Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

21.    భగవాన్ వృషాకపీ! నీవు ఉదయించి స్వప్నములను తొలగించుచున్నావు. తిరిగి అదే మార్గమున అస్తాద్రి చేరుచున్నావు. మేము సత్కార్యములు చేయుటకుగాను మరల విచ్చేయండి.
   
22.    ఇంద్రా! వృషాకపి ఇంటికి చేరుకున్నప్పుడు జనులు, భూతములకు ప్రాణమగు సూర్యుడు ఎటుపాయెను? అని అడుగుచున్నారు. "విశ్వస్మాదింద్ర ఉత్తరః'
   
23.    మానవ పశువు ప్రసిద్దుడు. అతడు తన వెంట ఇరువదిని ప్రకటించినాడు. అతనికి ఉదర వ్యాధి ఉండెను అతనికి ఇప్పుడు క్షేమము కలిగినది. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
   
                                         కున్తాపక సూక్తములు.
                  

                                 ముప్పది ఒకటవ సూక్తము - 123
   
1.    మానవ, కౌరమ, నరాశంసులారా! మేము స్తుతించువారలకు అరువదివేల 'రుశ్మ'ములు ఇచ్చుచున్నామను మాట వినండి.
   
2.    ఎవని శరీర రూప రథమును వధూమంతలగు ఇరువది ఒంటెలు మోయుచున్నదో అవి ద్యులోకమును తాకి "పీడిం" చుచున్నవి.
   
3.    మేము అన్నము కొరకని వంద'నిష్కములు' పది 'మాల'లు మూడు వందల అశ్వములు, పదివేల గోవులను దానము చేయుచున్నాము.
   
4.    స్తోతలారా! పండుగల చెట్టు మీది పక్షి కిచకిచయున్నట్లు పలుకుచుండండి. చేతనున్న కత్తి కదలునట్లు మీ నాలుక కదలుచుండును గాక.
   
5.    మేధావులగు స్తోతలు ఆబోతు వలె నడుచుచున్నారు. వారి ఇంట పుత్రులు, గోవులు ఉన్నవి.
   
6.    స్తోతా! గోవులు, ధనము లభించు బుద్దిని ఆశ్రయించుము. నీ వాక్కు దేవతలను చేరునుగాక. బాణము సంధించువానిని రక్షించినట్లు వాణి నిన్ను రక్షించుచున్నది.
   
7.    ఒకవేళ దేవత విశ్వ జనీన రాజు ప్రజలు అతిక్రమించినట్లైన పరీక్షిత వైశ్వానర స్తుతిని చేయునది.
   
8.    దేవత శుభములు కలిగించుచున్నాడు. స్థలములు విస్తరించుచున్నాడు. ఈ విషయము కౌరవ్యపతి భార్యతో చెప్పుచున్నాడు.
   
9.    పరీక్షిత్తు రాజ్యున భార్య భర్తు 'మంథాం పరిశ్రుతమ్' ధది ఎంత తేవలేను. అని అడుగుచున్నది.
   
10.    వండిన అన్నము ఒక మార్గమున ఉదర బిలమును చేరినట్లు పరీక్షిత్తు రాజ్యమున ప్రజలకు శుభములు కలుగుచున్నవి.
   
11.    ఇంద్రుడు స్తోతతో ఇట్లన్నాడు.
   
    నిలువుము. జనమున సంచరించుము. ఉగ్రుడనగు నా ప్రతాపమున నీవు కర్మను ఆచరించుము. శత్రువు నీకు సమస్తము అర్పించుచున్నాడు.
   
12.    ఇచట గోవులు ప్రసవించునుగాక. అశ్వములు పురుషులు వ్యక్తమగుదురుగాక. వేల దక్షిణ లిచ్చు పూషా ఇచటికి విచ్చేయునుగాక.
   
13.    ఇంద్రా! గోవులు హింసించబడకుండునుగాక. వానిని రక్షించు గోపాలుడు నష్టపడకుండును గాక. చోరులు ఇచట ప్రభావహీనులు అగుదురుగాక.
   
14.    ఇంద్రా! నీ సూక్తమున మమ్ము ప్రసన్నులను చేయుము. మేము మా శుభవచనములచే నిన్ను ఆనందింప చేయుచున్నాము. నీవు అంతరిక్షమునుండి మా వాణిని ఆలకించుము. మేము ఎన్నటికి నష్టపడకుందుముగాక. "నరిష్యేమ కదాచన"
   
                                 ముప్పది రెండవ సూక్తము - 124

   
1.    ఎవడు సభాయోగ్యుడు, యజ్ఞ గృహ యోగ్యుడు. అభిషవకుడు, యాజకుడు అగుచున్నాడో అతడు సూర్య లోకముదాటి ఊర్ధ్వ లోకములకు చేరుచున్నాడు. దేవతలు ఈ విషయము పూర్వమే చెప్పియున్నారు.
   
2.    ఎవడు 'జామి'చే విస్తరించుచున్నాడో, ఎవడు మిత్రతను దుర్దర్షణ చేయుచున్నాడో, ఎవడు అప్రచేతాజ్యేష్టుడో అతనిని 'అధరాక్' అనుచున్నారు.
   
3.    ఏ మంగళమయ పురుషుని పుత్రుడు ధర్షణశీలుడు అగుచున్నాడో అట్టివాడు విప్రకామ నా వచనమును పాలిక గలుగుచున్నాడు. అతడు గంథర్వుడు అగుచున్నాడు.
   
4.    దేవతలకు హవిస్సు సమర్పించని స్వభావము గల వర్తకులను చూచి ధీరులు ముఖము త్రిప్పుకొనుచున్నారని నినుచున్నాము.
   
5.    ఎవరు స్తుతించి యజ్ఞములు చేయుచున్నారో ఎవరు పాత్ర దానము చేయుచున్నారో వారు స్వర్గమునకు సూర్యుని వలె చేరుచున్నారు. మా ఇంద్రుడు మహామహుడు.
   
6.    ఎవడు అనాక్తాక్షుడు, అనభ్యక్తుడు, అమణివ అహిరణ్యవుడు, ఆబ్రహ్మ యగుచున్నాడో, వాడు 'బ్రహ్మణః పుత్రస్తోతా' కల్పములకు చేరుచున్నాడు.
   
7.    ఎవడు ఆక్తాక్ష, సుభ్యక్త, సుమణి సుహిరణ్యవ, సుబ్రహ్మ యగుచున్నాడో, అతడు బ్రహ్మణః పూతస్తోతా, కల్పములకు చేరుచున్నాడు.
   
8.    అప్రాణులు, వేశన్తులు, రేవలు, అప్రతిదిశ్యులు, ఆయభ్యులు కళ్యాణులు 'తోతా కల్పేషు సంమితా'
   
9.    సుప్రపాణులు, వేశన్తులు, రేవలు, సుప్రతిదిశ్యులు, సుయభ్యులు, కన్యాకళ్యాణులు 'తోతాకల్పేషు సంమితా'
   
10.    ఎవరి వ్యక్తులు, మహిషులు, స్వస్త్యులు, యుధింగములు, అనాశురులు, ఆయాములు 'తోతాకల్పేషు సంమితా'
   
11.    వావాతులు, మహిషులు, స్వస్త్యులు, యుగంధిగములు, శ్వాశురుల, ఆయాములు 'తోతాకల్పేషు సంమితా'
   
12.    ఇంద్రా! దాశరాజ జనులను తొలగించినవారి కొరకు నీవు విరూపుడవు అయినావు. యక్షునితో కూడి సమర్దుడవు అగుచున్నావు.
   
13.    ఇంద్రా! నీవు మఘవుడవై వృషాక్షుని తలవంచినావు. రవివై మర్యాదకరుని కూల్చినావు. రోహిణుని ముఖము చితుక కొట్టినావు. వృత్రుని తల నరికినావు.
   
14.    పర్వతములను స్థాపించిన, జలముల అవగాహన చేసిన, వృత్రుని సంహరించిన ఇంద్రునకు ప్రణమిల్లుచున్నాము.
   
15.    హర్యశ్వము పరిగెత్తుచుండుట చూచి ఉచ్చైశ్రవము ఇట్లన్నది.
   
    నీకు శుభము కలుగునుగాక. సుందర అలంకారము గల ఇంద్రుని వహింపుము.
   
16.    ఇంద్రా! శ్వేత అజైశ్రవస హర్యశ్వములు నీకు దక్షిణమున చేరుచున్నవి. దేవతలకు సమస్యుడవగు నీవు పూర్వుల మహత్వమును పొందుచున్నావు.
   
                                 ముప్పది మూడవ సూక్తము - 125
   
    1. ఈ అశ్వము ఉరుకుచున్నది. 2. సత్వ ప్రతీపమును పూర్తి చేయుచున్నది. 3. వానిలో ఒకటి హరిక్నిక. 4. హరిక్నికే! నీవు కోరునదేమి? 5. హితరమణీయ సాధు పుత్రుని. 6. పరాస్య ఎచట అహింసితుడుగ ఉండుచున్నాడు? 7. ఎచట ఈ మూడు శింశుపలు ఉన్నవో 8. నాలుగు దిశలందు మూడు. 9. సర్పము. 10. కొమ్ములతో కృమ్ముచున్నవి. 11. ఇది నీ మహాశ్వ దినము. 12. అతడు ఇచ్చకుని సాధకుడు అగుచున్నాడు. 13. గోమీద్య గోగతులను సాధించుచున్నది. 14. పురుషుడు, పృథ్వి నీ నిమిచ్చన చేయుచున్నారు. 15. బద్ద పల్ప అన్నము ఇట్లున్నది. 16. బద్దా, ఇది నీ అఘ యగుచున్నది. 17. కేవక జాగృతము కాలేదు. 18. అశ్వవారము గోశ పద్యకమున ఉన్నది. 19. అతడు శ్యేనపతి యగుచున్నాడు. 20. అతడు వ్యాధి రహిత ఉపజీవిక యగుచున్నాడు.
   
                                  ముప్పది నాలుగవ సూక్తము - 126
   
1.    ఎవడు ఈ అనేక బాణములకు స్వామియగుచున్నాడు?
   
2.    అసదికి పాలు ఏమి?
   
3.    అర్జునుని పయః ఏది?
   
4.    కాష్ణి యొక్క పయః ఏది?
   
5.    వీనిని అడుగుము. ఎవనిని అడుగను?
   
6.    కుహ యొక్క పక్వకుని అడుగుము.
   
7.    యతి ధనము ఎవనిది యగుచున్నది?
   
8.    కూపాయకు క్రోధమున నిండినాడు?
   
9.    ఆమణకము మణస్తకమగుచున్నది.
   
10.    దేవా! నీవు ప్రతి సూర్యుడవు.
   
11.    'ఏనశ్చపంక్తి కా హవిః'
   
12.    "ప్రదుద్రుదో మఘాప్రతి"
   
13.    "శృంగ ఉత్నన్న"

   
14.    నా మిత్రుడు నాకు అభిముఖుడగునుగాక.
   
15.    వశ బిడ్డను కనుచున్నది.
   
16.    'ఇరా వేదుమయందత'
   
17.    తదుపరి ఇది - ఇట్లగుచున్నది.
   
18.    అధో ఇయన్నితి'
   
19.    తదుపరి శ్వా అస్థిరమగుచున్నది.
   
20.    'ఉయం యకాంశలోకకా'




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.