Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
4. సుసమృద్ద అతి రాత్ర వలన (మిగిలినది 2 వలె.)
5. ఈ విషయము గ్రహించి మధువు వేసి అతిథికి అర్పించుచున్నాడో
6. సమృద్ద సత్ర సద్య యజ్ఞము వలన (మిగిలినది 2వలె.)
7. ఈ విషయము గ్రహించి మాంసమును శుద్ది చేసి భక్ష్య పదార్ధమును అతిథికి అర్పించుచున్నాడో
8. అతడు సుసమృద్ద ద్వాదశాహము చేయుట వలన (మిగిలినది 2వలె.)
9. ఈ విషయము తెలిసి అతిథి కొరకు భక్ష్య పదార్ధము జలముచే శుద్ది చేసి తెచ్చునో
10. అతడు ప్రజావృద్దిని, ప్రతిష్టను పొంది ప్రజలకు ప్రియతముడు అగుచున్నాడు.
ఆరవ సూక్తము - 10
1. అందువలన ఉషలు శబ్దించుచున్నవి. సవిత ప్రస్తుతించుచున్నాడు.
2. బృహస్పతి తన శక్తిచే ఉద్గాయనము చేయుచున్నాడు. త్వష్ట పుష్టి కలిగించుచున్నాడు. విశ్వే దేవతలు బృహస్పతి వదిలిన చోటి నుండి సాగించుచున్నారు.
3. ఈ విషయము గ్రహించిన వానికి ప్రజా, సంపద, పశు సమృద్ది కలుగుచున్నది.
4. ఉదయించు సూర్యుడు శబ్దించుచున్నాడు. కిరణములు ప్రశంసించుచున్నవి.
5. సూర్యదేవత అతని అంతమును అస్తమింపజేయుచు మధ్యాహ్నమున ఉద్గాయనము, అపరాహ్ణమున భోజనము కలుగజేయుచున్నాడు. (తదుపరి 3వలె.)
6. అభ్రము ప్రాదుర్భూతమై శబ్దించుచున్నది. గర్జన స్తుతించుచున్నది.
7. మెరయుచు ప్రతిహరణము కురియుచు గానము చేయుచున్నది. (తక్కినది 3 వలె.)
8. అతిథులవైపు చూచును. హింకరించును. అభివదించును. స్తుతించును. యాచించును. ఉద్గానము చేయును.
9. ఉచ్చిష్ట నిధనముల ఉపహరణము, ప్రతిహరణము చేయును.
10. దీనిని ఎరింగినవాడు సంపదలు, ప్రజలు, పశువులు కలవాడు అగుచున్నాడు.
ఏడవ సూక్తము - 11
1. క్షత్తను ఆహ్వానించినవాడు శృతిని విన్నవాడు అగుచున్నాడు.
(ప్రసవితావైక్షత్తా అని శాఠ్యము. కలిగించువాడని.)
2. ఏది ప్రతిశ్రవణమగునో అది ప్రత్యశ్రావము అగుచున్నది.
3. చేత పాత్రలు గొని వడ్డించుటకు అటూనిటు తిరుగువారు చమసము, అధ్వర్యు అగుచున్నారు.
4. అతిథులందు ఏ ఒక్కడు ఆహుతులు ఇవ్వనివాడు ఉండడు.
5. అతిథులకు తినిపించి ఇంట బయట నిలిచిన అతిథిలతి అవభ్రుత స్నానము చేసి ఇంటికి చేరినవాడగుచున్నాడు.
6. భోజన పదార్ధములను వేరువేరుగా అందించువాడు వేరు వేరు జనులకు దక్షిణ లిచ్చువాడగుచున్నాడు. అనుకూలుడై నిలిచినవాడు ఉద్వాసన చేసినవాడగుచున్నాడు.
7. అతడు భూమి మీద పిలిచినా వారి వద్ద భుజించుచున్నాడు. పృథివి మీద ఉన్న వివిధ రూప ప్రాణులు పిలిచినపుడు వారి వద్ద భుజించుచున్నాడు.
8. అంతరిక్షమున పిలిచినవారి వద్ద భుజించుచున్నాడు. అంతరిక్షమున ఉన్న వివిధ రూప ప్రాణులు పిలిచినపుడు భుజించుచున్నాడు.
9. దివి యందు పిలువబడినవాడై భుజించుచున్నాడు. దివి యందలి వివిధ రూప ప్రాణులు పిలిచినపుడు వారివద్ద భుజించుచున్నాడు.
10. ఆహ్వానించినపుడు దేవతలతో భుజించుచున్నాడు. దేవతలందలి వివిధ రూప ప్రాణులు ఆహ్వానించినపుడు భుజించుచున్నాడు.
11. ఆహ్వానించగా లోకములందు భుజించుచున్నాడు. లోకములందలి వివిధ రూప ప్రాణులు ఆహ్వానించగా భుజించుచున్నాడు.
12. అతడు ఈలోకమున, ఆ లోకమున ఆహ్వానించబడుచున్నాడు.
13. అతడు ఈ లోకమును, ఆ లోకమును పొందుచున్నాడు.
14. జ్యోతిష్మతో లోకాన్ జయతి య ఏవం వేద ఇది తెలిసినవాడు జ్యోతిష్మంత లోకములను జయించినవాడగుచున్నాడు.
నాలుగవ అనువాకము
మొదటి సూక్తము - 12
వినియోగము : గోష్ఠ కర్మమున అనుడుత్సవమున దీనిచే నిరుప్త హవియొక్క అభిమర్సన సంపాతన దాత్రువాచన, దానము కూడ చేయునది.
1. ఈ వృషభపు కొమ్ములు ప్రజాపతి, పరమేష్టి - శిరము ఇంద్రుడు - అగ్ని లలాటము - యముడు కృకటము అగుచున్నారు.
2. సోమరాజు మస్తిష్కము - ద్యౌ పై దవడ - పృథివి క్రింది దవడ అగుచున్నారు.
3. విద్యుత్తు జిహ్వ - మరుత్తు దంతములు - రేవతి గ్రీవము - కృత్తిక స్కంథము - "ఘర్మో వహః" అగుచున్నవి.
4. విశ్వము వాయువు, స్వర్గము లోకము "కృష్ణద్రం విధరణీ నివేష్యః" అగుచున్నవి.
5. శ్యేనము క్రోడము -అంతరిక్షము పాజస్యము - బృహస్పతి కకుదము - బృహతి అస్థులు అగుచున్నవి.
6. దేవపత్నులు పృష్ణములు - ఉపసదము పార్శ్వము అగుచున్నవి.
7. మిత్రావరుణులు బాహువులు - త్వష్ట, ఆర్యమ భుజములు - మహాదేవుడు హస్తములు అగుచున్నారు.
8. ఇంద్రాణి కటి - వాయువు తోక "పవమానో బాలాః" అగుచున్నారు.
9. బ్రాహ్మణ క్షత్రియులు నితంబములు - బలము ఊరువులు అగుచున్నారు.
10. ధాత, సవిత అష్టీవములు - గంధర్వులు జంఘలు - అప్సరసలు కుష్టికలు - అదితి శఫము అగుచున్నారు.
11. చేతము హృదయము - మేధ యకృత్తు 'వ్రతం పురీతత్' అగుచున్నవి.
12. క్షుత్ కుక్షిః - ఇరావనిష్టుః పర్వతాః ప్లాశయః
13. క్రోధో వృక్కౌ - మన్యుః ఆన్డౌ - ప్రజాశేపః
14. నదులు సూత్రములు - వర్షపతి స్తనములు - మెరుపు పొదుగు అగుచున్నవి.
15. విశ్వవ్యచాః చర్మ - ఓషధయః లోమాని - నక్షత్రాణి రూపమ్.
16. దేవజనాః గుదాః - మనుష్యాః ఆంత్రాణి - అత్రః ఉదరమ్.
17. రక్షాంపి లోహితమ్ - ఇతర జనాః ఊబధ్యమ్.
18. "అభ్రం పీబో మజ్జా నిధనమ్"
19. అగ్నిః ఆసీనః - ఉత్థితః అశ్వినా.
20. ఇంద్రుడు పూర్వ భాగమున, యముడు దక్షిణ భాగమున నిలిచి ఉన్నారు.
21. పశ్చిమపు వృషభాము ధాత, ఉత్తరపు వృషభము సవిత అగుచున్నారు.
22. గడ్డి లభించిన ఎద్దు సోమరాజు అగుచున్నది.
23. "మిత్ర ఈక్షమాణ ఆవృత్త ఆనందః".
24. యుజ్యమానః వైశ్వదేవః - యుక్త ప్రజాపతిః - విముక్తః సర్వమ్.
25. ఈ విశ్వరూపము - సర్వ రూపము గోరూపమే అగుచున్నది.
26. వీనిని తెలిసిన వాడు సర్వ ప్రకారముల, సర్వ రూపముల పశువులు కలవాడు అగుచున్నాడు.
రెండవ సూక్తము - 13
వినియోగము : శిరోరోగము మున్నగు వాని సర్వభైషజ్య కర్మమున ఈ సూక్తముచే రోగి దేహమును అభిమర్సన చేయునది. తదుపరి 21, 22 మంత్రములచే ఆదిత్యుని ఉపస్థానము చేయునది. దీని పాఠము అంహోలింగ గణములందున్నందున సర్వ వ్యాధి చికిత్స యందు వినియోగము.
1. శీర్షక్తి, శీర్షామయ, కర్ణశూల, విలోహితవంటి నీయొక్క సకల శిరో రోగములను బయటికి పంపుచున్నాను.
2. నీ చెవుల నుండి, కంకూషముల నుండి కర్ణశూల, విసల్పకములను సర్వ శిరో రోగముల నుండి బయటికి పంపుచున్నాను.
3. నీ చెవులకు, ముఖమునకు వ్యాపించు సకల శిరోరోగములను బయటికి పంపుచున్నాను.
4. ఏ రోగము పురుషుని ప్రమోతము, అంధము కలిగించుచున్నవో అట్టి సకల శిరోరోగములను బయటికి పంపుచున్నాను.
5. అంగభేద, అంగజ్వర, విశ్వాంగ్య, విసకల్పక సర్వ శిరో రోగములను బయటికి తరుముచున్నాను.
6. భయంకర ప్రతీకాశమై మనిషిని వడకించు పూర్ణ శరత్తున వచ్చు జ్వరమును "బహిర్నిమన్త్ర యామహే" బయటికి పంపుచున్నాము.
7. ఊరువులందు, గవీనికలందు తిరుగనట్టి యక్ష్మ రోగమును లోపలి నుండియు "బహిర్నిమన్త్రయామహే"
8. కామ, అకామము వలన హృదయమున పుట్టి హృదయమును బలహీన పరచు వ్యాధిని సర్వాంగములనుండి "బహిర్నిమన్త్రయామహే"
9. హరిమ, ఉదరాంతర్గత, యక్ష్మోధ వ్యాధులను అంతరాత్మ నుంచి 'బహిర్నిమన్త్రయామహే'
10. బలాసముక్షిప్తము, మూత్ర రోగము, నష్టము మున్నగు సమస్త రోగముల విషములు నీ నుండి బయట పడుటను చూపుచున్నాను.
11. కాహా వహమను రోగము నీ ఉదర బిలమునుండి బయట పడునుగాక సకల రోగముల విషములు నీ నుండి బయట పడుటను చూపుతున్నాను.





