రోజూ ముఖానికి టమాటాను రుద్దుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా!

పేరుకు కూరగాయ అయినా టమాటాను అందరూ పండు అని పిలుస్తారు.  టమాటాను కూరలో వాడతారు, నేరుగా సలాడ్ రూపంలో తింటారు. ఇది ఆహారానికి రుచిని,  శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. చర్మానికి అందాన్ని కూడా ఇస్తుంది.  చాలా మంది తమ చర్మ సంరక్షణలో టమాటాను చేర్చుకుంటారు. అయితే..  ప్రతిరోజూ ముఖానికి టమాటాను రుద్దుతూ ఉంటే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..

ప్రతిరోజూ ముఖానికి టమాటా రుద్దితే..

టమాటాలో క్లీనింగ్ ఏజెంట్లు ఉంటాయి.  ప్రతిరోజూ టమాటాను ముఖానికి రుద్దుతూ ఉంటే చర్మంలో పేరుకునిపోయిన నూనె, మురికిని శుభ్రం చేయడంలో సహాయపడతాయి.

సాధారణంగా చాలామంది సూర్య కిరణాల ప్రబావం వల్ల చర్మం మీద టానింగ్ సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. కానీ టమాటా టానింగ్ సమస్యను దూరం చేస్తుంది.  ప్రతిరోజూ టమాటాను ముఖం మీద రుద్దుతూ ఉంటే చర్మం మీద ఉండే టానింగ్ మెల్లిగా మాయమవుతుంది. తద్వారా చర్మాన్ని రక్షిస్తుంది.

నేటికాలంలో అతిచిన్న వయంలోనే చర్మం మీద ముడుతలు, గీతలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రతిరోజూ టమాటాను రుద్దుతూ ఉంటే.. ముఖం మీద గీతలు, ముడుతల తగ్గి చర్మం యవ్వనంగా మారుతుంది.

వయసు అయ్యేకొద్ది చర్మం వృద్దాప్యంగా మారుతుంది. కానీ కొందరికి చిన్న వయసులోనే చర్మం ముసలి వాళ్లలా కనిపిస్తుంది.  టమాటాతో ప్రతి రోజూ ముఖం మీద రుద్దుతూ ఉంటే చర్మం బిగుతుగా మారుతుంది.

ముఖం డల్ గా, కాంతిహీనంగా ఉన్నవారు  ప్రతిరోజూ టమాటాతో ముఖం మీద రుద్దుతూ ఉంటే  చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.

ఉపయోగించే విధానం..

టమాటాను రెండు ముఖ్కలుగా కట్ చేయాలి.  సగం టమాటాను నేరుగా ముఖం మీద మెల్లిగా రసం అంతా ముఖ చర్మానికి పట్టేలాగా రుద్దాలి.  పది నిమిషాలు అలాగే ఉంచాలి.  ఆ తర్వాత ఆరిపోయాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

                                  *రూపశ్రీ.