Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

1.    ధేనువు సత్కర్మలు చేయు వారికి సత్ఫలితములను ఇచ్చును గాక. ధేనువు పాదము యజమానులను పవిత్రము చేయుచున్నది. ధేనువు ఘ్రుతప్రద. సోమపుష్ట సకలదేవ సంబంధి అట్టి ధేనువు మా యజ్ఞములను సర్వధా వర్ధిల్ల చేయును గాత. (3)
   
                                           --౦౦౦--
   
1.    దర్భ పిడికిలి మాకు అవినాశ్యమగును గాక. గొడ్డలి మాకు స్వస్తి యగును గాక. రంపము మాకు స్వస్తి యగును గాక. హవిస్సులు అర్ధించు వారును, యజ్ఞాధి దేవతలు, యజ్ఞకాములు ఈ మా యజ్ఞమును సేవింతురు గాక. (4)
   
                                                    --౦౦౦--
   
1.    అగ్ని, విష్ణుదేవతలారా! మీ మహాత్మ్యము గొప్పది. మీరు గుహ్య ఘ్రుతమును సేవింతురు. స్తోతలకు సప్తరత్నములు ప్రసాదింతురు. మీలో ఒకరి జిహ్వ హోమఘ్రుతమును స్వీకరించుచున్నది. (5)
   
2.    అగ్ని విష్ణువులారా! మీ మహా ధామము సర్వప్రియము. మీరు గుహ్య ఘ్రుతమును ఆరగించువారు. మీరు యజమానుల గృహములందు వారి స్తుతులచే వర్ధిల్లుచున్నారు. మీలో ఒకరి జిహ్వ హోమ ఘ్రుతమును స్వీకరించుచున్నది. (6)
   
                                                --౦౦౦--
   
1.    ద్యావాపృథ్వులు, సూర్యుడు, బ్రహ్మణస్పతి, సవితా దేవత మాకు కనుల పండుగ చేయుదురు గాక. (7)
   
                                                            --౦౦౦--
   
1.    ఇంద్రదేవా! మమ్ము అనేక రాక్షసుల నుండి రక్షించండి. నీ రక్షణలందు మాకు జీవితము ప్రసాదించుము. మమ్ము ద్వేషించు శత్రువు బోర్ల పడును గాక. మేము ద్వేషించువాడు ప్రాణములు వదలును గాక. (8)
   
                                             --౦౦౦--
   
1.    అగ్ని ప్రసన్నులను చేయువాడు. సర్వప్రియుడు. స్తుతించబడి ఫలములు ఇచ్చువాడు. ఘ్రుతాహుతులచే వర్ధిల్లువాడు. అట్టి అగ్నికి నమస్కరించుచున్నాము. "దీర్ఘమాయుః కృణోతుమే" నన్ను దీర్ఘాష్కుని చేయును గాక. (9)
   
                                              --౦౦౦--
   
1.    మరుత్తులు, పూష, బృహస్పతి, అగ్ని మాకు ధనము సంతానము కలిగింతురు గాక. "దీర్ఘమాయుః కృణోతుమే" (10)
   
                                       మూడవ సూక్తము - 8
   
వినియోగము :-

   
      1) ద్వేషించు పురుషునకు పుత్ర సంతానము లేకుండ చేయుటకు ఆడ కంచరిగాడిద మూత్రమును రాతితో చిలికి మొదటి మంత్రముచే అభిమంత్రించి దానిని అన్నముతో కలిపి అతని భార్యకు ఇచ్చునది. అట్లేచేసి ఆమె  అలంకారములను తడుపునది. అన్నముతో కలుపరాదు. ఆమెను వంధ్యను చేయుటకు ఈ మంత్రముచే ఆమె సీమంతమును చూచునది.
   
      2) అభిచార కర్మమున 1, 2 మంత్రములచే పిడుగు పడిన చెట్టు సమిధలను ఉంచునది. అగ్ని  చయనపు అయిదవ చితి యందు పెట్టదగిన అసపత్నేష్టిని వీనిచే అభిమంత్రించునది.
   
      3) వివాహపు నాలుగవ నాడు 5 వ మంత్రముచే వధూవరులు నేత్రములను స్వచ్చము చేసికొనునది.
   
      4) సౌభాగ్య సంవనవ కర్మమున 7 - 11 మంత్రములచే సౌవర్చల మూలమును సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది. వీనితోనే శంఖపుష్పి పుష్పమును అభిమంత్రించి స్త్రీ తలకు కట్టునది.
   
1.    అగ్నిదేవా! పుట్టి ఉన్న నా శత్రువులను దూరము చేయుము. జాతవేదా! పుట్టనున్న శత్రువును మాతో యుద్దము కోరు శత్రువులను పాదముల కింద నలిచి వేయుము. అదితి అనుగ్రహమున మేము పాపరహితులమగుదుము గాత.
   
                                             --౦౦౦--
   
1.    జాతవేదాగ్నీ! మాకు ప్రతికూలురగు శత్రువులను అణచివేయుము. పుట్టనున్న శత్రుపుత్రులను సహితము నష్టపరచుము. మేము నివసించు దేశమును సౌభాగ్యవంతము చేయుము. విశ్వేదేవతలు ఈ శత్రువాహన కర్మను ఆమోదింతురు గాత. (2)
   
2.    ద్వేషించునట్టి స్త్రీ! నీవు గర్భము ధరించుటకు లోనున్న నూరు నాడులను, బయట ఉన్న వేయినాడులను - నిన్ను గొడ్రాలిని చేయుటకు గాను రాళ్ళతో కొట్టి పనికి రాకుండ చేయుచున్నాను. (3)
   
3.    ప్రతికూల నారీ! నీ యోనిని బయటకు లాగుచున్నాను. నీకు స్త్రీ పురుష సంతానము లేకుండ చేయుచున్నాను. నీ గర్భధారణ స్థానమును రాతితో మూయుచున్నాను. (4)

                                             --౦౦౦--
   
1.    మా వధూవరుల చూపులందు తేనె నిండును గాక. మా కన్నులకు కాటుక తగులును గాక.
   
    (వధూవరులు పరస్పరము అనుచున్నారు :-.)
   
    నీవు నా మనసులో నిలిచి పొమ్ము. మన మనసులు కలసి పోవును గాత. (5)
   
                                           --౦౦౦--
   
1.    పతిదేవా! నా వెంట ఉండుమని నా కొంగునకు కట్టుచున్నాను. నీవు కేవలము నా వాడవగుము. మరొక దాని పేరు సహితము ఎత్తకుము. (6)
   
                                          --౦౦౦--
   
1.    ఇది పతి వశీకరణము. పతిని వేరొక చోటునకు పోకుండ నిరోధించును. విముఖుడైన పతిని సుముఖుని చేయునది. పతిని సుఖపెట్టునది. అట్టి ఓషధిని త్రవ్వి తీయుచున్నాను. (7)
   
2.    శచీదేవి ఇంద్రుని దేనిచే తన వశమునందుంచుకున్నదో, అట్లే నా భర్తను నావశ వర్తుని చేయుచున్నాను. ఆనందపరవశుని చేయుటకే వశపరచుకొనుచున్నాను. (8)
   
3.    ఓషధీ! నీవు సోముని వశపరచుకున్నావు. సూర్యుని వశపరచుకున్నావు. సమస్త దేవతలను వశపరచుకున్న నిన్ను నా భర్తను నాకు వశపరచుమని ప్రార్దించుచున్నాను. (9)
   
4.    స్వామీ! న మాటలు మాత్రమే వినుము. మారు పలుకకుము. విద్వత్సభలందు మాట్లాడుము. నీవు నా వాడవు మాత్రమే కావలెను. మరొక దాని మాట ఎత్తకుము. (10)
   
5.    నీవు దూరమున ఉన్నపుడో, నది మానను దూరము చేసినపుడో ఈ ఓషధి నిన్ను కట్టితెచ్చి నాముందు ఉంచును గాక. (11)
   
                                         నాలుగవ అనువాకము
                                         మొదటి సూక్తము - 9
   

వినియోగము :-   

   
      1) మొదటి రుక్కుచే వృషభవపచే ఇంద్రుని యజించునది.
   
      2) అన్వారంభణీయే యందు సారస్వత పురోడాశమును 2, 3 మంత్రములచే అనుమంత్రించునది.
   
      3) కొత్త ఇల్లు కట్టు భూమిని శుద్ది చేయుటకు 4, 5 మంత్రములచే అచ్చోట శ్యేనచరు ఆహుతి ఇచ్చునది.
   
      4) అగ్నిష్టోమ హవిర్దానమున పురోడాశము అర్పించిన తరువాతి పిండమును 5వ మంత్రముచే అనుమంత్రించునది.
   
      5) సర్వవ్యాధి చికిత్సకు రోగి కీళ్ళను ముంజ పాశములతో కట్టి 6, 7 మంత్రములచే శరపింజూలముల సహితముగ ఉదక కుంభమును అభిమంత్రించి రోగిని స్నానము చేయించునది లేదా పైన చల్లునది. సర్వసంపదలు కోరువాడు వీనిచే రుద్రుని యజించునది. లేదా ఉపస్థానము చేయునది.
   
      6) అపవాదులచే కలిగిన కళంకమును దూరము చేయుటకు 8వ మంత్రముచే అన్నమును అభిమంత్రించి ఇచ్చునది. ద్రుఘణమణి లేదా దాని వంటి పలాశము, ఇనుము, బంగారములలో ఒక మణిని   సంపాతన,అభిమంత్రణలు చేసి కట్టునది.
   
      7) సంమావస్య కర్మమున 9వ మంత్రముచే ఏనుగు మున్నగు వాహనములను సంపాతిత, అభిమంత్రతములు చేసి సంమానస్యము కోరు వానిని ఇంటికి తీసుకొని వచ్చి అన్నము లేక మంథమును సంపాతిత అభిమంత్రితములు చేసి తినిపించునది. ఉక్ధ్యమున బ్రహ్మ దీనిచే అచ్చావాక యాజ్య హోమమును   అనుమంత్రించునది.
   
      8) ఈర్ష్యను నష్టపరచుటకు 10వ మంత్రమును ఈర్ష్యాళువును చూచుచు జపించునది. ఈర్ష్యాళువును తాకి దీనిని జపించునది. సక్తుమంథమును అభిమంత్రించి ఈర్ష్యాళువునకు ఇచ్చునది.
   
1.    సరస్వ దేవత దివ్యుడు. స్వర్గయోగ్యుడు. చక్కని నడకలవాడు. జలవంతుడు. విస్తారుడు. జలమధ్య రూపి. ఓషధీ గర్భుడు. వర్షించువాడు. సకల ప్రాణులకు తృప్తి కలిగించువాడు. సంపన్న దేశమున నివసించువాడు. ఇంద్రుడు అట్టి దేవతను మా గోష్ఠమున నిలుపును గాక.
   
1.    సరస్వ దేవతను పశువులు అనుసరించును. అతడి వలననే జలములు సంగమించును. అతని యందే పుష్టిపతి నివసించి ఉన్నాడు. అట్టి సరస్వాన్ దేవతను "వాహమహే" (2)
   
2.    సరస్వాన్ దేవత స్తోతలను ప్రసన్నులను చేయుటకు ప్రత్యక్షమగువాడు. యజమానికి ఇష్టఫల ప్రదాత. పుష్టిపతి. ధనస్థానస్థితుడు. ధనపతి. యజమానులకు అన్నము అందించగోరువాడు. అట్టి దేవతను ఆహ్వనించుచున్నాము. (3)
   
                                                 --౦౦౦--
   
1.    సూర్యుడు కర్మసాక్షి కర్మఫలము కలిగించువాడు. యుగాంతము చూచువాడు. మంచి నడకలవాడు. అతడు మరుభూములు సహితము ఫలించునట్టి వర్షము కలిగించును గాక. ద్యులోకపు దిగువ లోకములను అతిక్రమించి - మిత్రుడగు ఇంద్రసహితుడై శుభములు కలిగించుటకు విచ్చేయును గాక. (4)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.