Previous Page Next Page 
దావాగ్ని పేజి 4


    షాంపేన్ బాటిల్ భళ్ళున పగిలిన క్షణంలోనే విమానం డోర్ లో నుంచి మెట్లమీదకి అడుగుపెట్టింది ఒక మెరుపు తీగ. పైలట్ యూనిఫారంలో ఉంది తను. అప్పటికే ఎయిర్ హోస్టెన్ లూ, స్టివార్డ్ లూ అందరూ క్రిందకి దిగిపోయారు. 

 

    "లేడీ పైలట్:" అనుకున్నాడు జనరల్ భోజా అపనమ్మకంగా. ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఇప్పటికే తొమ్మిదిమంది స్త్రీలు పైలట్స్ గా పని చేస్తున్నారని అతనికి తెలియదు. ఈ అమ్మాయి పదవది.

 

    ఇండియన్ ఎయిర్ లైన్స్ డొమెస్టిక్ ఎయిర్ లైనర్ అంటే ఇండియాలోని రూట్లలోనే తిరుగుతుంటాయి వాళ్ళ విమానాలు. బయట దేశాలకు వెళ్ళే రూట్లకో ఎయిర్ ఇండియా విమానాలు తిరుగుతుంటాయి కానీ నేపాల్, పాకిస్తాన్ లాంటి దగ్గర దేశాలకు ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లయిట్స్ కూడా వెళుతుంటాయి.

 

    అలాంటి ఇండియా చిత్రద్వీప్ ఫ్లయిట్ లో వచ్చింది ఈ ఆడ ఫైలేట్... మొదటిసారిగా:

 

    అందంగా, హుందాగా వున్న ఆ అమ్మాయి నడక మాత్రమే ముందుగా కనబడింది జనరల్ భోజాకి. తర్వాత ఆ అమ్మాయి ఒంపులు... మొన్న తను ఈజిప్టు వెళ్ళినప్పుడు లక్సర్ ఎడారిలో చూసిన పిరమిడ్ల లాగా ఎత్తులు...  

 

    హఠాత్తుగా తోకాస్ అన్నాడు.

 

    "అర్జెంట్ మెసేజ్ బాస్:"

 

    "ఎక్కడనుంచి: ఏమని:"

 

    "ఇండియానుంచి: మనవాళ్ళే: ఈ ప్లేస్ లో బాంబ్ పెట్టి పేల్చెయ్యాల్సిన సిఖ్ఖు ఎక్స్ ట్రీమిస్ట్ దుర్లభ్ సింగ్ తనే ఒక బాంబులో పేలిపోయాడట:"  

 

    "ఎవరు చేశారా పని:"

 

    "తెలీద్సార్:"  

 

    "చస్తే చావనీ:" అన్నాడు జనరల్ భోజా అతనికి అప్పుడే ఆ వ్యవహారం మీద ఇంట్రెస్టు తగ్గిపోయింది. అతని మనసునంతా ఆక్రమించేసుకుంది ఎదురుగా నడిచి వస్తున్న ఆ లేడీ పైలెట్.

 

    "తోకాస్: వెళ్ళి ఆ అమ్మాయిని ఇటు పిల్చుకురా" అన్నాడు భోజా

 

    "యస్ బాస్:" అని తోకాస్ రివ్వుమని వెళ్ళిపోయాడు.

 

    వి.ఐ.పి లాంజ్ లో తన కోసం ప్రత్యేకం వేసి వున్న కుర్చీలో దర్పంగా కాలు మీద కాలు వేసుకు కూర్చున్నారు జనరల్ భోజా.

 

    నాలుగు నిమిషాల తర్వాత తోకాస్ తోపాటు సంశయంగా లోపలికి వచ్చింది ఆ లేడీ పైలట్.

 

    "సో: ఆడోళ్ళు కూడా విమానాలు నడుపుతున్నారన్న మాట:" అన్నాడు జనరల్ భోజా

 

    "అందులో వింత ఏముంది? చాలామంది లేడీ పైలెట్లు వున్నారు. ఇండియాలోనే నాతో కలిసి పదిమంది వున్నారు" అంది ఆ అమ్మాయి.

 

    ఆ సంగతే కాదు. జనరల్ నాలెడ్జ్ గురించిన చాలా సంగతులు తెలియవు భోజాకి అతనెప్పుడూ వార్తాపత్రికలు చదవడు. ఎందుకంటే అతనికి చదువు రాదు.

 

    "ఓహ్: ఇండియన్:" అన్నాడు భోజా అవహేళనగా "ఇండియన్ కుక్కల మధ్య నీలాంటి అందగత్తె ఎలా పుట్టింది? అది పోనియ్: నీ పేరేంటి అమ్మడూ?"

 

    రోషంతో ఆ అమ్మాయి ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. సమాధానం చెప్పకుండా నిలబడింది.

 

    "సార్ అడుగుతుంటే జవాబు చెప్పవేం? నీ పేరేంటి?" అన్నాడు తోకాస్

 

    నిటారుగా నిలబడి చెప్పింది ఆ అమ్మాయి "నా పేరు వినీల. కెప్టెన్ వినీల."  

 

    "నీ కెంతొస్తుంది జీతం?"

 

    "స్వేచ్ఛగా, గౌరవంగా బతకడానికి సరిపోయినంత" అంది వినీల. అతను ఇండియన్స్ ని కుక్కలు అనడంతో ఇంకతను ఇంక అతనితో వినయంగా మాట్లాడవలసిన అవసరం లేదని తేల్చేసుకుంది వినీల.

 

    "స్వేచ్ఛ... అహ్హహ్హహ్హ" అని గొరిల్లాలా నవ్వాడు భోజా. "నీకు నెలకి యాభైవేలు జీతం ఇస్తాను. నా ప్రైవేట్ జెట్ విమానం నడపడానికి ఓ లేడీ పైలట్ కావాలి. నా దగ్గర ఉద్యోగంలో చేరు."

 

    రిస్ట్ వాచ్ చూసుకుంది వినీల. "ఇంకో గంటలో ఇండియాకు రిటర్న్ ఫ్లయిట్ బయలుదేరుతుంది నాకు శెలవు ఇప్పించండి" అనేసి, అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

 

    "తోకాస్:" అని రంకెపెట్టాడు భోజా. "చూడు ఆ ఇండియన్ ఆడకుక్క పొగరు: ఆ ప్లేన్ ని తిరిగి వెళ్ళకుండా ఆపెయ్యండి: ది సీజ్ మై ఆర్డర్:"

 

    చేతులు నలుపుకుంటూ అన్నాడు తోకాస్. "కానీ సర్... అది ఇండియన్ ప్లేన్. ఇండియా అంటే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, చైనాలలాంటి సూపర్ పవర్ ల లెవెల్ కి త్వరత్వరగా చేరుకుంటున్న దేశం తలుచుకోవడం లేదుగానీ, తలుచుకుంటే ఆటంబాంబులు తయారు చేసి ప్రయోగించగల సామర్థ్యం వున్న దేశం. ఇండియన్ ప్లేన్ ని మనం డిటయిన్ చేస్తే..."    

 

    గుభీమని ఒక గుద్దు గుద్దాడు తోకాస్ ని భోజా. అతనికి కోపంవస్తే మినిస్టర్లమీద కూడా గుద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే అతను ఉత్త అన్ సివిలైజ్ డ్ బ్రూట్.

 

    "పిరికిపంధా: ఇండియా బలాన్ని వర్ణించి చెప్పి నన్ను బెదర గొడదామని చూస్తున్నావా ఏంది? తల్చుకుంటే నేనూ వంద యాటంబాంబులు తయారుచేసి ఇండియాలోని ఢిల్లీమీదా, బాంబేమీదా, కరాచీమీద కురిపించేగల్ను" వెయ్యేళ్ళపాటు యుద్ధంచేసి, ఇండియన్ కుక్కలందర్నీ చంపేస్తాను యావనుకున్నావో:" అన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS