Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



                                     మూడవ సూక్తము - 24

    వినియోగము :-
పూర్వ సూక్తము వలె.

    1. అథర్వణులకు నాలుగు ఋక్కులచే స్వాహా. 2. పంచర్చేభ్యః స్వాహా|| 3. షడృచేభ్యః స్వాహా|| 4. సప్తర్చేభ్యః స్వాహా|| 5. అష్టర్చేభ్యః స్వాహా|| 6. నవర్చేభ్యః స్వాహా|| 7. దశర్చేభ్యః స్వాహా|| 8. ఏకాదశర్చేభ్యః స్వాహా|| 9. ద్వాదశర్చేభ్యః స్వాహా|| 10. త్రయోదశర్చేభ్యః స్వాహా|| 11. చతుర్దశర్చేభ్యః స్వాహా|| 12. పంచదశర్చేభ్యః స్వాహా|| 13. షోడశర్చేభ్యః స్వాహా || 14. సప్తదశర్చేభ్యః స్వాహా|| 15. అష్టాదశర్చేభ్యః స్వాహా|| 16. ఏకోన వింశతిః స్వాహా|| 17. వింశతిః స్వాహా|| 18. మహత్కాండాయస్వాహా|| 19. తృచేభ్యో స్వాహా|| 20. ఏకర్చేభ్యః స్వాహా|| 21. క్షుద్రేభ్యః స్వాహా|| 22. ఏకనృచేభ్యః స్వాహా|| 23. రోహితేభ్యః స్వాహా|| 24. సూర్యాభ్యాం స్వాహా|| 25. వ్రాత్యాభ్యాం స్వాహా|| 26. ప్రజాపత్యాభ్యాం స్వాహా|| 27. విషాసహ్యై స్వాహా|| 28. మాజ్గిలికేభ్యః స్వాహా|| 29. బ్రాహ్మణే స్వాహా||

    30. బ్రహ్మజ్యేష్ఠా సంభృతా వీర్యాణి బ్రహ్మాగ్రే జ్యేష్ఠం దివ మా తతాన |
    భూతానాం బ్రహ్మ ప్రథమోత జజ్ఞేతేనార్హతి బ్రాహ్మణాస్పర్థితుంకః||

    (పూర్వ సూక్తపు 21 పునావృతము. అదే అర్థము.)

   
                                    నాలుగవ సూక్తము - 25

    17వ నక్షత్ర కల్పమున విహితమైన మహాశాంతియందు ఈ సూక్తపు వినియోగము.

    1. దేవతలు సవితను తన రక్షణ కొరకు ఏర్పరచుకున్నారు. బ్రహ్మణస్పతీ! వారితోనే ఈ దేశమునకు రక్షణ కలిగించుము.

    2. పరమ ఇంద్రా! ఇతనికి ఆయువు, మహాక్షాత్రము ప్రసాదించుము. ఇతని యందు వార్ధక్య పర్యంతము క్షాత్రమును జాగృతము చేయుము.

    3. పరమసోమా! ఇతనికి ఆయువు, మహాశ్రోత్రాదులను ప్రసాదించుము. ఇతని యందు  వార్ధక్య పర్యంతము బాధారహిత శ్రోత్రాదులను జాగృతము చేయుము.

    4. దేవతలారా! ఇతనికి వస్త్రము ప్రసాదించండి. వర్చస్సు కలిగించండి. జర, అపమృత్యువు నివారించండి. దీర్ఘాయువు కలిగించండి. బృహస్పతి వస్త్రమును సోమరాజునకు ఆచ్ఛాదనకు గాను ఇచ్చియున్నాడు.

    5. వార్ధక్యము వరకు జీవించుము. ఈ వస్త్రమును కప్పుకొనుము. గోవులు నిన్ను భయరహితునిగ రక్షించునుగాక. సంతానవంతుడవై శతశరత్తులు జీవించుము. ధన, ధాన్య సమృద్ధుడవు అగుము.

    6. ఈ వస్త్రమును నీ క్షేమము కొరకు ధరించుము. గోవులు నిన్ను భయరహితునిగ రక్షించునుగాక. సంతాన వ్యాప్తి కలవాడవై శతశరత్తులు జీవించుము. పుత్ర మిత్రాదులకు ధనము పంచుచుండుము.

    7. లభించనిది సమృద్ధిగ లభించుటకును, అన్నము అన్నము కొరకును మిత్రుడగు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.

    8. హిరణ్యవర్ణుడవగుము. అజరుడవగుము. సంతానవంతుడవగుము. అపమృత్యువాతపడకుము. సంతానవంతుడవై ఈ గృహమును ప్రవేశించుమని అగ్ని, సోమ, బృహస్పతి, సవిత, ఇంద్రుడు అనుచున్నారు.

   
                                      ఐదవ సూక్తము - 26

    అశ్వమా! ప్రప్రథమాశ్వపు ఆశ్రాంత మనసును నీకు కూర్చుచున్నాను. నది అడ్డంకిని అధిగమించి ప్రవహించినట్లు శత్రు సేనలోనికి దూకుము.

   
                                  ఆరవ సూక్తము - 27

    వినియోగము : 17వ నక్షత్ర కల్పమున విహిత ఆగ్నేయీ నామక మహాశాంతియందు బంగారు కుండలాదులను అభిమంత్రించి ధరింపచేయునది. ఈ సూక్తముచే తులాపురుషమందు శాంతి కలశమందు ఆహుతి చేసి సంపాతములను ఆనయనము చేయునది.

    1. హిరణ్యము అగ్ని నుండి ఆవిర్భవించినది. మర్త్యులకు అమృతము వంటిది. దీనిని తెలిసినవాడు హిరణ్యము ధరించుటకు అర్హుడు అగుచున్నాడు. దీనిని ధరించిన వాడు వార్ధక్యము వరకు జీవించుచున్నాడు.

    2. హిరణ్యము సూర్యుని ప్రేరణ గలది. పూర్వము మనువునకు కాంతి, సంతానము కలిగించినది. హిరణ్యము ధరించిన వాడు చంద్రుని వర్చస్సు కలవాడు ఆయుష్మంతుడు అగుచున్నాడు.

    3. హిరణ్యము నీకు ఆయుష్మము, వర్చస్సు, ఓజస్సు, కలిగించునుగాక. హిరణ్య ధారి హిరణ్యము వలె జనులందు ప్రకాశించుచున్నాడు.

    4. ఏ హిరణ్య ప్రభావమును రాజావరుణుడు, దేవ బృహస్పతి, వృత్రహంత ఇంద్రుడు గ్రహించి యున్నారో అట్టి హిరణ్యము నీకు ఆయుష్యము, వర్చస్సు అగునుగాక.

       
                                     నాలుగవ అనువాకము
                                     మొదటి సూక్తము - 28


    వినియోగము :
17వ నక్షత్ర కల్పమున విహిత ప్రాజాపత్య శాంతియందు బంగారము, వెండి, ఇనుము నింపిన మణిని కట్టునది.

    1. గోవులను పెంచి వృషభము నిన్ను రక్షించునుగాక. అశ్వములను పెంచి అశ్వము నిన్ను రక్షించునుగాక. వాయువు బ్రహ్మచే నిన్ను రక్షించునుగాక. ఇంద్రియములను ఇంద్రుడు రక్షించునుగాక.

    2. ఓషధులతో సోముడు, నక్షత్ర సహితుడై సూర్యుడు, మాస సహితుడై చంద్రుడు, వృత్రహంత వాయువు ప్రాణములను రక్షింతురుగాక.

    3. మూడు స్వర్గములు, మూడు పృథ్వులు, మూడు అంతరిక్షములు, నాలుగు సముద్రములు, త్రివృత స్తోమము, త్రివృత జలము, తివృతములచే త్రివృతము నిన్ను రక్షించునుగాక.

    4. మూడునాకములను, మూడు సముద్రములను, ముగ్గురు ఆదిత్యులను, మూడు విష్ఠపములను, ముగ్గురు మాతరిశ్వలను, ముగ్గురు సూర్యులను రక్షకులనుగ కల్పించుచున్నాము.

    5. అగ్నీ! నిన్ను ఘృతముచే తడుపుచున్నాను. ఆజ్యమున వర్ధిల్లచేయుచున్నాను. అగ్ని, సూర్యచంద్రులు నా ప్రాణములను మా యావులు నష్టపరచకుండునట్లు చేయుదురుగాక.

    6. మీ ప్రాణములను, అపానములను, బలములను మాయావులు హింసించకుందురుగాక. అందుకొరకు అగ్ని సూర్య చంద్రులు వేగవంతులై వచ్చెదరుగాక.

    7.ప్రాణము నుండి సూర్యుడు, వాయువు, విశ్వతోముఖుడు, సూర్యుడు, దేవతలు అవతరించినారు.

    8. ఆయుష్కృతుల ఆయుష్యముచే జీవించుము. ఆయుష్మంతుడవై జీవించుము. మరణించకుము. ఆత్మన్వంతుల ఆయుష్యముతో జీవించుము. మృత్యువాత పడకుము.

    9. దేవతలచే దాచబడిన నిధిని - దేవయాన మార్గములందు, ఇంద్రుడు వెలికి తీసినాడు. త్రివృతజలములు హిరణ్యములను వెలికి తీసినవి. అవియు త్రివృతములచే  త్రివృతములు నిన్ను రక్షించునుగాక.

    10. ముప్పది ముగ్గురు దేవతలు మూడు శక్తులను అతి ప్రియముగ భావించి జలగర్భములందు దాచిపెట్టినారు. ఆ శక్తులును - చంద్రుని యందున్న హిరణ్యమును ఇతనికి జలసంపద నిత్తురుగాక.

    11. దివియందున్న ఏకాదశ దేవతలు ఈ హవిస్సును స్వీకరింతురుగాక.

    12. యే దేవా అంతరిక్ష ఏకాదశస్థ తే దేవాసో హవిరిదం జుషధ్వం |
   
    13. యే దేవా పృథివ్యామేకాదశస్థ తే దేవాసో హవిరిదం జుషధ్వం|


    14. పూర్వ దిశన శత్రు రహితునిగ, పశ్చిమ దిశన భయ రహితుని చేసిన సవిత దక్షిణమునను, శచీపతి ఉత్తరమునను రక్షింతురుగాక.

    15. దివి యందు ఆదిత్యుడు, భూమి మీద అగ్ని సంరక్షింతురుగాక. ఇంద్రాగ్నులు ఎదుట రక్షింతురుగాక. అశ్వినులు సర్వదిశలందు సంపదలు ప్రసాదింతురుగాక. మూలలందు జాతవేదాగ్ని రక్షించునుగాక. భూతకృతుడు నాకు సర్వత్ర కవచప్రాయుడు అగునుగాక.

   
                                     రెండవ సూక్తము - 29

    1. ఈ మణిని నీకు కట్టుచున్నాను. ఇది నీకు దీర్ఘాయువు తేజస్సు కలిగించునుగాక. ఈ దర్భ నీ శత్రువులను అణచి నిన్ను ద్వేషించువారి హృదయములను మంటపెట్టునుగాక.

    2. దర్భమణీ! ద్వేషించువారి హృదయములను, శత్రువుల మనసులను తపింపచేయుము. దుష్ట స్వభావుల సర్వస్వమును అగ్నివలె దహించుము.

    3. దర్భమణీ! ద్వేషించువారిని అగ్ని వలె కాల్చుము. శత్రువు హృదయమును, బలమును ఇంద్రుని వలె ధ్వంసము చేయుము.

    4. దర్భమణీ! ద్వేషించువారల శత్రువుల హృదయములను భిన్నము చేయుము. వారి భుజములను ఎక్కి నెల మీద గడ్డిని కోసినట్లు, వారి తలలను నరుకుము.

    5. దర్భమణీ! నా మీదకు సేనను తెచ్చు శత్రువులను నలిపివేయుము. దుష్ట హృదయులందరను నలుపుము. ద్వేషించు వారిని నలిపివేయుము.

    6. దర్భమణీ! నా శత్రువులను నరుకుము. నా మీదకు వచ్చు సేనలను నరుకుము. నా విషయమున చెడు తలంపు గల వారలను, ద్వేషించువారిని నరుకుము.

    7. వృశ్చ దర్భ సపత్నాన్ మే వృశ్చమే పృతనాయతః|
    వృశ్చమే సర్వాన్ దుర్హార్దో వృశ్చమే ద్విషతో మణే ||

    వృశ్చ  = ఛేదించుము.

    8. కృన్త దర్భ సపత్నాన్ మే కృన్తమే పృతనాయతః |
    కృన్తమే సర్వాన్ దుర్హార్దః కృన్తమే ద్విషతో మణే ||


    కృన్త కృతీఛేదనే అని సాయణుడు.

    9. పింశదర్భ సపత్నాన్ మే పింశమే పృతనాయతః |   
    పింశమే సర్వాన్ దుర్హార్దః పింశ మే ద్విషతో మణే||


    పింశ =పిండుము - పిండిచేయుము.

    10. విధ్య దర్భ సపత్నాన్ మే  విధ్య మే పృతనాయతః|
    విధ్య మే సర్వాన్ దుర్హార్దో విధ్యమే ద్విషతో మణే||

    విధ్య = బాదుము - కొట్టుము - బాధించుము.

                                  మూడవ సూక్తము - 30
   
    అస్య ఐంద్ర్యాం మహాశాంతౌ దర్భమణి బన్ధనే వినియోగః పూర్వ సూక్తేన సహ ఉక్తః -

    1. నిక్ష దర్భ సపత్నాన్ మే నిక్షమే పృత నాయతః |
    నిక్షమే సర్వాన్ దుర్హార్దో నిక్షమే ద్విషతో మణే ||


    (నిక్ష చుమ్బ అని సాయణుడు. దర్భమణి ముద్దు విష తుల్యమని.)

    2. తృన్ది దర్భ సపత్నాన్ మే తృన్థి పృతనాయతః|
    తృన్ది మే  సర్వాన్ దుర్హార్ద స్తృన్ధ్వి మే ద్విషతో మణే||


    తృన్ధ్వినాశయ.

    3. రున్ధ్విదర్భ సపత్నాన్ మే రున్ధ్వి మే  పృతనాయతః|
    రున్ధ్వామే సర్వాన్ దుర్హార్దో రున్ద్వి మే ద్విషతో మణే ||

   
    రున్ద్వి = నిరోధించు

    4. మృణ దర్భ సపత్నాన్ మే  మృణమే పృతనాయతః |
    మృణమే సర్వాన్ దుర్హార్దో మృణమే ద్విషతో మణే ||


    మృణు = హింసించు.

    5. మన్థ దర్భ సపత్నాన్ మే  మన్థమే పృతనాయతః|
    మన్ధ మే సర్వాన్ దుర్హార్దో మన్దమే ద్విషతో మణే||


    మన్ధ మథించు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.