Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

3. వాజీకరణము కోరువాడు ఒకే కొమ్మగల అర్క వృక్షమణిని మూడవతృచ మొదటి మంత్రముచే సంపాతన, అభిమంత్రణలు చేసి అర్క సూత్రముచే కట్టునది. మూడవ మంత్రముచే కృష్ణ చర్మ మణిని సంపాతన, అభిమంత్రణలు చేసి కృష్ణ మృగపు వెంట్రుకచే కట్టునది.
   
1.    మాంసము, సుర, జూదముల మీది అపేక్షగలవారి పరివేదన వలెను, భోగవాంఛ గల పురుషుని మనసు స్త్రీమీదకు ఉరికినట్లును అవధ్యయగు ధేనువు వత్సమును ప్రసన్నము చేయునుగాక.
   
2.    మగ ఏనుగు ఆడ ఏనుగు కాలును తన కాలితో లేపినట్లు బోగవాంఛ గల పురుషుని మనసు స్త్రీ మీదకు ఉరికినట్లు అవధ్యయగు ధేనువు వత్సమును ప్రసన్నము చేయునుగాక.
   
3.    రథ చక్రములను ఇరుసు- ఇరుసును రథ చక్రమును పట్టుకొని ఉన్నట్లు - భోగవాంఛ గల పురుషుని మనసు స్త్రీమీదకు ఉరికినట్లు అవధ్యయగు ధేనువు వత్సమును ప్రసన్నము చేయునుగాక.
   
                                          --౦౦౦--

   
1.    ఆకలికి అనేక రకముల అన్నములు తిన్నాను. ఆశకు దొరికిన హిరణ్యము పరిగ్రహించినాను. ఆ దోషములను హోమ నిష్పాదక అగ్ని నివారించునుగాక.
   
2.    హుత, ఆహుతులను స్వీకరించిన దేవతలు, మానవులు అనుమతించిన వాటి కొరకు నా మనసు ఉవ్విళ్ళూరినది. ఆ దోషములను హోమ నిష్పాదక అగ్ని నివారించునుగాక.
   
3.    దేవతలారా! నేను అబద్దములాడి ఇతరుల అన్నము గుంజుకొని తిన్నాను. ఇవ్వవలసిన ధనము ఇత్తునన్నాను. ఇవ్వలేదు. అయినను ఆ వైశ్వానరాగ్ని నాకు సుఖకరుడు, మధుమయుడు అగునుగాక.
   
                                            --౦౦౦--
   
1.    పురుషుడు బద్దుడయ్యు అసురమాయచే రూపములను చూచుచు, తన ముందున్న వారిలో వ్యాపించునో అట్లే నీ శిశ్నము స్త్రీ యోని యందు ప్రవేశించునుగాక.
   
2.    తయోదరమును ప్రాణి ఉపస్థ గాలికి స్థూలమగుచున్నదో, పరస్వత్ మృగపు శిశ్నము ఎట్లుండునో నీ శిశ్నము కూడ అట్లు ఉండునుగాక.
   
3.    అంగముతో ప్రకటమగు పరస్వత్, హస్తి, గార్ధభము, కంచరగాడిద, అశ్వముల శిశ్నము వలె నీ శిశ్నము పెరుగును గాక.
   
                                             ఎనిమిదవ అనువాకము
                                          మొదటి సూక్తము - 36

   
వినియోగము:

   
       1. ఇందలి రెండు తృచలు సాంమనస్య కర్మమున వినియోగములు.
   
       2. ఇందలి మొదటి తృచ పాఠము వస్తోత్పత్య గణమున ఉన్నందున శాంత్యుదకాదులందును, వస్తోత్పత్య గణములందును వినియోగము.
   
    దీనిలోని మూడవ మంత్రముచే నూతన గృహ ప్రవేశమున పూర్ణ పాత్రను తెచ్చిన తరువాత యజమాని  మాట్లాడడు 'వాచం విసృజేత్'
   
1.    వరుణ, సోములారా! విచ్చేయండి అగ్ని బృహస్పతులారా! వసువుల సహితులై విచ్చేయండి. బంధువులారా! ఈ యజమాని బాల సంపన్నుడు. కార్యాకార్యములు తెలిసినవాడు. ఇతనితో సమ మనస్కులై వ్యవహరించండి.
   
2.    బంధువులారా! మీకు శోషక బలము ఉన్నది. మీ మనసులమ్దు కోరికలు ఉన్నవి. నేను ఘ్రుతాహుతులిచ్చి ఆ రెంటికి సంబంధము కలిగించుచున్నాను. నాతో సమ మనస్కులు కాదలచిన మీరు నాకు అనుకూలురై ఉండండి.

3.    బంధువులారా! మా ఇంటి విషయమున మీరు అనురాగ పూర్వకముగ ప్రవర్తించండి. మీరు మాకు ప్రతికూలురు కాదలచిన పూష దేవత మిమ్ము ప్రతికూలురు కాకుండ చేయునుగాతే. గృహపాలక దేవత మిమ్ము తేప తేప ఆహ్వానించునుగాక.
   
                                               --౦౦౦--   
   
1.    సమ మనస్కులు కాదలచిన వారలారా! మె దేహములు, మనసులు పరప్సర అనురాగ పూరితములు అగునుగాక. మీ కార్యములు అనుకూలములు అగునుగాక. బ్రాహ్మణస్పతి, భగదేవతయు, మిమ్ము మరల మరల ఆహ్వానించునుగాక.
   
2.    మీ మనసునకు, హృదయమునకు జ్ఞానము కలుగు కార్యము చేయుచున్నాను. భగ దేవత శ్రమించి సాధించిన జ్ఞానమును మీకు కలిగించుచున్నాను.
   
3.    ఆదిత్యులు వసువులతో సమాన జ్ఞానవంతులు అయినారు. రుద్రుడు మరుత్తులతో సమాన జ్ఞానవంతుడు అయినాడు. క్రోధించని త్రినామా! ఈ జనులను అనుకూల మనస్కులను చేయుము.
   
    (త్రినామా - భూమ్యంతరిక్ష ద్యులోకములు పార్ధివ, వైద్యుత, సూర్యాత్మకములు, గార్హ పత్యాది మూడు అగ్నులు.)
   
                                           రెండవ సూక్తము - 37
   
వినియోగము :

   
       1. మొదటి తృచచే అభిచారక తంత్రమున దర్భలు పరచునది. అభ్యాతానాంతమున ఇంగిడ ఆహుతులు ఇచ్చునది. ఇందలి సంస్థిత హోమములు చేయునది.
   
       2. ఈ నాలుగు రుక్కుల రెండవ సూక్తముచే విజయమున స్వస్త్యయనము కోరువాడు, ఖడ్గాది శస్త్రములను  సంపాతన చేసి, చేతితో శుభ్రపరచి అభిమంత్రించి ధరించునది. రాత్రులందు స్వస్త్యయనము కోరువాడు  దీనిని జపించి ముఖము మీద 'ప్రాదేశము' కప్పుకొని పరుండునది.
   
    పరదేశము వెళ్ళదలచిననాడు ప్రయోజన సిద్దికి గాను పడుకొని లేవగానే దీనిని జపించుచు మూడు అడుగులు వేసి ప్రయాణమగునది. లేదా భూమి మీద మూడు ప్రాదేశములు కొలచి సాగునది.
   
1.    మమ్ము బాధించుటకు సైన్యములు కూర్చుకొనువారిని స్థానభ్రష్టులను చేయుచున్నాము. ఇంద్రదేవా! శత్రువధ చేయుమని నీకు ఘ్రుతాహుతులు అర్పించుచున్నాము. శత్రువు మరలిరాని రీతిగా బాదుము.
   
2.    వృత్రహంత ఇంద్రా! శత్రువును వందల సంవత్సరాలకైన తిరిగిరాలేని దూర దేశమున తరిమి వేయుము.
   
3.    ఇంద్రునిచే తరిమి వేయబడిన శత్రువు మూడు భూములు దాటిపోవును గాక. పంచజనులను దాటి పోవును గాక. సూర్య, చంద్ర, అగ్నులు కాంతి ప్రసరించని చోటునకు చేరునుగాక. ఆకాశమున సూర్యుడు ఉన్నంత వరకు వారు తిరిగి రాకుందురుగాక.
   
                                              --౦౦౦--
   
1.    ఇతనిని చుట్టు ముట్టిన వారిని హింసించ దలచినవారి అగ్ని అనేక నాలుకలతో హృదయములందు ఉదయించునుగాక.
   
2.    ఏ అగ్నిని అద్దతి ఋషి దర్శించినాడో, ఆ అగ్ని ముఖము నుండి వచ్చు పొగను కనుగొన్నాడో అట్టి తపింప చేయు అగ్నిని ఆయుష్యము కొరకు స్తుతించుచున్నాను.
   
3.    ఎవడు క్షత్రియుడు సమర్పించు సమిధలను ఎరుంగుచున్నాడో అతడు కుటిలమగు మృత్యు మార్గమున అడుగు వేయకున్నాడు.
   
4.    ఏ క్షత్రియుడు అగ్నిని ఎరింగి అతని నుండి ఆయుష్యము పొందుచున్నాడో అతనిని శత్రువులు వధించజాలరు. శత్రువు అతని దగ్గర ఉన్నను అతడు లక్ష్య పెట్టడు.
   
                                               మూడవ సూక్తము - 38
   
వినియోగము:

   
      1. తొలి తృచచే పారిపోవు స్వభావము గల స్త్రీని నిలుపుటకు త్రాటిని పురివేసి, అభిమంత్రించి మధ్య స్థూణమున కట్టునది, స్త్రీ మంచమునకు రాతిని అభిమంత్రించి కట్టునది. దీనిచే తిలలను ఆహుతి  ఇచ్చునది.
   
      2. రెండవ తృచచే వివాహమందు ఘ్రుతాహుతులిచ్చి వధూవరుల తలల మీదకు సంపాతములు  తెచ్చునది.వివాహమునందే రసములను స్థాలీపాకమును సంపాతన, అభిమంత్రణలు చేసి భోజనమందు భార్యా భర్తలకు తినిపించునది, వివాహమందే ఘ్రుతము కలిపిన యవలను దోసిట నింపి ఆహుతి  చేయునది.
   
1.    ఎట్లు ద్యులోకము నిలిచి ఉన్నదో, ఎట్లు భూమి నిలిచి ఉన్నదో, ఎట్లు పర్వతములు నిలిచిఉన్నవో అట్లు నిలిచి ఉండుటకు అశ్వమును స్తంభమునకు కట్టినట్లు కట్టుచున్నాను.
   
2.    పరాఙ్ముఖ గమనమున వ్యాపించునట్టియు, దిగువన దాగి నడుచుచు వ్యాపించునట్టియు, పారిపోవు వారి గమనమును నిలుపునట్టియు దేవతలను ఆహ్వానించుచున్నాను.
   
3.    జాత వేదాగ్నీ! నిలిపి ఉంచుము. అందుకు వందల ఉపాయములను ప్రయోగించుము. దాగి ఉన్న వేల ఉపాయములు గోచరించునుగాక. మరలించుము.
   
                                              --౦౦౦--
   
1.    ఈ ప్రసిద్ద హవిస్సువలన ఇతడు వర్ధిల్లునుగాక. పిల్లనిచ్చు తల్లిదండ్రుల ఇల్లు పాడి పంటలచే వర్ధిల్లునుగాక.
   
2.    ఈ దంపతులకు సమృద్దమగు పాడి కలుగునుగాక. వీరి దేశము వర్ధిల్లునుగాక. తేజోవంత ధనమున వీరి కోరికలు తీరునుగాక.
   
3.    త్వష్టయే భార్యను సృష్టించినాడు. త్వష్టయే భర్తను సృష్టించినాడు. ఈ త్వష్టయే మీకు వేయేండ్ల వారిని దీర్ఘాయుష్కులను చేయునుగాక.
   
    (దంపతులకు దీర్ఘాయుష్యము, వంశమునకు వేయేండ్లు.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.