Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
ముప్పది అయిదవ సూక్తము - 127
1. 'ఆమినో నీతి భద్యతే'
2. 'తస్య అమ విభంజనమ్'
3. వరుణుడు ధనము వెంట సాగుచున్నాడు.
4. భారతికి వందల బలములు.
5. శతంమాశ్వా హిరణ్య యాః | శతం రథ్యా హిరణ్యయాః |
శతం కుథా హిరణ్యయాః | శతం నిష్కా హిరణ్యయాః |
6. అహల కుశ వత్త్రక
7. శఫమును వహించుచున్నది.
8. 'ఆయ వనేవతీ జని'
9. ధనిష్ఠ నావను పట్టి సాగును.
10. ఇది నన్ను ప్రసన్నుని చేయునట్టిది.
11. అది వృక్షములతో స్థిరపడునది.
12. 'పాకబలిః'
13. 'శాకబలిః'
14. అశ్వత్థము ఖాదిరముతో ఉరికినది.
15. నడువుము. విశ్రాంతి పొందుము.
16. పురుషుడు వ్యాప్తుడగుచున్నాడు.
17. అంతమున నేను పూషను పితుకుచున్నాను.
18. పరస్వాన మృగమును దాటి అర్ధర్చ ప్రవృత్తమగుచున్నది.
19. 'దౌవ హస్తినో దృతీ'
ముప్పది ఆరవ సూక్తము - 128
1. అలాఋకము ఒక్కటి.
2. అలా ఋకమును త్రవ్వువాడు?
3. కర్కరకుడు త్రవ్వువాడు.
4. అతడు వాయువును ఎగురవేయుచున్నాడు.
5. కులాయకమును చేయుచున్నాడు.
6. మహా ఉగ్రుని భజించుచున్నాడు.
7. అవిస్త్రుతుని భజించకున్నాడు.
8. వీరిలో కర్కర వ్రాయువాడెవడు?
9. వీరిలో ఎవరు దుందుభిని వధించువారు?
10. వధించినచో ఎవరు వధించినారు.
11. దేవి వధించినది కుహనము చేసినది.
12. భవనమును నలువైపుల మరల మరల.
13. ఉష్ట్రమునకు మూడు పేర్లు.
14. ఒక హిరణ్యము పలికినది.
15. శిశువులు ఇద్దరు అగుచున్నారు.
16. 'నీల శిఖండ వాహనః'
ముప్పది ఏడవ సూక్తము - 129
1. రెండు కిరణములు వ్యాపించిఉన్నవి. పురుషుడు వానిని పింశనము చేయుచున్నాడు. కుమారీ! నీవు ఏది అనుకున్నావో అతడు అదికాకున్నాడు. 'వవై కుమారి తత్ తథాయథా కుమారి మన్యసే'
2. పురుషా! నీవు అమృతము నుండి బయట పడినావే అది నీ తల్లి యొక్క రెండు కిరణములు అగుచున్నవి.
'నవైకుమారి....."
3. మధ్యమా! నీవు రెండు చెవులు పట్టుకొని ఇచ్చుట లేదు.
'నవైకుమారి...."
4. ఉత్తాన, శయానములకు నిలుచుండి ఆలింగనము చేయుచున్నది.
"నవైకుమారి...."
5. శ్లక్ష్మ్ణ లేక శ్లక్ష్ణికలందు శ్లక్ష్ణికయే అవగాహనము చేయుచున్నది.
"నవై కుమారి....."
6. రాలిన దంతములు, రోమయుక్త హ్రదమున అవశ్లక్ష్ణకు సమానమగుచున్నది.
ముప్పది ఎనిమిదవ సూక్తము - 130
1. ఇహేత్థ ప్రాగపాగుదగధరాగ్ 'ఇచటి నుండి పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణములందు, అరాలమునుంచి ఉద్భర్త్సన చేయుము.
2. "ఇహేత్ద...."
వత్స పురుషుడు కాగోరి కూర్చున్నాడు.
3. "ఇహేత్థ...."
స్థాలీపాకము విలీనమగుచున్నది.
4. "ఇహేత్థ...."
అతడు అత్యంత లీనమగుచున్నాడు.
5. "ఇహేత్థ...."
లాహిణి యందు లీశాథి అనుభవించుచున్నది.
ముప్పది తొమ్మిదవ సూక్తము - 131
1. భుక్, అభిగతమైనది. 'శత్' అపాక్రాంతమైనది. ఫలము అభిష్టితమైనది. స్తోతా! తదుపరి దుందుభిని బాదుటకు రెండు దండములచే ఆటలాడుము.
2. కోశబిలమును రజని యందు, ధాన్యమును గ్రంథులందు, ఉత్తమ జన్ములను ఉత్తమ జనముల మార్గమున చేర్చండి.
3. లౌకి, పృషాతాక, అశ్వత్థ, ఢాక, పిపీలిక అవట శ్వస, విద్యుత్, గోశఫాముల తరువాత స్తోతా! బలముతో ఆటలాడుము.
4. దేవతలు ప్రకాశించుచున్నారు. అధ్వర్యులారా! త్వరత్వరగ మంత్రములు ఉచ్చరించండి. మీరు గోవులకు సత్యము, 'ప్రఖుతము' అగుచున్నారు.
5. పూజించునదే పత్ని యగుచున్నది. జరితా! ఇక నీవు భయములను గెలుచు ప్రయత్నము చేయుము.
6. స్తోతా! ఆదిత్యుడు అంగిరుల నుండి దక్షిణలు తెచ్చియున్నాడు. జరితా! అతడు వానిని తెచ్చినాడు. స్తోతా! అతడు వానిని తెచ్చినాడు.
7. స్తోతలారా! దానిని వారు పరిగ్రహించినారు. దానిని మీరు పరిగ్రహించినరు. ఆహానేతర రసమును కాదు. సెహ్తనలను యజ్ఞానేతరసములను కాదు. చేతనలను, వానితో ముందడుగు వేయుచున్నాము.
8. శ్వేత ఆశుపత్య పద్య ఋక్కులచే యువకులు అగుచున్నారు. వానిని శీఘ్ర మానులు పూర్తి చేయుచున్నారు.
9. అంగిరా! ఆదిత్య, వసు, రుద్రులు నీకు అనుకూలురై ఉన్నారు. ఈ ధనమును పరిగ్రహించుము. ఈ ధనము విభు, ప్రభు, విశాలము బృహంతాము అగుచున్నది.
10. దేవతలు ప్రాణ బలము నిచ్చెదురుగాక. చేతనత్వము నిచ్చెదరు గాక. అవి మాకు రోజు రోజు లభించునుగాక. అత్యవసరమున లభించునుగాక.
11. ఇంద్రా! నీవు దేవతల పాలిట ధనమవు. వారికి హవిస్సులు చేర్చుచున్నాను.
నిన్ను స్తుతించు విప్రుడు పేదవాడైన అతనికి ధనము కలిగించుము.
12. ఇంద్రా! రెక్కలు విరిగి వంచిత అయిన పావురమునకు ఆహారము, జలము ప్రసాదించుము.
13. మూడు తోలు త్రాళ్ళచే కట్టబడిన 'అరంగర' మాటిమాటికి అరచుచున్నది. అది పృథ్విని ప్రశంసించుచున్నది. పృథ్వి లేని చోటును ఆశించుచున్నది.
నలుబదవ సూక్తము - 132
1. ఈ పాపభేదిని యొక్క క్రోధము క్షీణించినపుడు ఇది సరస్సున చేప వలె మసలుచున్నది.
2. స్థూల పయసమున ముష్కములు నాటినపుడు ఇసుకలో గాడుదల వలె ముష్కములు పెరుగుచున్నవి.
3. ఏది అల్పిక యందు అల్పికయో, ఏది కర్కధన వలె అవపదనమో, వాసంతిక తేజోసమముగ విత్పతమునకు పోవుచున్నది.
4. దేవతలు సుందర గోవునందు ప్రవేశించి ప్రసన్నులగునట్లు సకులనారి తేపతేప ప్రసన్నమగుచున్నది.
5. పైన ఉన్నవారి మీదకు పోక ఉత్క్రమించక మహాగ్ని తృప్తుడగుచున్నాడు. శక్తికాననులమగు మేము స్వచవశక ప్రకాశమును పొందుచున్నాము.





