Next Page 
శ్రీశ్రీ మన సంగీతం పేజి 1


                                     శ్రీశ్రీ మన సంగీతం

                                                                      శ్రీశ్రీ

                                         

                                       శ్రీశ్రీకి జయహో

                                                       అద్దేపల్లి రామమోహనరావు

    శ్రీశ్రీకి జయహో ! శ్రీశ్రీకి జయహో !
    రెండక్షరాల అగ్నిగుండానికి జయహో !
    జయహో ! జయహో ! జయహో ! జయహో !
    జయహో ! జయహో ! జయహో ! జయహో !                                    ||జయహో !||

    అక్షర లక్షాధికారి మాటల కోటీశ్వరుడూ
    అక్షరపద శిల్పానికి అక్షరవరభాస్కరుడూ
    అంతులేని ఆవేశం అడుగడుగున చైతన్యం
    ఆగని వేగాన ప్రగతి మార్గానికి ప్రయాణం                                           ||జయహో !||

    నవకవితను మునుముందుకు నడిపించిన మహాకవి
    పాడని కవితను నిండుగ పాడించిన కళారవి
    మారని జనగణములనే మార్చిన ప్రస్థానంలో
    పరిపూర్ణపు బ్రతుకిచ్చిన నవకవితా నాయకమణి                                  ||జయహో !||

    కార్మికులను కర్షకులను కదనానికి కదిలించెను
    దగాపడ్డ తమ్ముళ్ళకు దమ్ము తాను కలిగించెను
    అట్టడుగున పడిపోయిన వర్గాలకు బలమిచ్చెను
    అరుణారుణ పతాకమై ఆకాశము వెలిగించెను                                       ||జయహో !||

    భావి వేదములతో జీవనాదములతో
    జగములకే చవులిచ్చిన జగన్నాథ రథచక్రం
    రాళ్లెత్తిన కూలీలకు రాయి విసరు సోయిచ్చిన
    మహాకవికి శతజయంతి జయహో ! జయహో !                               ||జయ జయ జయహో శ్రీశ్రీ!        
    (శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ, శతజయంతి విశేష సంచిక 'శ్రీశ్రీ-100' ఏప్రిల్, 2010)


Next Page 

  • WRITERS
    PUBLICATIONS