Previous Page Next Page 
మయసభ పేజి 2

  

     "నొప్పి... ఎప్పుడయినా.... ఎక్కడయినా ... ఎవరితోనయినా నోప్పిగానే వుండదా?" ఈసారి అతని చెంపను కొరుకుతూ అంది.

    "కాదని ప్రాక్టికల్ గా రుజువుచేసే సందర్భం రావాలని నాకూ ఆతృతగా వుంది. అదెప్పుడోస్తుండా అని ఎక్స్ యిటింగ్ గా వుంది....." అతను వస్తున్న నవ్వును పేదల మాటున బిగబట్టుకుంటూ అన్నాడు.

    అమెకర్ధం కాలేదు.

    అదే అందామె.

    "అర్ధం కాలేదా....? నువ్వు చదువులోను, ఉద్యోగం సంపాదించు కోవటంలోనూ తెలివికలదానివే......" బట్ ... ఒక్క క్షణం ఆగి "నిజంగానే అర్ధం కాలేదా?" అన్నాడు తిరిగి.

    ఆమె భుజాల్ని తమాషాగా ష్రగ్ చేస్తూ అర్ధం కాలేదన్న భావాన్ని వ్యక్తం చేసింది.

    "స్రీ తన వివాహమైనా వెంటనే, ఆ తదుపరి ఒక సంవత్సరానికి రెండుసార్లు తియ్యటి బాధను ఎదుర్కుంటుంది తియ్యటి బాధలోని మొదటిపదం రెండవపదాన్ని చాలా మృదువుగా డామినేట్ చేస్తుంది."

    అమె కర్ధం చేసుకోనందుకు ప్రయత్నించి విఫలమయ్యింది.

    చల్లని పిల్లతెమ్మెర వారిని మరింత దగ్గర చేసే చలిని రేపుతూ సాగిపోయింది.

    కారు మేఘాల్లాంటి ఆమె నల్లని, చిక్కని జుత్తు అలల్లా కడలి అందమైన ఆమె మోముపై ముసురుకుంది నిండు పౌర్ణమి వెన్నెల జలతారు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తుండగా అతను కళ్ళు తెరిచాడు.

    "ప్లీజ్ ... రిషి ... అదేమిటో చెప్పావా....?" అందామె గోముగా.

    చీకటి జలపాతంగా తన మీదకు దుమికిన ఆమె జుత్తును చెరిపేస్తూ "ఆలోచించు" అన్నాడు.

    "నో ... ప్లీజ్ ... చెప్పవా....?"

    "చెప్పి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకని జంకుతున్నాను....."

    "ప్రమాదం లేదు, రాదు.... చెప్పు, ఆమె భరోసా ఇస్తున్నట్లుగా అంది.

    "సృష్టికర్త స్త్రీకి ప్రసాదించిన సృష్టి కార్యానికి ప్రారంభాన ... ఆ కార్యానికి చివరి అమ్చునా...." అతను సగంలో ఆగిపోతుండగానేఆమెకి చప్పున స్ప్రురించింది.

    అతనిలోని వల్నరబిలిటీ గిలిగింతలు అభినయించింది.

    "ఇంతకీ అర్ధమైందా....?" రిషి కవ్విస్తున్నట్ట్లుగా అడిగాడు.

    ఆమె తన పైపంటితో క్రింది పెదవిని అదిమి పెడుతూ భయపేడుతున్నట్ట్లుగా చూపుల్ని అతనిపై నిలిచింది.

    "మొదటిదానికి కట్టుకున్నవాడు కారణమైతే, రెండోవడానికి కన్న బిడ్డలు కారణమావు....."

    అతని మాటల్ని ఆమె పూర్తీ కానివ్వలేదు!

    తన అరచేతిలో అతని పెదవులను కప్పివేసింది. అతని మాటలేప్పుడూ అమెనో ఫేంటసీ ప్రపంచానికి దగ్గర చేస్తాయి.

    "నాకు ఎప్పుడూ థియరీకన్నా ప్రాక్టికల్సే బాగా నచ్చుతాయి. ఎందుకో ఏమిటో....?" అతను ఆమె జుత్తు చివరలను తన మునిపంటితో పట్టుకుంటూ అన్నాడు.

    "నచ్చుతాయా?" ఆమె కూల్ గా అడిగింది.

    "అవును" అన్నాడు ఆమె జుత్తును మరింతగా తన నోటిలోకి తీసుకుంటూ.

    అంతే తమర్ని అనుమానించాల్సిందే...." ఆమె మునిపంటితో పెదవిని నొక్కిపట్టుకుంటూ అంది.

    "అర్ద౦కాలేదు__ ఎందుకు?"

    "పాక్టికల్స్ ఏ విషయంలోనైన ఫర్వాలేదు __ కాని __ నేనివ్వవలసి ఉన్న ప్రాక్టికల్ అనుభూతి అనుభవం నీకిదివరకే నచ్చాయంటే....." ఆమె మధ్యలోనే అగోపోయి అతని రియాక్షన్ కోసం ఆగింది.

    రిశికి అర్దమయిపోయింది.

    అతను నాటకీయంగా ఆమె పదాల్ని పట్టుకున్నాడు.

    "ఈ దాసాను దాసుడ్ని అంతలా అనుమానించటం అన్యాయం అర్దభాగమా......"

    "ఆమె నవ్వింది.

    "అంతలా భయపడుటున్నావంటే గుమ్మడికయ దొంగపు అయ్యవనుకోవాలా....?"

    "అనుకోవలద __ అయినా నాకంత ధైర్యమ్మా...? పీల్చి చెండాదేయదు నా కాబోయే అర్దాంగి ...."

    "అదే వద్దు..... సిగ్గుపడక దారి తప్పి __ తప్పాక భయపడుతూ దారికి రావటం __భయపడుతూ మంచివాడిగా మిగలటం నాకసలు నచ్చాడు. నువ్వు తప్ప చేయకపోవటం అన్నది నీ నిజాయితీ మూలంగా కావాలి __ నా మీద ప్రేమతో కావాలి. ఈ లోకంలో మగవాళ్ళందరూ తప్పు చేయగల సమర్దులే. కొందరు ధైర్యంగా చేస్తే, మరికొందరు ధైర్యాన్ని ధైర్యాన్ని ఎరువు తెచ్చుకుని చేస్తే, ఇంకొందరు భయంతో చేయకపొతే, ఎందరో భయానికి భయపడి, సమజానికి వెరశి, తప్పుచేయటం తెలీక, నేర్వక తప్పును ఇష్టపడుతూ మిగిలిపోతారు.... ఏమైరైట్..... మైడియర్ హబ్బీ .....?"

    "బాషా సౌలభ్యం నాకింకా అలవడలేదు సుమీ __ లేదంటే ప్రాక్టికల్ బావుంటాయని అనగా, చదవగా , చూడగా మాత్రమె ఇష్టపడుతున్నాను అని అనేవాడ్ని"

    "ఈ తప్పుకూడా చేసావా?"

    "మరో తప్పా.....? అదేమిటి......" అతనాశ్చర్యపోతూ అడిగాడు .

    "చూడగా .... అన్నాది ... అది తప్పుకదా?"

    "అ?! ఎంత దెబ్బ తిన్నాను. తెలుగు బాష కనిపేట్టినవాళ్ళు గొప్ప శృంగార పురుషులయి వుంటారు. ఏ మాటని ఏమరుపాటుగా వాడినా అది మరేదో భావాన్ని ద్వనింపజేస్తుంది. నిన్ను మాటల్లో గెలవటం మాత్రం అసాధ్యం."

    మాటల్లోనే కాదు... ఎందులోనైన నన్ను గెలవటం అంత తేలికైన విషయం కాదు "

    "ఒక్క దానిలో మాత్రం గెలవగలను" అంటూ ఆమె లోతైన నాభిని ఆర్తిగా అర్ధమయ్యేలా సృజించాడు.

    ఆమె షాక్ తిన్నట్లు ఉలిక్కిపడి సర్దుకుంది.

    "అదే రిషి..... అదే నాకు బాధగా ఉంటుది. ఒక పురుషుడు తన పురుషత్వంతోనే స్త్రీ పై అయినా అనుభూతీస్తుంది. కాని అదొక్కటే మగవాడికి చాలని మాత్రం భావించలేదు. ఎన్నాళ్ళలా మనం దూరంగా మిగిలి పోదాం.....? నేను నీపరంగా కోరుకునే మార్పు ఎప్పటికి నీలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది....? మనిషికై మనిషి సృష్టించుకొనే పేదరికపు భయం, విమర్శనా భయం, అనారోగ్యపు భయం, ప్రేమరహిత్యపుభయం, స్వేచ్చా భయం, వృద్దాప్య భయం, చావు భయం __ ఎప్పుడూ ఆ మనిషిని ఎదగనియ్యవు __ దేన్నయినా ఎదిరించి బ్రతకగల స్థయిర్యాన్ని ఇవ్వవు."

    అతను ఒకింత సిగ్గుపడ్డాడు.

    "నువ్వు వారం... వారం.... నా దగ్గరకు రావటం నా సాన్నిహిత్యంలో కరిగిపోవటం నీకే కాదు నాకూ ఆనందమే కాని ఎన్నాళ్ళిలా? ఇది మీ తల్లిదండ్రులకు తెలిసేలా చేయగలవా? లేవు. ప్రేమించటానికి నిజంగా ప్రేమించగల మనస్సుంటే చాలేమో కాని__ ఆ ప్రేమను ఈ సమాజంలో కాశ్వాతం చేసుకోవాలంటే మరికొన్ని అర్హతలు మనిషిగా నిలబెట్టేందుకు కావాలి. శారీరక రుగ్మతల్ని వ్రుత్తిరీత్యా ఒక డాక్టర్ గా నేను నయంచేయగలనేమో......మానసిక రుగ్మతుల్ని నీ ప్రియురాలిగా, నీ శాశ్వత సహాయచర్యాన్ని కోరుకునే స్త్రీగా పొగొట్టలేకపోతున్నాను. ఆ భయాలు మీ నుంచి దూరం కావాలంటే , ధైర్యంగా, గర్వంగా నువ్వు తలెత్తుకు తిరగాలంటే నేనేం చేయాలో నాకర్ధం కావటంలేదు నీకు ఉద్యోగం లేకున్నా, సంపాదన లేకున్నా నిన్ను నేను ప్రేమిస్తాను. నా ప్రేమను నీకు పంచి ఇస్తాను నిన్ను సేదతీర్చే చలివేంద్రగా మారతాను. అప్పుడు సుపిరీయారిటీ కూడా ఫీలవ్వను. అలాంటి ఇరుకు మనస్తత్వం కూడా నాకు లేదు. కాని నన్ను చూసి నువ్వు ఇన్ పీరియర్ గా ఫీలవ్వటానికీ అసలు భరించలేను. పోనీ.... నీకే దారి నీవు చూసుకున్నా నా దారిలో నేను నడిపించుకు పోగలను. అది నీకు అవమానం కాదా....?" ఆమె బాధపడుతోంది __ అతన్ని మందలించాలని ఉన్నా, అతన్ని ఎవేర్ చేయాలని ఉన్నా సూత్యిగా ఆ పని చేయలేకపోతోంది. అందుకామేకు అతనిపై ఉన్న అపార అనురాగఝురి అడ్డుపడి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

    అతనిలో మార్పు వచ్చింది.

    అతనిలోని పిరికితనం తనకి నిజమైన బాశ్యాన్ని చెప్పకోలేక ఆత్మవంచనతో దాన్ని అనుమానంగా భావించింది. అతను ఆమె ఒడిలోంచి లేచాడు. ఆమెకి ఎడంగా జరిగాడు. అవమానంతో తల దించుకున్నాడు. ఆ వామనం వెనుకే ఆగ్రహం చోటు చేసుకుంది.

    ఇంకేదైనా అనాలంటే ఆమె గుండు గొంతుకడ్డుపడుతోంది.

    అతని బాగుపట్ల వ్యధ చెందుతోంది.

    "ఒక మగవాడి భాధలని నిజంగా మాయం చేయగల మహత్తు ఒక ఆడదానికే వుందని అమతారు. మరి నేను ఆడదాన్ని కాదా? ఏమో ... నాకే అర్ధం కావటంలేదు. నాలో ప్రిజిడీటీ లేదు.... నాకు కొన్ని నమ్మకాలు __ సిద్దంతాలు __ అభిప్రాయాలూ ఉన్నాయి. వాటికీ విలువ ఇచ్చేందుకు ఎంతటి నష్టాన్నికైనా సిద్దపడతాను. ఆడదాని మూలంగా మగవాడు నిజంగా బాగుపడతాడనే భావం నిజంగా నిజమే ఐతే నేను దానికి వ్యతిరేకిని కాను. న సిద్దాంతాల్ని గాలికి, వదిలి, నమ్మకాల్ని నీటముంచి, అభిప్రాయాల్ని అటకెక్కించి నీకు మన పెళ్ళికి ముందే సొంతమయినా __ నా స్త్రీత్వాన్ని రుజువు చేసుకుంటాను అప్పుడయినా మగవాడ్ని ... నాకు కావలసిన, నేను ఇష్టపడే  మగవాడినయిన నిన్ను మార్చుకోగాలనా? మారగలవా నువ్వు?" ఆమె శ్రావ్యమైన కంఠంలో సన్నని జీర తోంగిచూసింది.

    అతనికామే బాధ, వ్యధ తపన అర్ధమవుతూనే ఉన్నాయి. కాని అతని నిస్సహాయత అతన్ని నీలదీస్తోంది. పరిహాసిస్తోంది బిగుసుకుపోయి తన మీద అలిగి దూరంగా జరిగి __ తన స్పర్శకు దూరమయి అతను కృంగిపోతున్నాదాని అవంతి గ్రహించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS