Previous Page Next Page 
పంచభూతాలు పేజి 5

     దానిమీద పృద్వీరాజ్, "నిస్సందేహంగా ఏదో విధంగా గౌరవము రక్షించుకోవడానికి మానవాత్మ రకరాకల నైపుణ్య కార్యకలాపాలకు యత్నిస్తుంది. రాజు స్వేచ్చాచారి అయినపుడు,  ఏ ప్రకారంగా ప్రజలకు విముక్తిలేదు. ప్రజలు అతనిని దేవతా సమానంగా భావించి తమ హైన్య కష్టాలను మరచిపోవడానికి యత్నం చేస్తారు. మానవుడు శక్తి శాలి, సహనశీలుడు అయినప్పుడు అసహాయ స్త్రీ దేవునిగా బావించి వివశమవుతుంది. అతని నిష్టుర అత్యాచారాలను గౌరవ పూర్వకంగా సహిస్తుంది. మానవునిలో ఒకవే  ఈ విధమయిన బావముతో ఆ భావమును ఆచ్చాదించలేక పోయినంతవరకు మానవుడు గాదు. కేవలం పశుతుల్యుడుగా తయారవుతాడు." అని అన్నాడు పృద్వీరాజ్.
     నిర్ఘరిణీదేవి మెచ్చుకుని, "మానవుడు యే మాత్రం గత్యంతరం లేక ఈ విధంగా ఆత్మవంచన చేసుకుంటాడని చెప్పలేం. మా పక్షానికి విజయం లభిస్తున్న చోట అటువంటి స్థానంలో కూడా ఆత్మీయతా. స్థాపనాచేష్ట దృష్టి గోచరమవుతుంది. గోవును మనదేశంలో గోమాతని ఎందుకు అంటారు?  గోవు యేమాత్రం నోరులేనిది. అసహ్యమయిన పశువు. దానిని కొట్టితే దాని పక్షం వహించే వారెవరూ  వుండరు. మనం శక్తివంతులం. గోవు దుర్బలమయినది. మనం మానవులం, అది పశువు  కాని మనం దాని శ్రేష్టతను దాచిపెట్టటానికి ప్రయాస పడతాం. మనం బలవంతులం కాని మన అంతఃకరణ ఈ పనికి ఆమోదించపోవడమే యిందుకు ఏకైక కారణం. ఈ ఉపకారిణిని, ఈ శాంతిమయ మాతను తల్లి అని బావించి దాని పాలు తాగుతూ యదార్దంగా తృప్తి పడతాం. మానవునితో పశువుకుగల భావాత్మకు  సంబంధం, సుఖదాయక సంబంధము జోడించితేనే దాని సృజనచేష్ట శాంతిస్తుంది" అన్నది.
    గగన్ గంభీరంగా, "నువ్వు గొప్ప విషయమే చెప్పావు." అన్నాడు. ఇది విని నిర్ఘరిణి త్రుళ్లిపడింది. తన మాటలలో ఎంతో దోషముందని ఆమె తెలుసుకోలేపోయింది. దోషం మూలంగా సంకుచిత  మనస్సుతో తనలో తాను క్షమాభిక్ష కోరింది.
     ఆత్మయొక్క సృజన చేష్టను గురించి అనేక విషయాలు పొడసూపుతాయి.  సాలీడు తన గూడు మధ్యలో కూర్చుని నాలుగువేపులా గూడును విస్తరిస్తుంది. అలాగే మన కేంద్రీభూత ఆత్మ సకల జనులతో ఆత్మీయతా బంధనం స్థాపించుకోవడంలో నిమగ్నమవుతుంది. అది నిరంతరం దూరమును దగ్గరచేస్తుంది. అన్యులను తన వారిగా చేసుకుంటుంది. సౌందర్యం కూడా దాని రచనే. సౌందర్యం, ఆత్మ జడుల మధ్య వంతెన లాంటిది. పదార్దం కేవలం పిండం లాంటిది మనం దానిలో నుంచి బోజన సామాగ్రిని బయటకు తెస్తాం. అందులో గూడు కట్టుకుంటాం. దాని దెబ్బను కూడా సహిస్తాం. మనం దానిని అత్యాచారమని భావిస్తే వస్తు సమిష్టికి సమానమయినవి యింకొకటి లేదు. కాని ఆత్మ ఐక్యతను స్థాపింపచేస్తుంది. అది సుఖదాయని మద్దతుతో  సంబంధం కలుపుతుంది.
     జడునికి చక్కగా చెపితే అతను కూడా దాని హృదయంలో స్థానం సంపాదించుకుంటాడు. ఆ రోజు  అపార హర్షం పొందాం. యిద్దరం ఆనందించాం. సేత నిర్మాణ కార్యకలాపం నేను కూడా పూర్వం లాగానే నడుస్తోంది ఇది కవులకు గౌరవనీయ విషయం. సకల వస్తువులలో మనది పూరాతన సంబంధం.  కవులు దీనిని బలీయంగా తయారు చేస్తారు. కొత్త కొత్త సంబంధాలను సృజించుతుంటారు. విస్తృత బాషలో  దేనిని జడత అంటారో దానిని నేనూ జడత అంటాను. జడుడు జడతను గురించి కూడా తన అభిప్రాయం ప్రకటించడానికి వెళతాడు. సభలో కేవలం  నేను మాత్రమే సచేతన వస్తువులను ప్రకటిస్తాను"అన్నాడు.
     పవన్ దేవ్, గగన్ మాటలను శ్రద్దగావిని, "నిర్ఘరిణి కేవలం గంగిగోవులాగా వ్యవహరించింది. కాని మన దేశంలో ఇటువంటివారికి కొదవేం లేదు. మనిషి మిటమిటలాడే  ఎండలో ఖాళీ కిరసనాయలు డబ్బాను విడిచిపెట్టి నిట్టూర్చి  యమునా జలంలా వురకడం నేను చూచాను. ఆ దృశ్యం చూసి నా హృదయంలో తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో కలకలనాదం చేస్తూ ప్రవహించి శీతలజలభరిత నదిలో తన శరీరం అర్పించాడనే మేమెంతో తృప్తి చెందాం. సౌందర్య మణిమయ వసుంధరనుంచి తాతల పర్ణశాలవరకు నా హృదయంలో సమత్వ పూర్ణభావం వస్తుంది;  ఆ సమయంలో జీవితం శోభిస్తుంది. ఈ భూమి మీద సకల జడచేతనాలలో ఆశ్చర్యపడేవారిని యెరుగను. విజ్ఞాన  ప్రకాశం కలిగే ముందే ఈ విషయం తెలిసింది. జాతకం తయారుచేయడానికి చాలా ముందుగానే  నాడి చూసి ఈ విషయం సరైనదిగా పరిగణించాం. గృహస్థాశ్రమానికి విఘ్నేశ్వర పూజ చేశాం. మన భాషలో "థాంక్స్ అనే మాటకు సరయిన మాట లేనందున ఆంగ్ల భాషనుంచి  కృతజ్ఞతాపూర్వకంగా తీసుకున్నాం. కానీ దీనిని నేను పూర్తిగా తల క్రిందులుగా తీసుకుంటున్నాను. కృతజ్ఞతను తెలుసుకోవాలని నా హృదయం నిరంతరం అభిలషిస్తోంది. విద్యార్ది తన పుస్తకానికి, కర్రసాము చేసేవాడు. తన కర్రకు , శిల్పి తన పనిముట్లకు కృతజ్ఞత ప్రకటించే కోరికతో పూజిస్తాడు. ఒక విశేష శబ్దం లేనందున ఆ జాతికి కృతజ్ఞత లేదని చెప్పలేం,' అని అన్నాడు.
     "అనవచ్చు మనం  కృతజ్ఞతా సీనును వుల్లంఘించాం. మనం నిస్సంకోచంగా ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నాం. దీనికి కారణం  ఆ కృతజ్ఞత కాదు, దీనికి ముఖ్య కారణం పరస్పర స్వాతంత్ర్య భావాపేక్షకృత అభావం. ప్రబువు నౌకరు, భిక్షువు ధాత, అతిధి గృహస్థు, ఆశ్రితుడు, ఆశ్రయదాతల సంబంధం సహజమయింది అటువంటి స్థితిలో కృతజ్ఞత చూపి రుణం తీర్చుకోవాలనే భావం యెవరికీ రాదు," అని అన్నాను నేను.
     దానిమీద గగన్, "పర దేశీయులమీద  చూపే కృతజ్ఞత దేవతల మీద కూడా చూపుతాం.  ఆంగ్లేయులు 'థాంక్ గాడ్' అంటారు. అలా అనడంలో వారి ఆశయం ఏమిటి?  పరమాత్మ మన మీద దయచూపి మేలు కలుగుజేస్తే ఈ ఉపకారము స్వీకరించకుండా మనం మోటుగా తయారవుతామా? కృతజ్ఞత దేవతల పదవికి వుపయుక్తం కాలేదు అటు వంటి కృతజ్ఞత వల్ల మనం వారిని మోసగించే పనులు చేస్తాం, దేవతలు నాకు ఉపకారం చేస్తారనేదే దీని అర్దం. నేనుకూడా నా కర్తవ్యమును నిర్వర్తిస్తాను. కాని స్నేహంలో ఒక విధంగా ఆ కృతజ్ఞత కూడా  అకృతజ్ఞతా స్వాతంత్ర్యం కంటే అధిక గంభీరంగా వుంటుంది. ఈ కృతజ్ఞతకు యే విదేశీ భాషలోనూ రూపాంతరం లేదు" అన్నాడు.
     పృద్వీరాజ్ వ్యంగ్యపూర్వకంగా, "విదేశీయుల యెడ మనం కృతజ్ఞత చూపడానికి గంభీర కారణం వుంది. జడప్రకృతితో పాటు ఆత్మీయ సంబంధం కలుపుకోవడం గురించి సంభాషణ వచ్చింది. ఇందులో చాలా యింపు వుంది. ఆ విషయము ఇంతవరకు నాకు తెలియలేదు. సర్వులు మాటి మాటికీ డాబులు కొడుతుంటారు. యెందు కని?" ప్రకృతితో మనం భావాత్మక సంబంధం నెలకొల్పుకున్నాం. కాని యూరోప్ మాత్రం  మనతో వేరు విధంగా వుంది. దాని ప్రవర్తన కర్కశం. యూరపు సాహిత్యంలో నాకు పరిజ్ఞానం లేదు. అయితే నేటి సమావేశంలో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆంగ్లభాషా జ్ఞానం లేని వారు దీని ఉద్దేశ్యం చక్కగా ఎలా తెలుసుకోగలుగుతారు?" అని అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS