Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 3

    వ్యాధులను తపస్సుచే నివారించు టెట్లు? మరియు, ఒకవ్యాది నింకొక రుపశమిం పఁజేయు టెట్లు? అని పలువురు ప్రశ్నింతురు. ఇది న్యాయ్యమే. అట్టి యనుభవము పడయు వరకు నాకు నట్లే యుండెడిది. స్వయముగ నాకు దెలిసిన కొన్ని విశేషముల నుదాహరించి,సహృదలహములను రూపమున నాకు శ్రీ శాస్త్రిగా సత్యమదుర స్వభావ సంస్మరణావకాశమును, ఈ గ్రంధ రచనలో శ్రీ వారుద్దేశించిన ప్రయోజనము కొంతవఱకును చేకూరును.

    శ్రీ శాస్త్రిగారి 'ప్రజ్ఞా ప్రభాకర' రచనకు దొడగినప్పటికే భ్రుక్తరహిత తారక రాజయోగ మార్గమున ముప్పదేండ్లు సాధన మొనర్చి యుండిరి. ఈ సుదీర్ఘకాలమున నెన్నియో మహనీయాను భావములను వారు గడించిరి. తమ యనుభవములను, తమతోపాటు యోగదీక్షబడసినవారి యనుభూతులను, తమ వలన నుపకృతి బడసినవారి కధలను, వారు వేర్వేరు సంపుటములుగ బ్రకటింప నెచింరి. వారు సంకల్పించిన బృహద్గృంధమే రూపొందినచో నది తెలుఁగు వచన రచనలో మెఱుఁగులను చూపునది యేగాక, యోగాధ్యాసాధకులలోను, మనస్సరీరత త్త్వవేత్తలలోను, రోగ చికుత్సకులలోను సంచనముగల్గింపఁజాలినది నుండెడిది.

    కాని వా రా గ్రంధరచన కుపక్రమించి యిపుడు ప్రకటింపఁ బడిన భాగమును పూర్తి చేయునప్పటికి శ్రీ తిరుపతి దేవస్ధానమువారొక మ్యూజియమును నిర్మించుభారమును వారిపై నిడిరి. దానికై వారు ఆహార నిద్రా సౌకర్యములు మాని, పులులు చెరలాడు కడప యడవుల కడ మొదలిడి కమ్యునిస్టు గెరిల్లాల కాటపట్టు లగు కృష్ణాజిల్లా ముక్త్యాల, నైజాము రాష్ట్రము నల్లగొండ గుట్టలవఱకును గాలించి కన్నుల పండువును గూర్చు సుందర జిన బుద్ధ హిందూ విగ్రహములను బెక్కింటిని తిరుపతి చేర్చిరి.

    ఈ విగ్రహముల వలన మనకు పూర్వ మాంద్రదేశములో సమతాధర్మ ప్రతి పాదక ములు, అహింసా ప్రబోధకములు నైన జైన బౌద్ధములు ప్రబలె ననియు, తదనుయాయుల కళారా ధనా ఫలితముగ పెక్కు మనోహర విహార విగ్రహదులు వెలసె ననియు, కాలక్రమమున ప్రజలకు వర్ణా శ్రమాచారముల పై నను, వైదిక యజ్ఞ యాగాదుల పై నను చూపు మ్రొగ్గె ననియు, అపుడు వారు పూర్వ శిల్పనిర్మాణములను చేజేతుల రూపుమాపిరనియు, తమ నూతనా వేశమునకు లొంగని వారిని చిత్రవధ సల్పి రనియు తెలియ నగును. నాఁటి దౌర్జన్య హింసా కాండకును, తరువాతి శక ములలోని మహమ్మదీయుల విధ్వంసక చర్యలకును, నేఁటి రజాకారు కమ్యునిస్టు దుండగములకును భేదము కన్పట్టదు.మానవతలోని పశుత్వ మవిచ్చిన్నముగ నాఁటినుండి నేఁటి వరకు సాగుచునే యున్నది! తనకు మంచిదని తోఁచిన దాని నితరులచే నంగీకరింపఁ జేయుటకు మానవుఁడొనర్చు సాధనలో హింసాకాండను వర్జింప నేరఁడా?

    ఈ శిలా లోహ విగ్రహములే గాక శ్రీ శాస్త్రిగారు కాళహస్తి సంస్ధాన భాండారమంతయు శోధించి తత్సంస్దానాదీశ్వరుల యుదారానుమతితోఎన్నోఅముద్రితగ్రంధములు, చిత్రములు, పూర్వపు వీరులు ధరించిన కవచఖడ్గాదులుసేకరించిర ఆంద్రరప్రభసంపాదకులగుశ్రీనార్లవారిసహాయమున బందరునుండిశ్రీకోటసుబ్బారావుగారలుబహుకాలముశ్రమించిసేకరించిప్రాణతుల్యముగభద్రపరచుకొన్న అమూల్య చిత్ర ప్రతిమాదుల మ్యూజియమును తిరుపతికి తరలించిరి.

    ఈ పని యంతయు నొకప్రక్క- మఱియొక వంక తిరుపతి దేవస్ధాన ప్రాచ్యకళాపీఠ యాజమాన్యమున శ్రీ అన్నమాచార్యా వర్ధంతి జరుపుట, కీర్తనలు ప్రచురణ,పావులూరిగణితము,ఉత్తరహరివంశము, లక్షణోద్ధారము,నన్నయకు పూర్వపు ఆంధ్ర భాష ఇత్యాదులపరిష్కరించుట, వ్యాఖ్యానించుట, సమకూర్చుట, పరిశోధించుట జరపుచు, నన్నిచోడుని కుమారసంభమునకు వ్యాఖ్యానము రచించుట గూడ ప్రారంభించి యీ కార్యముల నన్నిటిని నేక కాలమున సవ్యసాచి వలె శ్రీ శాస్త్రిగారు నిర్వహించిరి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS