Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
12. "యమస్య భాగ స్థ |
అపాంశుక్ర మాపో"
13. "పిత్రూణాం భాగ స్థ |
అపాంశుక్ర మాపో"
14. "దేవస్య సవితుర్భాగ స్థ |
అపాంశుక్ర మాపో"
15. జలమా! మీ యందు నీటి పాలు ఉన్నది. ఆ నీటి భాగమున యజుస్సులు, దేవయజనములున్నవి. వానిని నేను పెంచుచున్నాను. దర్శించుచున్నాను. ఆ జలభాగమును మమ్ము ద్వేషించు వారిపై, మేము ద్వేషించు వారిపై ప్రయోగించుచున్నాను. ఈ మంత్రము, ఈ కర్మము, ఈ ఆయుధముచే శత్రువులను పరిమార్చుచున్నాను.
16. జలమా! నీయందు తరంగములు ఉన్నవి.
(మిగిలినది 15వలె అన్వయించుకొనునది.)
17. జలమా! నీయందు వత్సములు ఉన్నవి.
(మిగిలినది 15వలె అన్వయించుకొనునది.)
18. జలమా! నీయందు వృషభములు ఉన్నవి.
(మిగిలినది 15వలె అన్వయించుకొనునది.)
19. జలమా! నీయందు హిరణ్యగర్భుడు ఉన్నాడు.
(మిగిలినది 15వలె అన్వయించుకొనునది.)
20. జలమా! నీయందు అగ్నులు ఉన్నవి.
(మిగిలినది 15వలె అన్వయించుకొనునది.)
21. జలమా! నీయందు పృశ్ని శిలలున్నవి.
(మిగిలినది 15వలె అన్వయించుకొనునది.)
22. మూడు సంవత్సరముల లోపు మేము చేసిన అసత్య భాషణము, దాని వలన కలుగు దుర్గతి నుండి నన్ను విముక్తుని చేయుము.
23. జలమా! నిన్ను సముద్రమున కంపుచున్నాను. నీవు స్వస్థానమునకు చేరుము. నీవు సర్వత్ర ఉన్నదానవు. అరిష్టములను దూరము చేయుదానవు. మమ్ము ఎవడును భక్షించకుండును గాక.
24. పాపరహిత జలములారా! మా పాపములు దూరము చేయండి. సుప్రతీక జలమా! మా దుర్గతి, దుస్వప్న దుఃఖమును, మలినమును కడిగివేయుము.
25. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. పృథ్వి నిన్ను తీక్ష్ణము చేసినది. నీ యందు అగ్ని తేజమున్నది. పృథ్వి మీద విక్రమింపుము. మమ్ము ద్వేషించు వారిని, మేము ద్వేషించువారిని తొలగించుచున్నాము. వారు జీవించకుందురు గాక. ప్రాణములు వారిని విడుచును గాక.
26. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. అంతరిక్షము నిన్ను తీక్ష్ణము చేసినది. నీ యందు వాయుతేజమున్నది. అంతరిక్షము మీద విశ్రమింపుము. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని అంతరిక్షము నుండి తొలగించుచున్నాము. వారు జీవించకుందురు గాక. ప్రాణములు వారిని విడుచును గాక.
27. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. ద్యులోకము నిన్ను తీక్ష్ణము చేసినది. నీయందు సూర్యతేజమున్నది. ద్యులోకము మీద విక్రమింపుము. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని ద్యులోకము నుండి తొలగించుచున్నాము. వారు జీవించకుందురు గాక. ప్రాణములు వారిని విడుచును గాక.
28. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. దిక్కులు నిన్ను తీక్ష్ణము చేసినవి. నీయందు మనస్తేజమున్నది. దిక్కులందు విక్రమింపుము. మమ్ము ద్వేషించు వారిని,మేము ద్వేషించువారిని దిక్కుల నుండి తొలగించుచున్నాము. వారు జీవించకుందురు గాక. ప్రాణములు వారిని విడుచును గాక.
29. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. ఆశానములు నిన్ను తీక్ష్ణము చేసినవి. నీయందు వాత తేజమున్నది. ఆశానములందు విక్రమింపుము. మమ్ము ద్వేషించువారిని మేము ద్వేషించువారిని ఆశానముల నుండి తొలగించుచున్నాము. "సమా జీవీత్ తం ప్రాణో జహాతు".
30. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. ఋక్కు నిన్ను తీక్ష్ణము చేసినది. నీ యందు సామ తేజమున్నది. ఋక్కు మీద విక్రమింపుము. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని ఋక్కు నుండి తొలగించుచున్నాము. "సమా జీవీత్ తం ప్రాణో జహాతు".
31. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. యజ్ఞము నిన్ను తీక్ష్ణము చేసినది. నీయందు బ్రహ్మతేజమున్నది. యజ్ఞము పై విక్రమింపుము. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని యజ్ఞము నుండి తొలగించుచున్నాము. "సమా జీవీత్ తం ప్రాణో జహాతు".
32. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. ఓషధులు నిన్ను తీక్ష్ణము చేసినవి. నీయందు సోమతేజ మున్నది. ఓషధులపై విక్రమింపుము. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని ఓషధుల నుండి తొలగించుచున్నాము. "సమా జీవీత్ తం ప్రాణో జహాతు".
33. నీవు శత్రు నాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. జలములు నిన్ను తీక్ష్ణము చేసినవి. నీయందు వరుణతేజ మున్నది. జలములపై విక్రమింపుము. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని జలముల నుండి తొలగించుచున్నాము. "సమా జీవీత్ తం ప్రాణో జహాతు".
34. నీవు శత్రునాశకమవు. విష్ణువు వంటి పరాక్రమశాలివి. కృషి నిన్ను తీక్ష్ణము చేసినది. నీయందు అన్నతేజమున్నది. కృషిపై విక్రమింపుము. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని కృషి నుండి తొలగించుచున్నాము. "సమా జీవీత్ తం ప్రాణో జహాతు".
35. నీవు శత్రునాశకమవు. నీవు విష్ణువు వంటి పరాక్రమశాలివి. ప్రాణములు నిన్ను తీక్ష్ణము చేసినవి. నీయందు పురుష తేజమున్నది. ప్రాణములపై విక్రమింపుము. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని ప్రాణముల నుండి తొలగించుచున్నాము. "సమా జీవీత్ తం ప్రాణో జహాతు".
36. జయించినది మాది. ఉద్భిన్నము చేసినది మాది. శత్రువు యొక్క సమస్త సేనను అణచుచున్నాను. శత్రువు గోత్రపు, శత్రు పుత్రుని, శత్రువు వర్చస్సు, తేజము, ప్రాణము, ఆయువును చుట్టు ముట్టుచున్నాను. శత్రువును నేలకూల్చుచున్నాను.
37. దక్షిణ దిశన వ్యాపించి, సూర్యుడు సంచరించు మార్గమును నేను అనుసరించుచున్నాను.
"సామే ద్రవిణం యచ్చతు. సామే బ్రాహ్మణ వర్చసమ్" అది నాకు ధనము నిచ్చును గాక బ్రాహ్మణ వర్చస్సు నిచ్చును గాక.
38. జ్యోతిష్మతి దిశలకు ప్రదక్షిణ చేయుచున్నాను. "తామే ద్రవిణం యచ్చన్తు. తామే బ్రాహ్మణ వర్చసమ్ ||
39. "సప్త ఋషీనభ్యా వర్తే |
"తేమే ద్రవిణం యచ్చన్తు. తేమే బ్రాహ్మణ వర్చసమ్ ||"
40. బ్రాహ్మాభ్యావర్తే |
"తేమే ద్రవిణం యచ్చన్తు. తేమే బ్రాహ్మణ వర్చసమ్ ||"
41. బ్రాహ్మణా అభ్యావర్తే |
"తేమే ద్రవిణం యచ్చన్తు. తేమే బ్రాహ్మాణ వర్చసమ్ ||"
42. మేము ఎవరిని అన్వేషించుచున్నామో వారిని ఆయుధములచే ఆచ్చాదించుచున్నాము. వారిని అగ్ని ముఖమునందు పడవేయుచున్నాము.
43. ఈ సమిధారూప ఆయుధము శత్రువును అగ్ని యొక్క కోరలందు పెట్టును గాక. కాంతివంతమై, ఎదిరించరాని ఈ ఆహుతి శత్రువును భక్షించును గాక.
44. నీవు వరుణుని పాశమవు. శత్రువు పుత్రుని అన్న, ప్రాణములను బంధించుము.
45. భువస్పతే! పృథ్విమీద ఉన్నట్టి నీకు సంబంధించిన అన్నమును మాకు అందించుము.
46. దివ్య జలమును సమకూర్చుకొని మేము దానితో సంయుక్తులము అయినాము. అగ్నిదేవా! నేను జల సహితముగ నీ ముందుకు వచ్చినాను. నన్ను వర్చోసంపన్నుని చేయుము.
47. అగ్నిదేవా! నీవు నాకు తేజస్సు, ప్రజ, ఆయువు ప్రసాదించుము. ఋషుల సహితుడగు ఇంద్రుడు నన్ను నీ భక్తునిగా గుర్తించును గాక.
48. ఎవరిని చూచి దంపతులు ఆక్రోశించుచున్నారో, ఎవరి నివారణకు స్తుతులు కటువాక్కు గలవి అగుచున్నవో, అట్టి యాతుధానులను జ్వాలారూపయగు నీ క్రోధమున వారి గుండెలందు తన్నుము.
49. అగ్నిదేవా! నీ తాపమున యాతు ధానులను, రాక్షసులను హతమార్చుము. మూరదేవతలను, ఇతరులను బాధించి ఆనందించు శత్రువులను వధించుము.
50. విద్వాంసుడనగు నేను శత్రువు తలను ముక్కలు చేయుటకు చతుర్భ్రుష్టి జలవజ్రమును ప్రయోగించుచున్నాను. ఈ వజ్రము అతని సర్వాంగములను ఛేదించును గాక. సకల దేవతలు ఇందుకు అనుకూలింతురు గాక.
రెండవ సూక్తము - 6
వినియోగము :-
ఖాదిర కాష్ఠ ఫాల వికారం మణిం శత్రునాశాయ సర్వకామాప్తయే బధ్నాతి సూక్తేనానేన.
పశువు కొరకు వృశ్చ్యమాన యూప అనుమంత్రణ సమయమున దీని వినియోగము. పార్ధివీ మహాశాంతి యొక్క ఖాదిరకాష్ట ఫాలవికార మణి బంధనమున దీని వినియోగము.
1. ఓజస్సు గల నేను ద్వేషము, దుర్భావము గల శత్రువు తల నరుకుచున్నాను.
2. ఈ మణి రస, మంథపూర్ణము. ఇది తేజోయుతమై నా వద్దకు వచ్చి ఉన్నది. ఇది ఫాల నుండి పుట్టిన మణి. ఇది నన్ను కవచము రీతి రక్షించుచున్నది.





