరంలో టాక్సిన్లు బయటకు వెళతాయని అంటారు. అంతే కాదు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రం అవుతుంది. పేగులు శుభ్రపడతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. కానీ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా? రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది. రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జలుబు లేదా ఫ్లూ సమస్య ఉన్నట్లయితే వేడి నీరు తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడంలో, గొంతు నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా రాత్రంతా హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యను కూడా పరిష్కారమవుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగితే ఉదయాన్నే శరీరంలోని టాక్సిన్స్‌ను సులభంగా బయటకు పంపుతుంది. రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత లేదా నిద్రకు ఒకటి లేదా రెండు గంటల ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. రాత్రిపూట జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. రాత్రిపూట గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తరచుగా ఒత్తిడికి గురయ్యేవారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది ఒత్తిడిని, నిస్పృహను తగ్గిస్తుంది. హాయిగా నిద్ర పొందడానికి కూడా సహాయపడుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మెటబాలిజం స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఆరోగ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో అదనపు కొవ్వు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
read more


.webp)
.webp)




.webp)
.webp)





.webp)


.webp)


.webp)
.webp)