ఈ మూలికలు వాడితే చాలు.. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..!
కాలుష్యం నేటి కాలంలో ప్రజలకు అతిపెద్ద ముప్పు తెచ్చిపెడుతోంది. గాలి, నీరు, ఆహారం తో పాటు జీవనవిధానం కూడా చాలా వరకు కలుషితమైపోయింది. చాలామంది జీవినశైలి చాలా అధ్వానంగా మారింది. ఇంటి నుండి బయటకు వెళితే వాహనాల పొగ, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ.. మొదలైన వాటి వల్ల గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. దీని వల్ల ఊపిరితిత్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి. నిజానికి ధూమపానం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని అనుకునేవారు. కానీ నేటికాలం వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఊపిరితిత్తులు ప్రమాదంలో పడుతున్నాయి. అయితే గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులలో పేరుకున్న మురికి శుభ్రం చేసుకోగలిగితే ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని మూలికలు తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. తులసి.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి సమస్యలలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాలుగైదు తులసి ఆకులను ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని తాగాలి. లేదా తులసి ఆకుల రసాన్ని తీసి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అల్లం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్లంలో యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో వాపును తగ్గిస్తుంది. ప్రతిరోజూ అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇది చాలా బాగా సహాయపడుతుంది. అతి మధురం.. అతి మధురం ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైన మూలిక. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసం వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. తిప్పతీగ.. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. పైగా మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది. తిప్పతీగను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. *రూపశ్రీ.
read moreకంటిచూపు నుండి మధుమేహం వరకు.. 300 సమస్యలకు చెక్ పెట్టే ఆకు ఇది..!
టెక్నాలజీ పెరిగాక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. శరీరం కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకుంటే హాయిగా ఉండవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వల్ల జబ్బుల రాజ్యం ఉదృతమైంది. కంటి సంబంధ సమస్యలు, మధుమేహం, ఊబకాయం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఆహారంతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా గ్రామాలలోనూ, పట్టణాలలోనూ విరివిగా పెరిగే మునగ చెట్ల నుండి మునక్కాయలు కాస్తాయని అందరికీ తెలుసు. వీటిని డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అయితే మునగ ఆకులను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. పచ్చిగా ఉన్న ఆకులను తీసుకోలేని పక్షంలో ఎండిన మునగ ఆకులను అయినా పొడి చేసి వినియోగించవచ్చు. ఇంతకీ మునగ ఆకులలో ఉండే పోషకాలేంటి? ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది తెలుసుకుంటే.. పోషకాలు.. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియంతో పాటు, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక వరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మునగ ఆకులను ఆహారంలో తీసుకుంటే300 రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగ ఆకులు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి, శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి మునగ ఆకులను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి కాకుండా ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావవంతంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మునగ ఆకులు చక్కని పరిష్కారం. మునగ ఆకుల్లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా మునగ ఆకులు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మునగ ఆకులలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మహిళలు తరచుగా ఐరన్, కాల్షియం లోపాన్ని ఎదుర్కొంటారు. మునగ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి, బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మునగ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఎ తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, రేచీకటి వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, వయస్సుతో వచ్చే బలహీనతలను నివారిస్తుంది. *రూపశ్రీ.
read moreఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
చూడటానికి గుండ్రంగా కనిపించే అంజీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఓ రెండు అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొందరు బాదం, వాల్‌నట్‌లను, అత్తి పండ్లతో నానబెట్టి తింటుంటారు. అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పత్తి వ్యవస్థకు మంచిది: అత్తి పండ్లలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము మొదలైనవి. ఇవన్నీ కూడా మీ జీర్ణవ్యవస్థకు అనుగుణంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో రుతుక్రమం తర్వాత, హార్మోన్ల సమస్యలకు ప్రత్యేకంగా సహాయపడుతుంది. మెనోపాజ్ సమస్యలకు ఇది దివ్యౌషధం వంటిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది: మీ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించగల గుణం అత్తి పండ్లలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు నీటిలో నానబెట్టిన అంజీర పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్‌తో పాటు అత్తి పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. మలబద్ధకం నుంచి ఉపశమనం: చాలా మందికి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మలవిసర్జన సరిగా జరగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ విచ్ఛిన్నమై మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారికి రాత్రిపూట అంజూర పండును నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల మలవిసర్జన సులభతరం చేయబడి, దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం సమస్య దూరమవుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది: ఉదయం పూట రాత్రంతా నానబెట్టిన అంజీర్ నీటిని తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మన చర్మ కాంతిని పెంచడంతోపాటు చర్మ సమస్యలను నయం చేస్తుంది. తద్వారా మీ అందం పెరుగుతుంది. బరువు తగ్గుతారు: ఈ రోజుల్లో శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దీని కోసం ఆహార నియమాలు, వ్యాయామాలు అనుసరిస్తున్నారు. కానీ బరువు తగ్గించుకోవడానికి ఫైబర్ కంటెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అత్తిపండ్లు మనకు అవసరమైన ఫైబర్‌ని అందిస్తాయి. అయితే దీన్ని రెగ్యులర్ పరిమాణంలో తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తింటే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది.
read moreటీ పొడి నాణ్యతను గుర్తించడం సాధ్యమేనా? నకిలీ టీ పొడిని ఇలా గుర్తించవచ్చు.!
టీ అనేది భారతీయలకు చాలా ఎమోషన్. ప్రతిరోజూ టీ తాగనిదే పనులను అణువంత కూడా ముందుకు కదలవు. అయితే టీ పొడిలో నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టీ పొడిని చాలా సులభంగా కల్తీ చేస్తారు. టీ పొడి నాణ్యమైనదా లేదా కల్తీదా తెలుసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో కావాలి.. ఫిల్టర్ పేపర్ తో.. టీ ఆకులు కల్తీ అయ్యాయా లేక నాణ్యమైనవా అనే విషయం కనుగొనడానికి ఫిల్టర్ పేపర్ ను ఉపయోగించ వచ్చు. ఫిల్టర్ పేపర్ తీసుకుని ఆ పేపర్ పైన టీ పొడిని వేయాలి. ఫిల్టర్ పేపర్ ను కొద్దిగా తడిపి దాని మీద కొంచెం నీరు చిలకరించాలి. తరువాత ఫిల్టర్ పేపర్ ను తీసుకుని లైట్ దగ్గర పరిశీలించాలి. మీరు వాడినది కల్తీ టీ పొడి అయితే ఫిల్టర్ పేపర్ మీద నల్లని, గోధుమ రంగు మరకలు కనిపిస్తాయి. కల్తీ లేని టీ ఆకులు అయితే ఫిల్టర్ పేపర్ పైన ఎలాంటి మరకలు ఉంచవు. నీటితో.. ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి. ఈ నీటిలో టీ ఆకులు వేయాలి. నీటిలో టీ ఆకులు వేయగానే అవి రంగు మారుతుంటే.. ఆ టీ ఆకులకు కలర్ మిక్స్ చేశారని అర్థం. స్వచ్చమైన టీ ఆకుల రంగు చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. రుచి.. స్వచ్చమైన, తాజా టీ ఆకులు అయితే ఫ్రెష్ గా రుచికరంగా ఉంటాయి. కానీ చేదుగా లేదా చప్పగా ఉన్నా.. లేదా తీపిగా లేదా కారంగా అనిపిస్తున్నా అవి కల్తీ చేసిన టీ ఆకులు అని అర్థం. మార్కెట్ లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్ లలో ఉండే టీ ఆకులు చాలా వరకు పాత బడినవే అయి ఉంటాయి. వాటికి ఇలాంటి ఫ్లేవర్ జోడించి తాజాదనం అనుభూతిని జొప్పించి అమ్మేస్తుంటారు. రంగు.. స్వచ్చమైన టీ ఆకులు ఆకుపచ్చ రంగులో లేదా నల్లగా ఉంటాయి. కానీ కల్తీ టీ ఆకులు గోధుమ లేదా ఎరపు లేదా పసుపు వంటి ఇతరలతో కూడా ఉండే అవకాశం ఉంది. స్వభావం.. నిజమైన టీ ఆకులు పొడిగా, మృదువుగా, ముట్టుకుంటే పగిలిపోయేలా ఉంటాయి. అంటే విరిగిపోయేలా ఉంటాయి. ముఖ్యంగా వీటి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. కల్తీ టీ .. చాలా వరకు కల్తీ టీ ఆకులను టీ బ్యాగ్ ల రూపంలో అమ్మేస్తారు. ఎందుకంటే టీ బ్యాగ్ లలో ఉన్న ఆకులను బయటకు తీసి పరిశీలించే అవకాశం ఉండదు కాబట్టి. పైగా ఈ టీ బ్యాగుల తయారీలో కాగితానికి మైనం పూత ఉంటుంది. ఇది నీటిలో కరికి కడుపులోకి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలుగుతుంది. *రూపశ్రీ.
read moreఆస్తమాను కంట్రోల్ చేసే పళ్ళు.. కూరగాయాలు...
అస్తమా వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే ఊపిరి తీసుకోవడం లో కష్టంగా ఉంటుంది. ఇందుకోసం ఎన్నొఏళ్ళుగా అనేక రకాల ఇంహేలర్లు మందులు వాడుతూనే ఉంటారు. వాతావరణం మారిందా ఆస్తమా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ప్రతి ఏటా వరల్డ్ అస్తమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా అస్తమా పై అవగాహన కొన్ని రకాల అస్తమా లక్షణాలను తగ్గించడం లో కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు సహకరిస్తయన్న విషయం మీకు తెలుసా. పిల్లల నుండి పెద్దలు అంటే వృ ద్దుల వరకూ అస్తమా బారిన పడుతూనే ఉన్నారు.అస్తమా వచ్చిన వారిలో శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం తీవ్రమైన దగ్గు.ఊపిరి పీల్చుకోవడం గుండెల్లో మంట,వంటి సమస్యలు వస్తాయి. చికిత్సలో భాగం గా ఇన్హేలర్ లు వినియోగిస్తారు.అలాగే కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు అస్తమా లక్షనాలను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది. సిమ్లా మిర్చి... సిమ్లామిర్చి యాంటి ఆక్సిడెంట్ గా ను,విటమిన్ సి ఫైటో న్యుట్రీ యంట్స్ గుణాలు సంపూర్ణంగా ఉంటాయి అది మీఅరోగ్యానికి పూర్తిగా సహకరిస్తుంది. దానిమ్మ పండు.. ఇందులో విట మిన్ సి పీచుపదార్ధము యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటాయి.ముఖ్యంగా శ్వాస నాళం నాశనంకాకుండా సహకరిస్తుంది.వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో రక్తం శాతం తగ్గినప్పుడు. దానిమ్మ జ్యూస్,లేదా దానిమ్మ గింజలు ఆరోగ్యవంతులను చేసేది దానిమ్మ పండే అస్తమాతో ఇబ్బడి పడుతూ నీరసించి పోయేవారికి అద్భుత మైన ఔషదం గాసంజీవని గా పనిచేస్తుంది. అల్లం... అల్లం లో యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది.ఒత్తిడిని నియంత్రిస్తుంది.శరీరంలో డి ఎన్ ఏ కు ఎలాంటి నష్టం జరగ కుండా నిలువరించడం లో అల్లం సహాయ పడుతుంది.బ్లడ్ ప్రేషర్,గుండె పోటు.శ్వాస నాళా లలో ,ఊపిరి తిత్తులలో ఎలాంటి అనారోగ్యం తో నైనా పోరాడే విధంగా అల్లం సహాయ పడుతుంది.ముఖ్యంగా శ్వాస నాళాలలో మనకు అడ్డం పడే కళ్ళే ను తొలగించడం లో అల్లం మనకు సహాయ పడుతుంది. పాల కూర... పాల కూరలో ప్రోటీన్,ఐరన్,విటమిన్ మినరల్స్,పొటాషియం మెగ్నీషియం,వంటి విటమిన్ పీచు పదార్ధం పాస్పరస్,తయా మిన్ విటమిన్ ఇ, వంటి పోషకతాత్వాలు ఉంటాయి.పాల కూర వాడకం వల్ల జుట్టు,ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గించడం లో మీకు సహక రిస్తుంది. టమాట రసం... విటమిన్ సి విటమిన్ బి పొటాషియం సంపూర్ణంగా టమాటా లో ఉంటుంది.లైకో పిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభించడం వల్ల గుండె అనారోగ్య సమస్యల నుండి క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుండి తగ్గించడం లో సహకరిస్తుంది. యాపిల్... యాపిల్ సంపూర్ణ పోషకాలు ఉన్న పళ్ళలో సంపూర్ణంగా పీచుపదార్ధం ఉండడం వల్ల.శరీర బరువు తగ్గించడం లో ఊపిరి తీసుకోవడం లో సహకరిస్తుంది. అయితే యాపిల్ డయాబెటిస్,గుండె సంబంధిత క్యాన్సర్,దీర్ఘకాలిక రోగాలను నిలువరించడం లో సహకరిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు అని న్యూ ట్రీషియనిస్ట్ లు అంటున్నారు. బీన్స్... బీన్స్ లో విటమిన్ ఏ,సి పోలక్ట్ యాసిడ్ ,కాల్షియం,ఫైబర్,సంపూర్ణంగా ఉంటుంది.బీన్స్ ఎముకలను పటిష్టంగా బలంగా ఆరోగ్యంగా ఉంచేందుకు. ఎముకలు విరగడం వంటి ప్రమాదాల నుండి కాపాడ డం లో కీలక పాత్ర పోషిస్తుంది.బీన్స్ లో విటమిన్ బి,డిప్రెషన్ ను తగ్గించడం లో మీకు బీన్స్ సహాయ పడుతుంది. కమలా పండు... సంత్రా... విటమిన్లు ,ఖనిజ లవణాలు యాంటి ఆక్సిడెంట్ తో నిండిన పోషక తత్వాలు ఖజానా ఉంటుంది.పైన పేర్కొన్న పండ్లు కూరగాయాలు శ్వాస కొస సంబంధిత సమస్యలను నిలువరించడం లో సహాయ పడుతుంది.
read moreఎండు ద్రాక్ష నీటిని రోజూ తాగితే ఈ వ్యాధులు మాయమట..!
ఎండుద్రాక్ష తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడే డ్రై ఫ్రూట్. సాధారణ ద్రాక్షను ఎండబెట్డడం ద్వారా దీర్ఘకాలంగా నిల్వ చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే సాధారణ ద్రాక్ష కంటే ఎండుద్రాక్ష మరింత శక్తివంతమైనది. ఎందుకంటే ద్రాక్ష ఎండేకొద్ది అందులో పోషకాలు, తీపిదనం పెరుగుతుంది. ఎండుద్రాక్షను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. ఆహార నిపుణులు అయితే మహిళలు ఎండుద్రాక్షను ఖచ్చితంగా తీసుకోవాలని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఎండుద్రాక్ష నీరు తాగుతుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు చాలా తొందరగా నయమవుతాయట. అవేంటో తెలుసుకుంటే.. పోషకాలు.. ఎండుద్రాక్షల ఐరన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది కూడా. ఎండుద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగి ఎండుద్రాక్షను కూడా తినడం కొందరికి అలవాటు. ప్రయోజనాలు.. ఎండుద్రాక్షను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి ఎండుద్రాక్షలను కూడా తింటుంటే శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే విషపదార్థాలు టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఎండుద్రాక్ష నీరు గొప్ప మెడిసిన్. ఈ నీరు స్థూలకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తిని ఆ నీటిని తాగుతుంటే సులువుగా బరువు తగ్గుతారు. ఎండుద్రాక్ష నీటిలో నానిన తరువాత అందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఏర్పడుతుంది. ఈ నీటిని ఉదయాన్నే తాగి ఆ నానిన ఎండుద్రాక్షలు కూడా తింటుంటే జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎండుద్రాక్ష డ్రై ఫ్రూట్ గా పరిగణించబడుతుంది. ఇందులో సాధారణ ద్రాక్ష కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగుతున్నా, నానిన ఎండుద్రాక్ష తింటున్నా రోజంతా శరీరం చురుగ్గా ఉంటుంది. శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. చాలా రకాల ఆహారాలను అవాయిడ్ చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్ష నీరు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గితే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండుద్రాక్ష నీటిని ఉదయాన్నే తాగడం చాలా మంచిది. ఒకవేళ ఆ సయమంలో తాగలేక పోతే.. ఉదయం టిఫిన్ సమయంలో లేదా.. సాయంత్రం స్నాక్స్ సమయంలో అయినా తాగవచ్చు. కనీసం 15 నుండి నెల రోజులు దీన్ని క్రమం తప్పకుండా ఫాల్లో అవుతుంటే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. *రూపశ్రీ.
read moreముల్లంగి ఆకులు దొరికితే అస్సలు వదలకండి.. వీటితో ఎన్ని లాభాలంటే..!
ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ శాతం నీరు, ఫైబర్ కలిగిన ఈ దుంపలు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా మొలలు, మలబద్దకం. మధుమేహం వంటి సమస్యలున్న వారికి ముల్లంగి ఔషధం కంటే తక్కువ కాదు. అయితే ముల్లంగి దుంపలే కాకుండా ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. ముల్లంగి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో.. ఇవి ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయో తెలుసుకుంటే.. ముల్లంగి ఆకులలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా పోషకాలు అందిస్తాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముల్లంగి ఆకులను తరచుగా తింటూ ఉంటే చాలా మేలు జరుగుతుంది. సాధారణంగా ముల్లంగిని కొన్నప్పుడు వాటికి ఆకులు ఉంటే వాటిని చాలామంది విసిరేస్తారు. చెత్తబుట్టలో వేస్తారు. ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ముల్లంగి ఆకులలో ఫైబర్ మెరుగ్గా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం, అజీర్ణం, ఇతర కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి కూడా ముల్లంగి ఆకులు సహాయపడతాయి. సాధారణంగా ముల్లంగి దుంపలు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి. అలాగే ముల్లంగి ఆకులు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి. శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి. కాలేయాన్ని శుధ్ది చేసి కాలేయ పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. అదే విధంగా మూత్ర పిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే శరీరానికి విటమిన్-సి చాలా అవసరం. ముల్లంగిలో విటమిన్-సి మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సమస్యలను సులువుగా తగ్గిస్తుంది. మొలల సమస్యతో బాధపడేవారు ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే మంచిది. సాధారణంగా మలబద్దకం సమస్య వల్ల మొలల సమస్య వస్తుంది. ముల్లంగి ఆకులు ఆహారంలో తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గి మొలల సమస్య వచ్చే అవకాశమే ఉండదు. ఒక వేళ మొలల సమస్య ఉన్నా ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే చాలా తొందరగా సమస్య నుండి బయటపడతారు. *రూపశ్రీ.
read moreసోంపు నీళ్లు తాగితే కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసా?
సొంపు లేదా సోపు చాలా మందికి తెలిసిన పదార్థమే. ఇవి జీలకర్రను పోలిన గింజలు. తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం తరువాత వీటిని ఇస్తుంటారు. భారీ భోజనం తరువాత సొంపు తింటే ఆహారం బాగా జీర్ణమై కడుపు బరువు తగ్గుతుందని అంటారు. పైగా ఇది గొప్ప మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. అందుకే చాలామంది భోజనం తరువాత సొంపు తింటారు. చాలామందికి సొంపు గింజలను ఇలా తినడమే తెలుసు. కానీ సొంపు గింజలను కాకుండా సొంపు గింజల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు. జీర్ణక్రియ.. సొంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణాన్ని, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడంలో సొంపు నీరు బాగా పనిచేస్తాయి. సొంపు గింజలలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇక సొంపు నీటిలో సమ్మేళనాలు శరీరంలో ఉండే కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. పదే పదే ఆహారం తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. పరగడుపునే సొంపు నీరు తాగడం చాలామంచిది. యాంటీ ఆక్సిడెంట్లు.. సొంపు నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కాణాలను కాపాడటంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనంగా కనిపించడంలోనూ, అనేకరకాల వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుంది.. సొంపులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. సొంపు నీటిని తాగుతూ ఉంటే శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్దిని అడ్డుకుంటుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. *నిశ్శబ్ద.
read moreఈ సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు!
శరీరం మెరుగైన పనితీరుకు కారణమయ్యే అన్ని పోషకాలను కలిగి ఉండటం వల్ల పాలు లెక్కలేనన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B12, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పాల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలు తాగడం కొంతమందికి ప్రమాదకరం. ఏయే వ్యక్తులు పాలు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు పాలు తాగకూడదు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంటగా మారుతుంది. వీరు పాలను తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లాక్టోస్ ప్రతికూలత ఉన్నవారు పాలు తాగకూడదు. అంటే పాలు తాగడంతో కడుపు ఉబ్బరం, అసిడిటీ లేదా వాంతులు లేదా విరేచనాలు కలుగుతుంటాయి కొందరికి. ఇలాంటి సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు. పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత కొంతమందికి వికారం లేదా వాంతులు అవుతాయని ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి సమస్యలు ఉన్న వ్యక్తులు పాలు తాగకూడదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు, వీరికి ఒక సిప్ పాలు తాగిన తర్వాత వికారం మొదలైపోతుంటుంది. క్యాన్సర్ ఉన్నవారు పాలు తాగకూడదు. ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, అండాశయ క్యాన్సర్ అయినా, అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుంచి రక్తం పడటం వంటి సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదు. అలాగే పాలు తాగడం వల్ల అలర్జీ ఉన్నవారు కూడా పాలు అస్సలు తాగకూడదు. ఏవైనా చర్మవ్యాధులు ఉన్నా, పాలు తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు లేదా ముడతలు వచ్చే ప్రమాదం ఉన్నా పాలు తాగకూడదు. ఇవి మాత్రమే కాకుండా హృద్రోగులు పాలు తాగకూడదు. పైన చెప్పుకున్న సమస్యలున్నవారు పొరపాటున కూడా పాలు తీసుకోకూడదు. *నిశ్శబ్ద.
read moreతెలివిని పెంచే ఆహారం
మెదడు కూడా మన శరీరవ్యవస్థలో ఒక భాగమే! దానికీ తగినంత నీరు కావాలి. దానికీ సరిపడా పోషకపదార్థాలు చేరుతుండాలి. అందుకే మనం తీసుకునే ఆహారపు ప్రభావం ఎంతోకొంత మన మెదడు పనితీరు మీరు ఉంటుంది. అంతేకాదు! శరీరంలోని మిగతాభాగాల ఆరోగ్యం కూడా ఒకోసారి మెదడు మీద కనిపిస్తుంది. అందుకే... ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మెదడుకి మంచిదో సూచిస్తున్నారు నిపుణులు. వాటిలో కొన్ని ఇవిగో... చాక్లెట్లు చాక్లెట్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేమాట నిజమే! కానీ డార్క్ చాక్లెట్లను మితంగా తినడం వల్ల మన గుండెకు, రక్తపోటుకీ మంచిదంటూ ఎన్నో పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందంటున్నారు. డార్క్ చాక్లెట్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ల వల్ల కీడుకంటే మేలే ఎక్కువ. కాకపోతే చాక్లెట్ నల్లటిదై ఉండాలి (డార్క్), మోతాదు మించకుండా తినాలి. ఆకుకూరలు పచ్చగా ఉండే ఆకుకూరలు తింటే ఆ ప్రభావమే వేరంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరల వల్ల జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుందట. వీటిలో ఉండే సి,బి, కె, ఇ వంటి విటమిన్లు.... ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఆకుకూరలను తరచూ తిన్నవారి జ్ఞాపకశక్తి అమోఘంగా ఉండటమే కాదు... వారి మెదడులో నిక్షిప్తమై ఉన్న విషయాలు సుదీర్ఘకాలం పాటు చెక్కుచెదరవని అనేక పరిశోధనలలో రుజువైంది. చేపలు మాంసాహారం గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక. కానీ వాటిలో చేపల గురించి మాత్రం కాస్త మంచి మాటలే వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటుగా Docosahexaenoic acid (DHA) అనే రసాయనం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందట. పిల్లల్లో కనిపించే ADHD వంటి మానసికమైన లోపాలలో సైతం చేపలు తమదైన ప్రభావం చూపుతాయట. పప్పులు బాదంపప్పులు తింటే మెదడు చురుగ్గా ఉంటుందని తరతరాల నుంచీ వింటూనే ఉన్నాము. ఇక ఈ మధ్యకాలంలో బాదంతో పాటుగా ఆక్రోటుని కూడా తినమని ప్రోత్సహిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో పాటుగా సమృద్ధిగా లభించే విటమిన్ ఇ వల్ల మెదడులోని న్యూరాన్లు ఆరోగ్యంగా ఉంటాయట. పైగా వయసుతో పాటుగా వచ్చే మతిమరపు వంటి సమస్యలు కూడా దరిచేరవని ఘంటాపథంగా చెబుతున్నారు. టమాటాలు మెదడుకి మేత కోసం రూపొందిన జాబితాలో టమాటాలు కూడా ఉండటం ఆశ్చర్యమే! టమాటాలలో ఉండే ‘లైసోపిన్’ అనే రసాయనం మెదడులోని కణాలు దెబ్బతినకుండా చూస్తుందట. దానివలన మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అల్జీమర్స్ వంటి వ్యాధులు సైతం దాడి చేసేందుకు వెనకాడతాయట. ఇవే కాకుండా పసుపు, తృణధాన్యాలు, కొబ్బరినూనె, నెయ్యి, బీన్స్, అవ్‌కాడో, పొద్దుతిరుగుడు గింజలు వంటి పదార్థాలు కూడా మెదడు సామర్థ్యాన్ని పెంచడంలోనూ, ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ సాయపడతాయని సూచిస్తున్నారు. - నిర్జర.
read moreకంటి శుక్లం రాకుండా ఉండాలంటే ఉసిరికాయలు ఇలా తినాలి..!
ఉసిరి కాయలు భారతీయులకు వరం కంటే తక్కువ కాదు. ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సంస్కృతంలో ఉసిరిని అమలకి అని అంటారు. రోజూ ఉసిరికాయలు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని, బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలోనూ సహాయపడతాయని అంటారు. అయితే ఉసిరికాయలను తినడం వల్ల కంటి శుక్లానికి కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కంటి శుక్లం.. చాలామంది చూపు కోల్పోవడానికి కంటి శుక్లం కారణం అవుతుంది.. ముఖ్యంగా కంటి చూపు అస్పష్టంగా మారుతుంది. కాలక్రమేణా పూర్తీగా చూపు పోవడానికి దారితీస్తుంది. వయసు పెరిగేకొద్ది కంటి శుక్లం సమస్యలు వస్తాయి. చాలా వరకు వృద్దులలో కంటి శుక్లం సమస్యలు కనిపించేవి. కానీ నేటి కాలంలో చాలా తక్కువ వయసులోనే ఈ సమస్యలు బయటపడుతున్నాయి. కంటి శుక్లం రాకూడదన్నా, కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా ఉసిరికాయలు తినాలని అంటున్నారు. ఎలాగో ఇది కార్తీక మాసం.. ఈ మాసం మొదలు దాదాపు రెండు, మూడు నెలల వరకు ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి. ఉసిరికాయలు దొరికినన్ని రోజులు వీటిని తినడం.. మిగిలిన రోజులలో తినడానికి వీటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే ఏడాది మొత్తం క్వాలిటీతో కూడిన ఉసిరికాయ పొడి సిద్దమవుతుంది. ఉసిరికాయలు కంటి శుక్లానికి ఎలా చెక్ పెడతాయి తెలుసుకుంటే.. కంటి శుక్లం వయసుతో సంబంధం లేకుండా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల కంటి శుక్లం వచ్చి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కంటికి గాయం, మధుమేహం వంటి సమస్యల వల్ల కూడా కంటి శుక్లం వస్తుంది. సాధారణంగా కంటి శుక్లాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అయితే శస్ర్తచికిత్సతో సంబంధం లేకుండా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చు. దీనికి ఉసిరికాయ బాగా సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు కంటి శుక్లాన్ని నయం చేయడంలో, రాకుండా చేయడంలో సహాయపడతాయి. ఇతర కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో కూడా సహాయపడతాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఉసిరి సహాయపడుతుంది. ముఖ్యంగా ఉసిరికాయలో ఉండే విటమిన్-సి దృష్టి సమస్యలు నయం చేయడంలో సహాయపడుతుంది. వృద్దాప్య ప్రభావాల నుండి కళ్లను రక్షిస్తుంది. ఉసిరికాయ తినడం వల్ల కంటి లెన్స్ లోని టెన్షన్ తగ్గుతుందని అంటున్నారు. ఇది కంటి శుక్లం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. రోజూ ఒకటి లేదా రెండు ఉసిరికాయలను తినవచ్చు. దీన్ని పగలకొట్టి కొద్దిగా ఉప్పు వేసి నోట్లో వేసుకుని సుమారు గంట సేపటి వరకు దాని సారాన్ని మెల్లిగా జుర్రుకుంటూ ఉసిరిని తినవచ్చు. లేదంటే ఉసిరికాయను ముక్కలు చేసి దాన్ని గ్రైండ్ చేసి అందులో తగినంత నీరు జోడించి జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయ సీజన్ దాటితే అవి దొరకవు. అందుకే ఉసిరికాయల సీజన్ లోనే ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని వేడి నీటిలో కలిపి ఒక 10 నిమిషాల తరువాత గోరువెచ్చగా తాగాలి. *రూపశ్రీ.
read moreఅలోవేరలో ఔషద గుణాలు
అలోవేరా నేడు ప్రతి ఇంట్లో పెంచుకుంటున్న ఔషద మొక్క ఈమొక్క ఎక్కువగా గుబురు గా విస్తరిస్తుంది.ఊష్ణ ప్రాంతంలో ఇది ఎక్కువగా పెరుగుతుంది.దీనిని తెలుగులో కలబందఅని పిలుస్తారు.దీనిని వందల సంవత్సరాలుగా వైద్య పరంగా వినియోగిస్తునే ఉన్నారు. ఈ మోకలో మెత్తగా, వచ్చే గుజ్జు చాలా రకాల చికిత్సలకి నేటికీ వాడతారు.ప్రాచీన కలం నుండి ఇందులో ఉండే రసాయన పదార్ధం, జెల్ వైద్య పరంగా కనేతిక్స్ లో వాడుతున్నారు. అలో వీర ను పూర్తిగా కృష్ చేసి రుబ్బి మొత్తం ఆకును వినియోగిస్తారు.వివిధ పద్దతులలో వాడతారు, దీనుంది వచ్చిన రసాన్ని పూర్తిగా ఫిల్టర్ చేసి అలోవీరా జ్యూస్ గా ఒక సాధారణ ఆహరంమ్గా తీసుకుంటున్నారు. ఇది అల్కరైజర్ గా పనిచేస్తుంది,ఇటీవలి కాలంలో అలోవీరా జ్యూస్ డయాబెటిస్ నివారణకు వినియోగించడం గమనించవచ్చు. అలోవీరా అల్క లైసేర్ మన శరీరామ్ లో ఫై హెచ్ శాతాన్ని సమానంగా ఉంచుతుంది. ఇక డిటోక్షి కేషన్ చేయడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది.అలోవీరా జ్యూస్ మీ లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.అలోవీరా జ్యూస్ లో లివర్ కు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఇందులోఫి టో న్యూట్రి యాంట్స్ ఉండడం వాళ్ళ మల బద్ధకం ఎదుర్కుంటున్న వాళ్ళకి అలోవీరా జ్యూస్ నిత్యం రోజువారి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మీ పెద్ద పేగులు చిన్న పేగులు లేదా చాతి మంటగా ఉంటె కొంచం అలోవీరా జ్యూస్ తీసుకోండి గుండెల్లో మంతా మాయం కాస్త ఉపసమనం ఇస్తుంది.గ్యా స్టిక్ అల్సర్ ను సమర్ధంగా ఎదుర్కున్ర్ శక్తి అలోవీరా జుఇసుకి ఉంది.అలోవీరా చర్మా సంబందిత గాయాలులేదా తమర గజ్జి వంటి సమస్యకు అలోవీరా లో ఉన్న గుజ్జును కొంచం రాసి చ్చోదండి మంట ఉండదు దెబ్బ తగిలిన ప్రాంతంలో నెప్పి లేదా మచ్చ ఉండనే ఉండదు ఇన్ని ఔషద గుణాలు ఉన్న అలోవీరాను వినియోగిస్తే ఆరోగ్య పరంగా మేలుజరుగుతుందో. అలోవేర అలంకరానికే కాదు ఆరోగ్యానికి ఉపయోగమే.
read moreటీ బ్యాగ్ లతో టీ తయారు చేసుకుని తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..!
టీ.. భారతీయులకు ఒక ఎమోషన్. ఒకప్పుడు పట్టణాలలో ప్రజలు, బయటి షాపులలో మాత్రమే టీ కనిపించేది. కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా టీ ఫీవర్ పాకింది. ఉదయాన్నే కాఫీలు, సద్ది అన్నం తినే కల్చర్ నుండి ఉదయాన్నే టీ తాగి, టిఫిన్లు తిని పనులు చేసుకునే స్థితికి కాలం మారింది. ఇప్పుడు భారతదేశంలో నీటి తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న పానీయం టీ కావడం గమనార్హం. చాలామంది టీ ఆకులు, టీ పొడి కొనుగోలు చేసి టీని తయారు చేసుకుని తాగుతుంటారు. కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు గ్రీన్ టీ, బ్లాక్ టీ మొదలైనవి తాగుతారు. ఇవి కూడా తయారు చేసుకోవడానికి సులభంగా ఉంటుందని టీ బ్యాగ్ రూపంలో కొనుగోలు చేస్తారు. అయితే టీ బ్యాగ్ లు ఉపయోగించి తయారు చేసుకునే టీ వల్ల ఆరోగ్యం పాడవుతుందనే విషయాలను వైద్యులు, ఆహార నిపుణులు వెలిబుచ్చుతున్నారు. అసలింతకీ టీ బ్యాగ్ ల వల్ల జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. ఉదయాన్నే వేడి నీటిని ఒక పెద్ద కప్పులో పోసి అందులో గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్ వేసి 5 నుండి 10 నిమిషాల తరువాత ఆ పానీయాన్ని తాగడం చాలా మంది చేసే పని. ఆరోగ్యానికి ఆరోగ్యం, పని కూడా తక్కువే అనేది వారి భావన. కానీ ఇలా టీ బ్యాగుల ద్వారా తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు. టీ బ్యాగులు ఉపయోగించడం చాలా తేలిక. కేవలం వేడి నీటిలో ఈ టీ బ్యాగులను కొన్ని నిమిషాలు ఉంచితే ఆరోగ్యకరమైన టీ తయారవుతుందని అనుకుంటారు. దీనికి తగ్గట్టుగానే మార్కెట్లో కూడా టీ బ్యాగుల అమ్మకం ఎక్కువ. ముఖ్యంగా టీ బ్యాగులు కూడా వివిధ రకాల ఫ్లేవర్లలో అమ్ముతుంటారు. టర్మరిక్ టీ, మందార టీ, దాల్చిన చెక్క టీ, చమోమిలే టీ వంటి టీలను కూడా అమ్ముతుంటారు. ఇవన్నీ శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయని అనుకుంటారు. వీటిలో కెఫీన్ ఉండదు. అయినప్పటికీ ఇవి కూడా డెంజరే.. ఎందుకంటే ఇవి కూడా టీ బ్యాగ్ ల రూపంలో ఎక్కువ వాడతారు. టీ బ్యాగ్ లలో ఉండే రసాయనాలు శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. అంతే కాదు వీటిని ప్యాక్ చేసిన తరువాత ఇందులో ఏమున్నాయో గమనించే అవకాశం ఉండదు. కానీ కొన్ని సార్లు ఈ టీ బ్యాగ్ లలో కీటకాలు, చనిపోయిన పురుగులు వంటివి కూడా ఉండవచ్చు. ఈ కారణంగా ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ముఖ్యంగా టీ బ్యాగులను వేడి నీటిలో ఉంచినప్పుడు టీ బ్యాగుల నుండి మైక్రో ప్లాస్టిక్ విడుదల అవుతుంది. టీ బ్యాగులలో డయాక్సిన్ లేదా ఎపిక్లోరోహైడ్రిన్ పూత ఉంటుంది. వేడి నీటిలో టీ బ్యాగులను ఉంచినప్పుడు ఈ పూత కరుగుతుంది. ఇది గ్లాసులోని నీటిలో కలిసిపోతుంది. దీని వల్ల శరీరానికి హాని కలుగుతుంది. దీర్ఘకాలంగా ఈ టీ బ్యాగులు వాడితే శరీరానికి మేలు జరగకపోగా వివిధ రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. *రూపశ్రీ.
read moreచలికాలంలో వాము ఆకులు తప్పక తినాలి.. బెనిఫిట్స్ ఇవే..!
వాము ఆకుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మందంగా ఆకుల చివర కత్తిరించినట్టుగా కనిపించే వాము ఆకులు చాలామంది ఇళ్లలోనే పెంచుకుంటారు.దీని వాసన ఘాటుగా ఉంటుంది. దగ్గు, జలుబు చేయగానే చాలామంది ఈ ఆకులను తినమని సలహా ఇస్తుంటారు కూడా. అయితే ఈ వాము ఆకులు చలికాలంలో చాలా ఉపయోగపడతాయి. చలికాలంలో జలుబు, గొంతు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కేవలం వీటికే కాకుండా వాము ఆకు మరిన్ని సమస్యలకు అద్బుతమైన ఔషదంగా పనిచేస్తుంది. వాము ఆకుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. వాము ఆకులలో కాసింత ఉప్పు పెట్టి తాంబూలంలా చుట్టి నమిలి తినాలి. ఆ తరువాత గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే కడుపునొప్పి సమస్య మంత్రించినట్టు మాయం అవుతుంది. వాము ఆకులలో విటమిన్-ఎ,సి, సెలీనియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ గా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్న కారణం వల్ల వాము ఆకులను తిన్నప్పుడు కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో యాసిడ్లకు ఇది చికిత్స చేస్తుంది. వాము ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వీటిని బాగా నమిలి తినడం వల్ల నోటిలోని బాక్టీరియా మాత్రమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. వాము ఆకులలో థైమోల్ అనే యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతాయి. ఆయుర్వేదం మహిళలకు వాము ఆకులతో గొప్ప ఆరోగ్య చిట్కా సూచించింది. ఈ ఆకులను క్రమం తప్పకుండా తింటూ ఉంటే నెలసరి సమస్య వచ్చినప్పుడు అస్సలు నెలసరి నొప్పి సమస్యే ఉండదు. వాము ఆకులలో ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి గొంతు, ముక్కులలో రద్దీని క్లియర్ చేయడంలో సహయపడతాయి. అరచెంచా వాము ఆకులు, అరచెంచా మారేడు ఆకులను కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే మధుమేహం ఉన్నవారిలో పాలీయూరియా పై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. వాము ఆకులు, తెనె, కాసింత వెనిగర్ మూడూ కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. విటమిన్-ఎ మెండుగా ఉన్న కారణంగా వాము ఆకులు తినే వారిలో కంటి చూపు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తరువాత కంటి సమస్యలు అస్సలు రాకుండా చేస్తుంది. *నిశ్శబ్ద.
read moreనల్ల ఉప్పు నీటిని ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది. ఉప్పు లేని వంట ఎవరూ తినలేరు కూడా. ఉప్పులో చాలా రకాలున్నాయి. వాటిలో రాతి ఉప్పు, సాధారణ ఉప్పు మాత్రమే కాకుండా కొన్ని రకాల స్నాక్స్ లోనూ, వంటలలోనూ ప్రత్యేకంగా నల్ల ఉప్పును వాడుతుంటారు. బ్లాక్ సాల్ట్ అని పిలుచుకునే ఈ నల్ల ఉప్పును నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయమే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయని అంటున్నారు. నల్ల ఉప్పును, నల్ల ఉప్పు నీటిని ఆరోగ్య ప్రయోజనాల కోసం.. ఆయుర్వేదంలో చాలా ఏళ్ల నుండి ఉపయోగిస్తున్నారు. నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. నల్ల ఉప్పు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందంటే.. నల్ల ఉప్పు నీరు కాలేయాన్ని శుధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఉప్పు ప్రత్యేకత ఏమిటంటే ఇది కాలేయ కణాలలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా కాలేయం పనితీరును వేగవంతం చేస్తుంది. కాలేయానికి పొంచి ఉండే ఇతర వ్యాధులను నివారిస్తుంది. కేవలం కాలేయాన్ని మాత్రమే కాదు.. నల్ల ఉప్పు నీరు తాగితే శరీరం కుడా శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో నల్ల ఉప్పు నీరు చాలా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించడం ద్వారా ఫైల్స్ సమస్య కూడా తగ్గుతుంది. ఒకే రకమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నల్ల ఉప్పు నీటిలో ఆల్కలీన్ స్వభావం ఉంటుంది. ఇది ఎసిడిటీని తగ్గించడంలో.. కడుపులో ఆమ్లాలను తటస్థం చేయడంలో సహాయపడుతుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ నుండి ఉపశమం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు, కాసింత నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎసిడిటీ సమస్య మరింత తొందరగా తగ్గుతుంది. జీవక్రియ కూడా బాగుంటుంది. *రూపశ్రీ.
read moreమొలకలు వచ్చిన బంగాళదుంపలతో ముప్పు.. అంతా ఇంతా కాదు!
బంగాళదుంపలు భారతీయులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా ఇష్టమైన ఆహారం. తినడానికి రుచిగా, వండటానికి ఈజీగా ఉండే బంగాళదుంపలను ప్రతి వంటిట్లోనూ చూడవచ్చు. ఏ కూర చేయాలో అర్థం కాని వారికి బంగాళదుంప బంగారంలా కంగారు తగ్గిస్తుంది. ముక్కలుగా కోసి నూనెలో వేపి కాసింత ఉప్పు, కారం చల్లితే అన్నంలో కలుపుకుని తినడానికి అయినా, సైడ్ డిష్ కోసం అయినా, రోటీలలోకి అయినా ఇట్టే సెట్ అవుతుంది. ఇక బంగాళదుంపలు కేవలం కూరలాగానే కాకుండా పానీ పూరి నుండి చిప్స్ వరకు ప్రతి ఒక్క చోట తన ట్యాగ్ వేస్తుంది. ఈ కారణాల వల్ల బంగాళదుంపకు కాసింత క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే చాలా ఇళ్లలో బంగాళదుంపల మీద చిన్నగా మొలకలు రావడం గమనించి ఉంటారు. ఈ మొలకలను తొలగించి హాయిగా కూర వండేసుకోవడమే అందరికీ తెలుసు.. కానీ ఇలాంటి బంగాళదుంపలతో పెద్ద ముప్పేనని ఆహార నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన బంగాళదుంపలు.. మొలకెత్తిన బంగాళదుంపల మీద ఉన్న మొలకలు తొలగించి వండుకునే వారికి పెద్ద షాకే తగులుతోంది. ఇలా మొలకలు వచ్చిన బంగాళదుంపలను వండుకుని తినడం అంటే విషాన్ని తినడమేనట.. మొలకలు వచ్చిన బంగాళదుంపలు కానీ, బంగాళదుంపల మీద లేత ఆకుపచ్చ రంగు ఉన్నా కానీ ఇవి మంచివి కాదట. ఇలాంటి బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ వంటివి ఉత్పత్తివి. ఇవి చాలా విషపూరితమైన సమ్మేళనాలు. వీటిని తీసుకుంటే కడుపు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కడుపులో తిప్పడం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి మాత్రమే కాకుండా తల తిరగడం, తలనొప్పి, నరాల సంబంధ సమస్యలు పెంచుతాయి. బంగాళదుంపలు ఇలా తినకండి.. బంగాళదుంపలు వేయించి తినడం చాలా మందికి ఇష్టం. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఈ కారణంగానే బంగాళదుంపల చిప్స్, లేస్, బింగో, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్నాక్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది ఇప్పట్లో. అయితే ఇలా తినడం అస్సలు మంచిది కాదు. ఇవి రక్తపోటును పెంచుతాయి. కేలరీలు కూడా ఎక్కువగా అందిస్తాయి. ఈ కారణంగా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలా తినాలి.. బంగాళదుంపలు తినడానికి సరైన మార్గం వాటిని ఉడికించి తినడం. బంగాళదుంపలు ఉడికించి తిన్నా, వాటిని వివిధ రకాల కూరలలో భాగం చేసి ఉడికించినా మంచిది. సాంబార్, కిచిడి, ఉప్మా, కూర్మా వెజిటబుల్ రైస్ వంటి వాటిలో భాగం చేయవచ్చు. *రూపశ్రీ.
read moreఅశ్వగంద గురించి ఈ నిజాలు విన్నారా?
అశ్వగంధ ఆయుర్వేదంలో ఒక ముఖ్య ఔషధం. ఇది మొక్క వేరు నుండి లభించే పదార్థం. అశ్వగంధ వేరు రూపంలో ఉంటుంది. దీన్ని సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషదంగా వాడతారు. అశ్వగంధ కేవలం పొడి రూపంలోనే కాకుండా టాబ్లెట్లు, లేహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆయుర్వేద వైద్యులు చాలా రకాల జబ్బులకు అశ్వగంధను సిఫారసు చేస్తారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నరాల సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలకు అశ్వగంధను సిఫారసు చేస్తారు. అనారోగ్యంతో బాధపడే చాలామందికి అశ్వగంధను కూడా ఔషదంల బాగం చేస్తారు. ఇది ఇతర ఔషధాలు సమర్థవంతంగా పని చేయడంలో సహకరిస్తుంది. అంటే మందులను కాంబినేషన్ రూపంలో ఇస్తారు. కాబట్టి ఏవైనా మందులు వాడేవారు సొంతంగా అశ్వగంధ మాత్రలు లేదా పొడి తీసుకోకూడదు. అశ్వగంద నేరుగా తీసుకోవడం కంటే పాలతో తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. లేకుంటే వేడి నీటితో అయినా తీసుకోవచ్చు. అశ్వగందను ఏ రూపంలో తీసుకున్నా జ్ఞాపకశక్తి, శ్రద్ద, ఆలోచనలు మెరుగుపడటం, మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వంటి వాటిలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అశ్వగంధను తీసకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఈ కారణంగా శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు అశ్వగంధను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో కండరాలు బలంగా మారడంలో కూడా అశ్వగంధ సహాయపడుతుంది. మహిళలకు కూడా అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. మహిళలు సాధారణంగా హార్మోన్ సమస్యలు ఎక్కువగా ఎదురుకుంటూ ఉంటారు. అలాంటి వారికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. హార్మోన్ సమస్యలు తగ్గిస్తుంది. నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళలలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కునే పురుషులలో పునరుత్పత్తి హార్మోన్లను మెరుగు పరచడంలో అశ్వగంధ సహాయపడుతుంది. స్పెర్మ్ కౌంట్ మెరుగ్గా ఉండేలా, స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. *రూపశ్రీ.
read more









.webp)





.jpg)




.webp)
.webp)
.webp)