Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

6.    సకల ప్రాణులచే దర్శించబడు దేవత సూర్యుడు. అతడు కంటికి కనిపించని క్రిములను నాశము చేయుచున్నాడు. దృశ్య, అదృశ్య క్రిములను హతమార్చుచు ఆదిత్యుడు పూర్వదిశన ఉదయించుచున్నాడు.
   
7.    క్రిములందు శీఘ్రగమనలు పీడించునని గడగడలాడించునవి. తీక్ష్ణములు అవి కనిపించినను, కనిపించని వైనను వానిని హతమార్చుము.
   
8.    వడిగ నడచునవి హతములైనవి. మందగమనలు హతమైనవి. శనగలను రాతితో రుద్దినట్లు క్రిములన్నింటిని నలిపి వేసినాము.
   
9.    త్రిశీర్ష - త్రికకుద - సారంగ, అర్జున వర్ణక్రిములను హతమార్చుచున్నాము. వాటి ప్రక్క టెముకలను విరుచుచున్నాను. తలలు త్రుంచుచున్నాను.
   
10.    క్రిములారా! అత్రివలె, కణ్వునివలె, జమదగ్ని వలె మిమ్ము హతమార్చుచున్నాను. అగస్త్యుని మంత్ర ప్రభావమున మిమ్ము నాశనము చేయుచున్నాము.
   
11.    క్రిముల రాజు చచ్చినాడు. మంత్రి చచ్చినాడు. క్రిముల తల్లి, సోదరులు, భగినులు చచ్చినారు. (వంశము నిర్మూలమైనదని.)
   
12.    క్రిముల స్థానము, దాని పరిసరములు ధ్వంసములైనవి. బీజరూపలకు సూక్ష్మక్రిములు కూడా హతమారినవి.
   
13.    క్రిములలో ఆడవానిని, మగవానిని రాతితో కొట్టినష్టపరచుచున్నాను. నిప్పుతో కాల్చి బూడిద చేయుచున్నాను.
   
వ్యాఖ్య - ఆంగ్లేయులు వార్తకముచేసి అనైక్య భారతావనిని జయించినారు. ఇది వారి బలము కాదు. మన బలహీనత. భారత దేశమును గెలిచిన వారందరు అంతే అది వారి బలము కాదు మన బలహీనత - మన అనైక్యత!
   
    ఆంగ్లేయులు రాజకీయ ప్రభుత్వము వరకు సంత్రుపతులు కాలేదు. భారత సంస్కృతిని మొదలంట ధ్వంసము చేయుటకు వారికి తెలిసిన ఆధునిక ప్రచార సాధనాలను విచ్చల విడిగా వినియోగించి మనవారి తోనే 'మేము దద్దమ్మలము మాకేమిరాదు' అనిపించి మన విధనాలన్నింటినీ మనతోనే వెక్కిరింప చేసినారు!
   
    ఈ ప్రచారమందలి భాగముగనే మనకు వైద్యశాస్త్రము లేదని, తామేవైద్య శాస్త్రమునకు ఆద్యులు మని తమ వైద్య విధానమును ప్రవేశపెట్టి ప్రచారము చేసినారు!
   
    బానిస జాతి తమ సంస్కృతిని రక్షించు కొనజాలదు. వెక్కిరించు కుంటుంది. ప్రభువులకు ఊడిగం చేస్తుంది. మనము అదే చేసినాము. చేస్తున్నాము.
   
    భారతీయ వైద్య విజ్ఞానపు ప్రాముఖ్యతను ఇప్పుడిప్పుడు - మనము కాదు - పాశ్చాత్యులు గుర్తించుచున్నారు. వారికి గత్యంతరము లేదు. ఏనాటికైనను మానవాళికి భారత జీవన విధానమే శరణ్యము! అన్యథా శరణం నాస్తి!!
   
    GERMS - సూక్ష్మ జీవులను మేమే కనిపెట్టినా మన్న పాశ్చాత్యుల వాదన శుద్ద అబద్దమని తేలుచున్నది. సూక్ష్మజీవులు - క్రిములను గురించి ఈ సూక్తమున పేర్కొనబడినది. వైద్య శాస్త్రమున ఇందుకు సంబంధించిన మరిన్ని వివరములు లభించవచ్చును.
   
    ఇప్పటికి పరిశోధించకున్న పరిశోధించి పాశ్చాత్య వైద్య విధానమునకు బుద్ది చెప్పవలసి ఉన్నది.
   
                                            మూడవ సూక్తము - 24
   
వినియోగము.   
   

      1) పౌరోహిత్యము చేయగోరువాడు ఈ సూక్తముచే సమిధలను ఉంచవలెను.
   
      2) వివాహ మందలి ఘ్రుత హోమమున -
   
      3) చాతుర్మాస్యపు వైశ్వదేవ పర్వమందు సావిత్రి యాగమున బ్రహ్మ ఈ సూక్తమును అనుమంత్రించునది.
   
1.    సూర్యుడు పుట్టిన సర్వపదార్ధములకు అధిపతి అగుచున్నాడు.
   
    అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పురోదాయా మస్యాం ప్రతిష్టాయా మస్యాం చిత్త్య మస్యా మాకూత్యామస్యా మా శిష్యస్యాం దేవహూత్యాం స్వాహా.
   
    ఈ మంత్రమున, ఈ కర్మమున, ఈ పౌరోహిత్యమున, ప్రతిష్టయందు, చిత్యమున, సంకల్పమందు, ఆశీర్వచనమున నన్ను రక్షించును గాక స్వాహా.
   
    (తక్కిన ఋక్కులకు దీని చేర్చుకొనునది.)
   
2.    అగ్నిర్వస్పతీనామధిపతిః సమావతు.
   
3.    ద్యావాపృథివీ దాత్ర్రూణా మధిపత్నీ తేమావతాం | దాత్రూణాం - దాతల
   
4.    వరుణో2 సామధిపతిః సమావతు | అసాం - జలములకు.
   
5.    మిత్రావరుణో వృష్ట్యాధిపతీ తౌమావతాం. వృష్టికి.
   
6.    మరుతః పర్వతా నామధిపతయస్తే మావన్తు |
   
7.    సోమో వీరుధామధిపతిః స మావతు | లతలకు.
   
8.    వాయురన్త రిక్షస్యాధిపతిః సమావతు |
   
9.    సూర్యశ్చక్షుషామధిపతిః సమావతు |చక్షువులకు.
   
10.    చన్ధ్రమా నక్షత్రాణామధిపతిః సమావతు |
   
11.    ఇన్ద్రో ధినో2ధిపతిః సమావతు |దివికి.
   
12.    మరుతాం పితా పశూనామధిపతిః సమావతు |
   
13.    మృత్యుః ప్రజానామధిపతిః సమావతు |
   
14.    యమః పిత్రూణామధిపతిః సమావతు |
   
15.    పితరః పరే తే మా వస్తు |
   

    తరాల పైవారు
   
16.    తతా అవరే తే మా వస్తు |
   
    తరువాతివారు.
   
17.    తత స్తతా మహాస్తే మావన్తు |
   
    తాతామహులు.
   
                                                   నాలుగవ సూక్తము - 25
   
వినియోగము :-

   
    గర్భాదాన కర్మమందు 'ఆగమ కృశరం' చారు ద్వయము వండి, సంపాతన అభిమంత్రణలు ఈ సూక్తముచే చేసి రెండవ దరును యుగచ్చిద్రముచే సంపాతన అభిమంత్రణము చేసి భక్షించునది.
   
    ఈ కర్మమందే పలాశఖడ్గముష్టి మరియు కేలూనములను ఆరగదీసి శిశ్నమునకు రాసి మైదునము  చేయునది.
   
1.    పర్వతము నుండి స్వర్గమునకు వలె యోనియందు అంగము చేరినది. అది రేతస్సును నీటియందు ఆకువలె గర్భమున ప్రవేశపెట్టును గాక.
   
2.    ఈ మహా పృథివి సకల భూతములను గర్భమున ధరించినట్లు నేను నీ గర్భమును ధరించుచున్నాను. దానిని రక్షించు మని నిన్ను ఆహ్వానించుచున్నాను.
   
3.    సినీవాలి ఈ గర్భమునకు పుష్టి కలిగించును గాక. సరస్వతి పుష్టి కలిగించును గాక.
   
    కళ్యాణీ! పుష్ప మాలలు ధరించిన అశ్వినులు నీ గర్భమునకు పుష్టి కలిగింతురు గాక.
   
4.    మిత్రావరుణులు, ఇంద్రుడు, బృహస్పతి, అగ్ని, ధాత నీ గర్భమునకు పుష్టి కలిగింతురు గాక.
   
5.    విష్ణువు నీ యోనికి బలము కూర్చును గాక. త్వష్ట రూపము కల్పించునుగాక. ప్రజాపతి నీ గర్భమున తడి కల్పించును గాక. ధాత నీ గర్భమును పోషించును గాక.
   
6.    గర్భ కరణిని రాజా వరుణుడు, దేవిసరస్వతి, వృత్రహంత ఇంద్రుడు ఎరుంగుదురు. నీవు గర్భకరణిని త్రాగుము.
   
7.    అగ్నిదేవా! నీవు ఓషధులకు గర్భమవు. వనస్పతులకు గర్భమవు. సమస్త భూతములకు గర్భమవు. నీవు నా గర్భమునకు పుష్టి కలిగించుము.
   
8.    పైన ఉండుము, వీరత్వము చూపుము. యోని యందు గర్భమును స్థాపించుము.
   
    వృష్ణ్యావనా! నీవు వర్షము కలిగించు వాడవు. ప్రజల కొరకని నిన్ను తోడ్కొని పోవుచున్నాము.
   
9.    కళ్యాణీ! నీవు సిద్దమగుము. నీ యోనియందు నేను గర్భమును స్థాపించుచున్నాను. సోమ పానము చేయు దేవతలు ఉభయ లోకములను రక్షించు పుత్రుని ప్రసాదింతురు గాక.
   
10.    ధాతా! శ్రేష్ఠమగు రూపమున ఈమె గర్భమును రక్షించుము. పదవ మాసమున ప్రసవించినపుడు మగ బిడ్డను ప్రసాదించుము.
   
    (11,12,13 మంత్రముల అర్ధమిదియే. దేవతలు మారుదురు. గమనించునది.)
   
11.    త్వష్టః.
   
12.    సవితః
   
13.    ప్రజాపతే.
   
                                        అయిదవ సూక్తము - 26
   
వినియోగము :-

   
    పుష్టిని కోరువాడు నవశాలయందు తేనె కలిపిన ఘ్రుతమును ఈ సూక్తముచే ఆహుతులు ఇచ్చునది.
   
1.    యజుర్వేద మంత్రములకు సమిధలకు స్వాహా, ప్రవిద్వాంసుడగు అగ్ని వానితో కలియును గాక.
   
2.    మధ్యమ దేవత, విద్వాంసుడు ఈ యజ్ఞమునందు చేరును గాత - స్వాహా.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.