Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
18. ఈ హంస యొక్క పాప పరిహారక పక్షములు వేల దినములవై స్వర్గము వరకు వ్యాపించి ఉన్నవి. ఇది సమస్త దేవతలను గుండెలో పెట్టుకొని సకల భువనములను దర్శించుచు సాగిపోవును.
19. పైన ఉండి తపించుచున్నాడు. మంత్రబలమున దిగువను చూచుచున్నాడు. ప్రాణ బలమున వంకర నడచుచున్నాడు. "యస్మిన్ జ్యేష్టమథిశ్రితమ్?" ఎవరిలో పెద్ద తనము చేరి ఉన్నది?
20. ధనమును మథించు అరణులను ఎరిగిన విద్వాంసుడు జ్యేష్టుని కూడ తెలియుచున్నాడు. అతడు మహా బ్రాహ్మణుని కూడ తెలియుచున్నాడు.
21. అతడు తొలుత పాదహీనుడై ఉండెను. అతడే స్వర్గమును భరించినాడు. అతడు చతుష్పాధములు ధరించి అనుభవించగలవాడు అగుచున్నాడు. అన్ని భోజనములను పరిగ్రహించుచున్నాడు.
22. శ్రేష్ఠుడు, సనాతనుడగు దేవతను ఉపాసించువాడు అనుభయోగ్యుడు అగుచున్నాడు. బహు అన్నములను ఇచ్చుచున్నాడు.
23. అతనిని సనాతనుడు అనుచున్నారు. అతడు పునర్నవుడు అగుచున్నాడు. అతడు వివిధ రూపముల వాడై రాత్రింబవళ్ళు కలిగించుచున్నాడు.
24. వందల, వేల, అయుతముల, అసంఖ్యాకములు స్వయముగ అతని యందు చేరుచున్నవి. అవి అతని యందే లీనమగుచున్నవి. అతడు సాక్షీభూతుడు అగుచున్నాడు. అందువలననే అతడు కాంతిమంతుడై ప్రకాశించుచున్నాడు.
25. ఇది కేశమున కన్న సూక్ష్మము. ఇది అతి ప్రధానము. అట్లయ్యు లేనట్లు తోచును. దానిని దేవతలు ఆలింగనము చేయుచున్నారు. "సామమప్రియా" అది నాకు ప్రియమైనది. (ఆత్మకావచ్చును.)
26. ఇది కళ్యాణి. అజర. మర్త్య గృహమున అమృత. బ్రహ్మను ఉపాసించువాడు పూజింపబడుచున్నాడు.
27. నీవే స్త్రీవి. నీవే పురుషుడవు. నీవే కుమారుడవు, కుమారివి. నీవు జీర్ణుడవై ఉనికి లేని వాడవు అగుచున్నావు. ప్రకటితుడవైనపుడు విశ్వతోముఖుడవు అగుచున్నావు.
28. నీవు పితవు, పుత్రుడవు, జ్యేష్టుడవు, కనిష్టుడవు అగుచున్నావు. తొలుత ఆవిర్భవించిన ఒకే దేవత మనసున ప్రవేశించుచున్నాడు. అతడే గర్భాంతరమున ఉన్నాడు.
29. పూర్ణము నుండి పూర్ణము 'ఉదచతి' 'పూర్ణం పూర్ణేన సిచ్యతే' ఇది ఎచటి నుండి 'పరిషిచ్యతే' దానిని ఇప్పుడు మేము కనుగొన్నాము.
30. ఈమె సనాతన, సనాతనము నుండియే ఆవిర్భవించినది. పురాణి. సమస్తము అగుచున్నది. ఈ భూదేవి ఉషస్సుచే ప్రకాశితమగుచున్నది. ఆమె ఒక్కతే అనేకమంది కదలికలను గమనించుచున్నది.
31. 'అవి' నామక దేవత ఋతువును కప్పుకొన్నది. ఆమె వలననే ఈ పచ్చని చెట్లకు పచ్చదనము కలుగుచున్నది.
32. ఇది దగ్గరకి వచ్చు వారిని విడువదు. దగ్గర ఉన్న వానిని చూడదు. ఈ దేవత మహిమ చూడండి - అది జీర్ణము కాదు. అంతరించదు.
33. అపూర్వ ప్రేరణతో వాక్కు యథా తథముగ వచించుచున్నది. ఆ వాక్కు ఎచటికి చేరుచున్నదో "తదాహుర్బ్రాహ్మణం మహత్" దానిని మహా బ్రాహ్మణము అనుచున్నారు.
34. ఆరములు నాభియందు వలె దేవతలు, నరులు దేనిని ఆశ్రయించిఉన్నారో - జలపుష్పమా! నిన్ను అడుగుచున్నాను. ఏ మాయ వలన వారు అట్లు నిలిచి ఉన్నారు?
35. దేని వలన వాయువు వీచుచున్నదో, పంచదిశలు అనుగ్రహించున్నవో, దేవతలు ఆహుతులకు మాన్యత కలిగించుచున్నారో అట్టి జలనేతలు దేనియందు ఉన్నారు?
36. ఈ పృథివిని ఆచ్చాదించి ఉన్న అంతరిక్షము ఒకటియే యగుచున్నది. విధర్తయే ప్రాణులకు స్వర్గము కలిగించుచున్నాడు. అతడు ఒక్కడే సమస్త దిశలను రక్షించుచున్నాడు.
37. సమస్త ప్రాణులు ఎందున్నవో ఆ సూత్రమును తెలిసినవాడు, ఆ సూత్రపు సూత్రమును ఎరింగినవాడు మహా బ్రాహ్మణమును తెలియుచున్నాడు.
38. సమస్త ప్రాణులు ఎందున్నవో ఆ సూత్రమును నేను ఎరింగియున్నాను. ఆ సూత్రపు సూత్రమును కనుగొన్నాను. కావున మహా బ్రాహ్మణమును తెలిసినాను.
39. ద్యావాపృథ్వుల నడుమనున్న అగ్ని దహించుచు విశ్వతాపము కలిగించుచున్నాడు. దిక్పాలికలు ఎచట నిలిచిరో అప్పుడు వాయువు ఎచట ఉండెను.
(సూర్యుడు, దిక్పాలికలు వాయువు లేకనే నిలిచి ఉన్నారా? అనుట కావచ్చును.)
40. మాతరిశ్వ జలములందు ప్రవేశించినాడు. దేవతలు జలములందున్నారు. సృష్టికర్త జలములందున్నాడు. పవమాన హరితుడు జలములందు చేరినాడు.
41. ఉత్తరము నుండి గాయత్రియందు ప్రవేశించి, సామమున సామజ్ఞానము కలవారికి తెలిసిన అజుడు ఎచట కనిపించుచున్నాడు?
42. సవిత వసువులందును దేవత, సత్యధర్ముడు అగుచున్నాడు. పుణ్యాత్ములు అతనిలోనికే చేరుచున్నారు. ఇంద్రుడు ధన సమరములందు మాత్రమే నిలచి ఉండడు.
43. పుండరీకము నవద్వారములు కలిగి త్రిగుణములచే ఆవృతమై ఉన్నది. అందలి ఆత్మను తెలిసిన వారిని బ్రహ్మ విదులని చెప్పుచున్నారు.
44. నిష్కామి, ధీరుడు, అమృతుడు, స్వయంభువు రసాత్మకుడై తృప్తి చెందుచున్నారు. అతనికి లేనిది లేదు. అట్టి ధీరుడు, అజరుడు, యువకుడగు ఆత్మను తెలిసినవాడు మృత్యువునకు బెదరడు.
అయిదవ అనువాకము
మొదటి సూక్తము - 9
వినియోగము :-
ఈ సూక్తము ఆహుత్యర్ధ గోవధమున వినియోగము. వంధ్యగోవు 'శతౌదన' అనబడును. దాని వధ, దాని యజనము అగ్నిష్టోమ, అతిరాత్రముల కన్న శ్రేష్ఠము.
1. శతౌదన యజమానిని స్వర్గమున కంపునది, శత్రుసంహారక యగుచున్నది. ప్రథమమున ఇంద్రుడు దీనిని ప్రసాదించినాడు. దీనిని వధించగోరు శత్రువుల నోరు మూసి ఇంద్రుడు వారిని వజ్రాయుధమునకు అర్పించును గాక.
2. నీ చర్మము వేది. నీ లోమములు కుశలు అగుచున్నవి. ఈ త్రాడు నిన్ను పట్టినది. గ్రావాయుధము నీ మీద నాట్యమాడును గాక.
3. శతౌదనే! నీ వెంట్రుకలు ప్రోక్షణి అగును గాక. నీ జిహ్వ మార్జనము చేయును గాక. నీవు యాజ్ఞియవై స్వర్గమునకు చేరుము.
4. శతౌదనమును వండినవాని కోరికలు తీరి అతడు సమర్ధుడు అగుచున్నాడు. ఋత్విజులు అతని విషయమున ప్రీతులై యథావిధిగ వెళ్ళుచున్నారు.
5. శతౌదనమును 'అపూసనాభి'ని చేసి దానము చేయువాడు త్రిదివమునందున్న స్వర్గమును 'ఆరోహతి'
6. శతౌదనమును 'హిరణ్యజ్యోతిషము' చేసి ఇచ్చువాడు దివ్య, పార్ధివ లోకములకు చేరుచున్నాడు.
7. దేవీ! నిన్ను పచనము చేయువారు, 'శమనము' చేయువారు నీకు రక్షకులగుచున్నారు. భయపడకుము.
8. వసువులు దక్షిణమున, మరుత్తులు ఉత్తరమున, ఆదిత్యులు వెనుక నుంచి నిన్ను రక్షించుచున్నారు. నీవు అగ్నిష్టోమము వైపు వేగముగ పరిగెత్తుము.
9. దేవతలు, పితరులు, మనుష్యులు, గంధర్వులు, అప్సరసలు నిన్ను రక్షించుచున్నారు. నీవు అతిరాత్రము వైపు పరిగెత్తుము.
10. శతౌదనమును దానము చేసినవాడు ద్యు, భూ, అంతరిక్ష, ఆదిత్య, మరుత్, దిశా లోకములను పొందుచున్నాడు.
11. సుభగయగు శతౌదన దేవి ఘ్రుతమును ప్రోక్షించుచు దేవతలను చేరుచున్నది. దేవీ! నేవు వంట వారిని బాధించకుము. వారిని స్వర్గమునకు చేర్చుము.
12. స్వర్గమునందున్న, అంతరిక్షమందున్న, భూమి మీదనున్న దేవతలకు నీవు క్షీర, ఘ్రుత, మధువులను పితుకుము.
13. నీ శిరము, ముఖము, చెవులు హనువులు దాతకు క్షీర, ఘ్రుత, మధు, అమిక్షముల నిచ్చును గాక.
14. నీ యొక్క పెదవులు, ముక్కులు, కొమ్ములు, కళ్ళు దాతకు క్షీర, ఘ్రుత, మధు, అమిక్షల నిచ్చును గాక.
15. నీ క్లోమము, పురీతత్, హృదయము, కంఠనాడి "ఆమిక్షాం దుహతాం దాత్రే క్షీరం నర్పిరథోమధు" దాతకు క్షీర, ఘ్రుత, మధు, అమిక్షల నిచ్చును గాక.
16. యత్ తే యకృద్ యే మతస్నేయ దాన్త్రం యాశ్చతేగుదాః |
ఆమిక్షాం......"
17. నీ యొక్క ప్లాశి, వనిష్ఠ, కుక్షి చర్మములు
"ఆమిక్షాందుహతాం....."
18. "యత్ తే మజ్జా యదస్థి యన్మాంసం యచ్చ లోహితమ్ |
ఆమిక్షాం....."
19. నీ యొక్క భుజములు, బాహువులు, అంసలు, కకుద్
"ఆమిక్షాం......"
20. నీ యొక గ్రీవము, స్కంధములు, పృష్ఠము, పార్శ్వములు
"ఆమిక్షాం......"
21. "యౌతే ఊరూ అష్టీవన్తౌయేశ్రోణీ యాచతే భసత్ |
ఆమిక్షాం....."





