Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 4

    "ఏంటీ...?

    "పరిగెడుతున్నాడు సార్..."

    "మీరిప్పుడు  ఎక్కడ ఉన్నారు?"
 
    "యూనిట్ తో సహా సికిందరాబాద్ రైల్వేస్టేషన్ లో ఉన్నాం సర్..."

    "పరుగెత్తడం అపాక, నాకు ఫోన్ చేయమని  అంకిత్ కు చెప్పు..." అంటూ ఫోన్ పెట్టేశాడు పరమహంస.

    సరిగ్గా అప్పుడు...

                                               ***

    సికిందరాబాద్ రైల్వేస్టేషన్.

    ఓ పక్కన కెమెరాయూనిట్ ఉంది.లైటింగ్ ఆరెంజ్ మెంట్ జరుగుతోంది.

    "ఫోన్ ఎవరి దగ్గర్నుంచి?"కెమెరామెన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ అడిగాడు.

    "ఇంకెవరు మన బాస్.." చెప్పాడు రాహుల్.

    "ఏమిటట?"

    "అంకిత్ గురించి నాకు క్లాసు పీకబోయాడు"

    "అవునా... ఈ అంకిత్ ఎప్పుడూ ఏదో పితలాటకం పెడతాడని తెలుసు...నన్ను పొద్దునే అయిదు గంటలకు నిద్రలేపి 'రెడీ' కావాలని చెప్పాడు. ఇంతకీ అంకిత్ ఎక్కడ?" అడిగాడతను.

    "నీ కెమెరా 'వ్యూ' లోనుంచి చూడు... హీరోలా కనిపిస్తాడు" జోకాడు రాహుల్.

    కెమెరా మెన్ సీరియస్ గా కెమెరా దగ్గరకి వచ్చి కెమెరా  'వ్యూ' లో నుంచి చూశాడు.

    బ్లాక్ జీన్స్, వైట్  కలర్ రౌండ్  నెక్ టీ  షర్ట్ లో స్టయిల్ గా అగుపించాడు అంకిత్. ప్రయాణికులకు అబ్జర్వ్ చేస్తున్నాడు.కొంతమంది అమ్మాయలు అతని వైపు అడ్మయిరింగ్ గా చ్గూస్తున్నారు. స్టయిల్ గా నడుచుకుంటూ కెమెరా వైపు వస్తున్నాడు.

    "హలో బాసూ... నీ కోసం బస ఫోన్ చేశాడు. చెప్పాడు రాహుల్

    "వెరీగుడ్... పొద్దున్నే శుభవార్త చెప్పావు. అయినా ఒరే రాహుల్ నాకు తెలియక అడుగుతాను.ఇలాంటి వార్తలు తప్ప ఒక్కటంటే ఒక్కటైనా మంచి వార్త చెప్పవా?" అనుమానంగా అడిగాడు అంకిత్.

    "అదేంటి భయ్యా... పుసిక్కిన అంత మాటనేసావ్?" తెగ ఫీలయిన ఎక్స్ ప్రెషన్స్ అన్నాడు రాహుల్.

    "మన ప్రోగ్రామ్ చూసి బావుందని ఏ బిన్ లాడెన్ వెజిటేరియన్ న్యూస్ చెబుతావేంటి?"

    "గురూ... నాకో డౌట్ పీకుతుంది.అడగమంటావా? తంతవా?"

    ఏదో ఒకటి పీకుతాగానీ, అడుగు..."

    "బిన్ లాడెన్, ముల్గా ఉమర్ , మూషారప్ అంటే నీకింత ఇష్టమా?"

    "ఇష్టమా? పాడా? సినిమాల్లో విలన్ లేకపోతే,హీరోకు పేరెలా వస్తుంది.అలానే మన ప్రోగ్రామ్ని విలన్లు మెచ్చుకోవాలి. అప్పుడే ఉంటుంది మజా..."

    "నేను థమ్స్అప్ అనుకున్నావ్లె..." అంటూ తనలో తనే గోణుకున్నాడు రాహుల్.

    "ఏంటీ...ఏదో గోణుక్కుంటాడు?" అడిగాడు అంకిత్.

    " ఏంలేదు ప్రేండూ... నీ టాలెంట్ చూసి నా బుర్ర తిరిగితే సవరించుకుంటున్నా"

    "ఓసారి బాసూ అని, మరోసారి ' గురూ' అని... ఇంకోసారి భయ్యా... అని... ఇలా తరమా పిలుపులు మార్చకు. నాకు మండుద్ది. ఏదో ఒకటి కంటిన్యూ చెయ్... సంఝే ..." సీరియస్ లుక్కోటి పెట్టి అన్నాడు అంకిత్.

    "ఝే..." అన్నాడు రాహుల్.

    అప్పటికే న్యూడిల్లీ నుంచి సికింద్రాబాద్ రావాల్సిన ట్రేన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ మీదికి వస్తుందని అనౌంన్స్ మెంట్ వచ్చింది.

    "రాహుల్... ట్రెయిన్ ప్లాట్ ఫామ్ మీద ఆగక ముందే, నేను రన్నింగ్ లోనే టైన్ ఎక్కి, రాడ్ పట్టుకుంటాను. కెమెరా నా వెనకే రావాలి... షాట్ ఓ.కే.కాగానే 'ఓ.కే..' అని అరువ్... అప్పటివరకూ నేను పరిగెడుతూనే ఉంటాను... రన్నింగ్ టైన్ ని ప్రయాణీకులు ఎలా ఎక్కుతారో... నేచురల్ గా ఘాట్ అవ్వాలి... ఏ మాత్రం తేడాలోచ్చినా, ఇదే టైన్ కింద నిన్నూ, యూనిట్ నీ తోసేస్తా" వార్నింగ్  ఇచ్చాడు.అంకిత్.

    "అలాగేబాసూ... నువ్వు ప్రొసీడ్... మొట్టమొదటిసారిగా నాకు 'యాక్షన్' అనే అవకాశం వచ్చింది" ఉత్సాహంగా అన్నాడు రాహుల్.

    "నీ వాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది.జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్..." అన్నాడు. అప్పటికే ట్రెయిన్ ప్లాట్ ఫామ్ మీదికి వచ్చేసింది.

    రాహుల్ కెమెరామెన్ వైపు చూశాడు.కెమెరామెన్ కెమెరాను భుజం మీద పెట్టుకున్నాడు.

    రాహుల్ ఉత్సాహంగా, 'యాక్షన్' అని గట్టిగా అరిచాడు. ఆ అరుపునకు స్టేషన్ లో ఉన్న ప్రయాణికులంతా వింతగా చూశారు.

    అంకిత్ పరుగు ప్రారభించాడు. ట్రేయిన్ మెల్లిమెల్లిగా స్లో అవుతోంది.ట్రయిన్ తో పాటుపరుగేడుతున్నాడు అంకిత్.

    రాహుల్ కు ఉత్సాహంగా ఉంది.

    "పరుగెత్తు గురూ.. యాక్షన్ గురూ..ఉత్సాహాన్ని తెచ్చుకో బాసూ...నువ్వు పి.తి ఉష బ్రదర్ ని అనుకో. అశ్వనీ నాచప్ప ప్రెండ్ ని అనుకో..బలాన్ని పిక్కల్లోకి తెచ్చుకో.." రన్నింగ్ కామెంటరీలా అరుస్తూ 'అంకిత్' వెనుకే పరుగేడుతున్నాడు.

    కెమెరామెన్ కెమెరా తో అంకిత్ ను అనుసరిస్తున్నాడు. రాహుల్ కు మొదటిసారిగా 'యాక్షన్' అని చెప్పే అవకాశం వచ్చింది.దాన్ని సద్వినియోగం చేసుకునే ఉత్సాహంతో కామెంటేటర్ కేరెక్టర్ పోషించాడు.

    ట్రెయిన్ మరింత స్లో అవుతోంది.

    రాహుల్ ఓ.కే చెప్పి, కట చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాడు. రాహుల్ ఓ.కేచెప్పి, కట్ అనగానేతను కంపార్ట్ మెంట్ లోకి ఎక్కి, ఎంట్రన్స్ దగ్గర వున్న రాడ్ పట్టుకుని వేలాడాలి.

    ట్రెయిన్ ప్లాట్ ప్లాం మీద ఆగింది. అయినా రాహుల్ ఓ.కే చెప్పలేదు.'కట్' అనీ అనలేదు. కానీ ఉత్సాహంగా "పరుగెత్తు గురూ... గుడ్ షాట్.. వేల్ డన్..." అంటూనే ఉన్నాడు. కెమెరామెన్ ఆ హడావిడిలో ప్రయాణీకుల మధ్య ఇరుక్కుపోయాడు.

    అంకిత్ ఆగిపోయాడు. అతని మోహమంతా చెమట.... వెనకే వచ్చిన రాహుల్...

    "అదేంటి భయ్యా... ఆగిపోయావ్?" అడిగాడు అంకిత్ మొహంలోకి చూస్తూ.

    కసికొద్ది రాహుల్ వంగోబెట్టి పది, పదిహేను పిడి గుద్దులు గుద్ది, ఆయాసంతో రొప్పుతూ...


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS