Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
2. దేవ, మనుష్యులు ఇట్లన్నారు :-
మనము ఉభయులు జీవించు విధమును అతడు ఎరిగి ఉన్నాడు. కావున అతనిని మనవద్దకు ఆహ్వానింతము.
3. అతనిని ఆహ్వానించినారు.
4. శక్తి - బలము వచ్చును గాక. స్వధవచ్చును గాక. సత్య వాక్కు - వచ్చును గాక. ఇరావతి వచ్చును గాక.
5. అప్పుడు ఇంద్రుడు వత్సము, గాయత్రి అభిదానము, మేఘము పొదుగు అయినది.
6. బృహత్సామము, రథంతరము రెండుచన్నులు, యజ్ఞా యజ్ఞియ, సామములు రెండు చన్నులైనవి.
7. దేవతలు రథంతర సామమున ఓషధులను బృహత్సామమున వ్యచను పితికినారు.
8. వామదేవ సామమున జలమును యజ్ఞ యాజ్ఞియ సామమున యజ్ఞమును పితికినారు.
9. ఈ విషయము గ్రహించిన వానికి రథంతరము ఓషధులను బృహతి వ్యచను ప్రసాదించుచున్నది.
10. వామదేవుడు జలమును, యజ్ఞ యాజ్ఞియము యజ్ఞమును ప్రసాదించుచున్నవి.
నాలుగవ సూక్తము - 22
1. అతడు విక్రమించినాడు. వనస్పతులందు చేరినాడు. వనస్పతులు అతనిని హననము చేసినవి. అప్పుడు అతడు సంవత్సరము అయినాడు.
2. కావుననే తెగిన వనస్పతులు వర్షమున మరల తలెత్తుచున్నవి. ఈ విషయము గ్రహించిన వాని శత్రువు నష్టపడుచున్నాడు.
3. అతడు విక్రమించినాడు. పితరుల వద్దకు చేరినాడు. వారు అతనిని తంలో చేర్చుకున్నారు. అప్పుడు అతడు మాసములు, మాసములు అయినాడు.
4. కావుననే పితరులకు ప్రత్యేక మాసమున నోటికి అందించబడుచున్నది. ఈ విషయము గ్రహించినాడు పితృయాన మార్గమును తెలియుచున్నాడు.
5. అతడు విక్రమించినాడు. దేవతల వద్దకు చేరినాడు. వారు అతనిని తమలో లీనము చేసికున్నారు. అప్పుడు అతడు అర్ధమాసముగా ప్రాదుర్భవించినాడు.
6. కావుననే దేవతలకు అర్ధ మాసమున 'వషట్' చేయుచున్నారు. ఈ విషయము గ్రహించినవాడు దేవయాన మార్గమును తెలియుచున్నాడు.
7. అతడు విక్రమించినాడు. మనుష్యుల వద్దకు చేరినాడు. వారు అతనిని తమలో లీనము చేసికొన్నారు. అప్పుడు అతడు వెంటనే ప్రాదుర్భవించినాడు - "సాపద్యః సమభవత్"
8. కావున మనుష్యుల కొరకు రెండవ రోజు ఉపహరణము చేయబడుచున్నది. ఇది తెలిసిన వాని ఇంట నిత్యము అన్నము చేరుచున్నది.
అయిదవ సూక్తము - 23
1. అతడు విక్రమించినాడు. అసురుల వద్దకు చేరినాడు. వారు అతనిని 'మాయా! రమ్ము!' అని ఆహ్వానించినారు.
2. వారికి ప్రహ్లాద పుత్రుడు విరోచనుడు వత్సమైనాడు. ఇనుపగిన్నె పాత్రయైనది.
3. దానిని రెండు తలల "అత్వర్యుడు" పితికినాడు. మాయను పితికినాడు.
4. ఆ మాయచే అసురులు ఉపజీవనము చేయుచున్నారు. ఇది తెలిసినవాడు ఉపజీవనీయుడు అగుచున్నాడు.
5. అతడు విక్రమించినాడు. పితరుల వద్దకు చేరినాడు. వారు అతనిని 'స్వధా! విచ్చేయుము అని ఆహ్వానించినారు.
6. వారికి యమరాజు వత్సమైనాడు. వెండిగిన్నె పాత్ర అయినది.
7. దానిని మృత్యుదేవతయగు 'అంతకుడు' పితికినాడు. దానినుండి స్వధను పితికినాడు.
8. ఆ స్వధ చేత పితరులు ఉపజీవనము చేయుచున్నారు. ఇది తెలిసినవాడు ఉపజీవనీయుడు అగుచున్నాడు.
9. అతడు విక్రమించినాడు. మనుష్యుల వద్దకు చేరినాడు. వారు అతనిని "ఇరావతీ! విచ్చేయుము" అని తమ వద్దకు పిలిచినారు.
10. వారికి వివస్వత పుత్రుడు మనువు వత్సమైనాడు. "పృథివీ పాత్రమ్" భూమి పాత్రయైనది.
11. దానిని వేన పుత్రుడగు పృథువు పిదికినాడు. అతడు కృషిని, సస్యములను పిదికినాడు
12. కృషి మరియు సస్యములచే మానవులు ఉపజీవనము చేయుచున్నారు. ఇది తెలిసినవాడు ఉపజీవనము అగుచున్నాడు.
13. అతడు విక్రమించినాడు. సప్తర్షుల వద్దకు చేరినాడు. వారు అతనిని 'బ్రహ్మణవతీ! విచ్చేయుము' అని తమ వద్దకు పిలిచినారు.
14. వారికి సోమరాజు వత్సము. ఛందస్సు పాత్ర అయినది.
15. దానిని అంగిరస బృహస్పతి పిదికినాడు. బ్రహ్మ మరియు తపమును పితికినాడు.
16. కావుననే సప్తర్షులు బ్రహ్మ, తపస్సులచే ఉపజీవించుచున్నారు. ఇది తెలిసిన వాడు బ్రహ్మవర్చస్వి అయి ఉపజీవనీయుడు అగుచున్నాడు.
ఆరవ సూక్తము - 24
1. అతడు విక్రమించినాడు. దేవతలను చేరినాడు. వారు అతనిని "ఊర్జా! విచ్చేయుము" అని ఆహ్వానించినారు.
2. అప్పుడు ఇంద్రుడు వత్సము చమసము పాత్ర అయినది.
3. సవిత దానిని పిదికినాడు. పిదికినది 'ఊర్జ' అయినది.
4. వారు ఊర్జతోనే ఉపజీవించుచున్నారు. ఇది తెలిసిన వాడు ఉపజీవనీయుడు అగుచున్నాడు.
5. అతడు విక్రమించినాడు. గంధర్వ, అప్సరసలను చేరినాడు. వారు అతనిని "పుణ్యగంధా! ఏహి" అని తమ వద్దకు ఆహ్వానించినారు.
6. దానికి సూర్యవర్చ పుత్రుడు చిత్రరథుడు వత్సము. పుష్కరపర్ణము పాత్ర అయినది.
7. దానిని సూర్యవర్చ పుత్రుడు చిత్రరథుడు పితికినాడు. పితికినది పుణ్య గంధమైనది.
8. గంధర్వ అప్సరసలు పుణ్యగంధముతోడనే ఉప జీవించుచున్నారు. ఇది తెలిసినవాడు 'ఉపజీవనీయో భవతి'
9. అతడు విక్రమించినాడు. ఇతర జనులకు చేరినాడు. వారు అతనిని "తిరోధ ఏహి" అని తమ వద్దకు ఆహ్వానించినారు.
10. దానికి విశ్రవ పుత్రుడు కుబేరుడు వత్సము. పచ్చిమూకుడు పాత్ర అయినది.
11. దానిని రజతనాభి కుబేరుడు పితికినాడు. పితికినది తిరోధమైనది.
12. ఇతర జనులు తిరోధముతో ఉపజీవించుచున్నారు. ఇది తెలిసినవారు పాపములను తిరోహితము చేసి 'ఉపజీవనీయో భవతి'
13. అతడు విక్రమించినాడు. సర్పముల వద్దకు చేరినాడు. అవి అతనిని "విషవత్యే హి" అని తమ వద్దకు పిలిచినవి.
14. దానికి వైశాలేయ తక్షకుడు వత్సము. అలాబు పాత్ర పాత్ర అయినది.
15. దానిని ఐరావత వంశ ధృతరాష్టసర్పము పిదికినది. పిదికినది విషమైనది.
16. ఆ విషముచే సర్పములు ఉపజీవించుచున్నవి. ఇది తెలిసినవాడు "ఉపజీవనీయో భవతి"
ఏడవ సూక్తము - 25
1. కావున ఎవడు ఈ విషయములు గ్రహించుచున్నాడో అతని మీద అలాబుచే విషము ప్రయోగించినదో ప్రతిహంత అగుచున్నాడు.
2. మనసుతోనే ప్రతిహత్యా చేయుచున్నాననుకొనకుము. వాస్తవముగనే ప్రతిహత్య చేయుచున్నాను.
3. ప్రత్యాహంతికి విషమేవ తత్ ప్రత్యాహంతి.
4. ఇది గ్రహించిన వానికి అప్రియవిషము శత్రువుల పాలగుచున్నది.
విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాల సాహిత్యకర్త, విమర్శకుడు, చలనచిత్ర రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమర సేనాని, ప్రగతిపథగామి, ప్రసన్నుడు, "చిల్లర దేవుళ్ళు" "మోదుగు పూలు" "జనపదం" "రానున్నది ఏది నిజం?" "మాయజలతారు" "శరతల్పం" "మానవత" "పావని" నవలల రచయిత యగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన అథర్వవేద సంహిత యందలి ఎనిమిదవ కాండము సమాప్తము.





